ప్రధాన మండపానికి వెళ్లే గ్రిల్‌కు తాళం వేసిన ఆలయ అధికారులు
ఇబ్బందులు పడిన భక్తులు
కాళేశ్వరం: కాళేశ్వరంలో సరస్వతీనది పుష్కరాల సందర్భంగా శ్రీకాళేశ్వరముక్తీశ్వరస్వామి ఆలయంలో నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. గురువారం అట్టహాసంగా ప్రారంభమైన పుష్కరాలకు తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు తెల్లవారుజాము వరకు తరలొచ్చారు. కాగా, నదిలో స్నానాలు చేసిన భక్తులు నేరుగా శ్రీకాళేశ్వరముక్తీశ్వరస్వామి ఆలయంలో దేవస్థానం, పోలీసు అధికారులతో ఇబ్బందులు పడ్డారు. పోలీసులు, దేవస్థానం అధికారుల కుటుంబాలు, బంధువులు, స్నేహితుల కోసం దర్శనాలకు వీఐపీ దర్శనాలు చేయించడానికి తీసుకెళ్తున్నారని గుర్తుతెలియని ఎండోమెంట్‌శాఖ అధికారులు ప్రధాన మండపానికి వెళ్లే గ్రిల్‌కు తాళం వేసి దాచిపెట్టారు.
దీంతో పోలీసుల, ఇతర అధికారుల కుటుంబాలు రావడంతో దేవస్థాన ఉద్యోగులు తాళం వేసి దొరకడం లేదని తెలుపడంతో ఇబ్బందులు పడ్డారు. దాదాపు రెండున్నర గంటల అనంతరం తాళం చెవి దొరకడంతో సామాన్య భక్తుల దర్శనానికి ఎక్కువ సమయం తీసుకున్నారు. దీంతో అసహానానికి గురయ్యారు.దేవాదాయశాఖ అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించారని భక్తులు ఆరోపించారు. మిగతా 11రోజులు ఇబ్బందులు లేకుండా చూడాలని పలువురు భక్తులు కోరుతున్నారు.


