సమస్తీపూర్: కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీ సహకారంతో బిహార్ అభివృద్ధి చెందుతోందని జేడీయూ చీఫ్, సీఎం నితీశ్ కుమార్ చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి ఎన్డీయేకే ఓటేయాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. సమస్తీపూర్‌లో ప్రధాని మోదీ ప్రారంభించిన ఎన్నికల ర్యాలీలో నితీశ్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ పేరును ప్రస్తావించకుండా ఆయనపై తీవ్ర విమర్శలు చేశారు.
1997లో దాణా కుంభకోణంలో కేసు నమోదు కావడంతో గతంలో లాలూ సీఎం పదవి నుంచి వైదొలిగి, భార్య రబ్డీదేవికి బాధ్యతలను అప్పగించడాన్ని నితీశ్ తీవ్రంగా తప్పుబట్టారు. రాష్ట్రాన్ని లాలూ అధోగతి పాల్జేశారన్నారు. ఆయన ఇప్పటికీ మారలేదు. అప్పట్లో భార్యకు ముఖ్యమంత్రి పదవిని అప్పగించిన లాలూ, కుమారులు, కుమార్తెలకు అధికారం కట్టబెట్టేందుకు మళ్లీ తెరపైకి వచ్చారని వ్యంగ్యా్రస్తాలు సంధించారు. ఆయన పా ర్టీతో స్వల్పకాలం మైత్రి సాగించా. అది తప్పని ఆ తర్వాత తెలుసుకుని, ఆ కూటమి నుంచి బయటకు వచ్చి తిరిగి బీజేపీతో మైత్రి కొనసాగించా’అంటూ నితీశ్ చెప్పుకొచ్చారు.


