సేల్స్‌ఫోర్స్ సీఈవో మార్క్ బెనియాఫ్
భవిష్యత్తులో వ్యాపార విస్తరణ ప్రణాళికలకు సంబంధించి భారత్ కీలకంగా ఉంటుందని అమెరికన్ ఐటీ దిగ్గజం సేల్స్‌ఫోర్స్ సీఈవో మార్క్ బెనియాఫ్ చెప్పారు. దక్షిణాసియా కార్యకలాపాలకు సారథ్యం వహిస్తున్న అరుంధతి భట్టాచార్య (గతంలో ఎస్‌బీఐ చైర్‌పర్సన్) నాయకత్వాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రశంసించారు.
భారత్‌లో తమ సంస్థను గొప్పగా తీర్చిదిద్దుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఆ దిశగా అరుంధతి అత్యుత్తమంగా సేవలు అందిస్తున్నారని బెనియాఫ్ పేర్కొన్నారు. ఆమె నాయకత్వంలో కంపెనీ కార్యకలాపాలు అనేక రెట్లు విస్తరించాయని కంపెనీ ఫ్లాగ్‌షిప్ కార్యక్రమం ‘డ్రీమ్‌ఫోర్స్ 2025’లో పాల్గొన్న సందర్భంగా వివరించారు. మరోవైపు, గతంలో ఎన్నడూ లేనంత సమర్ధవంతంగా పని చేసేందుకు మనుషులకు ఏజెంటిక్ ఎంటర్‌ప్రైజ్ సహాయపడుతుందని బెనియాఫ్ చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అంతర్జాతీయంగా 41 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని సేల్స్‌ఫోర్స్ అంచనా వేస్తోంది.
ఇదీ చదవండి: ఇన్‌ఫ్రా కంపెనీలకు తక్షణమే బకాయిలు చెల్లించాలి


