
ఇండియా హోమ్‌లోన్ లిమిటెడ్‌లో 24.5% వాటా(34.99 లక్షలకుపైగా షేర్లు) దక్కించుకున్నట్లు స్కైబ్రిడ్జ్ వెంచర్స్ ఎల్‌ఎల్‌పీ తెలిపింది. అయితే, ఎంతకు కొనుగోలు చేసేందనే వివరాలు వెల్లడించలేదు. శుక్రవారం బీఎస్‌ఈలో ఇండియన్ హోమ్ లోన్ షేరు ముగింపు (రూ.42.46)తో లెక్కిస్తే డీల్ విలువ రూ.14.85 కోట్లుగా ఉంటుందని అంచనా.
‘‘ఈ వాటా కొనుగోలుతో భారత్‌లో అందుబాటు ధరల గృహాలు, రిటైల్ ఫైనాన్స్ రంగాల్లో దీర్ఘకాల వృద్ధి అవకాశాలు ఆశిస్తున్నాము. సేవలు విస్తరణకు ఒక బలమైన ఫ్లాట్‌ఫామ్‌ను ఏర్పాటు చేసుకున్నాము. సంస్థ అభివృద్ధిలో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉంది’’ అని స్కైబ్రిడ్జ్ వెంచర్స్ తెలిపింది.
కాగా 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఇండియా హోమ్ ఫైనాన్స్ రూ.13.60 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో నమోదైన రూ.12 కోట్లతో పోలిస్తే 13.14% అధికంగా ఉంది.