
అన్నదానం.. మహాప్రసాదం
భోజన సౌకర్యం బాగుంది..
సరస్వతీనది పుష్కరాలకు రెండు రోజుల క్రితం కుటుంబ సమేతంగా వచ్చాం. అన్నదాన సత్రాల్లో ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం చేస్తున్నాం. చాలా రుచిగా, శుభ్రంగా ఉంది.
– అనురాధ, భక్తురాలు, మంచిర్యాల
కాటారం /మల్హర్: అన్నం పరబ్రహ్మ సర్వూపం. ఆకలితో ఉన్న వారికి ఒక పూట భోజనం పెట్టినా చాలు ఎంతో పుణ్యం లభిస్తుంది. అందుకే సేవాభావంతో పలువురు ప్రముఖ దైవక్షేత్రాల్లో నిత్యాన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. అదే మాదిరి ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో కొనసాగుతున్న సరస్వతీనది పుష్కరాల నేపథ్యంలో ముక్తీశ్వరాలయ సమీపంలో దాదాపు 8 చోట్ల అన్నదాన సత్రాలు ఏర్పాటు చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తోపాటు ఇతర రాష్ట్రాల నుంచి అన్నదాతలు ఉచిత భోజన సదుపాయం ఏర్పాటు చేసి భక్తుల కడుపునింపుతున్నారు. ఒక్క పూటకు నాలుగు నుంచి ఆరు వేల మంది భక్తులకు ఉచిత అన్నదానాలు చేస్తున్నారు.
ప్రతీ రోజు టిఫిన్, అన్నదానం..
సరస్వతీనది పుష్కరాల సందర్భంగా ఆర్యవైశ్య, బ్రహ్మణ, ఈశ్వరకుమారి, వాసవీ క్లబ్, ఇతరాత్ర ట్రస్ట్‌ల ద్వారా ఏర్పాటు చేసిన అన్నప్రసాద సత్రాల ద్వారా భక్తులకు ప్రతీ రోజు టిఫిన్, మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. ఏదో ఉచిత భోజనం అందిస్తున్నామనే కాకుండా నిర్వాహకులు నాణ్యతతో కూడిన రుచికర భోజనం అందిస్తున్నారు. ఉదయం పలు రకాల అల్పాహారంతోపాటు భోజనంలో రెండు రకాల కూరలు, పప్పు, సాంబారు, పెరుగు, స్వీట్లు, పచ్చడి పెడుతున్నారు. రుచికరం, పరిశుభ్రంగా ఉండడంతో భక్తులు సత్రాల్లో భోజనం చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.
సేవలు అభినందనీయం..
పుష్కరాలకు పిల్లలతో కలిసి చాలా దూరం నుంచి వచ్చాం. మధ్యాహ్నం భోజనం చేయడానికి ఇబ్బంది అవుతుందని ఆందోళన చెందాం. కానీ తీరా ఇక్కడికి వచ్చి చూస్తే అన్నదాన సత్రాల్లో భోజనం లభించింది. సమయానికి మా ఆకలి తీరింది. అన్నదానం నిర్వాహకుల సేవలు అభినందనీయం.
– శ్రీనివాస్, భక్తుడు, కరీంనగర్
పుష్కరాల భక్తులకు
పలు ట్రస్ట్‌ల నిత్యాన్నదానం
పన్నెండు రోజుల పాటు
ఉచితంగా టిఫిన్, భోజనం
భక్తుల ఆకలి తీరుస్తున్న సత్రాలు

అన్నదానం.. మహాప్రసాదం

అన్నదానం.. మహాప్రసాదం