
టీజీఎప్‌సెట్‌లో ‘షైన్’ విజయకేతనం
హన్మకొండ: టీజీఎప్‌సెట్–2025 ఫలితాల్లో షైన్ విజయకేతం ఎగురవేసింది. రాష్ట్ర స్థాయిలో 181, 277, 1279 ర్యాంకులు సాధించి కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా ఫలితాలు సాధించిందని షైన్ విద్యా సంస్థల చైర్మన్ మూగల కుమార్ యాదవ్, డైరెక్టర్లు మూగల రమ, మూగల రమేశ్ తెలిపారు. షైన్ విద్యాసంస్థలు మొదటి నుంచి జే.ఈ.ఈ. మెయిన్స్, నీట్, ఈఏపీసీఈటీలో అత్యుత్తమ శిక్షణ వరంగల్‌లో అందిస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులను సైతం చక్కటి అకడమిక్ ప్రోగ్రామింగ్, ప్రణాళిక ద్వారా ఆణిముత్యాలుగా తీర్చిదిద్దుతూ రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధిస్తున్నామని తెలిపారు. టీజీఎప్‌సెట్ అగ్రికల్చర్ కేటగిరీలో డి.ఇందు 181 ర్యాంకు సాధించిందని తెలిపారు. కె.సహస్ర 277, బి.సంధ్య 2,227, ఎం.రమ్య 2,963, ఇ.సాహితీ 4,879, ఇంజనీరింగ్ కేటగిరీలో పి.శ్రీ మహేశ్ 1,279, ఎం.వరుణ్ 3,153, సి.హెచ్.సరిసహస్ర 4,133, కె.కస్తూరి 5,741, కె.చాణక్య 5,962, కె.విష్ణు 6,915, జి.నిగమ 7,009, ఎస్.శ్రీచైతన్య 8,162, ఎం.సుశాంత్ 8,795 ర్యాంకు సాధించారని వివరించారు. వీరితో పాటు అగ్రికల్చర్ కేటగిరీలో 23 మంది విద్యార్థులు 20 వేల లోపు ర్యాంకులు, ఇంజనీరింగ్ కేటగిరీలో 31 మంది విద్యార్థులు 20 వేల లోపు ర్యాంకులు సాధించారని చైర్మన్ తెలిపారు. ఆదివారం కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ర్యాంకు సాధించిన విద్యార్థులను అభినందించారు. కార్యక్రమములో షైన్ విద్యా సంస్థల కళాశాలల ప్రిన్సిపాళ్లు మారబోయిన రాజు గౌడ్, శ్రీనివాస్ గౌడ్, సంధ్య, ప్రశాంత్, అధ్యాపకులు పాల్గొన్నారు.