
ధాన్యం తరలింపు వేగంగా చేపట్టాలి
డోర్నకల్/కురవి: కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం నిల్వల తరలింపు ప్రక్రియ వేగంగా చేపట్టాలని జిల్లా వ్యవసాయ అధికారి విజయనిర్మల ఆదేశించారు. సీరోలు మండల కేంద్రంతోపాటు ఉప్పరిగూడెం, మన్నెగూడెం గ్రామాల్లోని వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను శనివారం ఆమె పరిశీలించారు. ధాన్యం తరలింపునకు అవసరమైన లారీలు, గోనె సంచుల వివరాలను అందించాలని ఆదేశించారు. ఇప్పటి వరకు కేంద్రాలకు వచ్చిన లారీలు, గోనె సంచుల లెక్కలను తెలుసుకున్నారు. అవసరముంటే గోనె సంచులు, లారీలకు ఇండెంట్ ఇవ్వాలని ఆమె నిర్వాహకులకు సూచించారు. కార్యక్రమంలో సీరోలు వ్యవసాయ అధికారి ఛాయారాజ్, ఏఏఓ ఎర్ర కర్ణ పాల్గొన్నారు. సీరోలు ఇన్‌చార్జ్ తహసీల్దారు కృష్ణవేణి తదితరులు ఉన్నారు.
పామాయిల్ చెట్ల
నరికివేత
డోర్నకల్: సీరోలు మండలం మన్నెగూడెం గ్రామంలోని ఓ పామాయిల్ తోటలోని 80 చెట్లను గుర్తు తె లియని వ్యక్తులు నరికివేశారు. డోర్నకల్ ఎస్సై వంశీధర్ శనివారం తెలిపిన వివరాల ప్రకారం.. ఖ మ్మంకు శ్రీరామినేని వెంకటేశ్వర్లు మన్నెగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని తన ఐదెకరాల భూమిలో ఆయిల్‌పామ్ సాగు చేశాడు. మన్నెగూడేనికి చెందిన శ్యామల వెంకటేశ్వర్లును పాలేరుగా నియమించాడు. ఈక్రమంలో శుక్రవారం గుర్తు తెలి యని వ్యక్తులు తోటలోని 80చెట్లను నరికేయడంతో పాలేరు.. యజమానికి తెలియజేశాడు. రూ.12 లక్ష ల నష్టం వాటిల్లిందని, వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
కొనుగోలు కేంద్రంలో గోల్‌మాల్
మరిపెడ రూరల్: మండలం రాంపురంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జీవనజ్యోతి ధాన్యం కొనుగోలు కేంద్రంలో గోల్‌మాల్ చోటుచేసుకుంది. నిబంధనలకు విరుద్ధంగా కొందరు ట్రక్ షీట్లు పొందారని సెంటర్ నిర్వాహకులు సుధగాని నీలమ్మ, కంసాని జ్యోతి, పట్ల బాలమ్మ శుక్రవారం కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో అడిషనల్ డీఆర్డీఓ జయశ్రీ శనివారం రైతుల సమక్షంలో ధాన్యం కొనుగోలు కేంద్రంలో విచారణ చేపట్టారు. ఈక్రమంలో రాంపెల్లి రవి 284 బస్తాలు, రాంపెల్లి బుచ్చిరాములు 158, రాంపెల్లి కపిల్ 40, బొమ్మగాని రవి 295, దోమల సత్తెయ్య 233, దోమల సోమయ్య 292, రాంపెల్లి కార్తీక్ కపిల్ 108 మొత్తం 1410 బస్తాల ధాన్యం కొనుగోలు కేంద్రానికి రాకుండానే ట్రక్ షీట్లు ఇచ్చినట్లు తేల్చారు. కొనుగోలు కేంద్రంలోని ఎంట్రీ బుక్ పరిశీలించగా ఆరోపించబడిన రైతులకు సంబంధించి ధాన్యం ఎంట్రీ కాలేదని నిర్దారించారు. విచారణ నివేదికను ఉన్నతాధికారులకు అందించనున్నట్లు తెలిపారు. ఆరోపణ ఎదుర్కొంటున్నరైతులు మాత్రం తాము కష్టపడి ధాన్యం పండించామని, కేంద్రంలో చోటు లేకపోవడంతో తమ కల్లంలోనే ఆరబెట్టికున్నామని, అనంతరం ప్రైవేట్ వాహనాల ద్వారా అబ్బాయిపాలెం సాయి శ్రీనివాస ఇండస్ట్రీస్ రైస్ మిల్‌కు తరలించినట్లు వివరణ ఇచ్చారు. ఇదిలా ఉండగా.. ఆరోపణ ఎందుర్కొంటున్న రైతుల అకౌంట్‌లో డబ్బులు జమకాకుండా అధికారులు అప్రమత్తమైనట్లు తెలిసింది.
హాయి హాయిగా..
ఎండ తీవ్రత, ఉక్కపోతతో మనుషులు కూలర్లు, ఏసీలతో ఉపశమనం పొందుతున్నారు. కానీ, జంతువులు ఎండ తీవ్రతను తట్టుకోలేక అల్లాడుతున్నాయి. ఈక్రమంలో ఎండవేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు ఓ శునకం మానుకోట మున్సిపల్ పరిధిలోని జంతువుల దాహార్తిని తీర్చేందుకు ఏర్పాటు చేసిన నీటికుండిలో మునిగి ఇలా హాయిని పొందుతుంది. – నెహ్రూసెంటర్

ధాన్యం తరలింపు వేగంగా చేపట్టాలి