
రోడ్డు ప్రమాదంలో ఏఆర్ కానిస్టేబుల్ మృతి
స్టేషన్‌ఘన్‌పూర్: రోడ్డు ప్రమాదంలో ఏఆర్ కానిస్టేబుల్ మృతి చెందాడు. ఈ ఘటన గురువారం రాత్రి మండలంలోని ఛాగల్లు శివారు శివారెడ్డిపల్లి వద్ద జాతీయ రహదారిపై జరిగింది. పోలీసు కథనం ప్రకారం.. హనుమకొండ జిల్లా దామెర మండలం ల్యాదెళ్లకు చెందిన రాయరాకుల సతీశ్(42) ఏఆర్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ప్రస్తుతం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు గన్‌మన్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. వ్యక్తిగత పనుల నిమిత్తం బైక్‌పై హనుమకొండ నుంచి జనగామ వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఛాగల్లు శివారులో శివారెడ్డిపల్లి వద్ద జాతీయరహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు పోలీసులు సమాచారం అందించగా వారు క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించే క్రమంలోనే మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుడి భార్య రాధిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ జి.వేణు తెలిపారు.
● శివారెడ్డిపల్లి వద్ద ఘటన
● మృతుడు మాజీ మంత్రి దయాకర్‌రావు గన్‌మన్

రోడ్డు ప్రమాదంలో ఏఆర్ కానిస్టేబుల్ మృతి