పెళ్లి తర్వాత తొలి దీపావళి.. అక్కినేని అఖిల్ భార్య స్పెషల్ విషెస్! | akhil akkineni wife jaianb ravdi sprcial wishes on Deepavali festival | Sakshi
Sakshi News home page

Akhil Akkineni: పెళ్లి తర్వాత తొలి దీపావళి.. అఖిల్ భార్య స్పెషల్ విషెస్!

Oct 23 2025 3:33 PM | Updated on Oct 23 2025 3:54 PM

akhil akkineni wife jaianb ravdi sprcial wishes on Deepavali festival

టాలీవుడ్ హీరో అక్కినేని అఖిల్ ఈ ఏడాది వివాహబంధంలోకి అడుగుపెట్టారు. చైతూ పెళ్లికి ముందే తన ప్రియురాలు జైనాబ్‌ రవ్దీతో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అఖిల్.. జూన్‌లో ఆమె మెడలో మూడుముళ్లు వేశారు. ఈ పెళ్లి వేడుక హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో గ్రాండ్‌గా జరిగింది. తమ్ముడి పెళ్లిలో నాగచైతన్య తన సతీమణి శోభిత ధూళిపాలతో కలిసి సందడి చేశారు.

ఈ ఏడాది పెళ్లి తర్వాత వీరిద్దరు కలిసి తొలిసారి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ పండుగ సెలబ్రేషన్స్‌ ఫోటోను అఖిల్‌ సతీమణి జైనాబ్ రవ్దీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీపావళి శుభాకాంక్షలు.. ఈ పండుగ అందరికీ శ్రేయస్సు, మంచి ఆరోగ్యం, శాంతి, ప్రేమతో నిండిన ఏడాదిగా నిలవాలని కోరుకుంటున్నానని పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ జంటను చూసిన అభిమానులు సోషల్ మీడియాలో క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. ఇటీవలే అఖిల్- జైనాబ్ జంటగా ఎన్టీఆర్ బామ్మర్ది నార్నే నితిన్‌ పెళ్లి వేడుకలో సందడి చేశారు. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement