10 శాతం కొనుగోలుకి రెడీ
రూ. 6,196 కోట్ల పెట్టుబడి
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ సంస్థ ఫెడరల్ బ్యాంక్‌లో తాజాగా పీఈ దిగ్గజం బ్లాక్‌స్టోన్ గ్రూప్ మైనారిటీ వాటా సొంతం చేసుకోనుంది. ఇందుకు బోర్డు తాజాగా గ్రీన్‌సిగ్నల్ ఇచి్చనట్లు ఫెడరల్ బ్యాంక్ పేర్కొంది. వెరసి బ్లాక్‌స్టోన్ గ్రూప్ సంస్థ ఏషియా 2 టాప్‌కో 13 పీటీఈ లిమిటెడ్‌కు రూ. 6,196 కోట్ల విలువైన ప్రిఫరెన్షియల్ వారంట్లను బ్యాంక్ జారీ చేయనుంది. అంతేకాకుండా బోర్డులో ఒక నాన్‌ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌ను నియమించుకునేందుకు బ్లాక్‌స్టోన్ ప్రత్యేక హక్కును పొందనుంది. ఇందుకు బోర్డు అనుమతించినట్లు ఫెడరల్ బ్యాంక్ తెలియజేసింది. అయితే వారంట్లను పూర్తిగా వినియోగించుకున్న తదుపరి బ్యాంక్ ఈక్విటీలో కనీసం 5 శాతం వాటాను
పొందిన తర్వాత మాత్రమే బ్లాక్‌స్టోన్‌కు నియామక
అవకాశముంటుంది.
రూ. 227 ధరలో
ప్రైవేట్ ప్లేస్‌మెంట్‌లో భాగంగా ఒక్కొక్కటి రూ. 227 ధరలో 27.29 కోట్ల ప్రిఫరెన్షియల్ వారంట్లను ఫెడరల్ బ్యాంక్ జారీ చేయనుంది. ఇందుకు రూ. 6,196 కోట్లను బ్లాక్‌స్టోన్ ఇన్వెస్ట్ చేయనుంది. జారీ తేదీ నుంచి వారంట్లకు గడువు 18 నెలల్లో ముగియనుంది. వారంట్లను ఈక్విటీ షేర్లుగా మారి్పడి చేసుకున్నాక బ్యాంక్‌లో బ్లాక్‌స్టోన్ వాటా 9.99 శాతానికి చేరనుంది. బ్లాక్‌స్టోన్‌కు ప్రిఫరెన్షియల్ వారంట్ల జారీ, డైరెక్టర్ ఎంపికకు ప్రత్యేక హక్కుపై నవంబర్ 19న వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా బ్యాంక్ వాటాదారుల అనుమతిని కోరనుంది.
బ్లాక్‌స్టోన్ పెట్టుబడుల నేపథ్యంలో ఫెడరల్ బ్యాంక్ షేరు బీఎస్‌ఈలో యథాతథంగా రూ. 227 వద్ద ముగిసింది.


