బంగారం ధరలు భారీగా పెరిగి.. వారం రోజుల నుంచి కొంత తగ్గుముఖం పడుతున్నాయి. అక్టోబర్ 22న.. ఒకేరోజు గోల్డ్ రేటు గరిష్టంగా రూ. 4690 తగ్గింది. కాగా ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో పసిడి ధరలు రూ.1,24,370 (24 క్యారెట్స్ 10 గ్రా), రూ.1,14,000 (22 క్యారెట్స్ 10 గ్రా) వద్ద ఉన్నాయి. ఈ ధరలు ఇంకా తగ్గాలంటే.. ఎలాంటి పరిణామాలు జరగాలనే విషయాన్ని నిపుణులు అంచనా వేశారు.
గోల్డ్ రేటు అంతర్జాతీయ మార్కెట్లలో గణనీయంగా తగ్గాలంటే.. యుద్దాలు ఆగాలి, అమెరికా విధించిన సుంకాలు తగ్గాలి, ఆర్థికాభివృద్ధి పెరిగినప్పుడే.. బంగారం ధరలు దిగివచ్చే అవకాశం ఉంటుందని.. టాటా అసెట్ మేనేజ్‌మెంట్ కమొడిటీస్ ఫండ్ మేనేజర్ 'తపన్ పటేల్' తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
అంతర్జాతీయ మార్కెట్లలో ఈ వారం బంగారం ధరలు 3 శాతం తగ్గడంతో పసిడి కొనుగోలుదారులు ఊపిరి పీల్చుకుంటున్నట్లు కనిపిస్తోంది. గోల్డ్ ధరలు సుమారు తొమ్మిది వారాలుగా పెరుగుతూనే ఉన్నాయి. ఈ వారంలో మాత్రమే ధరల పతనం నమోదైంది. దీంతో గోల్డ్ రేటు ఔన్సుకు 4118.68 డాలర్ల వద్దకు చేరుకుంది.
బంగారం పెరగడానికి కారణాలు
గోల్డ్ రేటు పెరగడానికి కారణాలు చాలానే ఉన్నాయి. ఇందులో ప్రధానంగా డిమాండుకు తగ్గ సరఫరా లేకపోవడం అని తెలుస్తోంది. డిమాండ్ పెరగడానికి కారణం.. పెట్టుబడిదారుల గోల్డ్ మీద ఎక్కువగా ఇన్వెస్ట్ చేయడమే. బంగారం సురక్షితమైన పెట్టుబడి, కాబట్టి దీనిపై పెట్టుబడులు పెరిగాయి. ఇవి కాకుండా అంతర్జాతీయ పరిణామాలు కూడా బంగారం ధరలను అమాంతం పెంచేస్తున్నాయి.
ఇదీ చదవండి: 'ఆలస్యం చేయొద్దు.. వేగంగా కొనండి': రాబర్ట్ కియోసాకి


