రైతులు ఉక్కిరి బిక్కిరి! | - | Sakshi
Sakshi News home page

రైతులు ఉక్కిరి బిక్కిరి!

May 17 2025 6:44 AM | Updated on May 17 2025 6:44 AM

రైతుల

రైతులు ఉక్కిరి బిక్కిరి!

శనివారం శ్రీ 17 శ్రీ మే శ్రీ 2025

IIలోu

సాక్షి, మహబూబాబాద్‌/మహబూబాబాద్‌ రూరల్‌: యాసంగి ధాన్యం అంచనాకు మించి దిగుబడి వ చ్చింది. ఇదే రీతిలో కొనుగోలు కేంద్రాలకు వస్తోంది. అంచనాకు మించి ధాన్యం కేంద్రాలకు రావడంతో ఒక వైపు కాంటాలు ఆలస్యం.. మరోవైపు గన్నీ సంచులు, లారీల కొరతతో పాటు జిల్లాలోని మిల్లులన్నీ ధాన్యంతో నిండిపోయాయి. ఈక్రమంలో వారాల తరబడి కేంద్రాల్లోనే రైతులు నిరీక్షించాల్సి వస్తోంది. దీనికి తోడు సాయంత్రం అయితే ఉరుములు, మెరుపులతో అకాల వర్షాలు కురుస్తుండడంతో రైతులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

అంచనాలు తారుమారు..

గత యాసంగిలో సివిల్‌ సప్లయీస్‌ అధికారులు వేసిన అంచనాల్లో మూడోవంతు ధాన్యం కూడా రాలేదు. ఇదే పరిస్థితి ఉంటుందని ఈ సారి అధికారులు వేసిన అంచనాలు తారుమారయ్యాయి. యాసంగిలో 1,36,236 ఎకరాల్లో వరి సాగుచేశారు. 2,63,577 మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ఇందులో ప్రైవేట్‌ అమ్మకాలు, ఇతర అవసరాలకు రైతులు నిల్వ ఉంచడం పోనూ.. కొనుగోలు కేంద్రాలకు 1.79లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేశారు. అయితే సన్న ధాన్యానికి క్వింటాకు బోనస్‌తో కలుపకొని రూ. 2,820 చెల్లించడంతో అందరు కొనుగోలు కేంద్రాలకే రావడం మొదలు పెట్టారు. దీనికి తోడు దిగుబడి అంచనా కూడా పెరడగంతో ఇప్పటికే 1.20లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా మరో 30వేల మెట్రిక్‌ టన్నులకు మించి ధాన్యం కేంద్రాల్లో ఉంది. ఇంకా రైతుల వద్దనుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తూనే ఉంది.

తీరని లారీల కొరత

కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన వెంటనే పలుచోట్ల ధాన్యం కొనకుండా ఉండడంతో ఒకేసారి రైతుల నుంచి ఒత్తిడి పెరిగింది. పెద్ద మొత్తంలో ధాన్యం రావడం, కాంటాలు పెట్టిన ధాన్యం మిల్లులకు చేరవేసేందుకు సరిపడా లారీలను అధికారులు సమకూర్చలేకపోతున్నారు. దీంతో కాంటాలు పెట్టిన ధాన్యం కేంద్రాల్లోనే వారాల తరబడి ఉంచాల్సి వస్తుందని రైతులు చెబుతున్నారు. ఆరు ఐదు రూట్లలో లారీలు సరఫరా చేసేందుకు కాంట్రాక్టర్లతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు లారీలు పెట్టడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఎగుమతి చేసిన ధాన్యం ఆధారంగా 80శాతం డబ్బులు అడ్వాన్స్‌గా ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఇవ్వడం లేదని పలువురు లారీ కాంట్రాక్టర్లు లారీలు పెట్టేందుకు వెనకడుగు వేస్తున్నట్లు తెలిసింది. దీంతో సరిపడా లారీలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు.

నిండిన మిల్లులు

జిల్లాలో 193 కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేసిన ధాన్యం దిగుమతి చేసుకునేకునే మిల్లులు నిండిపోయినట్లు తెలిసింది. జిల్లా వ్యాప్తంగా 63 రైస్‌ మిల్లులు ఉండగా ఇందులో సీఎంఆర్‌ పెట్టడం లేదని 16 మిల్లులను బ్లాక్‌ లిస్టులో పెట్టారు. ప్రభుత్వం పెట్టిన 10 శాతం బ్యాంకు గ్యారంటీ ఇవ్వాలనే నిబంధనలతో మరికొన్ని మిల్లులు వెనకడుగు వేశాయి. కాగా, వీటన్నిటికి అంగీకరించిన 40 మిల్లులకు మాత్రమే ధాన్యం సరఫరా చేయగా.. ఇప్పటికే వానాకాలం ధాన్యం నిల్వ ఉండడం, యాసంగి ధాన్యం రావడంతో మిల్లులు నిండిపోయాయి. జిల్లా సివిల్‌ సప్లయీస్‌ ఉన్నతాధికారులకు ఈవిషయం తెలుపగా వరంగల్‌ జిల్లాలోని మిల్లులకు పంపించాలని చెప్పారు. అయితే అక్కడ కూడా ఎక్కువ మొత్తంలో ధాన్యం రావడంతో మాకొద్దు మీ ధాన్యం అని వరంగల్‌ జిల్లా రైస్‌ మిల్లర్లు అంటున్నట్లు తెలిసింది. దీంతో ధాన్యం ఎగుమతి చేయడం కూడా అధికారులకు సవాల్‌గానే మారింది.

250 బస్తాల ధాన్యం తడిసింది

మా 250 బస్తాల ధాన్యం కొనుగోలు చేసి కాంటాలు పెట్టి మూడు రోజులైంది. లారీలు రాకపోవడం వల్ల నాలాంటి ఎంతో మంది రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లా రీలు రాకపోవడంతో అకాల వర్షం వల్ల ధా న్యం బస్తాలు తడిసిపోయాయి. ఇంకా ఎన్ని రోజులు కొనుగోలు కేంద్రంలో ఉండాలి, ఇప్పుడు ఈ నష్టాన్ని ఎవరు భరించాలి.

– బానోత్‌ మీట్యా, ఇస్లావత్‌తండా జీపీ

ధాన్యం కొన్నారు...

తరలించలేదు..

సింగారం ధాన్యం కొనుగోలు కేంద్రంలో మా వద్ద నిర్వాహకులు ధాన్యం కొనుగోలు చేశారు. కానీ బస్తాలు నింపి ఉంచి కాంటాలుపెట్టి మిల్లులకు తరలించకపోవడం వల్ల వర్షానికి ధాన్యం తడిసింది. ఇప్పుడు మిల్లర్లు ఈ బస్తాలు తీసుకోమని చెబితే మా పరిస్థితి ఏమిటో అర్థం కాడంలేదు.

– బానోత్‌ జేతా, కేశ్యతండా,

వీఎస్‌.లక్ష్మిపురం జీపీ

అకాల వర్షం.. తడిసిన ధాన్యం

కురవి/మరిపెడ రూరల్‌/ నర్సింహులపేట/ పెద్దవంగర/దంతాలపల్లి: జిల్లాలోని పలు మండలాల్లో గురువారం రాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. గాలివానకు చెట్లు కూలిపోయాయి, ఇంటిపైకప్పు రేకులు ఎగిరిపోయాయి. పలుచోట్ల విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. కురవి మండల కేంద్రంతోపాటు నేరడ గ్రామంలోని కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసింది. కాంటా అయిన ధాన్యం సైతం వర్షానికి తడిసిపోయింది. నేరడ గ్రామానికి వెళ్లే మార్గంలో పెద్ద వృక్షం కూలిపోవడంతో రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. యువకులు రోడ్డుపై పడిన చెట్టును తొలగించారు. సీరోలు మండలం కొత్తూరు(సీ) గ్రామంలో ధాన్యం తడిసిపోయింది. నర్సింహులపేట మండలంలో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. అలాగే మరిపెడ మండలంలోని తండధర్మారం గ్రామానికి చెందిన రైతు ధరంసోత్‌ మంగీలాల్‌కు చెందిన 90 ధాన్యం బస్తాలు తడిసిపోగా ఆరబెట్టుకున్నాడు. పెద్దవంగర మండలంలోని పలు కొనుగోలు కేంద్రాల్లో కాంటా పెట్టిన బస్తాలు తడిసిపోయాయి. శుక్రవారం బస్తాలను ఉల్టావేసి ఆరబెట్టుకున్నారు. అధికారులు తహసీల్దార్‌ మహేందర్‌, ఏఓ స్వామి నాయక్‌, ఏఈఓలు కేంద్రాలను సందర్శించారు. కాంటా పెట్టి నిల్వ ఉన్న బస్తాలను లారీల ద్వారా పంపించే పక్రియను వేగవంతంగా చేట్టారు. అలాగే దంతాలపల్లి మండలంలోనూ అకాల వర్షంతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసింది.

న్యూస్‌రీల్‌

కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపోయిన ధాన్యం నిల్వలు

సరిపడా గన్నీ సంచులు,

లారీలు లేక ఇబ్బందులు

ఇప్పటికే నిండిపోయిన రైస్‌ మిల్లులు

మాకొద్దు ధాన్యం అంటున్న

వరంగల్‌ అధికారులు

రైతులను వెంటాడుతున్న అకాల వర్షాలు

రైతులు ఉక్కిరి బిక్కిరి!1
1/6

రైతులు ఉక్కిరి బిక్కిరి!

రైతులు ఉక్కిరి బిక్కిరి!2
2/6

రైతులు ఉక్కిరి బిక్కిరి!

రైతులు ఉక్కిరి బిక్కిరి!3
3/6

రైతులు ఉక్కిరి బిక్కిరి!

రైతులు ఉక్కిరి బిక్కిరి!4
4/6

రైతులు ఉక్కిరి బిక్కిరి!

రైతులు ఉక్కిరి బిక్కిరి!5
5/6

రైతులు ఉక్కిరి బిక్కిరి!

రైతులు ఉక్కిరి బిక్కిరి!6
6/6

రైతులు ఉక్కిరి బిక్కిరి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement