
దరఖాస్తులు పరిష్కరించాలి
దంతాలపల్లి: భూభారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను తప్పులు లేకుండా పరిష్కరించాలని కలెక్టర్ అద్వైత్ కుమార్‌సింగ్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో రైతుల దరఖాస్తులను పరిశీలించారు. అనంతరం రెవెన్యూ అధికారులతో మాట్లాడుతూ.. భూముల విషయంలో రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, దరఖాస్తుదారుల ఆధారాలను పరిశీలించి న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. రైతుల సమస్యలను పూర్తిస్థాయిలో అవగాహన చేసుకొని, సమస్యలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. క్షేత్రస్థాయిలో భూములను పరిశీలించి హద్దులు ఏర్పాటు చేసి రైతులకు న్యాయం చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ వీరబ్రహ్మచారి, తహసీల్దార్ సునీల్‌కుమార్, నాగరాజు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
కొనుగోళ్లలో వేగం పెంచాలి
నర్సింహులపేట: ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ అన్నారు. గురువారం మండలంలోని వంతడపల స్టేజీ వద్ద ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా, వేగంగా చేపట్టాలన్నారు. అకాల వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్ వీరబ్రహ్మచారి, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్