ప్రభుత్వరంగ యూకో బ్యాంక్ (UCO Bank) తన కార్యకలాపాల విస్తరణపై దృష్టి సారించింది. వచ్చే మార్చి నాటికి 150 కొత్త శాఖలను తెరవనున్నట్టు ప్రకటించింది. ఇందుకు బోర్డు ఆమోదం తెలిపినట్టు యూకో బ్యాంక్ ఎండీ, సీఈవో అశ్వినీ కుమార్ తెలిపారు.
ప్రస్తుతం యూకో బ్యాంక్‌కు దేశవ్యాప్తంగా 3,322 శాఖలు ఉన్నాయి. సెపె్టంబర్ చివరికి యూకో బ్యాంక్‌లో ఉద్యోగుల సంఖ్య 21,266గా ఉన్నట్టు చెప్పారు. క్యూ2లో యూకో బ్యాంక్ మెరుగైన స్థిరమైన పనితీరు సాధించింది. నికర లాభం క్రితం ఏడాది ఇదే క్యూ2 పోల్చి చూస్తే రూ.603 కోట్ల నుంచి రూ.620 కోట్లకు, ఆదాయం రూ.7,071 కోట్ల నుంచి రూ.7,421 కోట్లకు వృద్ధి చెందింది.


