కొన్ని రోజుల నుంచి స్తబ్దుగా ఉన్న వృద్ధిని పునరుద్ధరించడానికి ఉద్దేశించిన పునర్నిర్మాణ ప్రణాళికలో భాగంగా టార్గెట్ కార్ప్ సుమారు 1,000 మంది ఉద్యోగులను తొలగించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. దాంతోపాటు ఇప్పటికే ఖాళీగా ఉన్న 800 స్థానాలను భర్తీ చేయకుండా వాటిని రద్దు చేయనున్నట్లు ప్రకటించింది.
త్వరలో సంస్థ నిర్వహణ పగ్గాలు చేపట్టబోయే ఇన్‌కమింగ్ సీఈఓ మైఖేల్ ఫిడెల్కే కంపెనీ ప్రధాన కార్యాలయంలోని ఉద్యోగులకు పంపిన మెమోలో ఈ నిర్ణయాలను ప్రకటించారు. ఏయే సిబ్బందిపై లేఆఫ్స్ ప్రభావం ఉంటుందో త్వరలో తెలియజేస్తామని చెప్పారు. టార్గెట్ కార్ప్ కంపెనీ అమెరికాలోని టాప్ సంస్థల్లో ఒకటిగా ఉంది. కంపెనీ పునర్నిర్మాణ ప్రక్రియను ఖరారు చేస్తున్నందున వచ్చే వారం యూఎస్‌లోని ఉద్యోగులందరూ ఇంటి నుంచి పని చేయాలని మెమోలో ఆదేశించారు.
వినియోగదారుల వ్యయం తగ్గడం, నిర్వహణ ఖర్చులు భారం అవుతుండడంతో టార్గెట్ కార్ప్ ఇటీవలి సంవత్సరాలలో పురోగతి సాధించడం లేదని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఫిబ్రవరి 1, 2025 నాటికి కంపెనీ సుమారు 4,40,000 మందికి ఉపాధి కల్పించింది.
ఇదీ చదవండి: ర్యాంక్ వారీగా ఐపీఎస్ అధికారుల వేతనాలు


