
నేటినుంచి కేయూ డిగ్రీ పరీక్షలు
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలో డిగ్రీ కోర్సుల బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీసీఏ, బీ ఒకేషనల్ తదితర కోర్సుల 2,4,6 సెమిస్టర్ల పరీక్షలు, అలాగే బ్యాక్‌లాగ్ మొదటి, మూడు, ఐదో సెమిస్టర్ల పరీక్షలు నేటి నుంచి (ఈనెల 14నుంచి) నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తిచేసినట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి కె. రాజేందర్ మంగళవారం తెలిపారు. ఆయా సెమిస్టర్ల పరీక్షల నిర్వహణకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో 46, ఖమ్మం జిల్లాలో 25, ఆదిలాబాద్ జిల్లాలో 47.. మొత్తం 118 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. 118 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 125 మంది అబ్జర్వర్లను నియమించామని తెలిపారు. ఆయా సెమిస్టర్ల పరీక్షలకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో 79,224మంది విద్యార్థులు, ఖమ్మం జిల్లాలో44,793 మంది, ఆదిలాబాద్ జిల్లాలో 77,221మంది.. మొత్తం 2,01,238 మంది విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారన్నారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు 10 మంది ఫ్లయింగ్‌స్క్వాడ్‌లను నియమించినట్లు తెలిపారు. టైంటేబుల్ ప్రకారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. విద్యార్థులు హాల్‌టికెట్లను సంబంఽధిత కేయూ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. కాగా, పరీక్షల నిర్వహణకు నిర్దేశించిన సమయానికి ముందే ఆయా కేంద్రాలకు ఆన్‌లైన్‌లోనే ప్రశ్నాపత్రాలు పంపిస్తారు. డౌన్‌లోడ్ చేసుకుని విద్యార్థులకు అందజేయాల్సింటుంది.
పరీక్షలు రాయనున్న
2,01,238 మంది విద్యార్థులు
118 కేంద్రాలు ఏర్పాటు
125మంది అబ్జర్వర్లు,
10 మంది ఫ్లయింగ్‌స్క్వాడ్‌ల నియామకం