
నేడు ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’
కేసముద్రం: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని శనివారం మండల కేంద్రంలోని రైతువేదిక భవనంలో నిర్వహించనున్నట్లు ఏఓ వెంకన్న శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 9.30గంటలకు నిర్వహించే కార్యక్రమంలో కేవీకే మల్యాల శాస్త్రవేత్తలు, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం, వరంగల్ శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో రైతులకు శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు.
దరఖాస్తుల పరిశీలన
వేగవంతం చేయాలి
మహబూబాబాద్: రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల పరిశీలన వేగవంతంగా పూర్తి చేయాలని బీసీ సంక్షేమశాఖ జిల్లా అధికారి సర్సింహస్వామి అన్నారు. స్థానిక మున్సిపాలిటీ కార్యాలయంలో శుక్రవారం రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల పరిశీలనపై వార్డు ఆఫీసర్లు, మున్సిపల్ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సింహస్వామి మాట్లాడుతూ.. ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకున్న వారి నుంచి హార్డ్‌కాపీలు రాకపోతే వెంటనే తెప్పించుకోవాలన్నారు. బ్యాంకుల నుంచి వెరిఫికేషన్ నివేదికలు త్వరగా తీసుకుని టార్గెట్‌లు పూర్తి చేయాలన్నారు. సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్రీనివాస రావు, ఎల్‌డీఎం సత్యనారాయణ మూర్తి పాల్గొన్నారు.
పార్టీ అభివృద్ధికి కష్టపడిన వారికే పదవులు
బయ్యారం: కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కష్టపడిన వారికే పదవులు వస్తాయని టీపీసీసీ జిల్లా పరిశీలకులు కూచన రవళిరెడ్డి, పొట్ల నాగేశ్వరరావు అన్నారు. సంస్థాగత కమిటీల ఏర్పాటులో భాగంగా శుక్రవారం స్థానిక సీతారామచంద్రస్వామి ఫంక్షన్‌హాల్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పార్టీ పెద్దల సూచనల మేరకు నిజమైన పార్టీ శ్రేణులకే పదవులు వస్తాయని, పార్టీ కోసం ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో పనిచేయాలన్నా రు. కార్యక్రమంలో ఎంపీ బలరాంనాయక్, ఇ ల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, డీసీసీ అధ్యక్షుడు భరత్‌చందర్‌రెడ్డి, సొసైటీ చైర్మన్ మధుకర్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు ముసలయ్య, ఎస్టీ విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు రామునాయ క్ తదితరులు పాల్గొన్నారు.
108 ప్రోగ్రాం మేనేజర్‌గా శివకుమార్
నెహ్రూసెంటర్: ఈఎంఆర్‌ఐ గ్రీన్ హెల్త్ సర్వీసెస్ సంస్థ జిల్లా ప్రోగ్రాం మేనేజర్‌గా శివకుమార్ నియమితులయ్యారు. జిల్లాలోని 108 (అత్యవసర సేవలు), 102 (అమ్మ ఒడి), 1962 (పశు సంచార) సేవలను పర్యవేక్షణ చేయనున్నారు. మహబూబాబాద్ ప్రోగ్రాం మేనేజర్‌గా పని చేసిన భూమ నాగేందర్ హైదరాబాద్ క్లస్టర్‌కు బదిలీపై వెళ్లగా ఆయన స్థానంలో వరంగల్‌లో మేనేజర్‌గా పని చేస్తున్న శివకుమార్ విధుల్లో చేరారు.
నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
గార్ల: ఆస్పత్రి అధికారులు, సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ఎమ్మెల్యే కో రం కనకయ్య అన్నారు. శుక్రవారం గార్ల సీహెచ్‌సీని తనిఖీ చేశారు. తొలుత వైద్యుల హాజరు పట్టికను పరిశీలించారు. నలుగురు డాక్టర్లలో ఒక్కరే విధులకు హాజరుకావడంపై ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వం డాక్టర్లకు లక్షల్లో వేతనాలు చెల్లిస్తుంటే.. కొంతమంది వారంలో ఒకరోజు కూడా హాజరుకాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రి నుంచే కొంతమంది డాక్టర్లకు ఎమ్మెల్యే ఫోన్ చేయగా వారు పొంతన లేని సమాధానం చెప్పారు. అనంతరం ఆస్పత్రికి వచ్చే రోగులతో ఎమ్మెల్యే మాట్లాడారు. ఆస్పత్రిలో ఉన్న డాక్టర్‌ను పిలిచి రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలని ఆదేశించారు. వైద్యుల గైర్హాజరు విషయాన్ని వైద్యశాఖ మంత్రి, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ రవిరాథోడ్, పీఏసీఎస్ చైర్మన్ దుర్గాప్రసాద్, మాజీ ఎంపీపీ వెంకట్‌లాల్, ఏఎంసీ మాజీ చైర్మన్ నాగేశ్వరరావు, డాక్టర్లు హనుమంతరావు, రాజ్‌కుమార్ జాదవ్ పాల్గొన్నారు.

నేడు ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’