Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page

ప్రధాన వార్తలు

Phones Blast Cause In Kurnool Bus Fire Accident Incident1
కర్నూలు ప్రమాదంలో కొత్త కోణం!.. 400 ఫోన్లు పేలడం వల్లే మంటలు

సాక్షి, అమరావతి: కర్నూలు చిన్నటేకూరు సమీపంలో వేమూరి కావేరి ట్రావెల్స్‌ అగ్నిప్రమాదానికి గురైన ఘటనలో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. బస్సు ప్రమాదానికి సంబంధించిన మరో కొత్త కోణాన్ని ఫోరెన్సిక్‌ బృందాలు ప్రాథమికంగా గుర్తించాయి. బస్సు లగేజీ క్యాబిన్‌లో వందల సంఖ్యలో మొబైల్‌ ఫోన్లు పేలడం వల్లే ప్రమాద తీవ్రత పెరిగి, భారీ ప్రాణ నష్టానికి దారితీసిందని ఫోరెన్సిక్‌ టీమ్స్‌ తెలిపాయి.వివరాల ప్రకారం.. ఫోరెన్సిక్‌ బృందాలు శుక్రవారం ఉదయం ఘటనాస్థలాన్ని, దగ్ధమైన బస్సును పరిశీలించాయి. ఈ క్రమంలో బస్సులో మొబైల్‌ ఫోన్లను తరలించినట్టు గుర్తించాయి. ‘ప్రమాదం సందర్భంగా ట్రావెల్స్‌ బస్సు.. బైకును ఢీకొట్టగానే దాని ఆయిల్‌ ట్యాంక్‌ మూత ఊడిపడి అందులోని పెట్రోల్‌ కారడం మొదలైంది. అదే సమయంలో బస్సు కింది భాగంలో బైక్‌ ఇరుక్కుపోవడంతో, దాన్ని బస్సు కొంత దూరం ఈడ్చుకెళ్లింది. ఈ క్రమంలో మంటలు ప్రారంభమయ్యాయి. ఇవి తొలుత లగేజీ క్యాబిన్‌కు అంటుకున్నాయి. అందులోనే 400కు పైగా మొబైల్‌ ఫోన్లతో కూడిన పార్సిల్‌ ఉండటంతో అధిక వేడికి ఆ ఫోన్ల బ్యాటరీలన్నీ ఒక్కసారిగా పేలాయి. బ్యాటరీలన్నీ ఒక్కసారిగా పేలడం వల్లే భారీ శబ్దం వచ్చింది. ఆ మంటలు లగేజీ క్యాబిన్‌ పై భాగంలోని ప్రయాణికుల కంపార్ట్‌మెంట్‌కు వ్యాపించాయి. దీంతో లగేజీ క్యాబిన్‌కు సరిగ్గా పైన ఉండే సీట్లలో, బెర్తుల్లో ఉన్న వారికి తప్పించుకునే సమయం లేకుండా పోయింది. అందువల్లే బస్సు మొదటి భాగంలోని సీట్లు, బెర్తుల్లో ఉన్నవారే ఎక్కువగా ప్రాణాలు కోల్పోయారు. అప్పటికే బస్సు దట్టమైన పొగ, మంటల్లో చిక్కుకుంది. బస్సు లోపల చిక్కుకున్న ప్రయాణికులు తప్పించుకునేందుకు యత్నించినా.. కుడివైపునున్న అత్యవసర ద్వారం తెరుచుకోకపోవడంతో వారి ప్రయత్నాలు ఫలించలేదు’ అధికారులు తెలిపారు. మంటలు చెలరేగిన వెంటనే డ్రైవర్‌ బస్సును నిలిపి అతని సీటు పక్కన ఉండే కిటికీ డోరు నుంచి దిగి వెనక వైపునకు వెళ్లి చూసి అక్కడి నుంచి పారిపోయాడు అని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో కర్నూలు ప్రమాద ఘటనలో తీవ్రత పెరగడానికి మొబైల్‌ ఫోన్ల పేలుడే కారణమని ప్రాథమికంగా తేలింది. పార్సెల్‌ ఆఫీసుల్లో పోలీసులు తనిఖీలు?ఈ ప్రమాదంలో ఫోన్లు పేలడం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ ట్రావెల్స్ పార్సిల్ ఆఫీసుల్లో.. ఆర్టీవో అధికారులు గానీ, పోలీసులు తనిఖీలు నిర్వహించే అవకాశం ఉంది. ఇలాంటి పేలుడు పదార్థాలకు ప్రధాన కారణంగా ఉన్నటువంటి మొబైల్ ఫోన్లను, సంబంధిత ఇతర వస్తువులను గాని బస్సులలో పంపించకూడదని ఇప్పటికైనా అధికారులు హెచ్చరించే అవకాశం ఏమైనా వుందా? చూడాల్సి ఉంది.

Why single out India Indian Minister Piyush Goyal Interesting Comments2
రష్యా చమురు.. భారత్‌ ఏకాకిగా మారిందా?

అంతర్జాతీయ వాణిజ్యంలో సమానత్వం అవసరమని, ఒకే రకమైన పరిస్థితుల్లో ఉన్న దేశాలకు వేర్వేరు నిబంధనలు వర్తింపజేయడం అన్యాయమని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ అభిప్రాయపడ్డారు. రష్యా చమురు విషయంలో భారత్‌పైనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఒత్తిడి చేస్తుండడం గురించి ప్రస్తావిస్తూ.. ఈ విషయంలో భారత్‌ ఏకాకిగా మారిందంటూ గోయల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ద్వైపాక్షిక్ష చర్చల్లో భాగంగా జర్మనీ పర్యటనలో ఉన్న ఆయన బెర్లిన్‌లో జరిగిన ఓ కార్యక్రమాంలో మాట్లాడుతూ.. ‘‘ఈ రోజు పేపర్‌లో చూశాను. ముడి చమురు కొనుగోలు విషయంలో ఆంక్షల నుంచి మిహాయించాలని జర్మనీ కోరినట్టు అందులో ఉంది. యూకే ఇప్పటికే అమెరికా నుంచి చమురు కొనుగోలు పరంగా మినహాయింపు పొందింది. అలాంటప్పుడు భారత్‌నే ఎందుకు లక్ష్యం చేసుకుంటున్నారు?.. అని మంత్రి అన్నారాయన. ఇదిలా ఉంటే.. రష్యా చమురు కంపెనీలైన రోజ్‌నెఫ్ట్, ల్యూక్‌ ఆయిల్‌తో ఎవరూ వ్యాపార లావాదేవీలు నిర్వహించరాదంటూ ఈ నెల 22న అమెరికా ఆంక్షలు ప్రకటించింది. అయితే ఈ తరహా సుంకాలు అనుచితం, అన్యాయం, అసమంజసమని భారత్‌ తరఫున గోయల్‌ మరోసారి స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌ యుద్ధంలో రష్యాతో భారత్‌ జరిపే చమురు వాణిజ్యం వల్లే నిధులు సమకూరుతున్నాయని.. తక్షణమే ఆ కొనుగోళ్లను ఆపేయాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ గత కొంతకాలంగా చెబుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే పెనాల్టీ టారిఫ్‌లు విధించిన ఆయన.. ఆపకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తూ వచ్చారు. అయినప్పటికీ భారత్‌ మాత్రం జాతి ప్రయోజనాలు తప్పించి.. మరే ఇతర కోణంలోనూ నిర్ణయాలు తీసుకోబోదని స్పష్టం చేసింది. అయితే.. మోదీ తనకు మంచి మిత్రుడని, రష్యా కొనుగోళ్లను ఆపేస్తానని హామీ ఇచ్చారని ట్రంప్‌ స్వయంగా ప్రకటించారు. భారత్‌ ఈ ప్రకటనను ఖండించింది. ఆ వెంటనే ఆయన స్వరం మారింది. వైట్‌హౌజ్‌ దీపావళి వేడుకల్లో మాట్లాడుతూ.. భారీగా కొనుగోళ్లను జరపబోదంటూ మరో ప్రకటన చేసేశారు. అదే సమయంలో.. ఇండియా-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కూడా ఓ కొలిక్కి రాబోతోందని తెలిపారు. రష్యా నుంచి ముడి చమురును నిలిపివేయాలంటూ అమెరికా ఒత్తిళ్లు తీసుకువస్తున్న వేళ.. మంత్రి పీయూష్‌ గోయల్‌ తాజా వ్యాఖ్యలకు ప్రాధాన్యం నెలకొంది.

IND vs AUS 2025 3rd ODI: Toss Playing XIs Updates And Highlights3
IND vs AUS: తొలి వికెట్‌ కోల్పోయిన ఆస్ట్రేలియా

Australia vs India, 3rd ODI Updates And Highlights: టీమిండియాతో నామమాత్రపు మూడో వన్డేలో ఆస్ట్రేలియా టాస్‌ గెలిచింది. సిడ్నీ క్రికెట్‌ గ్రౌండ్‌లో తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. తొలి వికెట్‌ కోల్పోయిన ఆస్ట్రేలియా9.2: సిరాజ్‌ బౌలింగ్‌లో ప్రసిద్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగిన ట్రావిస్‌ హెడ్‌. 25 బంతులు ఎదుర్కొని 29 పరుగుల చేసిన హెడ్‌ అవుట్‌. ఫలితంగా తొలి వికెట్‌ కోల్పోయిన ఆస్ట్రేలియా. మాథ్యూ షార్ట్‌ క్రీజులోకి రాగా.. మార్ష్‌ 25 పరుగులతో ఆడుతున్నాడు. పది ఓవర్లలో ఆసీస్‌ స్కోరు: 63-1ఐదు ఓవర్లలో ఆస్ట్రేలియా స్కోరు: 26-0(5)మిచెల్‌ మార్ష్‌ 6, ట్రావిస్‌ హెడ్‌ 13 పరుగులతో క్రీజులో ఉన్నారు. సిరాజ్‌ భారత బౌలింగ్‌ అటాక్‌ ఆరంభించగా.. హర్షిత్‌ రాణా సిరాజ్‌ కలిసి ఆల్టర్నేటివ్‌ ఓవర్లలో బరిలోకి దిగాడు.ఒక మార్పుతో బరిలోకిఈ సందర్భంగా ఆసీస్‌ కెప్టెన్‌ మిచెల్‌ మార్ష్‌ మాట్లాడుతూ.. ‘‘వికెట్‌ బాగుందనిపిస్తోంది. అందుకే ముందుగా బ్యాటింగ్‌ ఎంచుకున్నాం. యువ ఆటగాళ్లు రాణించడం మా జట్టుకు శుభపరిణామం. 3-0తో సిరీస్‌ క్లీన్‌స్వీప్‌ చేసే సువర్ణావకాశం మా ముందుంది. గత మ్యాచ్‌లో కూపర్‌ కన్నోలి అద్భుతంగా ఆడాడు. ఈ వన్డేలో మేము ఒక మార్పుతో బరిలోకి దిగుతున్నాం. జేవియర్‌ బార్ట్‌లెట్‌ స్థానంలో నాథన్‌ ఎల్లిస్‌ జట్టులోకి వచ్చాడు’’ అని తెలిపాడు.టీమిండియాలో రెండు మార్పులుమరోవైపు.. టీమిండియా గత మ్యాచ్‌లలో చేసిన పొరపాటును సరిచేసుకున్నట్లు అనిపిస్తోంది. రెండు వన్డేల్లో బెంచ్‌కే పరిమితం చేసిన చైనామన్‌ స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌కు ఎట్టకేలకు పిలుపునిచ్చింది. ఈ మ్యాచ్‌లో భారత్‌ తమ తుదిజట్టులో రెండు మార్పులు చేసింది. అర్ష్‌దీప్‌ సింగ్‌, నితీశ్‌ కుమార్‌ రెడ్డి స్థానాల్లో కుల్దీప్‌ యాదవ్‌, ప్రసిద్‌ కృష్ణలను ఎంపిక చేసుకుంది.టీమిండియా వర్సెస్‌ ఆస్ట్రేలియా మూడో వన్డే తుదిజట్లుటీమిండియారోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్ (కెప్టెన్‌), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (వికెట్‌ కీపర్‌), వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్‌ కృష్ణ.ఆస్ట్రేలియామిచెల్ మార్ష్(కెప్టెన్‌), ట్రావిస్ హెడ్, మాథ్యూ షార్ట్, మ్యాట్ రెన్షా, అలెక్స్ క్యారీ(వికెట్‌ కీపర్‌), కూపర్ కన్నోలీ, మిచెల్ ఓవెన్, నాథన్ ఎల్లిస్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హాజిల్‌వుడ్.

Diwali Celebrations Gone Wrong in the USA4
దీపావళి ఎఫెక్ట్‌: అమెరికాలో వెల్లువెత్తిన ఫిర్యాదులు

భారత్‌తో పాటు ప్రపంచంలోని నలుమూలలా భారతీయులు, మన మూలాలు ఉన్నవాళ్లు దీపావళి వేడుకలు ఘనంగా చేసుకున్నారు. అయితే.. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో వేడుకల్లోనూ పలు చోట్ల అపశ్రుతి ఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతో ఫిర్యాదులు వెల్లువెత్తగా.. అదే సమయంలో విమర్శలూ వెల్లువెత్తుతున్నాయి. దీపావళి వేడుకల్లో.. గాయాలు, ప్రమాదాలు, చివరాఖరికి మరణాలు కూడా సంభవించిన సందర్భాలు ఉన్నాయి. అయితే అమెరికాలో ఈ ఏడాది జరిగిన వేడుకల్లో ‘నష్టం’ కాస్త ఎక్కువే జరిగిందని పరిస్థితులు చెబుతున్నాయి. మరీ ముఖ్యంగా.. అర్ధరాత్రి పూట అక్కడి భారతీయులు చేసిన హంగామాపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. అందుకు న్యూయార్క్‌, న్యూజెర్సీ నగరాల్లో జరిగిన డ్యామేజ్‌ ఉదాహరణంగా నిలిచింది!.న్యూయార్క్‌ నగరం క్వీన్స్‌ ప్రాంతంలో.. బాణాసంచా కారణంగా లింకన్‌ స్ట్రీట్‌లోని మూడు నివాసాలు తీవ్రంగా దెబ్బ తిన్నాయి. ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. ఇక్కడి దీపావళి వేడుకలకు.. అదీ కూడా అర్ధరాత్రి పూట నిర్వహణకు అసలు అనుమతే లేదని అక్కడి అధికారులు చెబుతున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం, ఫైర్‌వర్క్స్‌ గాల్లోకి ఎగసి ఓ ఇంట్లోకి నేరుగా దూసుకెళ్లిన తర్వాత మంటలు వ్యాపించాయి. మరోపక్క.. Your #Diwali celebration? My house is gone!What a sad incident, disappointing beyond words.Indians in the U.S., wake up before it's too late!! pic.twitter.com/7SQjiVBgfV— M9 USA🇺🇸 (@M9USA_) October 24, 2025UPDATE: We have received video from the homeowner showing the damage caused by the illegal and irresponsible Diwali fireworks.In addition, a vehicle and the garage were completely burned and damaged. https://t.co/vOh5Oa58o3 pic.twitter.com/436GvhB9KD— YEGWAVE (@yegwave) October 24, 2025న్యూజెర్సీలో ఒక్క ఎడిసన్‌ నుంచే 40 ఎమర్జెన్సీ కాల్స్‌ అధికారులకు వెళ్లాయట. ఆస్తి నష్టంతో పాటు ముందస్తు జాగ్రత్తగా కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేశారట. తమ నిద్రకు భంగం వాటిల్లిందనే ఫిర్యాదులు చేసిన వాళ్లు ఉన్నారట. దీంతో ఫైర్‌ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పి వేడుకలను జరగనివ్వకుండా ఆపేశారు కూడా. ఇంకోపక్క.. Look at the aftermath of these Diwali celebrations.It’s chaos. Litter everywhere. Police holding people back. Indians hanging out of cars speeding by.And these people have the audacity to compare Christmas parades to this.I’m fed up.pic.twitter.com/2gX57IcKW3— Anti-Taxxer (@mapleblooded) October 23, 2025దీపావళి వేడుకల కారణంగా అగ్నిప్రమాదాలు సంభవించి కొందరి నివాసాలు పూర్తిగా ధ్వంసమై అయ్యాయని.. కట్టుబట్టలతో వాళ్లు రోడ్డు మీద పడ్డారని కొన్ని వీడియోలు, కథనాలు బయటకు వచ్చాయి. ‘‘ఇలా జరుగుతుందని అనుకోలేదు. మాకేం మిగల్లేదు. నా కొడుకు ఒంటి మీద సరైన బట్టలు కూడా లేవు. హోటల్‌ గదిలో జీవించాల్సి వస్తోంది’’ అని బాధితురాలు జువానిటా కొలన్‌ ఓ మీడియా సంస్థతో పేర్కొనడం గమనార్హం. దీంతో.. Indians were celebrating Diwali in US. Their police and fire department came to join the celebration and played Holi. pic.twitter.com/nLLlnFlh8p— Joy (@Joydas) October 23, 2025అమెరికా దీపావళి వేడుకలపై మునుపెన్నడూ లేనిస్థాయిలో అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. అందుకు ఆ స్థాయిలో జరిగిన నష్టమే కారణమని స్పష్టమవుతోంది. దీంతో అధికారులు ఇలాంటి వేడుకలను అనుమతించొద్దని.. ఒకవేళ అనుమతించినా.. సురక్షిత నిబంధనలు పాటించేలా కఠిన మార్గదర్శకాలను తీసుకురావాలని పలువురు అమెరికన్లు కోరుతున్నారు. ఈ ఘటనలకు సంబంధించి.. పోలీసులు ఇంకా విచారణ కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు ఎవరినీ అరెస్ట్‌ చేయలేదని సమాచారం.Indians have been living a respectful life in USA, UK, Canada and other Countries for over a century. What has really changed with the current expats creating such a ruckus, nuisance, civic garbage, displaying absolute lack of civic sense, cultural bankruptcy, this Diwali❓… pic.twitter.com/dGzt3SrtIs— Raju Parulekar (@rajuparulekar) October 24, 2025

Jammu Kashmir Rajya Sabha Election 2025 Results Declared5
క్లీన్‌ స్వీప్‌ మిస్‌.. బీజేపీకి ‘క్రాస్‌ ఓటింగ్‌’ విక్టరీ!

కేంద్ర పాలిత జమ్ము కశ్మీర్‌ రాజ్యసభ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి(Jammu Rajya Sabha Results). అధికార నేషనల్‌ కాన్ఫరెన్స్‌ క్లీన్‌ స్వీప్‌ మిస్‌ అయ్యింది. నాలుగు స్థానాల్లో మూడింటిని కైవసం చేసుకుంది. మిగిలిన ఒక్క స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకోగా.. క్రాస్‌ ఓటింగ్‌ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 2019లో ఆర్టికల్‌ 370 రద్దు అనంతరం జరిగిన తొలి రాజ్యసభ ఎన్నికలు ఇవే. జమ్ము కశ్మీర్‌ అసెంబ్లీలో శుక్రవారం(అక్టోబర్‌ 24వ తేదీన) ఓటింగ్‌ జరిగింది. 88 మంది ఎమ్మెల్యేలకు గానూ.. 86 మంది నేరుగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. జైల్లో ఉన్న ఆప్‌ ఎమ్మెల్యే మెహరాజ్‌ మాలిక్‌ పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటేశారు. కాంగ్రెస్‌, పీడీపీ, సీపీఐ(ఎం), ఏఐపీ, ఇతర స్వతంత్ర ఎమ్మెల్యేలు నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అభ్యర్థులకు మద్దతు ఇచ్చారు.ఎన్‌సీ తరఫున చౌదరి మహ్మద్‌ రంజాన్, సజ్జాద్‌ కిచ్లూ, జీఎస్‌ ఒబెరాయ్, బీజేపీ నుంచి ఆ పార్టీ రాష్ట్ర చీఫ్‌ సత్‌ పాల్‌ శర్మ(Sat Paul Sharma) విజేతలుగా నిలిచారని అసెంబ్లీ సెక్రటరీ ఎంకే పండిత తెలిపారు. भाजपा जम्मू कश्मीर अध्यक्ष श्री @iamsatsharmaca ने आज विधानसभा सचिवालय, श्रीनगर में राज्यसभा सांसद के रूप में विजय का प्रमाण पत्र चुनाव अधिकारी से प्राप्त किया। pic.twitter.com/pZul3mcCjF— BJP Jammu & Kashmir (@BJP4JnK) October 24, 2025నాలుగో సీటు కోసం నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నుంచి ఇమ్రాన్‌ నబీ, సత్‌ శర్మ పోటీ పడ్డారు. అయితే 32 ఓట్లతో శర్మ విజయం సాధించినట్లు అసెంబ్లీ సెక్రటరీ ప్రకటించారు. జమ్ము అసెంబ్లీలో బీజేపీకి కేవలం 28 సీట్లు మాత్రమే ఉండగా.. 4 అదనపు ఓట్లు వచ్చాయి. అయితే బీజేపీ ఊహించినట్లుగానే.. స్వతంత్రులు వాళ్ల వైపు మొగ్గు చూపినట్లు స్పష్టమవుతోంది. మరోవైపు నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధినేత, సీఎం ఒమర్‌ అబ్దుల్లా ఆ నాలుగు ఓట్లు ఎక్కడివి? అంటూ ఓ ట్వీట్‌ చేశారు. క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడ్డ(Cross Voting For BJP) ఆ నలుగురు ఎవరు అనేది తేలాల్సి ఉంది. ఇక..All of @JKNC_ votes remained intact across the four elections, as witnessed by our election agent who saw each polling slip. There was no cross voting from any of our MLAs so the questions arise - where did the 4 extra votes of the BJP come from? Who were the MLAs who…— Omar Abdullah (@OmarAbdullah) October 24, 2025డోడా నియోజకవర్గ ఆప్‌ ఎమ్మెల్యే మెహరాజ్ మాలిక్‌ పోస్టల్‌ బ్యాలెట్ ద్వారా రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేశారు. పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ (PSA) కింద సెప్టెంబర్ 8, 2025న అరెస్ట్ అయ్యారాయన. ఆయన ప్రస్తుతం కథువా జిల్లా జైలులో నిర్బంధంలో ఉన్నారు. 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ము కశ్మీర్ రాష్ట్రం కాస్త కేంద్ర పాలిత ప్రాంతంగా మారింది. ఛండీగఢ్‌, లక్షద్వీప్‌ లాంటి కేంద్ర పాలిత ప్రాంతాలకు అసెంబ్లీ ఉండదు. కాబట్టి వాటికి రాజ్యసభ స్థానాలు ఉండవు. అయితే.. 2020లో జమ్ము కశ్మీర్ రీజనల్ అసెంబ్లీ తిరిగి ఏర్పడింది. అందువల్ల ఇతర రాష్ట్రాల మాదిరిగానే రాజ్యసభ ఎన్నికలు మళ్లీ అసెంబ్లీలోనే జరిగాయి. అంతా ఊహించినట్లుగానే అధికార పార్టీ నేషనల్‌ కాన్ఫరెన్స్‌ మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుంది.

Rashmika mandanna emotional comments on Kurnool Bus Fire Accident6
భరించలేనంత బాధ.. కర్నూల్‌ ఘటనపై రష్మిక ఎమోషనల్‌

కర్నూలు జిల్లాలో శుక్రవారం తెల్లవారు జామున జరిగిన వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు ఘోర ప్రమాదం తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్‌ దేశాన్ని కలచి వేసింది. ఈ ఘటన గురించి సినీ నటి రష్మిక మందన్న స్పందించారు. 'కర్నూలులో జరిగిన ఘోర ప్రమాదం నా గుండెను చాలా తీవ్రంగా బాధపెడుతోంది. తగలబడుతున్న బస్సులో కాలిపోయే ముందు ప్రయాణికుల బాధను ఊహిస్తేనే భయంకరంగా ఉంది. చిన్న పిల్లలతో పాటు చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఒక కుటుంబం మొత్తం నిమిషాల్లోనే తమ ప్రాణాలు కోల్పోయిందని తెలుసుకుంటే చాలా బాధేస్తుంది. నిజంగా ఈ సంఘటన వినాశకరమైనది. ఇంతటి విషాదాన్ని మిగిల్చిన ఈ ప్రమాదంలో మరణించిన వారికి నా నివాళి. వారి ఆత్మకు శాంతి చేకూరాలి. మృతుల కుటుంబాలకు నా సానుభూతి.. దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్ధిస్తున్నా'అంటూ సోషల్‌మీడియాలో ఆమె ఒక పోస్ట్‌ చేశారు.ఈ ప్రమాదంలో 19 మంది సజీవ దహనం అయ్యారు. నెల్లూరుకు చెందిన అనూష ఆ మంటల్లో ఎలాగైనా తన కుమార్తెను కాపాడుకోవాలని బిడ్డను కౌగిలించుకుని అలాగే కాలిపోయిన దృశ్యం అందరినీ కంటతడి పెట్టించింది. మృతుల్లో ఏపీ, తెలంగాణ, కర్ణాటక వాసులున్నారు. వీరిలో ఇద్దరు చిన్న పిల్లలు కూడా ఉన్నారు. ఈ ప్రమాద సమయంలో బస్సు అద్దాలను ధ్వంసం చేసి అతి కష్టంగా 25 మంది ప్రాణాలతో బయటపడ్డారు.The news from Kurnool has been weighing heavily on my heart. Imagining what those passengers must’ve gone through inside that burning bus is just unbearable..To think that an entire family, including little kids, and so many others lost their lives in minutes it’s truly…— Rashmika Mandanna (@iamRashmika) October 24, 2025

Relentless Rains In AP: Tirumala Low Lying Areas on Alert7
తిరుమలను వదలని వరుణుడు

సాక్షి, తిరుపతి/విశాఖ: అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో ఇప్పటికే విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా.. ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్ర అల్పపీడనం ఇవాళ వాయుగుండంగా రూపాంతరం చెందనుంది. దీంతో.. వాతావరణ శాఖ అధికార యంత్రాగాన్ని అప్రమత్తం చేసింది. ఇంకోవైపు.. తిరుమలలో వారం రోజులుగా ఎడతెరిపి ఇవ్వకుండా కురుస్తున్న వర్షాలతో భక్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మరోవైపు.. జలాశయాలలో బారీగా నీరు వచ్చి చేరుతోంది. ఇప్పటికే గోగర్భం డ్యామ్ నిండిపోవడంతో అధికారులు గేట్లు ఎత్తేశారు. ముంపు ముప్పు దృష్ట్యా.. లోతట్టు ప్రాంతాల గ్రామాలను అప్రమత్తం చేశారు. తిరుమల భక్తుల రద్దీ ఇలా.. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనానికి 20 కంపార్టుమెంట్లో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 12 గంటలు, ప్రత్యేక దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. నిన్న(శుక్రవారం) శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 71,110గా ఉంది. తలనీలాలు సమర్పించిన భక్తులు 25,695 మంది. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.89 కోట్లు.మరిన్ని వర్షాలుఆగ్నేయ బంగాళాఖాతంలో రేపు తీవ్ర వాయుగుండంగా బలపడనుంది. ఎల్లుండికి నైరుతి, ఆనుకుని ఉన్న పశ్చిమమధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారే అవకాశం. దీని ప్రభావంతో ఇవాళ(శనివారం, అక్టోబర్‌ 25)) కోనసీమ,కృష్ణా,బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అలాగే.. ప్రకాశం, నెల్లూరు,తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవొచ్చని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ ఒక ప్రకటనలో తెలిపారు.

Telangana Police Checking Travels Buses At Hyderabad8
హైదరాబాద్‌లో ట్రావెల్స్‌ బస్సులు, వాహనాల తనిఖీలు.. చలాన్లు చెల్లిస్తేనే అనుమతి..

సాక్షి, హైదరాబాద్‌: కర్నూలులో ప్రైవేట్‌ బస్సు ప్రమాదం నేపథ్యంలో తెలంగాణ రవాణాశాఖ(Telangana Transport Department) అధికారులు అలర్ట్‌ అయ్యారు. శుక్రవారం రాత్రి, శనివారం ఉదయం ట్రాఫిక్‌ పోలీసులు ట్రావెల్స్‌ బస్సులను తనిఖీ చేశారు. డ్రంకన్‌ డ్రైవ్, బీమా, ఫిట్‌నెస్, పర్మిట్‌ పత్రాలు, బస్సు లోపల భద్రతను పరిశీలించారు. పర్మిట్‌ లేకుండా వెళ్తున్న బస్సులపై, నిబంధనలు పాటించని పలు బస్సులపై కేసులు నమోదు చేశారు. అనుమతి లేకుండా నడుపుతున్న ట్రావెల్స్‌ బస్సులను సీజ్‌ చేశారు.మరోవైపు.. కూకట్‌పల్లి, హయత్‌నగర్‌, ఎల్బీనగర్‌ పరిధిలో కూడా ట్రావెల్స్‌ బస్సులు, ఆటోలు, క్యాబ్‌ల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. లైసెన్స్‌, సరైన పత్రాలు లేని వాహనాలపై కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలోనే వాహనాలపై ఉన్న చలాన్లను పోలీసులు వసూలు చేస్తున్నారు. చలాన్లను చెల్లిస్తేనే వెళ్లేందుకు పోలీసులు అనుమతి ఇస్తున్నారు. అలాగే, గ్రేటర్ హైదరాబాద్‌ వ్యాప్తంగా రవాణాశాఖ అధికారుల తనిఖీలు చేపట్టనున్నారు. నిబంధనలు, భద్రతా ప్రమాణాలు పాటించని ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సుల యాజమాన్యాలపై చర్యలు తీసుకోనున్నారు. ఆరు ప్రత్యేక టీమ్‌లతో అధికారులు తనిఖీలు చేపట్టనున్నారు.కాగా, కర్నూలు శివారు చిన్నటేకూరు వద్ద ఘోర బస్సు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. బస్సు బైక్‌ను ఢీకొట్టడంతో ఈ ఘోరం జరిగింది. బైక్‌ను ఢీకొట్టిన తర్వాత బస్సు దాన్ని 300 మీటర్లు లాక్కెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో దాదాపు 20 మందికి పైగా మృతిచెందారు. అయితే.. ప్రమాదానికి అనేక కారణాలు ఉన్నాయని అధికారులు నిర్ధారణకు వచ్చారు. బస్సులో అనేక లోపాలు ఉన్నాయని కూడా తేలింది. దీంతో తెలంగాణ రవాణా శాఖ అప్రమత్తమైంది.

financial mistakes should not make in retirement planning9
రిటైర్‌మెంట్‌ ప్లానింగ్‌లో చేయకూడని తప్పులు

ఉద్యోగుల జీవితంలో రిటైర్‌మెంట్ అనేది ఒక మధురమైన, ముఖ్యమైన ఘట్టం. ఉద్యోగ బాధ్యతల నుంచి తప్పుకొని నచ్చిన పనులను, అలవాట్లను ఆస్వాదించడానికి లభించే విలువైన సమయం. అయితే ఈ కాలాన్ని ఆనందంగా, ఆర్థికపరమైన చింతలు లేకుండా గడపాలంటే సరైన ప్రణాళిక తప్పనిసరి. చాలా మంది తమ రిటైర్‌మెంట్ ప్లానింగ్‌లో కొన్ని సాధారణ ఆర్థిక తప్పులు చేస్తారు. ఈ తప్పులు భవిష్యత్తులో వారి జీవితాన్ని కష్టతరం చేయవచ్చు. రిటైర్‌మెంట్ జీవితం గోల్డెన్‌డేస్‌గా మారాలంటే సాధారణంగా చేసే తప్పులను సరి చేసుకోవ్సాలిందే.త్వరగా ప్రారంభించకపోవడంరిటైర్‌మెంట్ ప్లానింగ్‌లో చేసే అతిపెద్ద తప్పు.. పదవి విరమణ ప్రణాళికను త్వరగా ప్రారంభించపోవడం. ‘ఇంకా చాలా సమయం ఉంది కదా.. అప్పుడే తొందరేముంది’ అని అనుకుంటూ పొదుపును వాయిదా వేస్తారు. కానీ పెట్టుబడి, రాబడికి సంబంధించి సమయం అనేది అత్యంత శక్తివంతమైన ఆస్తి. చిన్న మొత్తంలో అయినా త్వరగా పెట్టుబడి పెట్టడం వల్ల చక్రవడ్డీ ప్రభావం ద్వారా మెరుగైన రాబడి వస్తుంది. ఆలస్యంగా మొదలుపెడితే అదే లక్ష్యాన్ని చేరుకోవడానికి చాలా పెద్ద మొత్తాలను పోగుచేయాల్సి ఉంటుంది.స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకోకపోవడంరిటైర్‌మెంట్ తర్వాత ఎలాంటి జీవనశైలిని కొనసాగించాలనుకుంటున్నారు? ఆ జీవనానికి ఎంత డబ్బు అవసరమవుతుంది? అనేదానిపై స్పష్టమైన లక్ష్యం లేకపోవడం మరో పెద్ద తప్పు. ద్రవ్యోల్బణం పెరుగుదలను పరిగణనలోకి తీసుకోకుండా లక్ష్యాన్ని అంచనా వేయడం వల్ల అవసరమైన మొత్తం కంటే తక్కువ పొదుపు చేసే ప్రమాదం ఉంది.ద్రవ్యోల్బణం ప్రభావాన్ని విస్మరించడంనేడు రూ.50,000 అ‍య్యే ఖర్చులు 20 ఏళ్ల తర్వాత కూడా అంతే ఉంటుంది అనుకోవడం పొరపాటు. ద్రవ్యోల్బణం కాలక్రమేణా డబ్బు విలువను హరిస్తుంది. ద్రవ్యోల్బణాన్ని అధిగమించలేని పెట్టుబడి సాధనాలను (ఉదాహరణకు, తక్కువ రాబడిని ఇచ్చే సంప్రదాయ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు) మాత్రమే ఎంచుకుంటే రిటైర్‌మెంట్ కార్పస్ కొన్నాళ్లకు సరిపోకపోవచ్చు. అందుకే ద్రవ్యోల్బణాన్ని మించి రాబడిని ఇచ్చే పెట్టుబడులు (ఈక్విటీ, మ్యూచువల్ ఫండ్స్ వంటివి) అవసరం.ఆరోగ్య ఖర్చులను పట్టించుకోకపోవడంవయసు పెరిగే కొద్దీ ఆరోగ్య సంరక్షణ ఖర్చులు పెరుగుతాయి. చాలా మంది రిటైర్‌మెంట్ కార్పస్‌ను లెక్కించేటప్పుడు ఆరోగ్య ఖర్చులను విస్మరిస్తారు. ఊహించని వైద్య అత్యవసర పరిస్థితులు మీ పొదుపు మొత్తాన్ని క్షణాల్లో ఖర్చు చేస్తాయి. అందుకే రిటైర్‌మెంట్ ప్రణాళికలో భాగంగా సరైన ఆరోగ్య బీమా తీసుకోవడం, వైద్య ఖర్చుల కోసం ప్రత్యేకంగా కొంత మొత్తాన్ని కేటాయించడం చాలా అవసరం.అధిక అప్పులతో రిటైర్‌మెంట్‌లోకి అడుగుపెట్టడంరిటైర్‌మెంట్ దశలోకి అడుగుపెట్టే సమయానికి గృహ రుణాలు, వ్యక్తిగత రుణాలు లేదా క్రెడిట్ కార్డ్ అప్పులు వంటివి ఉండటం చాలా ప్రమాదకరం. స్థిరమైన జీతం లేని సమయంలో ఈ రుణాలకు ఈఎంఐలు చెల్లించడం రిటైర్‌మెంట్ నిధిపై ఒత్తిడిని పెంచుతుంది. రిటైర్‌మెంట్‌కు ముందే అన్ని అప్పులనూ తీర్చేయడం ముఖ్యం.ఇదీ చదవండి: అగ్ని ప్రమాదంలో ఆస్తి నష్టం.. క్లెయిమ్‌ ప్రాసెస్‌ ఎలా?

China massive defence complex near Pangong Lake, Indian Border10
భారత్‌ పక్కలో చైనా మిసైల్‌ బల్లెం 

న్యూఢిల్లీ: కయ్యాలమారి చైనా ఒకవైపు భారత్‌కు స్నేహ హస్తం అందిస్తున్నట్టు నటిస్తూనే మరోవైపు సరిహద్దుల్లో భారీగా ఆయుధ వ్యవస్థలను మోహరిస్తోంది. టిబెట్‌లోని పాంగాంగ్‌ సరస్సు తూర్పు ఒడ్డున, వాస్తవాధీన రేఖకు కేవలం 65 కిలోమీటర్ల దూరంలోనే అత్యాధునిక గగన రక్షణ వ్యవస్థ బేస్‌ను నిర్మిస్తోంది. సకల వసతులతోపాటు భారీ ఆయుధాలు, క్షిపణులు మోహరించేలా దీని నిర్మాణాన్ని వేగంగా పూర్తిచేస్తోంది. ఈ బేస్‌ను మొదట అమెరికాకు చెందిన ఆల్‌సోర్స్‌ అనాలిసిస్‌ అనే సంస్థ గుర్తించింది. శాటిలైట్‌ చిత్రాల ద్వారా బేస్‌ను కనిపెట్టింది. 2020లో భారత్‌–చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగిన గస్తీ పాయింట్‌కు ఈ ఎయిర్‌ డిఫెన్స్‌ కాంప్లెక్స్‌ 110 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. గార్‌ కౌంటీలో ఉన్న ఈ కేంద్రం భారత్‌లో ఇటీవల ఆధునీకరించిన న్యోమా ఎయిర్‌ఫీల్డ్‌కు సరిగ్గా ఎదురుగా ఉంటుంది. భారీ క్షిపణులకు కేంద్రంగా.. ఉపగ్రహ చిత్రాలను బట్టి చూస్తే ఈ కాంప్లెక్స్‌లో భారీ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ భవనాలు, బ్యార్‌లు, వాహనాలు నిలిపి ఉంచే షెడ్లు, ఆయుధ నిల్వ గోదాములు, రాడార్‌ సిస్టంలు ఉన్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా క్షిపణి లాంచింగ్‌ వాహనాలను రహస్యంగా దాచి ఉంచేందుకు భారీ బంకర్‌ వంటి భవనాలను నిర్మిస్తున్నారు. ఈ భవనాలకు ముందుకు వెనుకకు జరుపగల పైకప్పును అమర్చినట్లు నిపుణులు గుర్తించారు. అంటే ఆ భవనంలో దాగి ఉన్న వాహనం నుంచి క్షిపణిని ప్రయోగించాలనుకుంటే వెంటనే భవనం పైకప్పు పక్కకు జరుగుతుంది. క్షిపణి ప్రయోగం పూర్తికాగానే మళ్లీ యథాస్థానానికి చేరుకుంటుంది. శత్రువు నిఘాకు దొరక్కుండా తమ క్షిపణి వ్యవస్థలను దాచేందుకు ఈ భవనాలను నిర్మిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ ఒక్కో బంకర్‌ రెండు వాహనాలను నిలిపి ఉంచగల భారీ విస్తీర్ణంలో ఉన్నాయి. ఈ బంకర్‌ భవనాల్లో చైనా దీర్ఘశ్రేణి సర్ఫేస్‌ టు ఎయిర్‌ (భూ ఉపరితలం నుంచి గగనతలంలోకి ప్రయోగించగల క్షిపణి) హెచ్‌క్యూ–9 క్షిపణి వ్యవస్థలను మోహరించనున్నట్లు ఇంటెలిజెన్స్‌ నిపుణులు పేర్కొంటున్నారు. ఆల్‌సోర్స్‌ అనాలిసిస్‌ సంస్థ ఈ కాంప్లెక్స్‌ను బహిర్గతం చేసిన తర్వాత అమెరికాకే చెందిన గగనగల ఇంటెలిజెన్స్‌ కంపెనీ వంటార్‌కు చెందిన ఓపెన్‌సోర్స్‌ ఇంటెలిజెన్స్‌ టీం (ఓఎస్‌ఐఎన్‌టీ) మరింత కచ్చితమైన చిత్రాలను సేకరించింది. సెపె్టంబర్‌ 29న తీసిన శాటిలైట్‌ చిత్రాల్లో కొన్ని బంకర్‌ భవనాల పైకప్పులు క్షిపణి ప్రయోగానికి అనువుగా తెరిచి ఉండగా, కొన్నింటికి మూసి ఉండటం కనిపించింది. ‘ఈ రకమైన భవనాలు చైనా క్షిపణి వ్యవస్థలకు అన్ని రకాలుగా రక్షణ ఇస్తాయి. అంతేకాకుండా శత్రువుల ఎదురుదాడి నుంచి తన క్షిపణి వ్యవస్థలను రక్షిస్తాయి. మామూలు సమయంలో అక్కడ మిసైల్‌ లాంచర్స్‌ ఉన్నట్లు గుర్తించటం కూడా కష్టమే’అని ఆల్‌సోర్స్‌ అనాలిసిస్‌ సంస్థ పేర్కొంది. చైనా గతంలో ఇలాంటి భవనాలనే దక్షిణ చైనా సముద్రంలోని వివాదాస్పద ద్వీపాల్లో నిర్మించినట్లు వార్తలు వచ్చాయి. అయితే, పాంగాంగ్‌ సరస్సు వద్ద చైనా చేపట్టిన ఈ నిర్మాణాలను గత జూలైలోనే డామియెన్‌ సైమన్‌ అనే జియోస్పేషియల్‌ పరిశోధకుడు గుర్తించాడు. కానీ, అప్పుడు అక్కడ ఏం నిర్మిస్తున్నారన్నది తెలియలేదు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement