సైన్యానికి మద్దతుగా తిరంగా ర్యాలీ
మహబూబాబాద్ అర్బన్: పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ సైన్యం నిర్వహించిన ఆపరేషన్ సిందూర్‌ను పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ సెంటర్ నుంచి తహసీల్దార్ కార్యాలయం, నెహ్రూసెంటర్, రైల్వేస్టేషన్ మదర్‌థెరిస్సా సెంటర్, చేపల మార్కెట్ మీదుగా స్వామి వివేకానంద సెంటర్ వరకు భారత్ సైన్యానికి మద్దతుగా తిరంగా ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణ చైర్మన్ మార్తినేని ధర్మారావు హాజరై మాట్లాడారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్‌లోని ఉగ్రస్థావరాలను, ఆర్మీ బేస్‌లను ధ్వంసం చేసిందని కొనియాడారు. ప్రధాని మోదీ వ్యూహంతో వ్యవహరించి పాకిస్తాన్‌లోని టెరర్రిస్టులను భారత్ సైన్యంతో హతం చేశారన్నారు. తిరంగా యాత్రలో పాల్గొన్న జిల్లా మాజీ సైనికులకు, ఆర్మీ, నేవీ సైనికులకు, యువకులు, మహిళలు, వ్యాపారవేత్తలకు, న్యాయవాదులు, వైద్య బృదాలకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆర్మీ, నేవి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ మాట్లాడు తూ.. సైన్యం పిలిస్తే భారత్ తరఫున తాము యు ద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నామని, తమ ప్రాణా లను సైతం లెక్కచేయమని చెప్పారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, జిల్లా మాజీ అధ్యక్షుడు వద్దిరాజు రామచందర్‌రావు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యు డు శ్యామ్‌సుందర్‌శర్మ, జిల్లా కౌన్సిల్ సభ్యుడు గడ్డం అశోక్, రాష్ట్ర ఎస్టీ మోర్చా కార్యదర్శి రాంబాబునాయక్, జిల్లా అధికార ప్రతినిధి ఇందుభారతి, పట్టణ అధ్యక్షుడు అజయ్, నాయకులు సంపత్, ఓర్సు పద్మ, సరోజ, రాధపటేల్, మహేష్‌గౌడ్, సందీప్, నరేశ్, మదన్‌లాల్, అశోక్, మాజీ సైనికులు నర్సింహరావు, కేశవరావు, విజయ్‌గణేష్, రాజేశ్వర్, రాఘవరెడ్డి, ఐలయ్య తదితరులు ఉన్నారు.
సైన్యానికి మద్దతుగా తిరంగా ర్యాలీ


