
వడదెబ్బతో ఎఫ్‌ఏ మృతి
నర్సింహులపేట: వడదెబ్బతో ఓ ఫీల్డ్ అసిస్టెంట్ మృతి చెందాడు. ఈ ఘటన మండల కేంద్రంలో చోటు చేసు కుంది. నర్సింహులపేటకు చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ తూ డి మాణిక్యం(52) శుక్రవారం పెద్దగుట్ట, చిత్తుకుంటలో జరిగిన ఉపాధి హామీ పనులను పరిశీలించారు. ఈ సమయంలో ఎండ వేడిమికి అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే కూలీలు స్థానిక వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో 108లో మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. మృతుడి భార్య కల్యాణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సురేశ్ తెలిపారు.