
ఖైదీల పనితీరు ప్రోత్సహించేందుకు స్టాల్ ఏర్పాటు
● జెళ్ల శాఖ డీజీ సౌమ్యమిశ్రా
కాళేశ్వరం : ఖైదీల పనితీరు ప్రోత్సహించడంలో భాగంగా సరస్వతీనది పుష్కరాల్లో వారితో తయారు చేయించిన వివిధ ఉత్పత్తులతో కాళేశ్వరంలో స్టాల్ ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ సౌమ్యమిశ్రా తెలిపారు. ఈ మేరకు శుక్రవారం కాళేశ్వరంలో ఏర్పాటు చేసిన స్టాల్‌ను ప్రారంభించిన అనంతరం ఆమె మాట్లాడారు. జైళ్ల శాఖ ఖైదీలకు వివిధ ఉత్పత్తి రంగాల్లో శిక్షణ కల్పిస్తూ వారితో నాణ్యమైన వస్తువులు తయారు చేయించి ఉపాధి కల్పిస్తోందన్నారు. పుష్కరాలకు వచ్చే భక్తులు ఈ ఉత్పత్తులు కొనుగోలు చేయాలని కోరారు. కార్యక్రమంలో జైళ్ల శాఖ వరంగల్ రేంజ్ డీఐజీ సంపత్, కలెక్టర్ రాహుల్ శర్మ, వరంగల్ సెంట్రల్ జైల్ పర్యవేక్షణాధికారి టి.కళాసాగర్, ఉప పర్యవేక్షణాధికారులు పి.వెంటేశ్వరస్వామి, జైలర్ పి.పూర్ణచందర్, పరకాల సబ్ జైలు పర్యవేక్షణాధికారి ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.