
అంబేడ్కర్ ఆశయ సాధనకు కృషి
గూడూరు: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ ఆశయ సాధనకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు జాటోతు హుస్సేన్‌నాయక్ అన్నారు. మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్‌లో అంబేడ్కర్ కమిటీ ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహాన్ని ఆయన శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ విగ్రహావిష్కరణ కమిటీ కన్వీనర్ కత్తి స్వామి అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడారు. పేద వర్గాలు, వెనుకబడిన తరగతుల అభ్యున్నతికి అవసరమైన అంశాలను అంబేడ్కర్ ఆనాడే రాజ్యాంగంలో పొందుపరిచారని అన్నారు. అంబేడ్కర్ కల్పించిన హక్కులతోనే తనకు నేడు జాతీయ ఎస్టీ కమిషన్‌లో సభ్యుడిగా అవకాశం వచ్చిందన్నారు. గూడూరు మండలాన్ని డీ లిమిటేషన్‌లో డివిజన్ కేంద్రంగా మారేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రాజకీయాలకు అతీతంగా తనతో అభివృద్ధి పనులు చేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అంబేడ్కర్ విగ్రహావిష్కరణ కమిటీ, హిందూ ఉత్సవ సమితి అధ్యక్షుడు పింగిళి శ్రీనివాస్, అంబేడ్కర్ యువజన సంఘం అధ్యక్షుడు వీరస్వామి, వాంకుడోతు కొమ్మాలు, డాక్టర్ ఏపూరు రవీందర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ లింగారెడ్డి, మాజీ సర్పంచ్ రమేష్‌నాయక్, రాధ, తహసీల్దార్ చంద్రశేఖర్‌రావు, తదితరులు పాల్గొన్నారు.
జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు
హుస్సేన్‌నాయక్