
పౌర రక్షణ వలంటీర్లుగా నమోదుకు అవకాశం
న్యూశాయంపేట : భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ‘మై భారత్ పౌర రక్షణ వలంటీర్లుగా పనిచేయడానికి యువత నుంచి పేర్ల నమోదుకు ఆహ్వానిస్తున్నట్లు మై భారత్ వరంగల్ డిప్యూటీ డైరెక్టర్, ఉమ్మడి జిల్లా యువజన సంక్షేమాధికారి సీహెచ్.అన్వేశ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. యువతలో పౌర బాధ్యత, క్రమశిక్షణ భావం పెంపొందించడమే కాకుండా క్లిష్ట పరిస్థితుల్లో శిక్షణ ఇచ్చి పనిచేయడానికి సన్నద్ధం చేస్తామని తెలిపారు. ఆసక్తి గల యువత మై భారత్ పోర్టల్ mybharat.gov.inలో నమోదు చేసుకోవాలన్నారు. వివరాలకు 9491383832 నంబర్‌లో సంప్రదించాలన్నారు.
వడదెబ్బతో వృద్ధురాలి మృతి
లింగాలఘణపురం : మండలంలోని వడిచర్లకు చెందిన గండి పోషఎల్లమ్మ (68)వడదెబ్బతో సోమవారం మృతి చెందింది. ఆదివారం కుటుంబ సభ్యులు బంధువుల వివాహానికి వెళ్లగా ఇంటి వద్ద ఉన్న పోషఎల్లమ్మ గ్రామంలో ఎండలో తిరిగింది. వివాహానికి వెళ్లిన కుటుంబ సభ్యులు ఆలస్యంగా ఇంటికి రావడంతో నిద్రపోతుందని భావించి వారు కూడా నిద్రపోయారు. ఉదయం లేచి చూడగా తీవ్ర జ్వరంతో కనిపించగా గమనించి ఆస్పత్రికి తరలించే ప్రయత్నంలోనే మృతి చెందింది.
రాయపర్తిలో వృద్ధుడు..
రాయపర్తి: వడదెబ్బతో మండల కేంద్రంలోని అంబేడ్కర్‌నగర్ కాలనీకి చెందిన కంతుల ఉప్పలయ్య(75) మృతి చెందాడు. సోమవారం ఎండవేడిమికి అస్వస్థతకు గురికావడంతో ఆర్‌ఎంపీ వద్దకు తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందినట్లు స్థానికులు తెలిపారు.
చేపల వేటకు వెళ్లి వ్యక్తి ..
చిన్నగూడూరు: చేపల వేటకు వెళ్లి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన సోమవారం మండలంలోని జయ్యారం పెద్ద చెరువులో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కొండ సైదులు(55) చేపలు పట్టే క్రమంలో చెరువులో ఉన్న నాచు, వల కాళ్లకు చుట్టుకుంది. గమనించి సహ జాలర్లు సైదులును కాపాడే యత్నం చేస్తుండగానే నీట మునిగి మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రవీణ్‌కుమార్ తెలిపారు.
60 కిలోల ఎండు
గంజాయి స్వాధీనం
మహబూబాబాద్ రూరల్ : మహబూబాబాద్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో సుమారు రూ. 15 లక్షల విలువైన 60 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నామని ఎకై ్సజ్ సీఐ జి.చిరంజీవి తెలిపారు. ఈ మేరకు మహబూబాబాద్ ఎకై ్సజ్ స్టేషన్ వద్ద సోమవారం వివరాలు వెల్లడించారు. పలు రైళ్లలో ఎండు గంజాయి సరఫరా చేస్తున్నారనే సమాచారం మేరకు సోదాలు నిర్వహించగా కురవి గేట్ రైల్వే ట్రాక్ సమీపంలోని చెట్ల పొదలమాటున రెండు ప్లాస్టిక్ సంచుల్లో ఎండు గంజాయి లభ్యమైందన్నారు. ఘటనాస్థలిలో ఎవరూలేరని, గంజాయి సీజ్ చేసి కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ సోదాల్లో ఎకై ్సజ్ సీఐలు నాగేశ్వరరావు, నీరజ, ఎస్సైలు చంద్రశేఖర్, అశోక్, కిరీటి, హెడ్ కానిస్టేబుళ్లు శ్రీనివాస్, మధు, కానిస్టేబుళ్లు రాజు, శ్రీను, శేఖర్, ఇబ్రహీం, భవా ని, నర్సింహరావు, రవి, సుమన్ పాల్గొన్నారు.

పౌర రక్షణ వలంటీర్లుగా నమోదుకు అవకాశం

పౌర రక్షణ వలంటీర్లుగా నమోదుకు అవకాశం

పౌర రక్షణ వలంటీర్లుగా నమోదుకు అవకాశం