
పుష్కరాలకు పోలీసు సైన్యం..
కాళేశ్వరం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో ఈ నెల 15 నుంచి 26వ తేదీ వరకు జరగనున్న సరస్వతీనది పుష్కరాల్లో విధులు నిర్వర్తించేందుకు పోలీసు సైన్యం రెడీ అయ్యింది. ఎస్పీ కిరణ్‌ఖరే ఆధ్వర్యంలో 1,678 మంది సిబ్బంది పుష్కర విధుల్లో పాల్గొననున్నారు. వివిధ ప్రదేశాల్లో 12 రోజుల పాటు భద్రత నిర్వహించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సరస్వతీనది పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని రూ.25కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టింది.
తరలిరానున్న
ప్రముఖులు..
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీ స్‌గఢ్ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి లక్షలాదిగా 12 రోజుల పాటు రోజుకు 50 నుంచి 60వేల వరకు భక్తులు తరలిరానున్నారు. వీరితో పాటు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి 15న పుష్కరాల ప్రారంభానికి రానుండడంతో పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. పీఠాధిపతులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, సినీ పెద్దలు, ప్రముఖ వ్యాపారవేత్తలు రానున్నారు. వీరందరితో పాటు సామాన్య భక్తజనానికి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.
పుష్కరాల విధుల్లో పాల్గొనే
పోలీసుల వివరాలు ..
డీఎస్పీలు 24, సీఐలు 60, ఎస్సైలు 196, ఏఎస్సైలు, హెడ్‌కానిస్టేబుళ్లు 214, కానిస్టేబుళ్లు 442, హోంగార్డులు, 280, మహిళ హెడ్‌కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు 100, మహిళా హోంగార్డులు 16, ఇతర రోప్‌పార్టీలు, బాంబ్‌స్క్వాడ్‌లు, డాగ్‌స్క్వాడ్‌లు ఇతర పోలీసులు విధులు నిర్వర్తిస్తారు.
విధులు ఇలా..
కాళేశ్వరాలయం, పలుగుల ఎక్స్, గంగారం ఎక్స్, వీఐపీ ఘాట్, మెయిన్‌ఘాట్, నాలుగు పార్కింగ్ స్థలాలు, వంతెన చెక్‌పోస్టు, ఇప్పలబోరు జంక్షన్, పోలీసుస్టేషన్, తదితర ప్రాంతాల్లో పోలీసులు విధులు నిర్వర్తిస్తారు.
విధుల్లో 1,678 మంది సిబ్బంది
వివిధ ప్రదేశాల్లో
12 రోజుల పాటు భద్రత