నేడు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌ రాక | - | Sakshi
Sakshi News home page

నేడు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌ రాక

May 19 2025 2:32 AM | Updated on May 19 2025 2:32 AM

నేడు

నేడు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌ రాక

ప్రముఖుల పుష్కర స్నానం..

కాటారం/కాళేశ్వరం: పవిత్ర పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో కొనసాగుతున్న సరస్వతీనది పుష్కరాల్లో భాగంగా ఆదివారం పలువురు ప్రముఖులు పుష్కర స్నానం ఆచరించారు. హైకోర్టు జడ్జి సుధా దంపతులు, ప్రముఖ సినీనటుడు రాజేంద్రప్రసాద్‌, జెన్‌కో డైరెక్టర్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ అనురాధ, ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న.. సరస్వతి(వీఐపీ)ఘాట్‌లో పుష్కర స్నానం చేశారు. అనంతరం కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయం చేరుకుని స్వామి వారికి, సరస్వతీమాతా, శుభానందాదేవికి ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు హైకోర్టు జడ్జి సుధాకు కలెక్టర్‌ రాహుల్‌శర్మ, ఎస్పీ కిరణ్‌ఖరే స్వాగతం పలికి మొక్కను బహూకరించారు.

నిఘా నీడలో కాళేశ్వరం

భూపాలపల్లి/కాళేశ్వరం: సరస్వతీనది పుష్కరాల సందర్భంగా పోలీసులు ముందస్తు నిఘా నేత్రాలు ఏర్పాటు చేశారు. మావోయిస్టు ప్రాబల్య ప్రాంతం, మహారాష్ట్ర– తెలంగాణ సరిహద్దులో కాళేశ్వరం ఉండడంతో అంతర్రాష్ట్ర వంతెన నుంచి మొదలు.. శ్రీకాళేశ్వర ముక్తీశ్వర దేవాలయం, పరిసర ప్రాంతాలు, పార్కింగ్‌ స్థలాలు, పుష్కర ఘాట్‌, ప్రధాన రహదారుల్లో సుమారు 200 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వీటన్నింటినీ కాళేశ్వరంలో ఏర్పాటు చేసిన పోలీస్‌ కంట్రోల్‌ రూంకు అనుసంధానం చేసి నిత్యం పరిశీలిస్తున్నారు. ఫలితంగా ఇప్పటి వరకై తే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదు.

ఎండవేడితో భక్తుల అస్వస్థత

భూపాలపల్లి అర్బన్‌: కాళేశ్వరంలో ఎండ వేడితో భక్తులు అస్వస్థతకు గురవుతున్నారు. పుష్కరాలో భాగంగా నాలుగో రోజు ఆదివారం 8 మంది భక్తులు ఎండవేడికి అస్వస్థతకు గురికాగా 108లో కాళేశ్వరం పీహెచ్‌సీకి తరలించారు. పీహెచ్‌సీలో ఆదివారం 156 మందికి ఓపీ పరీక్షలు నిర్వహించగా 30 మంది భక్తులను అడ్మిట్‌ చేసుకున్నారు. కాళేశ్వరంలో ఏర్పాటు చేసిన క్యాంపుల ద్వారా సుమారు 4వేల మంది భక్తులకు వైద్య సేవలు అందించామని డీఎంహెచ్‌ఓ మధుసూదన్‌ తెలిపారు.

కలెక్టర్‌ జాయ్‌ రైడ్‌..

భూపాలపల్లి/కాళేశ్వరం: జయశంకర్‌ భూపాలపల్లి కలెక్టర్‌ రాహుల్‌ శర్మ జాయ్‌ రైడ్‌ చేసి సరస్వతీనది పుష్కర సదుపాయాలను పరిశీలించారు. ఆదివారం ఉదయం కరీంనగర్‌ సీపీ గౌస్‌ అలం, కరీంనగర్‌ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ ప్రపుల్‌ దేశాయ్‌తో కలిసి హెలికాప్టర్‌లో పుష్కర పరిసరాలు పరిశీలించారు. పుష్కర ఘాట్‌లు, రహదారి సదుపాయాలు, శానిటేషన్‌, పారిశుద్ధ్య చర్యలు, టెంట్‌ సిటీ, స్టాళ్లు, భద్రతా ఏర్పాట్లును పరిశీలించారు. అనంతరం అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ భక్తులకు హెలికాప్టర్‌ ద్వారా త్రివేణి సంగమం, కాళేశ్వర దేవస్థానం, కాళేశ్వరం చుట్టు పక్కల అడవులు, తదితర అందాలను వీక్షించడానికి జాయ్‌ రైడ్‌ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

భూపాలపల్లి: సరస్వతీనది పుష్కరాలకు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌ సోమవారం రోడ్డు మార్గాన కాళేశ్వరం రానున్నారు. ఉదయం 10.30 గంటలకు కాళేశ్వరం చేరుకుని పుష్కర స్నానం ఆచరించిన అనంతరం శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారిని దర్శించుకుంటారు. 12 గంటలకు తిరిగి కరీంనగర్‌కు వెళ్లనున్నారు. అలాగే, ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ కూడా సోమవారం కాళేశ్వరం రానున్నట్లు సమాచారం.

నేడు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌ రాక1
1/4

నేడు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌ రాక

నేడు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌ రాక2
2/4

నేడు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌ రాక

నేడు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌ రాక3
3/4

నేడు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌ రాక

నేడు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌ రాక4
4/4

నేడు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌ రాక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement