
కాశీపండితులతో నవహారతులకు సిద్ధం
పీఠాధిపతులకు ప్రత్యేక విడిది..
కాళేశ్వరం : సరస్వతీనది పుష్కరాలకు వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చే పీఠాధిపతుల కోసం దేవాదాయశాఖ ప్రత్యేకంగా విడిది ఏర్పాట్లు చేసింది. కాళేశ్వరంలోని త్రివేణి గెస్ట్‌హౌస్‌ను కాకినాడకు చెందిన శిల్పులు సాలహారం సిమెంట్‌తో అందంగా ముస్తాబు చేశారు. 15 నుంచి 26 వరకు పదుల సంఖ్యలో రోజుకు ఒకరు తరలొచ్చి స్నానం ఆచరించనున్నారు.
ప్రమాద హెచ్చరిక జెండాలు ఏర్పాటు
కాళేశ్వరం: సరస్వతీనది పుష్కరాల్లో లక్షలాదిగా పుణ్యస్నానాలు ఆచరించడానికి తరలొచ్చే భక్తులు ప్రమాదాలకు గురికాకుండా ఇరిగేషన్‌శాఖ ఆధ్వర్యంలో కొంత లోతు వరకు ఎరుపు జెండాలు, బెలూన్స్ ఏర్పాటు చేశారు. మోకాలు లోతు నీటిలో స్నానాలు ఆచరించనున్నారు.
‘బాహుబలి’ సెట్టింగ్స్!
కాళేశ్వరం: పుణ్యస్నానాలకు వచ్చే భక్తులు పులకించేలా బాహుబలి మాదిరి సెట్టింగ్స్ ఏర్పాటు చేశారు. నాలుగు స్తంభాలకు నమస్కరిస్తున్న సింహాల బొమ్మలు ఏర్పాటు చేశారు. ఘాట్‌లో తోరణాలు ఏర్పాటు చేస్తున్నారు.
దుస్తులు మార్చుకునే గదుల నిర్మాణం
కాళేశ్వరం: పుణ్యస్నానాలు చేసిన అనంతరం మహిళలు దుస్తులు మార్చుకోవడానికి సరస్వతీఘాట్ వద్ద గదులు నిర్మిస్తున్నారు. 24 వరకు గదులు నిర్మించారు. మెయిన్‌ఘాట్‌లో 12 గదులు నిర్మించారు.
కాళేశ్వరం: కాళేశ్వరంలో మే15 నుంచి 26వ తేదీ వరకు జరుగనున్న సరస్వతీనది పుష్కరాల్లో తొలిసారి కాశీపండితులతో నవహారతులు ఇవ్వడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏడు గద్దెలు సరస్వతీమాత విగ్రహం ఎదుట నిర్మాణం చేశారు. ఏడుగురు పండితులు తొమ్మిది హారతులు 12 రోజుల పాటు ఇవ్వనున్నారు. కాశీ నుంచి పండితులు అశుతోశ్ పాండే, అభిషేక్ పాండే, నితీశ్‌కుమార్ పాండే, సమంత్ తివారీ, కౌశల్ తివారీ, దీపక్‌పాండే, అంకిత్‌పాండే, శివమ్ మిశ్రా ప్రత్యేక విమానంలో రానున్నారు.

కాశీపండితులతో నవహారతులకు సిద్ధం

కాశీపండితులతో నవహారతులకు సిద్ధం

కాశీపండితులతో నవహారతులకు సిద్ధం