
మళ్లీ సాయంత్రం బడులు
హసన్‌పర్తి: సంపూర్ణ అక్షరాస్యత కోసం ప్ర భుత్వం మళ్లీ సాయంత్రం బడులు ప్రారంభించనుంది. సామాజిక చైతన్య కేంద్రాల పేరిట ఈ కార్యక్రమాన్ని ని ర్వహించనుంది. గతంలో వయోజన కేంద్రాల ద్వారా సాయంత్రం బ డులు నిర్వహించారు. గ్రామంలో 19 ఏళ్ల పైబడి ఉండి చదువు రాని వారు ఈ కేంద్రాలకు వచ్చి చదువుకునేవారు. ఇందుకు ప్రత్యేక వలంటీర్లను నియమించారు. 20 ఏళ్ల క్రితం ఈ కేంద్రాలు రద్దయ్యాయి.
సామాజిక చైతన్య కేంద్రం
రాష్ట్ర ప్రభుత్వం వయోజన విద్య కేంద్రాల స్థానంలో సామాజిక చై తన్య కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. ఇందుకు మార్గదర్శకాలు జా రీ చేసింది. మండల స్థాయిలో ఎంఈఓ కన్వీనర్‌గా, ఇందిరా క్రాంతి పథం ఏపీఓ కోకన్వీనర్‌గా వ్యవహరించనన్నారు. గ్రామస్థాయిలో ప్రఽ దానోపాధ్యాయుడు కన్వీనర్‌గా, పీఏసీఎస్ చైర్మన్ కోకన్వీనర్‌గా, స్వయం సహాయక సంఘం సభ్యురాలు, విశ్రాంత ఉపాధ్యాయుడు, స్వచ్ఛంద సంస్థ సభ్యుడి సభ్యులుగా వ్యవహరిస్తారు. ఈనెల 12 తర్వాత అర్హుల గుర్తింపు ప్రక్రియ చేపట్టనున్నారు.
‘ఉల్లాస్’ యాప్‌లో..
చదువురాని వయోజనులను గుర్తించి వారి పేర్లను ఉల్లాస్ యాప్‌లో నమోదు చేయనున్నట్లుఽ అధికారులు వెల్లడించారు. దీంతో గ్రామాల్లో ఎంతమంది నిర్లక్ష్యరాస్యులు ఉన్నారో స్పష్టం కానుంది.
నేడు గ్రామస్థాయి సమావేశాలు..
ఈనెల 12న గ్రామస్థాయి సమావేశాలు నిర్వహించనున్నారు. స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడి అధ్యక్షతన ఈ సమావేశం ఉంటుంది.
జూన్ 1 నుంచి ప్రారంభం
సామాజిక చైతన్య కేంద్రాలు జూన్ 1 నుంచి ప్రారంభించనున్నట్లు ఎంఈఓ రాజిరెడ్డి తెలిపారు. చదువు చెప్పడానికి ముందుకు వచ్చేయ వారికి అవకాశం కల్పిస్తామని పేర్కొన్నారు. గ్రామాల్లో వందశాతం అక్షరాస్యత సాధించే దిశలో కృషి చేయాలని కోరారు.
సామాజిక చైతన్య కేంద్రాల ద్వారా విద్యా బోధన
జూన్ 1వ తేదీ నుంచి ప్రారంభం
నేడు గ్రామస్థాయి సమావేశాలు