
బస్టాండ్ బహుదూరం..
కాటారం : సరస్వతీనది పుష్కరాల్లో భాగంగా కాళేశ్వరం ఏర్పాటు చేసిన ఆర్టీసీ తాత్కాలిక బస్టాండ్ ప్రధాన ఆలయం, సరస్వతీ(వీఐపీ) ఘాట్, మెయిన్ ఘాట్‌కు చాలా దూరంలో ఉండడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాహనాలు, భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయానికి దగ్గరలోని ఆర్టీసీ బస్టాండ్‌కు అధికారులు బస్సుల రాకపోకలు నిలిపివేశారు. దీంతో తాత్కాలిక బస్టాండ్ నుంచి బస్సులు నడుపుతుండడంతో భక్తులు అక్కడే దిగి అక్కడే ఎక్కాల్సి వస్తోంది. పుష్కర స్నానానికి వెళ్లడానికి ప్రైవేట్ వాహనాల్లో, ఉచిత బస్సుల్లో వెళ్తున్నా తిరుగు ప్రయాణంలో మాత్రం ఆలయం నుంచి తాత్కాలిక బస్టాండ్ వరకు నడుచుకుంటూ రావాల్సి వస్తోంది.