నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) తన పరిధిలోని.. నేషనల్ హైవే నెట్‌వర్క్‌లోని టోల్ ప్లాజాలలో నెలవారీ పాస్‌లు, యాన్యువల్ పాస్‌లకు సంబంధించిన సమాచారాన్ని ప్రదర్శించనున్నట్లు ప్రకటించింది. పాస్‌లకు సంబంధించిన రేట్లు, అర్హత మొదలైనవాటి గురించి.. వినియోగదారులలో అవగాహనను, పారదర్శకతను పెంపొందించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
జాతీయ రహదారులపై ఎక్కువగా ప్రయాణించేవారికి.. కొంత పొదుపుగా, సౌకర్యవంతంగా ఉండేలా ఈ పాస్‌లను రూపొందించారు. ఈ పాస్‌ల వివరాలు టోల్ ప్లాజా అప్రోచ్‌లు, కస్టమర్ సర్వీస్ ఏరియాలు, ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్లు వంటి ప్రదేశాలలో ఉంచిన సైనేజ్ బోర్డులపై ప్రదర్శించనున్నారు. ఇందులో సమాచారం ఇంగ్లీష్, హిందీ, ప్రాంతీయ భాషలలో అందుబాటులో ఉంటుంది. ఫీల్డ్ ఆఫీసులు ఈ బోర్డులను 30 రోజుల్లోపు ఏర్పాటు చేయాలని, ఫీజు నిబంధనలకు అనుగుణంగా పగలు & రాత్రి వేళల్లో కూడా స్పష్టంగా కనిపించేలా చూసుకోవాలని ఎన్‌హెచ్ఏఐ ఆదేశించింది.
నెలవారీ పాస్
విస్తృత ప్రచారం కోసం.. ఈ సమాచారం రాజ్‌మార్గయాత్ర మొబైల్ యాప్, సంబంధిత ఎన్‌హెచ్ఏఐ ప్రాజెక్ట్ వెబ్‌సైట్‌లలో కూడా అందుబాటులో ఉంచారు. మంత్లీ పాస్ అనేది.. టోల్ ప్లాజా పరిధిలో 20 కిలోమీటర్ల (లేదా వర్తించే విధంగా) దూరంలో నివసించే ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది.
యాన్యువల్ పాస్
యాన్యువల్ పాస్ విషయానికి వస్తే.. ఇది కార్లు, జీపులు, వ్యాన్లు వంటి ప్రైవేట్ వాహనాల కోసం కేటాయించారు. రూ. 3,000 వన్-టైమ్ ఫీజుతో ఒక సంవత్సరం లేదా 200 క్రాసింగ్‌లను అనుమతిస్తుంది. దీనిని రాజ్‌మార్గయాత్ర యాప్ ద్వారా డిజిటల్‌గా కొనుగోలు చేయవచ్చు. ఈ పాస్ ప్రస్తుతం దేశంలోని జాతీయ రహదారులు మరియు ఎక్స్‌ప్రెస్‌వేలలోని దాదాపు 1,150 టోల్ ప్లాజాలలో చెల్లుబాటు అవుతుంది.
➡ To enhance transparency and create awareness for #NationalHighway users, #NHAI will display detailed information about the ‘Local Monthly Pass’ and the ‘Annual Pass’ at all fee plazas.
➡ This information will be placed on signage boards at visible locations, including fee… pic.twitter.com/MmSiJIEZMA— NHAI (@NHAI_Official) October 24, 2025


