టాలీవుడ్ హీరో శర్వానంద్ ఇటీవలే తన కొత్త సినిమాకు సంబంధించి అప్‌డేట్ ఇచ్చారు. ఈ దీపావళి టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను పంచుకున్నారు. బైకర్ అనే మూవీలో శర్వానంద్ నటిస్తున్నట్లు నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. పోస్టర్ చూస్తుంటే ఈ చిత్రంలో బైక్ రేసర్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ శర్వానంద్ కెరీర్‌లో 36వ సినిమాగా రానుంది. ఇందులో మాళవిక నాయర్ హీరోయిన్‌గా కనిపించనుంది.
అయితే తాజాగా శర్వానంద్ సోషల్ మీడియాలో ఫోటోలను పోస్ట్ చేశారు. షర్ట్ లెస్‌తో ఉన్న ఫోటోలు చూసిన ఫ్యాన్స్ షాకింగ్‌కు గురవుతున్నారు. ఇవీ చూసిన అభిమానులు.. శర్వానంద్ ఇలా మారిపోయాడేంటి? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే బైకర్ మూవీ కోసమే ఇలా పూర్తిగా తన బాడీని మార్చుకున్నారని తెలుస్తోంది. నిజమైన బైక్ రేసర్‌గా కనిపించేందుకు బరువు తగ్గినట్లు తెలుస్తోంది. ఇలాంటి ఫిజిక్ కోసం కొన్ని నెలల పాటు వర్కవుట్స్ చేసినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా.. ఈ చిత్రంలో బ్రహ్మాజీ, అతుల్ కుల్‌కర్ణి కీలక పాత్రలు పోషిస్తున్నారు.


