లాహోర్: జైలులో ఉన్న పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సోదరి అలీమా ఖాన్ పాస్‌పోర్టు, గుర్తింపు కార్డు, బ్యాంకు అకౌంట్‌లను సీజ్ చేయాలని రావ ల్పిండిలోని ఉగ్రవాద నిరోధక కోర్టు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది.
నాన్ బెయిలబుల్ వారెంట్లతో ఉగ్రవాద ఆరోపణలను ఎదుర్కొంటున్న అలీమా ఖాన్ విచారణకు రావాలంటూ పదేపదే పంపుతున్న నోటీసులను పట్టించుకోనందునే ఈ మేరకు ఆదేశాలిచి్చనట్లు కోర్టు తెలిపింది. అయితే, ఇతర కార్యక్రమాలు ఎక్కడున్నా తప్పకుండా హాజరయ్యే అలీమా ఖాన్..కోర్టుకు మాత్రం ఎందుకు రావడం లేదని విచారణ సందర్భంగా జడ్జి అంజాద్ అలీ షా ప్రశ్నించారు. కేసు విచారణను తదుపరి ఈ నెల 27వ తేదీకి వాయిదా వేస్తున్నామని, ఈ దఫా ఆమెను తప్పకుండా కోర్టులో హాజరుపర్చాలని అధికారులను ఆదేశించారు.


