కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్
మహబూబాబాద్: జిల్లాలో ఆయిల్‌పామ్ సాగు విస్తీర్ణం పెంచాలని కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్ అన్నారు. కలెక్టరేట్‌లో మంగళవారం ఆయిల్‌పామ్ సాగు పోస్టర్లు, కరపత్రాలను కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్, అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఆయిల్‌పామ్ సాగుతో ప్రతీ నెల స్థిరమైన ఆదాయం సమకూరుతుందన్నారు. జిల్లాలో 8,000 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు చేసిన ట్లు తెలిపారు. పలు రకాల ఉద్యాన పంటలు సాగు చేస్తే రైతులకు ఆదాయం పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో డీఏఓ విజయనిర్మల, ఉ ద్యానశాఖ జిల్లా అఽధికారి మరియన్న ఉన్నారు.
పీహెచ్‌సీ ఆకస్మిక తనిఖీ
మరిపెడ: మరిపెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డిప్యూటీ డీఎంహెచ్‌ఓ సుధీర్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. గర్భిణులు పీహెచ్‌సీలోనే ప్రసవం అయ్యేలా చూడాలని సూచించారు. ప్రతీ బుధ, శనివారాల్లో పిల్లలకు వ్యాక్సిన్స్ ఇవ్వాలన్నారు. ప్రతీ మంగళ, శుక్రవారాల్లో డ్రైడే పాటించాలని చెప్పారు. కార్యక్రమంలో స్థానిక వైద్యాధికారి గుగులోతు రవికుమార్, డిప్యూటీ పారామెడికల్ ఆఫీసర్ వనాకర్‌రెడ్డి, విద్యాసాగర్, మంగమ్మ, సుదర్శన్, లక్ష్మి, మాధవి, పద్మ, స్వర్ణ, వీరయ్య తదితరులు పాల్గొన్నారు.
శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలి
మహబూబాబాద్ అర్బన్: ఉపాధ్యాయులు శిక్షణ తరగతులకు తప్పకుండా హాజరై సద్వి నియోగం చేసుకోవాలని డీఈఓ రవీందర్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని అనంతారం మో డల్ స్కూల్, హోలిఏంజిల్స్ ఏకశిల హైస్కూల్, జెడ్పీహెచ్‌ఎస్ బాలికల పాఠశాలలో మంగళవారం ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు ప్రా రంభమయ్యాయి. డీఈఓ హాజరై మాట్లాడు తూ.. ఉపాధ్యాయులు శిక్షణలో నేర్చుకున్న అంశాల ఆధారంగా విద్యార్థులకు మెరుగైన బోధన చేయాలన్నారు. ప్రభుత్వ బడుల బలోపేతానికి ఉపాధ్యాయులందరూ కృషి చేయాలని, విద్యార్థుల సంఖ్య పెంచాలన్నారు. కార్యక్రమంలో క్వాలిటీ కోఆర్డినేటర్ ఆజాద్ చంద్రశేఖర్, ఏసీజీఈ మందుల శ్రీరాములు, జిల్లా సైన్స్ అధికారి అప్పారావు, ఎంఈఓలు వెంకటేశ్వర్లు, రవి కుమార్, డీసీఈబీ అసిస్టెంట్ సెక్రటరీ సమ్మెట సతీష్‌గౌడ్ పాల్గొన్నారు.
గొంతులో మాంసం బొక్క ఇరుక్కుని ఒకరి మృతి
మరిపెడ: భోజనం చేస్తుండగా మాంసం బొక్క గొంతులో ఇరుక్కుని ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మరిపెడ పట్టణ శివారు కొత్తతండాలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు బండతండాకు చెందిన జాటోతు లక్ష్మణ్(68) తన బావమరిది అయిన కొత్తతండాకు చెందిన అజ్మీరా ఠాగూర్ ఇంట్లో దుర్గమ్మ పండుగకు హాజరయ్యాడు. మంగళవారం ఉదయం మాంసం తింటున్న సమయంలో బొక్క గొంతులో అడ్డుపడింది. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. మృతుడికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు.
సమయపాలన పాటించాలి
గూడూరు: ఏజెన్సీ ప్రాంతాల్లోని ఆస్పత్రుల్లో విధులు నిర్వర్తించే వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలని ఐటీడీఏ ఏటూరునాగా రం పీఓ చిత్రామిశ్రా అన్నారు. మండలంలోని తీగలవేణి పీహెచ్‌సీని మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రి భవనం, పరిసర ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ... ఎండాకాలం దృష్ట్యా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుకోవాలని, అవసరమైన మందులు నిల్వ చేసుకోవాలన్నారు. ఓపీ, ఇతర రికార్డులను పరిశీలించారు. డాక్టర్ రాంబాబు, సూపర్‌వైజర్ శానుబేగం, ఫార్మసిస్టు అమల, సిబ్బంది పాల్గొన్నారు.

ఆయిల్‌పామ్ సాగు విస్తీర్ణం పెంచాలి