
అభ్యసన సామర్థ్యాలు పెంపొందించుకోవాలి
● కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్
మహబూబాబాద్ అర్బన్: ఉపాధ్యాయులు శిక్షణలో అభ్యసన సామర్థ్యాలు పెంపొందించుకోవాలని కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ అన్నారు. ఉపాధ్యాయుల శిక్షణ శిబిరాన్ని బుధవారం సందర్శించి మాట్లాడారు. శిక్షణ ద్వారా మెళకువలు నేర్చుకుని విద్యార్థులకు ఉత్తమ బోధన చేపట్టాలన్నారు. ఏజెన్సీ ప్రాంతాల విద్యార్థులపై ఉపాధ్యాయులు ఎక్కువ శ్రద్ధ వహించాలన్నారు. విద్యార్థులు పాఠశాలలకు సరి గా హాజరుకాకపోవడంతో గణితం, తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో నైపుణ్యత సాధించలేకపోతున్నారని అన్నారు. అన్ని సబ్జెక్టులపై విద్యార్థులు మక్కువ చూపేలా చర్యలు తీసుకోవాలన్నారు. తరగతి గదుల్లో చదవడం, రాయడం పెంపొందించాలన్నారు. ఆర్‌జేడీ సత్యనారాయణ, డీఈఓ రవీందర్‌రెడ్డి, ఏసీ జీఈ శ్రీరాములు, జిల్లా సైన్స్ అధికారి అప్పారావు, చంద్రశేఖర్‌ఆజాద్ తదితరులు పాల్గొన్నారు.