
మా భూమిలో ఆస్పత్రి నిర్మించొద్దు
మహబూబాబాద్: తాము కొనుగోలు చేసి భూమిలో అర్బన్ పీహెచ్‌సీ భవన నిర్మాణం చేపట్టడం సబబు కాదని బాధితులు చుక్కల పద్మ, కోడెల లక్ష్మి అన్నారు. జిల్లా కేంద్రం శివారు డబుల్ బెడ్రూం ఇళ్ల సమీపంలో అర్బన్ పీహెచ్‌సీ భవన నిర్మాణ పనులు జరుగుతుండగా.. మంగళవారం వారిద్దరూ ఆ స్థలం వద్ద పెట్రోలు బాటిల్‌తో ఆందోళన చేశారు. ఈసందర్భంగా పద్మ, లక్ష్మి మాట్లాడుతూ.. తాము లక్షలు పెట్టి కొనుగోలు చేసిన 800గజాల భూమిలో పీహెచ్‌సీ భవన నిర్మాణ పనులు చేయడం ఎంత వరకు సమంజసమన్నారు. పనులు నిలిపి వేయకపోతే ఆత్మహత్య చేసుకుంటామన్నారు. విషయం తెలుసుకున్న టౌన్ ఎస్సై విజయ్ అక్కడికి చేరుకుని.. వివరాలు తెలుసుకుని పనులు నిలిపివేయించడంతో బాధితులు ఆందోళన విరమించారు. సంబంధిత డాక్యుమెంట్లు తీసుకుని వస్తే అఽధికారులతో మాట్లాడుతామని చెప్పడంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
పెట్రోలు బాటిల్‌తో బాధితుల ఆందోళన