
తరుణ్‌కు 325 ర్యాంకు
మహబూబాబాద్ రూరల్ : మహబూబాబాద్ మండలం అయోధ్య జీపీ పరిధిలోని భజన తండాకు చెందిన గుగులోత్ నెహ్రూ, సత్తి దంపతుల పెద్ద కుమారుడు తరుణ్ టీజీ ఎప్‌సెట్ ఫలితాల్లో 325 ర్యాంకు సాధించాడు. హైదరాబాద్ హయత్‌నగర్ ప్రాంతంలోని ఓ కళాశాలలో 2024 మార్చిలో ఇంటర్ ఎంపీసీ పూర్తిచేసిన తరుణ్.. కూకట్‌పల్లిలోని ఓ కోచింగ్ సెంటర్‌లో లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకున్నాడు. ప్రస్తుతం విడుదలైన ఎప్‌సెట్ ఫ లితాల్లో 325 ర్యాంకు సాధించి సహ విద్యార్థులకు ఆదర్శంగా నిలిచాడు. కాగా, సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కావాలన్నదే తన లక్ష్యమని తరుణ్ పేర్కొన్నాడు.
ఏజేఆర్ ఆటోమోటివ్స్ షోరూం ప్రారంభం
కరీంనగర్: కరీంనగర్‌లోని విట్స్ కళాశాల ఎదుట ఏర్పాటు చేసిన బుల్ కన్‌స్ట్రక్షన్స్ ఎక్విపెమెంట్ ఏజేఆర్ ఆటోమోటివ్స్ షోరూంను ‘సుడా’ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, బుల్ మిషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సౌత్ జోన్ హెడ్ వి.సోమసుందరం, స్టేట్‌హెడ్ ఎన్.సురేశ్ బాబు, షోరూం డీలర్ అంబటి జోజిరెడ్డి ఆదివారం ప్రారంభించారు. బుల్ కంపెనీకి సంబంధించి స్టాండర్డ్ పోర్ట్, స్టాండర్డ్ క్వాలిటీ, సూపర్ ఫర్ఫార్మెన్స్ ఉంటుందన్నారు. బుల్ కన్‌స్ట్రక్షన్స్ ఎక్విప్‌మెంట్ ద్వారా గంటకు లీటర్ డీజిల్ ఆదా అవుతుందన్నారు. సర్వీస్ విషయంలోనూ 100శాతం క్వాలిటీ అందిస్తామని తెలిపారు. కాంట్రాక్టర్ జగ్గారెడ్డి, ఫాదర్ సంతోశ్ పాల్గొన్నారు.
ప్రతీ విద్యార్థికి ఉపాధి కల్పిస్తాం
హసన్‌పర్తి: కళాశాలలో ప్రవేశం పొందిన ప్రతీ విద్యార్థికి ఉపాధి కల్పిస్తామని ఎస్‌వీఎస్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ ఎర్రబెల్లి తిరుమల్‌రావు అన్నారు. అల్లాడి క్లౌడ్ సొల్యూషన్ కంపెనీ నిర్వహించిన క్యాంపస్ ఇంటర్వ్యూల్లో ఉద్యోగాలు సాధించిన ఐదుగురు విద్యార్థినులకు ఆదివారం నియామక పత్రాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళాశాలలో వివిధ కంపెనీలను ఆహ్వానించి క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నామని, ఈఏడాది 234 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించారని వివరించారు. వారిని తిరుమల్‌రావు అభినందించారు. కార్యక్రమంలో కళాశాల ఫ్రిన్సిపాల్, ఎస్‌వీఎస్ విద్యాసంస్థ ల డైరెక్టర్లు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు
● ఎస్‌వీఎస్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ ఎర్రబెల్లి తిరుమల్‌రావు

తరుణ్‌కు 325 ర్యాంకు

తరుణ్‌కు 325 ర్యాంకు