
సీబీఎస్‌ఈ టెన్త్ ఫలితాల్లో విజయభేరి..
విద్యారణ్యపురి: సీబీఎస్‌ఈ టెన్త్ పరీక్షల ఫలితాల్లో ‘ఎస్‌ఆర్’ స్కూల్స్ విద్యాసంస్థల విద్యార్థులు విజయభేరి మోగించారని ౖ‘ఎస్‌ఆర్’ విద్యాసంస్థల చెర్మన్ ఎ. వరదారెడ్డి, డైరెక్టర్లు మధుకర్‌రెడ్డి, సంతోశ్‌రెడ్డి మంగళవారం తెలిపారు. జాతీయ స్థాయిలో ఎం. రిషి 500 మార్కులకుగాను 498 మార్కులు సాధించారని వారు పేర్కొన్నారు. వి. వివేకానందారెడ్డి 487 మార్కులు, కె జశ్వంత్ 487 మార్కులు, బి హృశికేశ్‌మూర్తికి 485 మార్కులు, ఎ. సాయి కశ్యప్ 484 మార్కులు, పి.అభిలాశ్‌రెడ్డి 481మార్కులు, కెకె.సాహిత్య 480మార్కులు సాఽధించారని తెలిపారు. పటిష్ట విద్యాప్రణాళిక, అంకితభావం కలిగిన ఉపాధ్యాయ బృంద విద్యాబోధనతో విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారని వారు చెప్పారు. ఎస్‌ఎస్‌సీ విద్యార్థులకు ఐఐటీ, మెడికల్ ఫౌండేషన్‌పై శ్రద్ధ తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ ఫలితాలు విద్యార్థులందరికీ స్ఫూర్తిదాయకం కావాలని వారు ఆకాంక్షించారు.

సీబీఎస్‌ఈ టెన్త్ ఫలితాల్లో విజయభేరి..

సీబీఎస్‌ఈ టెన్త్ ఫలితాల్లో విజయభేరి..

సీబీఎస్‌ఈ టెన్త్ ఫలితాల్లో విజయభేరి..

సీబీఎస్‌ఈ టెన్త్ ఫలితాల్లో విజయభేరి..