సక్సెస్ వల్ల ఇమెజ్ వస్తుంది. ఆ ఇమేజ్‌ను వాడుకోవడానికి చాలా మంది ప్రయత్నిస్తారు. అలాంటప్పుడు తెరపైకి వచ్చే మొదటి విషయం పారితోషకం. సాధారణంగా ఇప్పుడు హీరోయిన్ల పారితోషకం రూ.5 నుంచి రూ.10 కోట్ల వరకూ ఉంటోంది. అది వారి ఇమేజ్‌ను బట్టి పెరగొచ్చు, తగ్గొచ్చు. అయితే క్రేజ్ ఉన్న హీరోయిన్లు ప్రత్యేక పాటలో నటించడానికి పారితోషికాన్ని కాస్త ఎక్కువగానే డిమాండ్ చేస్తుంటారు. చాలా మంది హీరోయిన్లు ప్రత్యేక పాటలో నటిస్తూ పారితోషకాన్ని అధిక మొత్తంలో పుచ్చుకుంటున్నారు. ఇందుకు పూజా హెగ్డే అతీతం కాదు.
ఈ అమ్మడు ఇంతకుముందు తెలుగులో రంగస్థలం చిత్రంలో జిల్‌జిల్‌జిగేలు రాజా అనే ఐటమ్ సాంగ్‌లో నటించి బాగా పాపులర్ అయ్యారు. ఆ తరువాత కూలీ చిత్రంలో మోనికా పాటలో నటించి అందరిని అలరించారు. తాజాగా మరో భారీ చిత్రంలో ప్రత్యేక పాటలో చిందేయడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో అత్యంత భారీ బడ్జెట్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఇప్పటికే 5, 6 మంది హీరోయిన్లు నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

అందులో దీపికా పడుకొనే, జాన్వీకపూర్, మృణాల్‌ఠాకూర్, రష్మిక మందన్నా వంటి స్టార్ హీరోయిన్ల పేరు చోటు చేసుకున్నట్లు సమాచారం. తాజాగా ఈ చిత్రంలో ఒక ప్రత్యేక పాటలో పూజాహెగ్డేను నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిసింది. 5నిమిషాలపాటు సాగే ఈ పాటలో నటించడానికి ఈ అమ్మడు రూ.5 కోట్లు డిమాండ్ చేసినట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇకపోతే ఈ మధ్య అవకాశాలు లేని ఈ బ్యూటీ ఇప్పుడు మళ్లీ బిజీ అవుతున్నారు.


