భరించలేనంత బాధ.. కర్నూల్‌ ఘటనపై రష్మిక ఎమోషనల్‌ | Rashmika Mandanna Emotional Comments On Kurnool Private Travels Bus Fire Accident, Check Tweet Inside | Sakshi
Sakshi News home page

భరించలేనంత బాధ.. కర్నూల్‌ ఘటనపై రష్మిక ఎమోషనల్‌

Oct 25 2025 8:38 AM | Updated on Oct 25 2025 10:04 AM

Rashmika mandanna emotional comments on Kurnool Bus Fire Accident

కర్నూలు జిల్లాలో శుక్రవారం తెల్లవారు జామున జరిగిన వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు ఘోర  ప్రమాదం తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్‌ దేశాన్ని కలచి వేసింది. ఈ ఘటన గురించి సినీ నటి రష్మిక మందన్న స్పందించారు. 'కర్నూలులో జరిగిన ఘోర ప్రమాదం నా గుండెను చాలా తీవ్రంగా బాధపెడుతోంది. తగలబడుతున్న బస్సులో కాలిపోయే ముందు ప్రయాణికుల బాధను ఊహిస్తేనే భయంకరంగా ఉంది. చిన్న పిల్లలతో పాటు చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఒక కుటుంబం మొత్తం  నిమిషాల్లోనే తమ ప్రాణాలు కోల్పోయిందని తెలుసుకుంటే చాలా బాధేస్తుంది. నిజంగా ఈ సంఘటన వినాశకరమైనది. ఇంతటి విషాదాన్ని మిగిల్చిన ఈ ప్రమాదంలో మరణించిన వారికి నా నివాళి. వారి ఆత్మకు శాంతి చేకూరాలి. మృతుల కుటుంబాలకు నా సానుభూతి.. దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్ధిస్తున్నా'అంటూ సోషల్‌మీడియాలో ఆమె ఒక పోస్ట్‌ చేశారు.

ఈ ప్రమాదంలో 19 మంది సజీవ దహనం అయ్యారు. నెల్లూరుకు చెందిన అనూష ఆ మంటల్లో ఎలాగైనా తన కుమార్తెను కాపాడుకోవాలని బిడ్డను కౌగిలించుకుని అలాగే కాలిపోయిన దృశ్యం అందరినీ కంటతడి పెట్టించింది. మృతుల్లో ఏపీ, తెలంగాణ, కర్ణాటక వాసులున్నారు. వీరిలో ఇద్దరు చిన్న పిల్లలు కూడా ఉన్నారు. ఈ ప్రమాద సమయంలో బస్సు అద్దాలను ధ్వంసం చేసి అతి కష్టంగా 25 మంది  ప్రాణాలతో బయటపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement