
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం; తిథి: శు.విదియ రా.7.56 వరకు, తదుపరి తదియ; నక్షత్రం: విశాఖ రా.3.17 వరకు, తదుపరి అనూరాధ; వర్జ్యం: ఉ.6.53 నుండి 8.39 వరకు; దుర్ముహూర్తం: ఉ.9.10 నుండి 9.57 వరకు, తదుపరి ప.2.30 నుండి 3.17 వరకు; అమృత ఘడియలు: సా.5.32 నుండి 7.18 వరకు;
సూర్యోదయం : 5.58
సూర్యాస్తమయం : 5.32
రాహుకాలం : ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం : ఉ.6.00 నుండి 7.30 వరకు
భగినీహస్త భోజనం.
మేషం... కొత్త వ్యక్తులతో పరిచయం. శుభవార్తా శ్రవణం. ఆర్థిక విషయాలలో ముందడుగు వేస్తారు. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు అధిమిస్తారు.
వృషభం.... కొత్త మిత్రుల కలయిక. కుటుంబంలో సంతోషకరంగా గడుపుతారు. ఆకస్మిక ధనలాభం. అప్రయత్న కార్యసిద్ధి. వ్యాపారాలలో అంచనాలు నిజం కాగలవు. ఉద్యోగాలలో మరింత సానుకూలం.
మిథునం.... ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. పనుల్లో తొందరపాటు. నిర్ణయాలు మార్చుకుంటారు. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంతమేర అనుకూలిస్తాయి.
కర్కాటకం..... కొత్త రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువుల నుంచి కొన్ని సమస్యలు. ఆరోగ్యభంగం. శ్రమ తప్పదు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యస్థితిలో ఉంటాయి.
సింహం.... గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.
కన్య.... పనుల్లో జాప్యం. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. శ్రమాధిక్యం. ఆరోగ్య సమస్యలు. కుటుంబంలో చికాకులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటుపోట్లు.
తుల.. సంఘంలో గౌరవం పెరుగుతుంది. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశించినరీతిలో సాగుతాయి.
వృశ్చికం..... శ్రమాధిక్యం. పనులు ముందుకు సాగవు. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ పరుస్తుంది. అనారోగ్యం. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆశ్చర్యకరమైన మార్పులు.
ధనుస్సు.... బంధువుల నుంచి కీలక సమాచారం. ఆలయాలు సందర్శిస్తారు. ముఖ్య వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత సానుకూలత.
మకరం..... కొత్త వ్యవహారాలు చేపడతారు. ఆత్మీయులు సహకరిస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలు ప్రగతిదాయకంగా ఉంటాయి.
కుంభం... ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. మిత్రుల నుంచి సమస్యలు. ఒప్పందాలలో ఆటంకాలు. మానసిక అశాంతి. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.
మీనం.... వ్యయప్రయాసలు. బంధువులతో విభేదాలు. పనులలో ఆటంకాలు. అనారోగ్యం. అనుకోని ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలు అదనపు బాధ్యతలు.