హన్మకొండ: టీజీఎప్‌సెట్–2025 ఫలితాల్లో రెజోనెన్స్ విద్యాసంస్థల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. తమ విద్యార్థులు రావుల ఇక్షవర్ 265వ ర్యాంకు, ఎ.సాయి రోహన్ 467, ఎ.నాగసాయి 806 ర్యాంకు సాధించారని రెజోనెన్స్ విద్యా సంస్థల చైర్మన్ లెక్కల రాజిరెడ్డి తెలిపారు. 272 మంది విద్యార్థులు 10,000 కంటే తక్కువ ర్యాంకులు సాధించారన్నారు.
విద్యార్థులు ఉజ్వల భవిష్యత్ కోసం తమ విద్యాసంస్థ కృషి చేస్తోందన్నారు. తమ అధ్యాపకుల అంకితభావం, విద్యార్థుల అవిశ్రాంత కృషి, వారి తల్లిదండ్రుల నిరంతర సహకారంతో ఈ విజయం సాధ్యమైందన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్లు లెక్కల మహేందర్ రెడ్డి, మాదిరెడ్డి దేవేందర్ రెడ్డి, సీఏఓ లెక్కల రమ్య రాజిరెడ్డి పాల్గొన్నారు.

‘రెజోనెన్స్’ విద్యార్థుల ప్రతిభ