breaking news
Nagarkurnool
-
పైసల పంచాయితీ!
● మూడో విడతలోనూ రూ.35 కోట్లు విడుదల? ● గతంలో తాము ఖర్చు చేసిన డబ్బులు ఇవ్వాలంటున్న కార్యదర్శలు ● నిర్వహణకే సరిపోవని మొండికేస్తున్న కొందరు సర్పంచ్‌లు అచ్చంపేట: పల్లెలకు పాలకవర్గాలు లేని సమయంలో పంచాయతీ కార్యదర్శలే అంతా తామై వ్యవహరించారు. చెత్త సేకరణ వాహనాలకు డీజిల్ మొదలుకొని.. వీధిలైట్లు నిర్వహణ ఖర్చులు భరించారు. అయితే పాలకవర్గాలు కొలువుదీరిన అనంతరం ఇప్పటి వరకు 15వ ఆర్థిక సంఘం నిధులు రెండు విడతలుగా జమయ్యాయి. గతంలో ఖర్చు చేసిన డబ్బులు కొందరు సర్పంచ్‌లు కొంత మేర కార్యదర్శులకు ఇస్తుండగా.. మరికొందరు మాత్రం ససేమిరా అంటున్నారు. దీంతో వారి నడుమ అంతర్గతంగా పంచాయితీ మొదలైంది. 22 నెలల పాటు.. జిల్లావ్యాప్తంగా 20 మండలాల పరిధిలో 461 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 2024 ఫిబ్రవరిలో సర్పంచ్ల పదవీకాలం ముగియగా.. 2025 డిసెంబర్లో ఎన్నికలు నిర్వహించారు. సుమారు 22 నెలల పాటు గ్రామాలకు పాలకవర్గాలు కరువయ్యారు. ప్రభుత్వం ప్రత్యేకాధికారులను నియమించి చేతులు దులుపుకోవడంతో పాలన అస్తవ్యస్తంగా మారింది. రెండేళ్లుగా సమావేశాలు, నిర్వహణ ఖర్చులు కార్యదర్శలే భరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను పారిశుద్ధ్యం, వీధిదీపాలు, నీటి సరఫరా, రోడ్లు, డ్రెయినేజీ, ఆరోగ్యం, విద్య, వ్యవసాయంతోపాటు 29 అంశాలకు సంబంధించిన పనులకు చిన్న గ్రామాలకు రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు, పెద్ద పంచాయతీలకు రూ.3 నుంచి రూ.4 లక్షల వరకు ఖర్చు చేసినట్లు సమాచారం. కాగా పరిశ్రమలున్న గ్రామాల్లో ప్రతినెలా పన్నులు రాగా.. మిగతా చోట్ల కార్యదర్శలు అప్పులు చేసి రెండేళ్లపాటు నెట్టుకొట్చారు. రెండేళ్లు.. రూ.10 కోట్లు రెండేళ్లలో జిలావ్యాప్తంగా పంచాయతీ కార్యదర్శలు సుమారు రూ.10 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. అయితే పాలకవర్గాలు కొలువుదీరిన తర్వాత కేంద్రం రెండు విడతలుగా 15వ ఆర్థిక సంఘం నిధులకు సంబంధించి రాష్ట్రానికి రూ.640 కోట్లు విడుదల చేయగా జిల్లాకు రూ.రూ.36.58 కోట్లకుపైగా పంచాయతీల ఖాతాల్లో జమ చేసింది. తాజాగా కేంద్రం మూడు రోజుల క్రితం 2024– 25 ఆర్థిక సంవత్సకానికి సంబంధించిన మొత్తం బకాయిల్లో రాష్ట్రానికి మరో రూ.640 కోట్లు విడుదల చేయగా.. పంచాయతీలకు సుమారు రూ.30– 35 కోట్ల నిధులు జమ కానున్నాయి. 2025– 26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్రానికి సుమారు రూ.1,255 కోట్లు ఇంకా రావాల్సి ఉంది. అయితే గతంలో తాము పెట్టిన డబ్బులు ఇవ్వాలని కార్యదర్శలు సర్పంచ్‌లను అడుగుతున్నారు. దీంతో కొందరు సర్పంచ్‌లు కొంత మేర ఇస్తుండగా, మరికొందరు ససేమిరా అంటున్నట్లు తెలిసింది. జిల్లా ఉన్నతాధికారుల మాటలు నమ్మి బయట అప్పు చేసి జీపీల నిర్వహణ నెట్టుకొస్తే.. ఇప్పుడు కొందరు సర్పంచ్‌లు డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని కార్యదర్శలు వాపోతున్నారు. అధికారులు జోక్యం చేసుకొని తాము ఖర్చు చేసిన డబ్బులు ఇప్పించాలని వేడుకుంటున్నారు. అలాగే కొందరు పాత సర్పంచ్‌లు సైతం తాము ఖర్చు పెట్టిన డబ్బులు ఇవ్వాలని కోరుతున్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులు ఇప్పటికే రెండు విడతలుగా ఆయా గ్రామ పంచాయతీల ఖాతాల్లో జమ అయ్యాయి. అవసరాలను బట్టి వినియోగించుకుంటున్నారు. మూ డో విడత నిధులు కూడా వచ్చాయి. జీపీల్లో జమ కావాల్సి ఉంది. పాత బకాయిలు చెల్లించడంతోపాటు ఇతరత్రా అవసరాలకు ఉపయోగించుకుంటున్నారు. – శ్రీరాములు, జిల్లా పంచాయతీ అధికారి -
వంటగ్యాస్ కొరత నివారించాలి
నాగర్‌కర్నూల్ రూరల్: దేశంలో నెలకొన్న వంట గ్యాస్ సంక్షోభం నుంచి దేశ ప్రజలను రక్షించడంలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్ఎండీ ఫయాజ్ అన్నారు. సీపీఐ జాతీయ సమితి పిలుపు మేరకు జిల్లా కార్యాలయం నుంచి ఖాళీ సిలిండర్ కుండతో ప్రదర్శనగా అంబేడ్కర్ చౌరస్తాకు చేరుకుని అక్కడ గ్యాస్ కొరతను నిరసిస్తూ కట్టెల పొయ్యిపై వంట చేసి వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇరాన్‌పై అమెరికా– ఇజ్రాయిల్ చేస్తున్న దాడులతో పరిస్థితులన్నీ తలకిందులుగా మారి దేశంలో తీవ్రమైన గ్యాస్ కొరత ఏర్పడిందన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాట్లాడితే తాను విశ్వనాయకుడిని అని చెప్పుకొంటారు కానీ, మన పక్క దేశాల్లో యుద్ధం ద్వారా ఇక్కడ గ్యాస్ డీజిల్, పెట్రోల్ లాంటి వస్తువుల కొరత ఏర్పడుతుందని కనీసం ముందుచూపు లేకపోవడం విచారించదగ్గ విషయమన్నారు. వీలైనంత త్వరగా వంట గ్యాస్ అందుబాటులోకి తీసుకురాకపోతే సీపీఐ ఆధ్వర్యంలో గ్యాస్ గోదాంలను ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు ఆనంద్జీ, చంద్రమౌలి, కృష్ణాజీ, లక్ష్మీపతి, ఖాజ, వెంకటయ్య, రవీందర్, రామస్వామి, బాలపీరు, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
అక్షరాస్యత వందశాతానికి పెంపే లక్ష్యం
కందనూలు: జిల్లాలో అక్షరాస్యత వందశాతానికి పెంచడమే లక్ష్యంగా పనిచేయాలని అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్‌లాల్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత ఉల్లాస్ కార్యక్రమం ద్వారా నిరక్షరాస్యులైన మహిళలు, వయోజనులకు జిల్లాలో ఇది వరకు చదువు నేర్పిన మహిళలకు ఈ నెల 29న నిర్వహించే ప్రీఫైనల్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ అసెస్మెంట్ టెస్ట్‌కు విధిగా హాజరయ్యేలా చూడాలన్నారు. జిల్లాలో వందశాతం అక్షరాస్యత సాధించేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని చెప్పారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అధికారిక విద్యకు దూరమైన 15 ఏళ్లు పైబడిన వయోజనులకు చదవడం, రాయడం, లెక్కలు, ప్రాథమిక జీవన నైపుణ్యాలు అందించడం కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఉల్లాస్ కార్యక్రమం ముఖ్య లక్ష్యం అన్నారు. జిల్లాలో చదవడం, రాయడం నేర్చుకున్న నిరక్షరాస్య మహిళలు, వయోజనులు 25,313 మంది ఈ పరీక్షకు హాజరుకానున్నారని.. పరీక్షను జిల్లావ్యాప్తంగా సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. నిరక్షరాస్యుల పరీక్షలకు అవసరమైన ప్రశ్నపత్రాలను ఈ నెల 27న జిల్లాలోని పాఠశాలలకు చేర్చాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో డీఆర్డీ ఓ చిన్న ఓబులేసు, జిల్లా వయోజన విద్యాఽ దికారి శ్రీనివాస్‌రెడ్డి, డీఈఓ రమేష్‌కుమార్, మైనార్టీ సంక్షేమ శాఖాధికారి రాజేశ్వరి, సీఎంఓ వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. -
పట్టాలెక్కిన కొడంగల్
నారాయణపేట–మక్తల్–కొడంగల్ ఎత్తిపోతల్లో కదలిక రెండో విడతలో కెనాళ్లు, డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థ అభివృద్ధి, చెరువుల సామర్థ్యం పెంపు వంటి పనులు చేపట్టనున్నారు. చివరి విడతలో విద్యుత్ సబ్స్టేషన్ల ఏర్పాటు, తదితర నిర్మాణ పనులు చేయనున్నారు. మొత్తంగా కొడంగల్ ఎత్తిపోతల కింద 10 రిజర్వాయర్లు నిర్మించనున్నారు. ఆర్థిక భారం పెరగకుండా మక్తల్, నారాయణపేట, కొడంగల్ నియోజకవర్గాల్లో అందుబాటులో ఉన్న చెరువుల సామర్థ్యం పెంచి రిజర్వాయర్లుగా అభివృద్ధి చేయనున్నారు. ● తొలి విడతలో రూ.1,400 కోట్లు మంజూరు.. స్టేజీ–1 పనులు షురూ ● కాట్రేవులపల్లి వద్ద అప్రోచ్ చానల్, పంప్‌హౌస్ వర్క్స్ ముమ్మరం ● మొత్తంగా లక్ష ఎకరాలకు సాగునీరు.. ప్రాజెక్ట్ వెంట గ్రీన్‌బెల్ట్ ● 56 హెక్టార్లలో మొక్కల పెంపకం.. రైతాంగంలో హర్షాతిరేకాలు ఊట్కూరు (మక్తల్), జాజాపూర్, పేరుపళ్ల జాయమ్మ (నారాయణపేట), కాన్కుర్తి (దామరగిద్ద), దౌల్తాబాద్, కొడంగల్, హస్నాబాద్, బొంరాస్‌పేట, లక్ష్మీపూర్, ఈర్లపల్లి (కొడంగల్). ● -
రాయితీపై డ్రోన్లు
రైతులకు తీరనున్న పురుగు మందుల పిచికారీ వెతలు ● జిల్లాకు పది కేటాయింపు ● సహకార, మహిళా సంఘాలకు ప్రాధాన్యం ● ఒక్కో యూనిట్‌కు రూ. 4లక్షల వరకు సబ్సిడీ కందనూలు: వ్యవసాయ పొలాల దుక్కితో మొదలుకొని.. పంట చేతికొచ్చే వరకు అత్యాధునిక పరికరాల వినియోగం పెరిగింది. యాంత్రీకరణతో వ్యవసాయ పనులు చకచకా సాగడంతో పాటు కూలీల కొరత తీరుతోంది. ప్రధానంగా పంటల్లో చీడపీడల నివారణ కోసం పురుగు మందుల పిచికారీకి డ్రోన్ల వినియోగం నానాటికీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అన్నదాతలకు ఆర్థిక భారం తగ్గించాలనే ఉద్దేశంతో రాయితీపై డ్రోన్ల పంపిణీకి శ్రీకారం చుట్టింది. జిల్లాలో సాగుకు అనుకూలమైన పంట పొలాలు 8.30 లక్షల ఎకరాల్లో ఉన్నాయి. అందులో పత్తి 2.95 లక్షలు, వరి 2.10లక్షలు, వేరుశనగ 1.05 లక్షల ఎకరాల్లో సాగుచేస్తుండగా.. మిగతా పొలాల్లో వివిధ రకాల పంటలను పండిస్తున్నారు. నాగనూల్‌లో డ్రోన్ ద్వారా వరిపంటకు పురుగు మందు పిచికారీ చేస్తున్న రైతు (ఫైల్ ) తక్కువ ఖర్చు.. సమయం ఆదా వ్యవసాయ రంగంలో డ్రోన్లతో పొలాలకు ఎరువులు, పురుగు మందులు చల్లడం తేలిక. ఖర్చు తగ్గడంతో పాటు రైతులకు సమయం వృథా కాకుండా ఉంటుంది. కూలీలతో పురుగు మందులు పిచికారీ చేయడం ద్వారా రైతు ఆర్థికంగా నష్టపోవడంతో పాటు సమయం చాలా తీసుకుంటుంది. పంటలకు సకాలంలో పురుగు మందులు పిచికారీ చేయకపోతే రైతులు ఆర్థికంగా నష్టాలను చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వ్యవసాయ రంగంలో డ్రోన్లు ఉపయోగించుకునేలా తయారు చేయడానికి అవకాశం కల్పించింది. జిల్లాకు పది కేటాయింపు.. పంటలకు పురుగు మందుల పిచికారీలో నూతన విధానానికి అనుగుణంగా డ్రోన్లు వినియోగించేలా అవసరమైన శిక్షణతో పాటు పరికరాలను రాయితీపై రైతులకు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా మొదటి విడతలో జిల్లాకు పది డ్రోన్లు కేటాయించింది. తర్వాత డిమాండ్‌కు అనుగుణంగా వాటి సంఖ్య పెంచే అవకాశం ఉంది. ఒక్కో డ్రోన్ యూనిట్ వ్యయం రూ. 9.50 లక్షల నుంచి రూ. 11.50 లక్షల వరకు ఉంటుంది. ప్రతి యూనిట్‌కు రూ.4 లక్ష లు రాయితీ ఇవ్వనున్నారు. రైతు ఉత్పత్తి దారు సంఘాలతో పాటు ప్రాథమిక వ్వవసాయ సహకార సంఘాలు, స్వయం సహాయక మహిళా సంఘాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. కొనుగోలులో 40 శాతం రాయితీతో గరిష్టంగా రూ. 4లక్షల వరకు సబ్సిడీ అందజేయనున్నారు. కొనుగోలు చేసిన సంఘాల నుంచి రైతులు అద్దెకు తీసుకొని తమ అవసరాలకు వినియోగించుకోవచ్చు. -
హైరానా..!
జూరాల వద్ద హైలెవల్ బ్రిడ్జి నిర్మాణంపై గందరగోళం స్థల మార్పిడి కారణంగా.. వాస్తవానికి చాలాకాలంగా జూరాల డ్యాం భద్రతను దృష్టిలో ఉంచుకుని డ్యాంకు సమీపంలో అదనంగా బ్రిడ్జి నిర్మించాలని అధికారులు రూ.వంద కోట్లతో అంచనాలతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అయితే గతేడాది వానాకాలంలో జూరాల గేట్ల రోపులు తెగిపోయి ప్రాజెక్టుకు ముప్పు పొంచి ఉందని మీడియాలో కథనాలు వచ్చిన నేపథ్యంలో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి జూరాలను సందర్శించారు. ప్రాజెక్టును పరిశీలించిన అనంతరం రూ.వంద కోట్లతో నూతనంగా మరో బ్రిడ్జి నిర్మిస్తామని ప్రకటించారు. ఇందుకు గతంలో ఇరిగేషన్‌శాఖ అధికారులు నివేదించిన స్థలంలో కాకుండా గద్వాల మండలం కొత్తపల్లి– ఆత్మకూరు మండలం జూ రాల మధ్యలో హై లెవెల్ బ్రిడ్జి నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు పనులు సైతం మొదలు కాగా.. తాజాగా వివాదం చెలరేగింది. గద్వాల: కృష్ణానదిపై నిర్మించిన ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు సేఫ్టీని కాపాడాలి.. ఈ మేరకు డ్యాంకు సమీపంలో మరో బ్రిడ్జి నిర్మించాలన్న వాదన బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో జూరాల వద్ద హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణంపై గందరగోళం నెలకొంది. ఇదే అంశంపై ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నిర్వహించిన సమీక్షలో సైతం చర్చ జరగడం.. దీనిపై సమగ్ర వివరాలను ఆ శాఖ అధికారులు మంత్రికి నేరుగా వివరించడం.. ఎంపీ డీకే అరుణ డ్యాం సేఫ్టీని కాపాడాలని సమీక్షలో గట్టిగా కోరడం వంటి పరిణామాలతో సమగ్ర పరిశీలనకు ఆ శాఖ కార్యదర్శి త్వరలోనే జూరాలకు రానున్నారు. దీంతో ప్రస్తుతం గద్వాల మండలం కొత్తపల్లి– ఆత్మకూరు మధ్యలో నిర్మించనున్న హై లెవెల్ బ్రిడ్జి భవితవ్యం గందరగోళంగా మారింది. ఇదే క్రమంలో ఈ బ్రిడ్జి నిర్మాణంపై ఇరిగేషన్ అధికారులు నిరభ్యంతర ధ్రువపత్రం ఇవ్వడానికి మల్లగుల్లాలు పడుతుండటం పెద్దఎత్తున చర్చకు దారితీసింది. భద్రతే.. ప్రధానం 2021–డ్యాం సేఫ్టీ చట్టం ప్రకారం ఎక్కడైనా పాజెక్టుకు సంబంధించి డ్యాం భద్రతే ప్రధానం. అయితే జూరాల డ్యాం సేఫ్టీకి సంబంధించిన బ్రిడ్జి సమీపంలో కాకుండా డ్యాంకు దూరంగా నిర్మిస్తున్నారు. ఇందుకు సంబంధించి సర్వే, టెండర్లు పూర్తయ్యి సివిల్ పనులు సైతం మొదలయ్యాయి. అయితే ఈ బ్రిడ్జి నిర్మాణం డ్యాం సేఫ్టీ చట్టానికి విరుద్ధంగా ఉంది. ఈ చట్టం ప్రకారం డ్యాం సేఫ్టీ పర్యవేక్షణ బాధ్యత ఇరిగేషన్ శాఖదే. వరద వచ్చే ముందు, వరద వచ్చిన తర్వాత డ్యాం భద్రతపై సమగ్ర నివేదిక ఇరిగేషన్ అధికారులు ఇవ్వాల్సి ఉంటుంది. దీని కారణంగానే హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణంపై ఇరిగేషన్ శాఖ అధికారులు ఎన్ఓసీ (నిరభ్యంతర ధ్రువపత్రం) ఇవ్వడానికి తర్జనభర్జన పడుతున్నారు. అదనంగా మరొకటి.. ‘ఆర్అండ్బీ ఆధ్వర్యంలో గద్వాల మండలం కొత్తపల్లి– ఆత్మకూరు మండలం జూరాల మధ్య హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి తాము అభ్యంతరం చెప్పడం లేదు. కానీ, జూరాల డ్యాం సేఫ్టీకి అవసరమైన అదనంగా బ్రిడ్జి నిర్మాణాన్ని చేపడితే భవిష్యత్‌లో డ్యాంకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు. అదేవిధంగా ప్రస్తుతం గత 40 ఏళ్లుగా డ్యాంపై అన్ని రకాల వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. దీంతో డ్యాం భద్రతకు ముప్పు ఏర్పడే అవకాశాలున్నాయి. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని జూరాల డ్యాంకు సమీపంలో అదనంగా మరో బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని కోరుతున్నాం అంటూ ఇరిగేషన్ శాఖ అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.’ డ్యాం స్టేఫీ ప్రధానమంటున్న ఇరిగేషన్ అధికారులు ఎన్ఓసీ ఇచ్చేందుకు మల్లగుల్లాలు మూడు, నాలుగు రోజుల్లో రానున్న ఆ శాఖ కార్యదర్శి పైపెచ్చు ఆర్అండ్బీ నిర్మించే బ్రిడ్జిపై అభ్యంతరం లేదని స్పష్టీకరణ ప్రభుత్వ నిర్ణయమే.. జూరాల వద్ద హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణంపై ప్రభుత్వానిదే తుది నిర్ణయం. అయితే జూరాల డ్యాం సేఫ్టీకి సంబంధించి బ్రిడ్జి నిర్మాణం ఇతర అంశాలపై రాష్ట్ర ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. మా పరిధిలో ఉన్న మేరకు డ్యాం సేఫ్టీకి సంబంధించి పూర్తి వివరాలతో ఇది వరకే ప్రభుత్వానికి నివేదిక సమర్పించాం. – రహీముద్దీన్, ఎస్ఈ, జూరాల మంత్రి సమీక్షలో చర్చ.. ఇటీవల ఉమ్మడి పాలమూరులోని ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి జిల్లా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇరిగేషన్ శాఖ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా గుడ్డెందొడ్డి రిజర్వాయర్ సామర్థ్యం పెంపుపై ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడంతో.. ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకునే వరకు వెళ్లింది. అయితే ఎంపీ డీకే అరుణ జూరాల ప్రాజెక్టు సేఫ్టీకి చర్యలు తీసుకోవాలని సమీక్షలో గట్టిగా కోరారు. ఇదే క్రమంలో ఇరిగేషన్ అధికారులు డ్యాం సేఫ్టీని మంత్రికి వివరించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణంపై తీవ్రస్థాయిలో చర్చ జరిగినట్లు తెలిసింది. దీంతో సమగ్ర వివరాలతో కూడిన నివేదిక ఇవ్వాలని ఇరిగేషన్ శాఖ కార్యదర్శిని ఆదేశించగా.. ఆయన మూడు, నాలుగు రోజుల్లో జూరాలను సందర్శించనున్నట్లు తెలిసింది. -
విద్యాభివృద్ధికి అధిక ప్రాధాన్యం
అచ్చంపేట రూరల్/లింగాల: రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తోందని అచ్చంపేట ఎమ్మెల్యే డా.వంశీకృష్ణ అన్నారు. ఆదివారం లింగాల మండలం మాడాపూర్‌లో పాఠశాల నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. శిథిలావస్థకు చేరిన పాఠశాలల స్థానాల్లో కొత్త భవనాలు నిర్మిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టిసారించినట్లు చెప్పారు. మాడాపూర్‌లో రూ. 30లక్షలతో పాఠశాల భవనాన్ని అన్ని హంగులతో నిర్మిస్తామన్నారు. మండలంలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్, గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల భవన నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. వేసవిలో తాగునీటి ఇబ్బందులు ఏర్పడకుండా ప్రజాప్రతినిధులు, అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. సర్పంచ్ శేఖర్, ఉపసర్పంచ్ సాబేరాబేగం, పంచాయతీ కార్యదర్శి లలిత, ఐకేపీ సీసీ రూప్సింగ్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు వెంకటయ్య పాల్గొన్నారు. ● అచ్చంపేట పట్టణంలోని ఓ ఫంక్షన్ హాలులో ఆదివారం రాష్ట్ర మైనార్టీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ముస్లింలకు ఇఫ్తార్ ఏర్పాటుచేశారు. ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ హాజరై ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. -
దరఖాస్తు చేసుకోండి
కందనూలు: ఎస్సీ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా ఎస్సీలకు బ్యాంకు లింకేజీ ద్వారా అందించే వివిధ ఉపకరణాల కోసం దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ బదావత్ సంతోష్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 2025–26 సంవత్సరానికి గాను ఎలక్ట్రిక్ ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు, సోలార్ యూనివర్సల్ పంప్ కంట్రోళ్లకు రాయితీలు అందించనున్నట్లు పేర్కొన్నారు. వ్యవసాయ రంగానికి సంబంధించి 21 నుంచి 50 ఏళ్ల వయసు, వ్యవసాయ ఆధారిత పథకాలకు 21 నుంచి 60 ఏళ్ల వయసు వారు అర్హులని తెలిపారు. అలాగే గ్రామీణ ప్రాంతాల వారికి రూ. 1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల వారికి రూ. 2 లక్షల వార్షిక ఆదాయం మినహాయింపు ఉంటుందని.. అర్హత కలిగిన వారు ఆధార్, రేషన్ కార్డు, కుల, ఆదాయ ధ్రువపత్రాలు, శాశ్వత డ్రైవింగ్ లైసెన్స్, పట్టాదారు పాస్‌బుక్‌లతో tgobmms.cgg.gov. in వెబ్సైట్లో ఈ నెల 17 నుంచి 24వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నేటి నుంచి ఒంటిపూట బడులు కందనూలు: ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో సోమవారం నుంచి ఒంటిపూట బడు లు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. వచ్చే నెల 23వ తేదీ వరకు ఒంటిపూట బడులు నిర్వహించనున్నారు. ఉద యం 8 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు తరగతులు కొనసాగనున్నాయి. పదో తరగతి పరీక్ష కేంద్రాలు ఏర్పాటుచేసిన పాఠశాలలను మధ్యాహ్నం 1గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నారు. అయితే ఒంటిపూట బడులు నిర్వహిస్తున్నప్పటికీ మధ్యాహ్న భోజనం యథావిధిగా కొనసాగనుంది. తరగతులు పూర్తయిన తర్వాత మధ్యాహ్న భోజనం అందించి విద్యార్థులను ఇంటికి పంపాలని అధికారులు సూచించారు. పెట్రోల్ కొరత కొల్లాపూర్: పట్టణంలో పెట్రోల్ కొరత ఏర్పడింది. స్థానికంగా మూడు పెట్రోల్ బంకులు ఉండగా.. రెండు బంకుల్లో శనివారం రాత్రి నుంచే నో స్టాక్ బోర్డులు పెట్టారు. భార త్ పెట్రోల్ బంకులో మాత్రమే పెట్రోల్ పోస్తుండటంతో ఆ బంకు వద్ద వాహనాల రద్దీ ఏర్పడింది. రెండు, మూడు రోజులుగా పెట్రో ల్ ట్యాంకర్లు రావడం లేదని.. అందుకే నో స్టాక్ బోర్డు ఏర్పాటుచేసినట్లు బంకుల నిర్వాహకులు తెలిపారు. హామీలన్నీ నెరవేరుస్తాం వీపనగండ్ల: అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్ఛయంతో ఉందని జిల్లా పర్యాటకశాఖ అధికారి నర్సింహ అన్నారు. ఆదివారం మండలంలోని కల్వరాలలో సీసీ రహదారి నిర్మాణానికి భూమిపూజ చేసి పనులు ప్రారంభించి మాట్లాడారు. ఉపాధిహామీ నిధులు రూ.16.50 లక్షలతో గ్రామంలో సీసీ రహదారి పనులు చేపడుతున్నామని.. మండలంలోని వివిధ గ్రామాల్లో కూడా మంత్రి జూపల్లి కృష్ణారావు సహకారంతో సీసీ రోడ్ల నిర్మాణాలకు ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులు మంజూరయ్యాయని చెప్పారు. కార్య క్రమంలో సర్పంచ్ బండారి రాములు, ఉపసర్పంచ్ తడకల రంగమ్మ పాల్గొన్నారు. మొబైల్ వాహనాలతో న్యాయ సేవలు పాలమూరు: తెలంగాణ రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ (టీఎస్ఎల్ఎస్ఏ) రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలో న్యాయ సేవలను మరింత విస్తరించడానికి రెండు మొబైల్ లోక్ అదాలత్ వ్యాన్లు అందుబాటులోకి తీసుకువచ్చి ప్రారంభించినట్లు జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్.ప్రేమలత ఒక ప్రటకనలో తెలిపారు. ఈ మొబైల్ వాహనాలు రొటేషన్ పద్ధతిలో జిల్లావ్యాప్తంగా పర్యటిస్తూ లీగల్ క్యాంపులు, లీగల్ సర్వీసెస్ ప్రచార కార్యక్రమాలు, జైలు సందర్శన చేస్తారన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తిరుగుతూ ప్రజలకు చట్టాలపై అవగహన కల్పించడం, బాధితులకు న్యాయ సలహాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రజలకు పూర్తిస్థాయిలో న్యాయ సేవలను దగ్గర చేయాలనే లక్ష్యంతో ఈ మొబైల్ వాహనాలు ఏర్పాటు చేయడం ప్రధాన ఉద్దేశమన్నారు. టోల్‌ఫ్రీ నం.15100 ద్వారా న్యాయ సలహాలు పొందవచ్చన్నారు. ఈ మొబైల్ వాహనాల్లో మొదటి క్యాబిన్లో కంప్యూటర్లు, ఎల్ఈడీ టీవీ, వెబ్ కెమెరాలు, హైస్పీడ్ ఇంటర్నెట్, సీసీటీవీ, యూపీఎస్, రెండో క్యాబిన్లో జ్యుడీషియల్ అధికారులు, ప్యానెల్ న్యాయవాదులు, పీఎల్ఓలు, ఇతర సిబ్బంది ఉంటారని తెలిపారు. -
పకడ్బందీగా జనగణన : కలెక్టర్
కందనూలు: జిల్లాలో జనగణన పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. జనగణన–2027 ప్రక్రియలో భాగస్వాములయ్యే అధికారులకు ఆదివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా ప్రణాళికశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మొదటి విడత జిల్లాస్థాయి శిక్షణ తరగతులను కలెక్టర్ ప్రారంభించి మాట్లాడారు. రెండు దశల్లో చేపట్టే జనగణన నమోదుకు తొలిసారిగా సాంకేతికత వినియోగిస్తున్నట్లు తెలిపారు. తొలి దశలో నివాసగృహాలతో పాటు అన్ని రకాల కట్టడాలు, కుటుంబ వివరాలను సేకరించడం జరుగుతుందని.. రెండో విడతలో వ్యక్తిగత వివరాలు సేకరించాల్సి ఉంటుందన్నారు. దేశంలోనే తొలిసారి పూర్తిగా డిజిటల్ విధానం ద్వారా జనగణన జరపాల్సి ఉంటుందన్నారు. జనగణనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై వాస్తవ వివరాలు వెల్లడించాలని కలెక్టర్ సూచించారు. ఏ ఒక్కరి వివరాలు ఎక్కడ కూడా బయటికి వెల్లడి కావన్నారు. ఈసారి సెల్ఫ్ డిక్లరేషన్ ఎంతో ముఖ్యమని.. అధికారులు, ఎన్యుమరేటర్లు సమన్వయంతో పనిచేయాలన్నారు. చార్జ్ ఆఫీసర్లు రోజూ జనగణన ప్రక్రియపై సమీక్షించాలని.. తాము కూడా క్షేత్రస్థాయి రోజువారీగా పర్యవేక్షణ చేస్తామన్నారు. అందుబాటులో ఉన్న సిబ్బందితో నిర్దేశిత గడువులోగా జనాభా లెక్కల సేకరణ ప్రక్రియను పూర్తిచేసేలా సన్నద్ధం చేయాలన్నారు. మొదటి దశలో నిర్వహించే ఇళ్ల జాబితా గణనలో ఇంటి నిర్మాణం, ఇంటి పరిస్థితి, కుటుంబ యజమాని వివరాలు, తాగునీటి సౌకర్యం, మురుగునీటి పారుదల వ్యవస్థ, మరుగుదొడ్ల లభ్యత, వంటగది సౌకర్యం వంటి వివరాలతో పాటు రేడియో, టెలివిజన్, స్మార్ట్‌ఫోన్, కంప్యూటర్, సైకిల్, కారు వంటి సౌకర్యాలపై మొత్తం 33 ప్రశ్నలకు సంబంధించిన వివరాలను ఎన్యుమరేటర్లు ప్రతి ఇంటికీ వెళ్లి సేకరిస్తారని కలెక్టర్ తెలిపారు. కాగా, ఈ నెల 17వ తేదీ వరకు మూడు రోజులపాటు జరిగే శిక్షణ తరగతుల్లో జనగణనపై అధికారులకు మాస్టర్ ట్రైనర్లు బి.లాజర్, శివరామకృష్ణ, రాజేశ్వర్ పూర్తిస్థాయిలో అవగాహన కల్పించనున్నారు. మొదటి రోజు సాంకేతిక పరిజ్ఞానం వినియోగం తదితర అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వారు వివరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అమరేందర్, జెడ్పీ సీఈఓ దేవ సహాయం, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి సుజాత పాల్గొన్నారు. -
అల్లాహ్ ఆశీస్సులు అందరిపై ఉండాలి
కొల్లాపూర్: పవిత్ర రంజాన్ మాసం ఆత్మశుద్ధి, సహనం, దాతృత్వానికి ప్రతీకగా నిలుస్తుందని.. అల్లాహ్ ఆశీస్సులు అందరిపై ఉండాలని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం కొల్లాపూర్‌లోని ఖాదర్‌పాషా దర్గా వద్ద ముస్లింలకు ప్రభుత్వపరంగా ఏర్పాటుచేసిన ఇఫ్తార్‌కు మంత్రి జూపల్లి, కలెక్టర్ బదావత్ సంతోష్ హాజరయ్యారు. ముందుగా దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ముస్లింలను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ.. అన్ని మతాల ప్రజలు గంగా జమున తహజీబ్ స్ఫూర్తితో, పరస్పర గౌరవంతో కలిసిమెలిసి పండుగలను జరుపుకోవాలని పిలుపునిచ్చారు. రంజాన్ మాసంలో పాటించే ఉపవాస దీక్షలు శరీర నియంత్రణ, సేవాభావం, సహనం వంటి అంశాలను నేర్పుతాయని అన్నారు. అంతకుముందు ముస్లింలకు రంజాన్ కానుకలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆర్డీఓ భన్సీలాల్, తహసీల్దార్ భరత్‌కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ రెడ్డి జ్యోతి సత్యనారాయణ, వైస్‌చైర్మన్ షేక్ రహీంపాషా, జామె మసీదు కమిటీ అధ్యక్షుడు ఖాజా చావుష్తో పాటు మున్సిపల్ కౌన్సిలర్లు, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు. -
‘పది’ పరీక్షలు ప్రారంభం
కందనూలు: జిల్లావ్యాప్తంగా పదో తరగతి వార్షిక పరీక్షలు శనివారం ప్రారంభమయ్యాయి. జిల్లావ్యాప్తంగా 10,651 మంది విద్యార్థులు పరీక్ష రాయనుండగా వారికోసం 60 కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొదటిరోజు తెలుగు పరీక్ష జరగగా 10,651 మంది విద్యార్థులకు గాను 10,630 మంది (98.80 శాతం) హాజరవగా 21 మంది గైర్హాజరయ్యారని డీఈఓ రమేష్‌కుమార్ తెలిపారు. అలాగే ఇది వరకు పరీక్షల్లో తప్పిన ప్రైవేట్ విద్యార్థులు 5 మందికి గాను నలుగురు హాజరు కాగా ఒకరు గైర్హాజరైనట్లు చెప్పారు. అంతకు ముందు జిల్లాకేంద్రంలోని సీఎన్ఆర్ ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రం వద్ద డీఈఓ రమేష్‌కుమార్ విద్యార్థులను తనిఖీ చేసి పరీక్ష హాల్లోకి పంపించారు. జిల్లావ్యాప్తంగా తొలిరోజు 34 పరీక్ష కేంద్రాలను అధికారులు తనిఖీలు చేశారు. డీఈఓ పాలెం, నాగర్‌కర్నూల్‌లో రెండు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసి.. తాగునీరు, ఓఆర్ఎస్ పాకెట్లు, ఇతర సదుపాయాలు, పరీక్ష ప్రక్రియను పరిశీలించారు. ప్రశాంతమైన వాతావరణంలో పరీక్ష జరిగేలా చర్యలు తీసుకున్నామని, ఎలాంటి మాల్ ప్రాక్టిస్ కేసులు నమోదు కాలేదని డీఈఓ పేర్కొన్నారు. మొదటిరోజు 98.80 శాతం హాజరు -
కమర్షియల్‌గా వినియోగిస్తే చర్యలు
సాక్షి, నాగర్‌కర్నూల్: జిల్లాలో ఎల్పీజీ డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను కమర్షియల్ కోసం వినియోగిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని జిల్లా పౌరసరఫరా శాఖాధికారి నర్సింహారావు అన్నారు. శనివారం జిల్లాలోని వంగూరు మండలం తుమ్మలపల్లి శివారు యోగి రెస్టారెంట్లో ఎన్ఫోర్స్మెంట్ డీటీ హేమ్లానాయక్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా 2 డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్లను హోటల్ నిర్వహణ కోసం వినియోగిస్తున్నట్లు గుర్తించారు. రెండు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకొని అత్యవసర వస్తువుల చట్టం–1955 ప్రకారం హోటల్ నిర్వాహకులపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్టు నర్సింహారావు తెలిపారు. జిల్లాలో ఎక్కడా ఎల్పీజీ డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల కొరత లేదని, ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. జిల్లాలో అవసరమైన డొమెస్టిక్ గ్యాస్ స్టాక్ అందుబాటులో ఉందని, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. -
తరచుగా తనిఖీలు చేపట్టాలి..
వ్యవసాయ మార్కెట్లతోపాటు ప్రైవేటు వ్యాపారుల వద్ద నిర్వహిస్తున్న కాంటాల్లో తేడాలు ఉంటున్నాయి. ప్రామాణికమైన తూకం రాళ్లకు బదులుగా సాధారణ బండరాళ్లను వినియోగిస్తున్నారు. తూకంలో తేడాలు వస్తున్నాయని ఫిర్యాదు చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. లీగల్ మెట్రాలజీ అధికారులు తరచుగా తనిఖీలు చేపట్టాలి. – వర్దం సైదులు, అచ్చంపేట రైతుల నుంచి ప్రైవేటుగా పత్తి కొనుగోలు చేసే వ్యాపారులు కాంటాలను సక్రమంగా నిర్వహించడం లేదు. ఎలక్ట్రానిక్ కాంటాలను సైతం ట్యాంపర్ చేసి తూకాల్లో తేడాతో రైతులను మోసగిస్తున్నారు. మార్కెట్ ధర కన్నా తక్కువగా కొనుగోలు చేయడంతోపాటు పంట బరువు తూకంలో మోసాలతో ఎక్కువగా నష్టపోతున్నాం. సంబంధిత అధికారులు స్పందించి కాంటాల నిర్వహణ సక్రమంగా ఉండేలా చూడాలి. – అబ్దుల్ కలీం, కోమటికుంట, లింగాల మండలం తూనికల శాఖ అధికారులు తనిఖీలు చేపట్టకపోవడంతో వ్యాపారస్తులు తూకాల్లో తేడా చేస్తూ పేదలను మోసం చేస్తున్నారు. మరోపక్క వారాంతపు సంస్థలో బాట్లకు బదులు మోటు రాళ్లు పెట్టి తూకం చేసి వ్యాపారులు సామాన్యులతో భారీగా డబ్బులు గుంజుతున్నారు. అలాగే రైతులు పండించిన పంటలను దలారి వ్యాపారులు ఎలక్ట్రిక్ కాంటాల్లో మోసాలకు పాల్పడుతూన్నారు. తూనికల శాఖ అధికారులు మాత్రం కన్నెత్తి చూడడం లేదు. – మోహన్ రెడ్డి, రైతు, మరికల్, నారాయణపేట జిల్లా ● -
తూకం తప్పుతోంది!
నేడు ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం వినియోగదారులు ఎవరైనా వస్తువులు కొనుగోలు చేసిన ప్రతి సందర్భంలో కూడా తప్పక బిల్లు తీసుకోవాలి. వస్తువు నాణ్యతలో లోపం ఉన్నా, ఇతర సమస్య ఏది ఉన్నా.. కోర్టుకు వెళ్లడానికి అవకాశం ఉంటుంది. కొనుగోలు చేసిన బిల్లు లేకపోతే చట్టపరంగా ఎదుర్కొవడానికి రాదు. ఉమ్మడి జిల్లా పరిధిలో ఒకే ఒక్క కోర్టు ఉండటం వల్ల ఫిర్యాదులు పెరుగుతున్నాయి. జిల్లాలో ప్రతి రోజు హక్కుల ఫోరంకు రెండు నుంచి మూడు వరకు కేసులు వస్తుంటాయి. ఎక్కువగా ఎలక్ట్రానిక్ వస్తువులు, జీవిత భీమా, చిట్‌ఫండ్, ఫైనాన్స్‌లలో నష్టపోయిన వాళ్లు అధికంగా వస్తుంటారు. ముఖ్యంగా గ్రామీణా ప్రాంతాల నుంచి ఎవరు రావడం లేదు.. పట్టణ ప్రాంతాల నుంచి అవగహన ఉన్న వ్యక్తులు మాత్రమే కేసులు వేయడానికి వస్తున్నారు. ఇంకా ప్రజల్లో దీనిపై చైతన్యం రావాల్సిన అవసరం ఉంది. వచ్చిన కేసులు పెండింగ్‌లో లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కారించడానికి కృషి చేస్తున్నాం. – అశోక్ వర్ధన్‌రాజు, వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ సూపరిటెండెంట్ ఉదయం లేచింది మొదలు.. రాత్రి పడుకునే వరకు వినియోగించే ప్రతి వస్తువులోనూ నాణ్యత ప్రశ్నార్థకంగా మారింది. తాగే పాల దగ్గరి నుంచి ఆరోగ్యానికి కాపాడుకునేందుకు వినియోగించే మందుల వరకు ప్రతీది కల్తీయే. ప్రతి వస్తువు సరైన తూకంలో లభిస్తున్నాయా అంటే అనుమానమే. కాసుల దాహంతో వ్యాపారులు చేస్తున్న మోసం.. కళ్లు మూసుకొని నిద్ర నటిస్తున్న అధికారుల నిర్లక్ష్యం.. వెరసి వినియోగదారుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. ప్రశ్నించేతత్వం లేనంత వరకు ఈ మోసాలు కొనసాగుతూనే ఉంటాయి. ఇప్పటికై నా వినియోగదారులు మేల్కొని తప్పును నిలదీయాలి. మోసాన్ని వేలెత్తిచూపి.. జరిగిన నష్టానికి న్యాయం పొందాలి. ఆదివారం ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం... – పాలమూరు వినియోగదారులు ఎలాంటి కేసులు వేయడానికి అవగాహన కోసం 08542- 245633 నంబర్‌కు ఫోన్ చేయాలి● వస్తువుల నాణ్యత, సేవల్లో లోపాలను తెలుసుకోవాలి ● కొనుగోలు చేసే ప్రతి వస్తువుకు బిల్లు తీసుకోవాలి ● వినియోగదారుడికి జరుగుతున్న అన్యాయంపై అవగాహన తప్పనిసరి 1967 : పౌర సరఫరాల శాఖ సురక్షిత ఆహారం లేక.. నాణ్యత వస్తువులు లభించక దాదాపు 200 రకాల వ్యాధులు వస్తున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు.ఒకవైపు ప్రజల ఆర్యోగంపై కల్తీ జరుగుతుంటే మరోవైపు నాణ్యత లేని వస్తువలను వినియోగదారులకు అంటగడుతున్న ఘటనలు అనేకం ఉన్నాయి. వినియోగదారులు మోసపోవడంతో పాటు కల్తీ బారిన పడుతున్నారు. ఒక్క ఆహార వస్తువుల్లో మాత్రమే కాదు... ఎలక్ట్రానిక్, జీవిత బీమా, ఆరోగ్య బీమా ఇలా ప్రతి దాంట్లో వినియోగదారుడిని మోసం చేయాలనే భావన స్పష్టంగా కన్పిస్తోంది. చాలా వరకు వస్తువులు కొనుగోలు చేసిన వినియోగదారులు మోసపోయిన కోర్టును ఎలా ఆశ్రయించి న్యాయం పొందాలనే విషయంపై అవగాహన లేక విరమించుకుంటారు. మరికొందరు సమయం వృథా అవుతుందనే భావనతో మోసపోయినా ఊరుకుంటారు. కానీ చిన్న వస్తువు అయినా పెద్ద వస్తువు కొనుగోలు చేసినా బిల్లు తీసుకుంటే నాణ్యత లోపం ఉంటే తప్పక కోర్టుకు వెళ్లవచ్చు. జిల్లా వినియోగదారుల హక్కుల ఫోరంలో వినియోగదారులు ఒక్క రూపాయి నుంచి రూ.50 లక్షల వరకు కేసులు వేయడానికి అవకాశం ఉంది. దీంట్లో రూపాయి నుంచి రూ.5 లక్షల వరకు ఉన్న కేసులు కోర్టులో ఉచితంగా వాదిస్తారు.రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు వరకు కోర్టు ఫీజు రూ.200, రూ.10 లక్షల నుంచి రూ.20లక్షల వరకు ఫీజు రూ.400 ఉంటుంది. రాష్ట్ర కమిషన్‌లో రూ.20 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ఉంటే కోర్టు ఫీజు రూ.వెయ్యి, రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు ఉంటే రూ.4వేలు ఉంటుంది. జాతీయ కమిషన్‌లో రూ.కోటికి పైగా ఉంటే ఫీజు రూ.5 వేలు ఉంటుంది. వినియోగదారుడు ఏదైనా ఒక వస్తువులు కొనుగోలు చేసిన తర్వాత సదరు వస్తువు నాసిరకంగా ఉండటం లేదా మరమ్మతుకు గురైతే అప్పుడు సెక్షన్ 35 ప్రకారం వినియోగదారుల ఫోరం కోర్టులో ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు చేసిన 30 రోజుల వ్యవధిలో సదరు వ్యక్తి లేదా సంస్థకు నోటీస్ ఇవ్వగా 45 రోజుల వ్యవధిలో దీనికి సమాధానం చెప్పాలి. లేకపోతే కోర్టు ఎక్స్‌పార్టీ చేసి ఆర్డర్ వన్‌సైడ్ చేసి కోర్టు తీర్పు ఇస్తుంది. ఇచ్చిన జడ్జిమెంట్‌పై ప్రతివాది 45 రోజుల్లో నష్టపరిహారం చెల్లించాలి.. లేకపోతే అప్పీల్ వేసుకోవాలి. నాణ్యతపై ప్రశ్నిద్దాం..!‘నగరానికి చెందిన చంద్రశేఖర్, సుమిత్ర దంపతులతో పాటు వారి పిల్లలు కలిసి 2008 నవంబర్ 26న రూ.21,250తో టీటీడీలో శ్రీవారి మేల్ చాట్ వస్త్ర సేవ టికెట్లు బుక్ చేసుకున్నారు. అప్పటి నుంచి సంవత్సరాల పాటు ఎదురుచూసినా స్వామి సేవలో పాల్గొనడానికి అవకాశం రాలేదు. చివరికు 2021 సెప్టెంబర్ 10న స్లాట్ బుకింగ్ అయిందని కరోనా కారణంగా ఆ సేవ రద్దు చేసినట్లు తెలిపారు. దాని స్థానంలో బ్రేక్ దర్శనం అవకాశం కల్పిస్తామని టీటీడీ అధికారులు తెలిపారు. ఆ తర్వాత అయిన కూడా వారికి టీటీడీ అవకాశం కల్పించలేదు. దీంతో చంద్రశేఖర్ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఆశ్రయించారు. దీంతో కోర్టు చంద్రశేఖర్‌కు శ్రీవారి సేవలో పాల్గొనే అవకాశం ఇవ్వాలని లేనిపక్షంలో రూ.20 లక్షలు డిపాజిట్ చేస్తారా లేక జైలుకు వెళ్తారా అంటూ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో టీటీడీ 2025 ఆగస్టు 14, 15తేదీలలో చంద్రశేఖర్ దంపతులకు శ్రీవారి సేవలో పాల్గొనే అవకాశం కల్పించారు.’ ‘నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం బొల్గట్పల్లిలో మూడు నెలల కింద రైతుల నుంచి పత్తి కొనుగోలు చేసేందుకు వచ్చిన వ్యాపారులు ఎలక్ట్రానిక్ కాంటా తూకాల్లో మోసాలు చేస్తున్నట్టు రైతులు గుర్తించారు. పత్తి సంచుల బరువు ఎలక్ట్రానిక్ కాంటాలో తక్కువగా చూపుతూ మోసాలకు పాల్పడుతున్నట్టు గుర్తించి అచ్చంపేట మార్కెట్ కమిటీ అధికారులకు ఫిర్యాదు చేశారు. సంబంధిత అధికారులతో తనిఖీలు నిర్వహిస్తామని చెప్పినా ఇప్పటివరకు తనిఖీలు చేపట్టలేదు.’ -
గ్యాస్ కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు
కందనూలు: జిల్లాలో గృహ అవసరాలకు వినియోగించే వంటగ్యాస్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వినియోగిస్తే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటారని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. శనివారం కలెక్టరేట్లో గ్యాస్ సరఫరాపై అదనపు కలెక్టర్ అమరేందర్‌తో కలిసి గ్యాస్ ఏజెన్సీల డీలర్లు, సేల్స్ ఆఫీసర్లు, పౌర సరఫరాల శాఖ అధికారులు, డీటీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనే సేవాభావంతో పనిచేయాలన్నారు. జిల్లాలోని 17 గ్యాస్ ఏజెన్సీల ద్వారా రోజువారి పంపిణీ ప్రక్రియ, నిల్వ తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో ఎల్పీజీ డీలర్ల దగ్గర బుకింగ్ స్టాక్, సరఫరాపై ప్రతిరోజు రిపోర్ట్ సమర్పించాలని ఆదేశించారు. జిల్లా ప్రజలు ఆందోళన చెందవద్దని, ఎల్పీజీ గ్యాస్‌కు ఎలాంటి కొరత లేదని చెప్పారు. ఆస్పత్రులు, వసతి గృహాలు, అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలు వంటి సంస్థలకు ప్రభుత్వ నిబంధనల మేరకు సరఫరా చేయాలని సూచించారు. ఎవరైనా కృత్రిమ కొరత సృష్టించి, బ్లాక్ మార్కెట్లో సిలిండర్లు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్న డొమెస్టిక్ సిలిండర్లను వ్యాపార, వాణిజ్య దుకాణాల నుంచి స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేయాలన్నారు. ఆస్పత్రుల్లో ఇన్ పేషెంట్ల సంఖ్యకు అనుగుణంగానే సిలిండర్లు ఇండెంట్ పెట్టేలా కట్టుదిట్టమైన పర్యవేక్షణ చేయాలన్నారు. సమావేశంలో డీఎస్డీఓ నర్సింహారావు, సివిల్ సప్లయ్ డీఎం రాజేందర్, పెట్రోలియం సంస్థల అధికారులు, గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో గృహ అవసరాలకు ఎలాంటి ఇబ్బంది లేదు విపత్కర పరిస్థితుల్లో సేవాభావంతో పనిచేయండి కలెక్టర్ బదావత్ సంతోష్ -
‘ఎక్స్‌లెన్స్’ కేజీబీవీలు
జిల్లాలో మూడు కస్తూర్బా విద్యాలయాల ఎంపిక ● వచ్చే విద్యా సంవత్సరం నుంచి తరగతులు షురూ ● ప్రవేశ పరీక్ష ద్వారా విద్యార్థుల చేరికకు అవకాశం ● ఐఐటీ, నీట్, క్యాట్ తదితర పరీక్షలకు ప్రత్యేక శిక్షణ ● రేపటి నుంచి దరఖాస్తుల స్వీకరణ ●అచ్చంపేట: కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో ఇక ఎక్స్‌లెన్స్ చదువు అందనుంది. కార్పొరేట్, ప్రైవేట్లకు ధీటుగా నాణ్యమైన బోధన అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు యంగ్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌కు సంబంధించి విద్యార్థులకు ఐఐటీ, క్యాట్, నీట్, లాసెట్ వంటి ప్రవేశ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. రాత పరీక్ష ద్వారా ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఎంపిక చేసి పోటీ పరీక్షలకు సంసిద్ధం చేయనున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ ప్రక్రియ అమలు కానుంది. చాలామంది విద్యార్థులు ఆర్థిక పరిస్థితుల కారణంగా దూర ప్రాంతాల్లో శిక్షణకు వెళ్లకుండా ఇంజినీరింగ్, మెడికల్, లా కోర్సుల్లో చేరలేకపోతున్నారు. ఇంటి వద్దనే సిద్ధమవుతూ అవగాహన లేక వాటిలో రాణించలేకపోతున్నారు. ఇలాంటి వారి కోసం ప్రభుత్వం జిల్లాలో మూడు కేజీబీవీలను ఎంపిక చేసింది. ఇందులో విద్యార్థులకు ఇంటర్‌తోపాటు ఆయా ప్రవేశ పరీక్షలకు నిపుణులతో శిక్షణ అందించనున్నారు. జిల్లావ్యాప్తంగా 20 కస్తూర్భా గాంధీ విద్యాలయాలు ఉండగా 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఇక్కడ విద్యా బోధన ఉంటుంది. ఇంటర్లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ విద్యాలయాల్లో మొత్తం 6,222 మంది విద్యార్థినులు విద్యను అభ్యసిస్తున్నారు. అయితే వీరంతా పేద విద్యార్థులే. ప్రభుత్వం ఈ ఏడాది యంగ్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ కింద నాగర్‌కర్నూల్, బిజినేపల్లి, వెల్దండ సీఓఈలను ఎంపిక చేశారు. కాగా.. నాగర్‌కర్నూల్ కేజీబీవీలో ఐఐటీ, జేఈఈకి సంబంధించి శిక్షణ కల్పించనున్నారు. బిజినేపల్లి కేజీబీవీలో క్యాట్‌కు సంబంధించి శిక్షణ ఇవ్వనున్నారు. వెల్దండ కేజీబీవీలో నీట్ కోర్సుకు సంబంధించి శిక్షణ ఉంటుంది. అయితే ఈ పాఠశాలల్లో గ్రంథాలయంతోపాటు ఎన్సీసీ, ఇతర మౌలిక వసతులు ఏర్పాటు చేయనున్నారు. వీటికి ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించింది. అవసరమైన విషయ పరిజ్ఞాన నిపుణులను సైతం నియమించింది. జూన్ నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. విద్యార్థులకు అవసరమైన స్టడీ మెటీరియల్ అందించనున్నారు. ఎక్స్‌లెన్స్‌కు ఎంపికై న వెల్దండ కస్తూర్బా విద్యాలయం జిల్లాలోని ఈ మూడు కేజీబీవీల్లో వచ్చే ఏడాది ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరానికి సంబంధించి ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది. ఆన్లైన్ ద్వారా సోమవారం నుంచి ఏప్రిల్ 15 వరకు దరఖాస్తు గడువు ఉంది. మే 5న పరీక్ష నిర్వహించనున్నారు. ఎస్సెస్సీ పూర్తిచేసిన వారు అర్హులు. అయితే ఎంపికై న విద్యార్థులకు జేఈఈ, నీట్, ఎఫ్ సెట్, లా సెట్ తదితర ఎంట్రైన్స్ కోచింగ్లతోపాటు సీఏకు సంబంధించి కూడా శిక్షణ కల్పించనున్నారు. -
జిల్లాలో వంటగ్యాస్ సిలిండర్ల కొరత లేదు
● కమర్షియల్‌కు డొమెస్టిక్ సిలిండర్లు వినియోగించకుండా చర్యలు ● కలెక్టర్ బదావత్ సంతోష్ కందనూలు: జిల్లాలో గృహ అవసరాలకు వంటగ్యాస్ సిలిండర్ల కొరత లేదని.. గృహ వినియోగదారులకు అవసరమైన మేరకు సరఫరా చేసేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ బదావత్ సంతోష్ తెలిపారు. శుక్రవారం ఎల్పీజీ సిలిండర్ల పంపిణీ, సాగు, తాగునీటి సరఫరా, విద్యుత్ తదితర అంశాలపై హైదరాబాద్ నుంచి రాష్ట్ర మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, సీఎస్ రామకృష్ణారావు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ప్రస్తుతం జిల్లాలో 2,50,277 ఎల్పీజీ కనెక్షన్లు ఉండగా.. గృహ అవసరాలకు వినియోగించే సిలిండర్ల సమస్య లేదన్నారు. రానున్న రోజుల్లోనూ ఎలాంటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటామన్నారు. కమర్షియల్ వినియోగానికి డొమెస్టిక్ సిలిండర్లు వినియోగించకుండా పటిష్ట నిఘా ఏర్పాటు చేస్తామని తెలిపారు. అదే విధంగా జిల్లావ్యాప్తంగా 4,11,002 ఎకరాల్లో వరి, మొక్కజొన్న, వేరుశనగ తదితర పంటలు సాగుచేశారని.. పంటలకు అవసరమైన సాగునీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు. ప్రస్తుతం శ్రీశైలం డ్యామ్‌లో 72.4928 టీఎంసీల నీటినిల్వ ఉందన్నారు. రానున్న వేసవిలో తాగు, సాగునీటికి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. యాసంగి సీజన్‌కు సంబంధించి త్వరలో కోతలు ప్రారంభమవుతాయని.. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ వెల్లడించారు. -
ఆహార పంపిణీలో ప్రమాణాలు పాటించాలి
కందనూలు/అచ్చంపేట రూరల్/కల్వకుర్తి టౌన్/ఉప్పునుంతల: జిల్లాలోని పేదలు, విద్యార్థులు, గర్భిణులకు ఆహార భద్రత కింద అందించే ఆహారంలో లోపాలను సరిచేసి.. నిర్దేశిత ప్రమాణాలు పాటించాలని రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్‌రెడ్డి ఆదేశించారు. జాతీయ ఆహార భద్రత చట్టం 2013 అమలుపై శుక్రవారం కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని కల్వకుర్తి, అచ్చంపేట ప్రాంతాల్లో విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజన అందడం లేదని గుర్తించడం జరిగిందన్నారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ప్రతి హాస్టల్, పాఠశాలల్లో తప్పనిసరిగా సంబంధిత అధికారుల ఫోన్ నంబర్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. సమావేశంలో రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యులు ఓరుగంటి ఆనంద్, రంగినేని శారద, అదనపు కలెక్టర్ అమరేందర్, జెడ్పీ సీఈఓ దేవసహాయం, డీఆర్డీఓ చిన్నఓబులేషు ఉన్నారు. ● అంతకు ముందు అచ్చంపేట పట్టణంలోని రేషన్ దుకాణం, అంగన్వాడీ కేంద్రం, సివిల్‌సప్లయ్ గోదాంలను ఫుడ్ కమిషన్ చైర్మన్ పరిశీలించారు. నిబంధనలు పాటించని రేషన్ డీలర్లపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను సందర్శించి.. మధ్యాహ్న భోజనం నాణ్యతపై ఆరా తీశారు. కొందరు విద్యార్థినులు ఇంటి నుంచి ఆహారం తెచ్చుకోవడానికి గల కారణాలను తెలుసుకున్నారు. ● కల్వకుర్తి పట్టణంలోని జేపీ నగర్ గురుకుల పాఠశాలలో చైర్మన్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. విద్యార్థులకు మెనూ ప్రకారం గుడ్డు అందించకపోవడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. అనంతరం మరుగుదొడ్లను పరిశీలించగా.. శుభ్రంగా లేకపోవడంతో అసహనం వ్యక్తంచేశారు. ఆహార సరుకులు, తదితర వస్తువులు ఉన్న గదులతో పాటు విద్యార్థులు ఉండే వసతి గృహాలను శుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. ఉప్పునుంతల కేజీబీవీలో విద్యార్థినులకు అందిస్తున్న భోజనంతో పాటు బియ్యం, ఇతర సరకులు, కూరగాయల నాణ్యతను పరిశీలించా రు. నిల్వ ఉన్న పప్పులు, అల్లం వెల్లుల్లి పేస్టులో పురుగులు ఉండటాన్ని గుర్తించిన వారు.. కేజీబీవీ ఎస్ఓపై ఆగ్రహం వ్యక్తంచేశారు. విద్యార్థినులు భోజనం చేసే హాలులో ఇతర వస్తువులు ఉండటం.. మెనూ ప్రకారం భోజనం అందించకపోవడంపై అసంతృప్తి వ్యక్తంచేశారు. విద్యార్థులతో మాట్లాడి సమస్య లు తెలుసుకున్నారు. అ నంతరం స్థానిక సీహెచ్‌సీని తనిఖీ చేశారు. కా ర్యక్రమాల్లో జిల్లా సివిల్ సప్లయ్ అధికారి రాజశేఖర్, ఆర్డీఓ యాదగిరి, డీఈఓ రమేశ్‌కుమార్, తహసీల్దార్లు సునీత, సైదులు, ఏటీడీఓ ఫిరంగి, ఆర్ఐలు శివకుమా ర్, బాల్‌రాం, డిప్యూటీ డీఎంహెచ్ఓ తారాసింగ్, ఎంపీడీఓ రేవతిరెడ్డి, సర్పంచ్ శ్రీనివాసులు పాల్గొన్నారు. రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్‌రెడ్డి -
పారదర్శకంగా భూముల రీసర్వే
● అతి పురాతనమైన జటప్రోల్ మదనగోపాలస్వామి ఆలయాన్ని అన్నివిధాలా తీర్చిదిద్దుతామని మంత్రి జూపల్లి అన్నారు. మదనగోపాలస్వామి ఆలయంలో రూ. 2కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను దేవాదాయశాఖ అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆలయంలో చేపట్టిన పనులు దాదాపు 80శాతం పూర్తయ్యాయని తెలిపారు. మిగతా పనులను త్వరగా పూర్తిచేసి.. భక్తులు, పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. మంత్రి వెంట ఈఓ జైపాల్, ఆర్డీఓ భన్సీలాల్, తహసీల్దార్ రాజుకుమార్, గోవింద్‌గౌడ్, సర్పంచ్ చంద్రకళ, రామన్‌గౌడ్, భీంరెడ్డి, గోపినాయక్, గోపాల్, నాగిరెడ్డి ఉన్నారు. కొల్లాపూర్/కొల్లాపూర్ రూరల్/పెంట్లవెల్లి: భూము ల రీసర్వే పారదర్శంగా నిర్వహించాలని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులకు సూచించారు. శుక్రవారం కొల్లాపూర్ మండలం మొలచింతపల్లిలో భూముల రీసర్వేపై పట్టాదారులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు గాను ప్రభుత్వం అధునాతన సాంకేతికతతో భూముల రీసర్వేకు శ్రీకారం చుట్టిందన్నారు. సర్వేలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా భూముల వివరాలు పక్కాగా నమోదు చేయాలని అధికారులకు సూచించారు. ఇదిలా ఉంటే, గత పాలకులు గ్రామంలో అశాంతి నెలకొల్పి.. దాడులను ప్రోత్సహించారని మంత్రి వ్యాఖ్యానించడంతో బీఆర్ఎస్ నాయకులు అభ్యంతరం వ్యక్తంచేశారు. కొంతసేపు మంత్రి, బీఆర్ఎస్ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు కల్పించుకోవడంతో వివాదం సద్దుమణిగింది. అంతకు ముందు మంత్రి జూపల్లి ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించారు. నూతన నిర్మాణాలకు భూమిపూజ చేశారు. మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు. కాగా, మొలచింతపల్లి, ముక్కిడిగుండం గ్రామాలకు జీవనాధారంగా ఉన్న జీల్దార్ తిప్ప చెరువుకు కేఎల్ఐ ద్వారా సాగునీరు అందించాలని గ్రామ సర్పంచ్ వరలక్ష్మి మంత్రిని కోరగా.. సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అమరేందర్, ఆర్డీఓ భన్సీలాల్ పాల్గొన్నారు. శుద్ధమైన తాగునీటి సరఫరా కొల్లాపూర్ నియోజకవర్గ ప్రజలకు శుద్ధమైన తాగునీరు అందిస్తున్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శుక్రవారం పట్టణంలోని 9, 10 వార్డుల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా వాటర్ ట్యాంకులను పరిశీలించి, శుభ్రం చేయించారు. అనంతరం నల్లాలకు నీటిని వదిలారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా తాగునీరు సరఫరా చేయాలని.. పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టిసారించాలని మున్సిపల్ పాలకవర్గానికి సూచించారు. మంత్రి వెంట మున్సిపల్ చైర్పర్సన్ రెడ్డి జ్యోతి సత్యనారాయణ, వైస్‌చైర్మన్ షేక్ రహీంపాషా, కమిషనర్ యాదగిరి, కౌన్సిలర్ లహరి వేణుగోపాల్‌గౌడ్ ఉన్నారు. రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు -
తొలిసారి ‘నల్లమలశ్రీకు గవర్నర్
మన్ననూర్: శ్రీశైలం క్షేత్రానికి రోడ్డు మార్గాన వెళ్తున్న రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లాకు శుక్రవారం మన్ననూర్ మృగవాణి అతిథిగృహం వద్ద కలెక్టర్ బదావత్ సంతోష్, ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్ ఘనస్వాగతం పలికారు. అనంతరం పోలీస్ గౌరవ వందనం సమర్పించారు. రాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా ఈ ప్రాంతానికి వచ్చిన ఆయన.. కలెక్టర్, ఇతర అధికారులతో ఈ ప్రాంతం విశేషాలు, ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. అతిథిగృహంలో ఆయన కాసేపు విశ్రాంతి తీసుకుని శ్రీశైలం క్షేత్రానికి బయలుదేరి వెళ్లారు. స్వాగతం పలికిన నాగర్‌కర్నూల్ కలెక్టర్, ఎస్పీ -
నేడు జిల్లాకు సీఎం రేవంత్‌రెడ్డి
గద్వాల: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శనివారం జిల్లాలో పర్యటించనున్నారు. స్థానిక ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి కుమారుడి వివాహానికి సీఎం హాజరు కానున్నారు. ఈ సందర్భంగా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటుచేశారు. సీఎం పర్యటన ఏర్పాట్లను శుక్రవారం రాత్రి ఎమ్మెల్యే బండ్లతో కలిసి కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, ఎస్పీ శ్రీనివాసరావు పర్యవేక్షించారు. ముఖ్యమంత్రి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. సమాజంలో మహిళల పాత్ర కీలకం నాగర్‌కర్నూల్ క్రైం: మహిళలు సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారని అదనపు ఎస్పీ నోముల వెంకటేశ్వర్లు అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో మహిళా పోలీసు సిబ్బందికి వైద్య పరీక్షలతో పాటు క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ.. మహిళలు కుటుంబ వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తూ, అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. పోలీసుశాఖలో మహిళా సిబ్బంది ధైర్యం, నిబద్ధతతో విధులు నిర్వర్తిస్తూ.. ప్రజల భద్రతకు విశేషంగా సేవలు అందిస్తున్నారని కొనియాడారు. మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకుసాగితే ఏ రంగంలోనైనా విజయం సాధించగలరని అన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డా.రవికుమార్, ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డా.రమాదేవి, డీఎస్పీ శ్రీనివాసులు పాల్గొన్నారు. మంత్రి క్యాంపు కార్యాలయం ముట్టడి కొల్లాపూర్: పట్టణంలోని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు క్యాంపు కార్యాలయాన్ని శుక్రవారం ఆశావర్కర్లు ముట్టడించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు శివవర్మ, ఆశావర్కర్ల సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలు శ్రీదేవి మాట్లాడుతూ.. ఆశావర్కర్లకు పెండింగ్ వేతనాలు చెల్లించడంతో పాటు ఉద్యోగ భద్రత, ప్రమాద బీమా, రిటరైమెంట్ బెనిఫిట్స్ కల్పించాలని డిమాండ్ చేశారు. అదే విధంగా ఎన్హెచ్ఎంకు సరిపడా నిధులు కేటాయించాలని, పీఆర్సీ, ఎన్నికల డ్యూటీ డబ్బులు చెల్లించాలని, మెడికల్, క్యాజువల్ సెలవులు ఇవ్వాలన్నారు. లేనిపక్షంలో ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామన్నారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని మంత్రి క్యాంపు కార్యాలయ అధికారి నాగరాజుకు అందజేశారు. కార్యక్రమంలో శివలీల, చెన్నమ్మ, గౌరమ్మ, నిర్మల, మమత, మంజులత, వకులాదేవి, సుజాత, ఉమాలక్ష్మి, వరలక్ష్మి పాల్గొన్నారు. కుమ్మెర బాధితులకు రక్షణ కల్పించాలి నాగర్‌కర్నూల్ క్రైం: కుమ్మెర మల్లన్న జాతరలో దాడికి గురైన బాధిత కుటుంబానికి పోలీసులు రక్షణ కల్పించడంతో పాటు స్వగ్రామంలో స్వేచ్ఛగా పనిచేసుకునేందుకు అవకాశం కల్పించాలని ధర్మసమాజ్ పార్టీ అధ్యక్షుడు విశారదన్ మహారాజ్ అన్నారు. శుక్రవారం బాధితులతో కలిసి స్థానిక డీఎస్పీని కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుమ్మెర మల్లన్న జా తరలో జరిగిన దాడిలో 8 మంది ఉండగా, ఇప్పటివరకు ఐదుగురిని మాత్రమే రిమాండ్ చేశారన్నారు. మిగతా వారిని పట్టుకోవడంలో పోలీసు ల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందని ఆరోపించా రు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులపై ఎస్సీ, ఎస్టీ కేసుతో పాటు హత్య కేసు నమోదు చేయాలన్నారు. నిందితులను అరెస్టు చేసి జైలుకు పంపే వరకు, బాధితులకు న్యా యం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామన్నా రు. వారి వెంట సోషల్ జస్టిస్ ఫర్ హ్యూమన్ రైట్ కమిటీ అధ్యక్షురాలు లక్ష్మీశ్రావణి ఉన్నారు. -
సీపీఎస్ ఉద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యం
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): సీపీఎస్ ఉద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తమ యూనియన్ పని చేస్తోందని తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ అన్నారు. శుక్రవారం స్థానిక కార్యాలయంలో జరిగిన సంఘం జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. సంఘాన్ని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా నూతన సభ్యత్వ నమోదు ప్రక్రియ జరుగుతుందని, పాలమూరు జిల్లాలో యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. ప్రతి ఉద్యోగిని సంఘంలో భాగస్వామిని చేస్తూ హక్కుల పోరాటంలో ఏకం చేయాలని పిలుపునిచ్చారు. డీఏ బకాయిలు ఏకకాలంలో అన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాల విషయంలో జాప్యం చేయడం తగదని, పెండింగ్ బకాయిల కోసం అవసరమైతే ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్ మాట్లాడుతూ ఈహెచ్ఎస్ ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు అత్యంత కీలకమైన ఈహెచ్ఎస్ పథకాన్ని సీపీఎస్ ఉద్యోగులకు రిటైర్మెంట్ తరువాత పెన్షనర్ ఐడీలను కల్పిస్తూ, కంట్రిబ్యూషన్ లేని హెచ్‌ఎస్‌ను అమలు చేయాలని కోరారు. జిల్లా అధ్యక్షుడు చంద్రకాంత్, జిల్లా ప్రధానకార్యదర్శి రాఘవేందర్ రెడ్డి, రాఘవేంద్ర, వెంకటేష్ మల్లేశ్,రాజేష్, నరేష్, రాఘవేందర్ రావు, కర్నయ్య పాల్గొన్నారు. -
సర్వం సిద్ధం
నేటి నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు ● జిల్లాలో 60 పరీక్ష కేంద్రాల ఏర్పాటు ● హాజరుకానున్న 10,683 మంది విద్యార్థులు ● అన్ని ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు జిల్లా కేంద్రంలోని సీఎన్ఆర్ పాఠశాల పరీక్ష కేంద్రంలో హాల్ టికెట్ నంబర్లు వేస్తున్న సిబ్బంది అచ్చంపేట/కందనూలు/కల్వకుర్తి టౌన్: జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. శనివారం నుంచి ఏప్రిల్ 16వ తేదీ వరకు జరిగే పరీక్షలకు ఇప్పటికే విద్యార్థులను అన్నివిధాలా సంసిద్ధం చేశారు. జిల్లాలో పరీక్షల నిర్వహణ కోసం 60 కేంద్రాలను ఏర్పాటుచేయగా.. 10,683 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. వీరిలో 5,264 మంది బాలురు, 5,394 మంది బాలికలు ఉన్నారు. విద్యార్థులు పరీక్ష కేంద్రాలను తేలికగా తెలుసుకునేందుకు గాను హాల్ టికెట్‌పై క్యూఆర్ కోడ్ ముద్రించారు. మీసేవ కేంద్రం లేదా 80969 58096 వాట్సప్ నంబర్ ద్వారా కూడా హాల్ టికెట్ పొందే వెసులుబాటు కల్పించారు. పరీక్షల పర్యవేక్షణ కోసం 60 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 60 మంది డిపార్ట్మెంట్ ఆఫీసర్లు, ఇద్దరు అడిషనల్ డిపార్డ్మెంట్ ఆఫీసర్లు, 4 ఫ్లయింగ్ స్క్వాడ్, 6 సిట్టింగ్ స్క్వాడ్స్, 36 మంది కస్టోడియన్స్, 517 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు నిర్వహించనున్నారు. పదో తరగతి పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అధికార యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎండలు తీవ్రం కావడంతో కేంద్రాల వద్ద వైద్య సదుపాయాలు, తాగునీటి వసతి ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి గదిలో ఫ్యాన్, ఫర్నిచర్ ఏర్పాటు చేశారు. ఎలాంటి మాస్ కాపీయింగ్‌కు తావు లేకుండా పోలీస్, రెవెన్యూ, విద్యాశాఖ అధికారులు పర్యవేక్షించనున్నారు. అన్ని వసతుల ఏర్పాటు.. నిపుణుల సూచనలు.. పరీక్షలు రాసే విద్యార్థులు ప్రశాంతంగా చదవడం ద్వారా అన్ని విషయాలు గుర్తుకు ఉంటాయి. గతంలో చదివిన వాటిని రివిజన్ చేయాలి కానీ.. కొత్తగా మరిన్ని విషయాలను చదివి కంగారు పడొద్దు. గతంలో తమ పాఠశాలలోనే పరీక్షలు రాసిన విద్యార్థులు ఇప్పుడు ఇతర పరీక్ష కేంద్రంలో పరీక్షలు రాయడానికి వెళ్తారు. ఈ క్రమంలో కొంత ఇబ్బందులు పడతారు. అనుకున్న మార్కులు వస్తాయో రావోనన్న భ యం కలుగుతుంది. ముందుగా విద్యార్థులు ఆ భయాన్ని వీడి పరీక్షలకు హాజరుకావాలి. ఏ అంశం నుంచి ప్రశ్నలు వచ్చినా రాస్తామనే ధీమా.. నమ్మకంతో ఉంటూ ఆందోళనను దూరం చేసుకోవాలి. పరీక్ష కేంద్రానికి నిర్ణీత సమయానికి ముందుగానే చేరుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండవచ్చు. కనీసం గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలే తప్ప.. చివరి నిమిషంలో హడావుడిగా కేంద్రానికి వెళ్లడం వల్ల ఒత్తిడి పెరిగి పరీక్ష సరిగ్గా రాయలేకపోతారు. ప్రశ్నపత్రం చేతికి రాగానే కంగారు పడకుండా.. సుమారు 10 నిమిషాలు చదివితేనే పూర్తిగా అర్థం చేసుకోవచ్చు. ప్రశ్నపత్రం చదివాక ముందుగా తెలిసిన వాటికి సమాధానాలు రాస్తే పరీక్షపై నమ్మకం వచ్చి.. మిగిలిన వాటికి సైతం మంచి జవాబులను రాసేందుకు ఆస్కారం ఉంటుంది. పరీక్షల సమయంలో చాలా మంది విద్యార్థులు ఒత్తిడికి గురై ఆరోగ్యాన్ని పట్టించుకోకపోవడం పరిపాటిగా మారుతుంది. ఈ సమయంలో పోషకాహారం, పండ్లు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ లాంటివి తీసుకుంటే శరీరం పూర్తిగా రీచార్జ్ అవుతుంది. రాత్రిపూట కనీసం 6 గంటలకు పైగా నిద్ర తప్పనిసరి. పరీక్ష అనేది మీ మేధస్సుకు ఒక పరీక్ష మాత్రమే కానీ మీ జీవితానికి కాదు. ఆత్మస్థైర్యంతో ముందడుగు వేస్తే ప్రతి విద్యార్థి మంచి ఫలితాలు సాధించవచ్చు. -
ముగిసిన ఇంటర్ పరీక్షలు
కందనూలు: జిల్లాలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ముగిశాయి. శుక్రవారం జిల్లావ్యాప్తంగా 34 కేంద్రాల్లో ద్వితీయ సంవత్సరం కెమిస్ట్రీ, కామర్స్ పరీక్షలు నిర్వహించగా.. 5,721 మంది విద్యార్థులకు గాను 5,521 మంది హాజరయ్యారు. జనరల్‌లో 4,505 మందికి గాను 4,377 మంది, ఒకేషనల్ విభాగంలో 1,216 మందికి గాను 1,144 మంది హాజరై పరీక్ష రాశారు. జనరల్‌లో 128 మంది, ఒకేషనల్ విభాగంలో 72 మంది గైర్హాజరయ్యారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశామని డీఐఈఓ వెంకటరమణ తెలిపారు. -
ఆషామాషీగా తీసుకోవద్దు
‘ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక’ నామమాత్రం కావొద్దు ● అన్ని అంశాలపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాలి ● పెండింగ్ పనులపై అధికారులే బాధ్యత వహించాలి ● కార్యక్రమంపై నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ● 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో మంత్రి జూపల్లి కృష్ణారావు సాక్షి, నాగర్‌కర్నూల్: ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో అధికారులతోపాటు ప్రజాప్రతినిధులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం జిల్లాకేంద్రంలో కలెక్టర్ బదావత్ సంతోష్, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డితో కలిసి ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం అధికారులు, సర్పంచులు, మున్సిపాలిటీల పాలకవర్గాల సభ్యులతో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని అధికారులతోపాటు ప్రజాప్రతినిధులు ఆషామాషీగా తీసుకోకుండా ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలని చెప్పారు. కార్యక్రమం అమలులో రాష్ట్రంలోనే జిల్లాను ఆదర్శంగా నిలపాలని కోరారు. 99 రోజులపాటు ప్రధాన అంశాలపై నిర్వహించే ఈ కార్యక్రమాన్ని అన్ని విధాలుగా సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రజలతో మమేకం కావాలి.. నూతనంగా ఎన్నికై న సర్పంచులు, మున్సిపాలిటీల చైర్మన్లు, కౌన్సిలర్లకు ఈ కార్యక్రమం మంచి అవకాశం అని మంత్రి అభిప్రాయపడ్డారు. ఇంటింటికి వెళ్లి ప్రజాసమస్యలను తెలుసుకోవాలని, ప్రధానంగా సమస్యలను గుర్తించి పరిష్కారం కోసం కృషిచేయాలన్నారు. నిరంతరం ప్రజల్లో ఉంటేనే మంచిపేరు ఉంటుందని, భవిష్యత్‌లో ఎదుగుదలకు ఉపకరిస్తుందని చెప్పారు. ప్రజాప్రతినిధులతోపాటు అధికారులు సైతం ప్రజలతో మమేకం కావాల్సిందేనన్నారు. తహసీల్దార్ స్థాయి అధికారులు సైతం ఉదయం పూట గ్రామాల్లో పర్యటించి సమస్యలు తెలుసుకోవాలని సూచించారు. దరఖాస్తులు స్వీకరించాలి.. 99 రోజులపాటు నిర్వహించే ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో సమస్యల పరిష్కారంపైనే అధికారులు దృష్టిపెట్టాలన్నారు. ప్రజల నుంచి ప్రతి దరఖాస్తును స్వీకరించి.. రసీదు ఇవ్వాలని, పెండింగ్ పనులు ఉంటే అధికారులు బాధ్యత తీసుకోవాలన్నారు. నిర్దేశిత గడువులోగా సమస్యలు పరిష్కారం కావాల్సిందేనని స్పష్టం చేశారు. భూభారతి పోర్టల్‌లో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులపై ప్రత్యేకంగా శ్రద్ధవహించాలన్నారు. దరఖాస్తుల పరిష్కారంలో నిర్లక్ష్యం, కాలయాపన ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రధాన సమస్యలకు నిధులు.. మున్సిపాలిటీలతోపాటు గ్రామాల్లో ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు, కనీస అవసరాలకు తప్పనిసరిగా నిధులు కేటాయించాలని మంత్రి చెప్పారు. ముందుగా పారిశుద్ధ్యం, లైటింగ్, తాగునీరు, డ్రెయినేజీ పనులు చేపట్టిన తర్వాత మిగతా వాటికి నిధుల కేటాయించాలన్నారు. ప్రస్తుతం చోటుచేసుకుంటున్న మరణాల్లో సగభాగం ప్రమాదాలు, తాగినడపడం, ఓవర్‌స్పీడ్ ద్వారానే జరుగుతున్నాయని, దీనిపై గ్రామస్థాయిలో ఇంటింటా అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందన్నారు. ప్రైవేట్‌లో చదువు పేరిట భారీగా అప్పులపాలవుతున్నారని, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునేలా ప్రోత్సహించాలని చెప్పారు. వివాహం జరిగిన వారం రోజుల్లో కల్యాణలక్ష్మి కింద ఆన్లైన్లో దరఖాస్తు చేసేలా చూడాలని, ఆతర్వాత 20 రోజుల్లో మంజూరయ్యేలా అధికారులు అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు శ్యాంప్రసాద్‌లాల్, అమరేందర్, డీఎఫ్ఓ రేవంత్‌చంద్ర, మున్సిపల్ చైర్మన్లు సునేంద్ర, రత్నమాల, రెడ్డి జ్యోతి, మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ బదావత్ సంతోష్ మాట్లాడుతూ ప్రభుత్వం ఈ కార్యక్రమం కింద కీలకమైన 10 అంశాలను ఎంపిక చేసుకుని 99 రోజులపాటు అమలు చేసేలా పూర్తిస్థాయిలో ప్రజలను మమేకం చేయాలన్నారు. పరిసరాల పరిశుభ్రత, ఆరోగ్యం, సురక్షితంగా చేరుకోవడం, సంక్షేమం, పిల్లల భద్రత– రక్షణ, రైతులు, విద్య, యువత– క్రీడలు, మహిళలు, పర్యావరణం అంశాలు ఉన్నాయన్నారు. వీటిపై ఏప్రిల్ 2న గ్రామసభల నిర్వహణ, ఏప్రిల్ 16న మండల, మే 2న నియోజకవర్గ, మే 22న జిల్లా, జూన్ 2న రాష్ట్రస్థాయిలో ప్రగతి ప్రణాళిక సమావేశాలు నిర్వహించనున్నట్టు వివరించారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ నల్లమల ప్రాంతానికే చెందిన సీఎం రేవంత్‌రెడ్డికి ఇక్కడి ప్రాంత అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిపెట్టారన్నారు. అభివృద్ధే లక్ష్యంగా ప్రజాప్రతినిధులు, అధికారులు సమస్యల పరిష్కారానికి కృషిచేయాలన్నారు. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ కల్వకుర్తి పట్టణంలో అభివృద్ధి పనుల కోసం ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి రూ.15 కోట్లు కేటాయించారన్నారు. ప్రధానంగా సీసీరోడ్లు, మౌళిక వసతుల కల్పనకు కృషిచేస్తున్నామన్నారు. ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డి మాట్లాడుతూ తమ ప్రభుత్వ కాలంలో ప్రతీఇంటికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని చెప్పారు. నాగర్‌కర్నూల్ పట్టణ అభివృద్ధికి రూ.55 కోట్లతో ప్రత్యేక కార్యాచరణ చేపట్టామన్నారు. -
జోగుళాంబ హుండీ ఆదాయం రూ.99 లక్షలు
అలంపూర్: దక్షిణకాశీ అలంపూర్ క్షేత్రంలోని శ్రీజోగుళాంబదేవి అమ్మవారి హుండీ లెక్కింపు జరిగింది. దేవాదాయ, ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్ మదనేశ్వర్‌రెడ్డి, ఆలయ ఈఓ దీప్తి ఆధ్వర్యంలో గురువారం చేపట్టిన హుండీ లెక్కింపులో ఆలయ సిబ్బంది, వివిధ సేవా సంస్థల సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జోగుళాంబ అమ్మవారి ఆలయంలోని హుండీలను లెక్కించగా రూ.99,55,566 ఆదాయం సమకూరినట్లు ఈఓ దీప్తి తెలిపారు. అలాగే 28 గ్రాముల మిశ్రమ బంగారం, 298 గ్రాముల మిశ్రమ వెండి వచ్చిందని పేర్కొన్నారు. వీటితోపాటు విదేశీ కరెన్సీలైన యూఎస్డీ 39, ఫౌండ్స్ 10, ఓమన్ 100 బైసా హుండీల ద్వారా వచ్చినట్లు చెప్పారు. బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాల హుండీలను ఉగాది పండగ తర్వాత లెక్కించనున్నట్లు ఈఓ వెల్లడించారు. అమ్మవారి హుండీ ద్వారా వచ్చిన నగదును డీసీసీ బ్యాంక్‌లో జమ చేశామన్నారు. -
బాలికలకు టీకా రక్షణ
●నాగర్‌కర్నూల్ క్రైం: ప్రస్తుతం మహిళల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ సాధారణంగా మారింది. భారతదేశంలో మహిళలకు 40 ఏళ్ల తర్వాత గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ బారిన పడుతుండటంతో నివారణ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టడంతోపాటు క్యాన్సర్‌ను కట్టడి చేసేందుకు హెచ్‌పీవీ (హ్యుమన్ పాపిలోమా వైరస్) టీకాను అందించేందుకు నిర్ణయించింది. ఈ నెల 8న ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా హెచ్‌పీవీ వాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ బదావత్ సంతోష్ ప్రారంభించారు. మహిళలకు వచ్చే క్యాన్సర్లలో సర్వైకల్ క్యాన్సర్ రెండోస్థానం ఆక్రమిస్తుండటంతో 14 సంవత్సరాల బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల మహిళలకు భవిష్యత్‌లో కలిగే అస్వస్థలు, మరణాలను తగ్గించేందుకు వీలవుతుందని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. 4,297 మంది బాలికలు.. జిల్లాలోని 14 సంవత్సరాల బాలికల వివరాలను జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సేకరించారు. ఈ మేరకు జిల్లాలోని 28 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో కలిపి 14 సంవత్సరాల బాలికలు 4,297 మంది ఉన్నట్లు గుర్తించడంతోపాటు ఒక డోసు హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ను వేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే ఈ నెల 8న జిల్లాకేంద్రంలోని జనరల్ ఆస్పత్రితోపాటు కల్వకుర్తి, అమ్రాబాద్, ఉప్పునుంతల, లింగాల సివిల్ ఆస్పత్రులు, కొల్లాపూర్, అచ్చంపేట ఏరియా ఆస్పత్రుల్లో హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ను పంపిణీ చేస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కలిపి 148 మంది బాలికలకు వ్యాక్సిన్ పంపిణీ చేశారు. అయితే టీకా కోసం వచ్చే బాలికలు తప్పనిసరిగా ఆధార్‌కార్డుతోపాటు జనన ధ్రువప్రతం తీసుకురావాలని వైద్యులు సూచిస్తున్నారు. సిబ్బందికి ప్రత్యేక శిక్షణ జిల్లాలోని 14 ఏళ్ల బాలికలకు అందించే హెచ్‌పీవీ వ్యాక్సిన్ గురించి జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారితోపాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సిబ్బందికి ఇప్పటికే శిక్షణ అందించారు. జిల్లాలోని 28 పీహెచ్‌సీల పరిధిలో ఉన్న ఐస్‌లైన్ రిఫ్రిజరేటర్లను అధికారులు తరుచూ తనిఖీ చేస్తూ వ్యాక్సిన్ ఎంతెంత ఉష్ణోగ్రత్తల మద్య భద్రపర్చాలనే అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కావడంతో జిల్లా స్టోర్ నుంచి తరలించేందుకు అవసరమైన వ్యాక్సిన్ క్యారియర్లను, ఐస్ ప్యాక్‌లను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. ఇప్పటికే జిల్లాలో 148 మంది బాలికలకు పంపిణీ జనరల్, ఏరియా, సివిల్ ఆస్పత్రుల్లో అందుబాటులో.. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ వల్ల వచ్చే దుష్ప్రభావాలపై జిల్లాలోని 14 ఏళ్ల బాలికలు, తల్లిదండ్రులకు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో అవగాహన కల్పిస్తున్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ పారంభమైతే 28 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో నేరుగా వచ్చి వ్యాక్సిన్ తీసుకోవాలని సూచిస్తున్నారు. నాగర్‌కర్నూల్‌ను గర్భాశయ క్యాన్సర్ రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యంగా 14 ఏళ్ల వయస్సు గల బాలికలందరికీ హెచ్‌పీవీ వ్యాక్సిన్ అందించేందుకు కృషి చేస్తామని వైద్యాధికారులు పేర్కొన్నారు. -
మద్దిమడుగు అంజన్న పాలకమండలి నియామకం
అమ్రాబాద్: పదర మండలంలోని మద్దిమడుగు పబ్బతి శ్రీఆంజనేయస్వామి దేవస్థానం పాలక మండలిని దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ మేరకు గురువారం పాలక మండలి చైర్మన్‌గా దేశావత్ రాములునాయక్, డైరెక్టర్లుగా బసిరెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి, నాగిరెడ్డి, పెద్ద కోటమ్మ, సుబ్బదాస్, శ్రీనివాసులు, శ్రీశైలం, హలరాజు, లింగయ్య, వెంకటయ్య, ప్రణీత, రాములు, లక్ష్మణ్బావోజీని నియమించగా.. మద్దిమడుగు ఆంజనేయస్వామి సన్నిధిలో ప్రమాణస్వీకారం చేశారు. ఎండోమెంట్ డివిజన్ ఇన్స్పెక్టర్ మదన్, ఈఓ నర్సింహులు పాలక మండలిచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా చైర్మన్ రాములునాయక్ మాట్లాడుతూ ఆలయ అభివృద్ధితోపాటు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సమష్టి కృషితో చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ప్రధాన అర్చకులు వీరయ్యశర్మ, సిబ్బంది పరందామరెడ్డి, విశ్వేశ్వర్‌రెడ్డి, అజయ్ తదితరులు పాల్గొన్నారు. -
ముగిసిన ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు
కందనూలు: జిల్లాలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షలు ముగిశాయి. గురువారం జిల్లావ్యాప్తంగా 34 కేంద్రాల్లో మొదటి సంవత్సరం విద్యార్థులకు కెమిస్ట్రీ, కామర్స్ పరీక్షలు నిర్వహించగా.. 7,297 మందికి గాను 6,957 మంది పరీక్షకు హాజరయ్యారు. జనరల్ విభాగంలో 5,802 మందికి గాను 5,579 మంది, ఒకేషనల్‌లో 1,495 మందికి గాను 1,378 మంది హాజరై పరీక్ష రాశారు. జనరల్ విభాగంలో 223 మంది, ఒకేషనల్‌లో 117 మంది గైర్హాజరయ్యారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశామని డీఐఈఓ వెంకటరమణ తెలిపారు. ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు కందనూలు: జిల్లాలో ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. గురువారం సాయంత్రం కలెక్టర్ అధ్యక్షతన ఆయన చాంబర్లో నిర్వహించిన జిల్లాస్థాయి ఇసుక కమిటీ సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో ఇసుక బుకింగ్ పూర్తిగా ఆన్లైన్ విధానంలో ‘మన ఇసుక వాహనం’ యాప్ ద్వారానే జరగాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆఫ్‌లైన్ బుకింగ్ అనుమతించకూడదని స్పష్టం చేశారు. ఈ విధానం ద్వారా పారదర్శకత పెరిగి ప్రభుత్వానికి గరిష్ట ఆదాయం లభిస్తుందన్నారు. జిల్లాలోని వంగూరు మండలం జాజాల, ఉప్పునుంతల మండలంలోని దాసర్లపల్లి గ్రామాల్లో పట్టా భూమిలో ఇసుక తవ్వకాలపై వచ్చిన దరఖాస్తులను అధికారులు సమర్పించిన పర్యావరణ అనుమతుల ద్వారా ఇసుక రీచ్‌లను తెలంగాణ మినరల్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారానే ఇసుక తరలించేలా కలెక్టర్ అనుమతులు ఇచ్చారు. సమావేశంలో అదనపు కలెక్టర్ అమరేందర్, జిల్లా మైనింగ్ అధికారి వెంకటరమణ, జిల్లా నీటిపారుదల శాఖ అధికారి మురళి, డీపీఓ శ్రీరాములు, భూగర్భజల శాఖ అధికారి దివ్య జ్యోతి తదితరులు పాల్గొన్నారు. కంటిచూపును సంరక్షించుకోవాలి నాగర్‌కర్నూల్ క్రైం: మానవ జీవిత కాలంపాటు ప్రతిఒక్కరూ కంటి చూపును వందశాతం సంరక్షించుకోవాలని నాగర్‌కర్నూల్ ఆప్తాలమిక్ అధికారి కొట్ర బాలాజీ అన్నారు. గ్లూకోమా నీటి కాసుల వ్యాధి వారోత్సవాల సందర్భంగా జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ, ఎల్వీ ప్రసాద్ నేత్ర విజ్ఞాన శాఖ ఆధ్వర్యంలో గురువారం జిల్లాకేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆప్తాలమిక్ అధికారి మాట్లాడుతూ ప్రతిరోజు భోజనంలో విటమిన్ ఏ సంబంధిత ఆహారాన్ని ప్రతిఒక్కరు అధిక మొత్తంలో తీసుకోవాలని సూచించారు. ప్రతివ్యక్తి ఆరునెలలకు ఒకసారి తప్పనిసరిగా కంటి పరీక్షలు చేయించుకుని ఏవైనా సమస్యలు ఉంటే చికిత్స చేయించుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎల్వీ ప్రసాద్ తూడుకుర్తి ఆస్పత్రి పాలనాధికారి ప్రేమ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. వ్యాధి నిరోధక శక్తి పెంపునకే టీకాలు పాన్‌గల్: పశువుల్లో వ్యాధి నిరోధక శక్తి పెంపొందించేందుకు టీకాలు వేయించాలని జిల్లా పశువైద్యాధికారి డా. వెంకటేశ్వర్లు సూచించారు. గురువారం మండల కేంద్రంలో నిర్వహించిన గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని పశువులకు టీకాలు వేశారు. అనంతరం మాట్లాడుతూ.. పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో పశువులకు ఉచితంగా అందిస్తున్న గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రైతులు అందుబాటులో ఉండి తమ పశువులకు టీకాలు వేయించాలన్నారు. అదేవిధంగా మండలంలోని చింతకుంట, రాయినిపల్లిలో పశువైద్య సిబ్బంది టీకాలు వేశారు. కార్యక్రమంలో మండల పశువైద్యాధికారి డా. సురేష్, చింతకుంట సర్పంచ్ కోట్ల రాములు, పశువైద్య సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. -
రేపు ఉద్యోగమేళా
కందనూలు: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆర్ట్స్ డిగ్రీ కళాశాలలో ఈ నెల 13న ఉద్యోగమేళా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ గీతాంజలి తెలిపారు. ఇందుకు సంబంధించిన బ్రోచర్లను బుధవారం స్థానిక ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి చేతులమీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. ప్రైవేటు కంపెనీలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జాబ్‌మేళా ఏర్పాటుచేసినట్లు పేర్కొన్నారు. పదో తరగతి, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణులైన వారు అర్హులని.. ఈ అవకాశాన్ని జిల్లాలోని యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. డ్రగ్స్ మహమ్మారికి అడ్డుకట్ట వేద్దాం కందనూలు: డ్రగ్స్ మహమ్మారిని అరికట్టడంలో విద్యార్థులు కీలక పాత్ర పోషించాలని సీఐ శంకర్‌నాయక్ అన్నారు. నాగర్కరూ్న్ల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం జిల్లా విద్యాశాఖ, ఈగల్ టీం ఆధ్వర్యంలో డ్రగ్స్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలతో భవిష్యత్ నాశనమవుతుందన్నారు. విద్యార్థులు, యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని సూచించారు.కార్యక్రమంలో ఎంఈఓ త్యాగరాజు, రిసోర్స్పర్సన్లు తిరుపతయ్య, లక్ష్మీప్రసన్న, వెంకటయ్య, నార్కోటిక్ కానిస్టేబుల్ వీరయ్య తదితరులు పాల్గొన్నారు. గ్రానైట్ తవ్వకాలు నిలిపివేయాలి చారకొండ: మండలంలోని సిర్సనగండ్ల శివారులో సర్వేనం 182లో చేపట్టిన బ్లాక్ గ్రానైట్ తవ్వకాలను నిలిపివేసి.. వన్యప్రాణులను రక్షించాలని సిర్సనగండ్ల, శాంతిగూడెం గ్రామాల రైతులు కోరారు. ఈ మేరకు బుధవారం ఫారెస్టు అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గుట్ట ప్రాంతంలో మైనింగ్ తవ్వకాలతో పర్యావరణ దెబ్బతినడంతో పాటు వన్యప్రాణులకు హాని చేకూరుతుందన్నారు. పశు సంపద, వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న రైతులకు తీవ్ర నష్టం కలుగుతుందని వాపోయారు. అధికారులు స్పందించి అటవీ సంరక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. -
చకచకా.. సుందరీకరణ
ఊపందుకున్న అమృత్ భారత్ స్టేషన్ పథకం పునరాభివృద్ధి పనులు ● విమానాశ్రయాల స్థాయిలో వసతుల కల్పనకు చర్యలు ● ఉమ్మడి జిల్లాలో మహబూబ్‌నగర్, జడ్చర్ల, గద్వాల, జోగుళాంబ స్టేషన్లు ● ఎప్పటికప్పుడు పనులు పర్యవేక్షిస్తున్న జనరల్ మేనేజర్ స్టేషన్ మహబూబ్‌నగర్: రైల్వేస్టేషన్ల ఆధునికీకరణకు కేంద్ర రైల్వేశాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. స్టేషన్లలో మౌలిక వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఈ మేరకు స్టేషన్లలో ప్రయాణికులకు మరిన్ని అధునాతనమైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ‘అమృత్ భారత్ స్టేషన్ స్కీం’ (ఏబీఎస్ఎస్) కింద రైల్వేస్టేషన్లలో ఆధునిక సౌకర్యాలు కల్పించనున్నారు. ప్రయాణికుల సౌకర్యాలకు పెద్దపీట వేస్తుండటంతో.. ఈ పథకం కింద ఎంపికై న రైల్వేస్టేషన్లలో పునరాభివృద్ధి ముమ్మరంగా జరుగుతున్నాయి. రైల్వే ప్రయాణికులకు ప్రపంచస్థాయి సౌకర్యాలు కల్పించడానికి, భారీస్థాయిలో రైల్వేస్టేషన్లను ఆధునికీకరించడానికి గణనీయమైన మార్పులు తీసుకొస్తున్నారు. రైల్వేస్టేషన్లలో ప్రయాణికులకు ఎయిర్‌పోర్టు అనుభూతి కలిగేలా మినీ ఎయిర్‌పోర్టులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనులు చేపడుతున్నారు. ఇందులో భాగంగా అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద ఎంపికై న ఉమ్మడి జిల్లాలోని నాలుగు రైల్వేస్టేషన్లలో పునరాభివృద్ధి పనులు జోరుగా కొనసాగుతున్నాయి. మహబూబ్‌నగర్ రైల్వేస్టేషన్‌కు రూ.39.82 కోట్లు, జడ్చర్ల స్టేషన్‌కు రూ.36.67 కోట్లు, గద్వాల స్టేషన్‌కు రూ.42.82 కోట్లు, శ్రీబాలబ్రహ్మేశ్వర, జోగుళాంబ స్టేషన్‌కు రూ.6.7 కోట్లతో పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఈ మేరకు ఆయా రైల్వేస్టేషన్లలో పునరాభివృద్ధి పనులు గత నెలలో సౌత్‌సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్‌కుమార్ శ్రీవాస్తవ పరిశీలించారు. ఎప్పటికప్పుడు పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద స్టేషన్లను అన్ని విధాలుగా ఆధునీకరించనున్నారు. ప్రయాణికులకు అవసరమైన సౌకర్యాలను దృష్టిలో పెట్టుకొని వసతులు కల్పించనున్నారు. ముఖ్యంగా స్టేషన్ ముఖద్వారాలు, ప్రణాళికబద్ధమైన పార్కింగ్, పాదచారుల మార్గాలు, మెరుగైన లైటింగ్ సౌకర్యాలతోపాటు ఆహ్లాదకరమైన అనుభూతి కోసం సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా స్టేషన్లను ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతారు. పార్కింగ్, రైల్వే బుకింగ్ సౌకర్యం గదులు నిర్మాణం చేయనున్నారు. ఫుట్ఓవర్ బ్రిడ్జి నిర్మాణం, ప్రయాణికులు వివిధ ప్లాట్‌ఫాంలో దిగేందుకు వీలుగా లిఫ్టులు, ఎస్కలేటర్లు ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం ఉన్న ప్రధాన ద్వారం ముఖచిత్రం పూర్తిస్థాయిలో నవీకరణ, సుందరీకరణ చేయనున్నారు. రైల్వేస్టేషన్లో అనసవర నిర్మాణాలు తొలగించి సర్క్యులేటింగ్ ప్రాంతం, అప్‌గ్రేడ్ చేసిన పార్కింగ్ స్థలాలు, దివ్యాంగులకు అనుకూలంగా మౌలిక వసతులు, గ్రీన్ ఎనర్జీని ఉపయోగించడం ద్వారా పర్యావరణ అనుకూల సదుపాయాలు కల్పించనున్నారు. ట్రాఫిక్ సర్క్యులేషన్, ఇంటర్ మోడల్ ఇంటిగ్రేషన్ వంటి పనులు చేపట్టనున్నారు. ఆధునిక ఆర్కిటెక్చర్, ప్రపంచస్థాయి సౌకర్యాలతో అభివృద్ధి చేసేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ట్రాక్‌ల శుభ్రత, దివ్యాంగుల కోసం చక్రాల కుర్చీలు ఏర్పాటు చేస్తారు. ప్రవేశం వద్ద ర్యాంపులు, కేఫ్ ఏరియా, విశ్రాంతి గదులు ఏర్పాటు చేయనున్నారు. అదేవిధంగా ఆధునిక లైటింగ్‌తో సహా స్పీడ్వైఫే 5జీ సేవలకు టవర్లు కూడా నిర్మించనున్నారు. -
సంతోషంగా ఉంది..
అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయడం సంతోషంగా ఉంది. ఈ పథకంతో రైల్వే స్టేషన్ల రూపురేఖలు మారిపోతున్నాయి. ప్రయాణికులకు ఇంకా మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. ఎస్కలేటర్లు, లిఫ్టులు ఏర్పాటు అవుతాయి. ముఖ్యంగా దివ్యాంగులు, సీనియర్ సిటిజన్లకు ఎన్నో సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. దేవరకద్ర, వనపర్తి రోడ్ రైల్వేస్టేషన్లు కూడా ఏబీఎస్ఎస్ కింద అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి. – దిడ్డి గోపాల్ నారాయణ, డీఆర్‌యూసీసీ మెంబర్ -
టాప్ 10లో నిలుస్తాం
● చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ ● మాస్ కాపీయింగ్‌కు ప్రోత్సహిస్తే కఠిన చర్యలు ● ‘సాక్షి’ ఇంటర్వ్యూలో డీఈఓ రమేశ్‌కుమార్ జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి కందనూలు: పదో తరగతి వార్షిక పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించి.. రాష్ట్రంలోనే టాప్ 10లో నిలిచేందుకు కృషి చేస్తున్నామని జిల్లా విద్యాశాఖ అధికారి రమేశ్‌కుమార్ అన్నారు. అందులో భాగంగానే వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ.. పరీక్షలకు సన్నద్ధం చేస్తున్నామన్నారు. ఈ నెల 14 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభంకానున్న నేపథ్యంలో బుధవారం డీఈఓతో ‘సాక్షి‘ నిర్వహించిన ఇంటర్వ్యూలో పలు అంశాలను వివరించారు. పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే.. ప్రతి విద్యార్థి రాణించేలా.. అన్ని పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులకు ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతులు బోధిస్తూ.. గ్రాండ్ టెస్టులు నిర్వహిస్తున్నాం. విద్యార్థుల సమక్షంలోనే పేపర్లు దిద్ది.. ఏ అంశాల్లో వెనుకబడి ఉన్నారో తెలియజేస్తున్నాం. అవసరమైన సలహాలు, సూచనలు చేస్తున్నాం. గతేడాది మ్యాథ్స్, ఫిజిక్స్‌లో విద్యార్థులు రాణించలేకపోయారు. ఈసారి అలాంటి పరిస్థితులు తలెత్తకుండా.. విద్యార్థులు మ్యాథ్స్, ఫిజిక్స్‌లో మంచి మార్కులు సాధించడం కోసం గ్రాండ్ టెస్టులు నిర్వహిస్తున్నాం. ఎక్కడ ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటున్నాం. మెరుగైన ఫలితాలు సాధిస్తాం.. ఈ ఏడాది ప్రతి పరీక్షకు రెండు నుంచి నాలుగు రోజుల సమయం ఉంది. పరీక్ష లేని రోజుల్లో ఏ సబ్జెక్టు టీచర్ ఆ రోజు విద్యార్థులను పాఠశాలలను రప్పించుకొని ప్రత్యేకంగా క్లాసులు తీసుకోవాలని ఆదేశించాం. తద్వారా విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉంటుంది. గతేడాది పదో తరగతి ఫలితాల్లో 13వ స్థానంలో నిలిచాం. ఈసారి కచ్చితంగా టాప్ 10లో సింగిల్ డిజిట్ సాధించడం కోసం కృషి చేస్తున్నాం. హాజరుకానున్న 10,683 మంది విద్యార్థులు.. జిల్లాలో ఈ ఏడాది 10,683 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నారు. వీరిలో బాలురు 5,264 మంది, బాలికలు 5,394 మంది ఉన్నారు. పరీక్షల నిర్వహణ కోసం జిల్లావ్యాప్తంగా 60 కేంద్రాలను ఏర్పాటుచేశాం. 517 మంది ఇన్విజిలేటర్లు, 60 మంది చొప్పున సీఎస్, డీఓలను నియమించాం. అదే విధంగా 4 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 6 సిట్టింగ్ స్క్వాడ్స్ బృందాలను ఏర్పాటుచేశాం. మరో 36 మంది కస్టోడియన్ అధికారులను నియమించాం. సీసీ నిఘాలో పరీక్ష పేపర్ల సీల్ తీయాలి. పరీక్షల నిర్వహణలో ఎక్కడ నిర్లక్ష్యం వహించినా చర్యలు తప్పవు. మాస్ కాపీయింగ్‌కు పాల్పడే విద్యార్థులు, ప్రోత్సహించిన వారిపై కఠినంగా వ్యవహరిస్తాం. విద్యార్థులు పాఠశాలలతో సంబంధం లేకుండా నేరుగా ఆన్లైన్లో హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష ఉంటుంది. విద్యార్థులు అరగంట ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. ఈ సారి ఐదు నిమిషాల వెసులుబాటు కల్పించడం జరిగింది. విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించేందుకు తల్లిదండ్రులు తమవంతుగా సహకరించాలి. పరీక్షల సమయంలో పౌష్టికాహారం అందిస్తూ.. సరిపడా నిద్రపోయేలా చూడాలి. విద్యార్థులు ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాయాలి. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ముఖ్యంగా తాగునీరు, విద్యుత్, ఫ్యాన్లు, అవసరమైన ఫర్నిచర్‌తో పాటు వైద్యసేవలను అందుబాటులో ఉంచుతున్నాం. ఇప్పటికే సంబంధిత అధికారులతో కలెక్టర్ సమన్వయ సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. -
‘ఉపాధిహామీ’పై నిర్లక్ష్యం తగదు
అమరచింత: కేంద్ర ప్రభుత్వం ఉపాధిహామీ పథకంపై వివక్ష చూపుతూ లక్ష్యాన్ని నీరుగార్చే కుట్రలు చేస్తోందని.. ఉపాధి కూలీలకు అండగా నిలుస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ తెలిపారు. బుధవారం మండలంలోని పాంరెడ్డిపల్లి శివారులో ఉపాధి పని ప్రదేశంలో కూలీలను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకాన్ని వీబీజీ రాంజీగా పేరు మార్చి జీఓ తీసుకురావడం దారుణమన్నారు. కొత్త చట్టంతో కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం నిధులు భరించాలనే నిబంధన విధించడం సిగ్గుమాలిన చర్యగా అభి వర్ణించారు. అదేవిధంగా సంక్రాంతి నుంచి పనులు చేస్తున్నా కూలి డబ్బుల అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పని ప్రదేశాల్లో కూలీలకు కనీస సౌకర్యాలు కల్పించలేని స్ధితిలో ప్రభుత్వం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎండలు ముదురుతున్నందున నీడ కోసం షేడ్నెట్లు ఏర్పాటు చేయాలని, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, తాగునీరు, ప్రథమ చికిత్స కిట్లు అందుబాటులో ఉంచాలని కోరారు. రోజువారి కూలి రూ.307 చెల్లిస్తున్నారని.. మారుతున్న కాలానికి అనుగుణంగా రూ.800 చెల్లించాలని డిమాండ్ చేశారు. ఏడాదికి 200 పనిదినాలు, రూ.2 లక్షల కోట్ల బడ్జెట్ కేటాయించాలన్నారు. అలాగే పట్టణ ప్రాంతాల్లో ఉపాధి పనులు తొలగించడంతో వ్యవసాయ కూలీలు పనులు దొరకక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని.. మున్సిపల్, అర్బన్ ప్రాంతాల్లో సైతం అమలు చేయాలని డిమాండ్ చేశారు. పని అడిగిన ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించాలని.. లేనిపక్షంలో పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నెల 20 వరకు రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, కలెక్టరేట్ల ముట్టడికి పిలుపునిచ్చామన్నారు. పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు జీఎస్ గోపి, మహమూద్, వెంకటేష్, అజయ్, రాఘవేంద్ర, బుచ్చన్న, శంకర్రాజు, విజయ్, అనంతమ్మ, మణెమ్మ తదితరులు పాల్గొన్నారు. సీపీఎం రాష్ట్ర క్యార్యదర్శి జాన్‌వెస్లీ -
యువతకు కిడ్నీ గండం
పరీక్షలు చేసుకోవాలి.. కిడ్నీ సంబంధిత సమస్య ఉన్నవారిలో మొదట లక్షణాలు నీరసం, ఆకలి మందగించడం, మూత్రం తక్కువగా రావడం కనిపిస్తుంది. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించి పరీక్షలు చేసుకోవాలి. ప్రస్తుతం చాలా మందిలో మారుతున్న జీవనశైలి వల్ల కిడ్నీ సమస్యలు పెరుగుతున్నాయి. వేసవిలో అధికంగా డీహైడ్రేషన్ సమస్య ఉండటం వల్ల మూత్రంలో మంట, కిడ్నీలలో రాళ్లు ఎక్కువగా ఏర్పడటానికి అవకాశం ఉంటుంది. నాణ్యతతో కూడిన డయాలసిస్ చేసుకోకపోవడం వల్ల కూడా సమస్య పరిష్కారం కావడం లేదు. హెచ్డీఎఫ్ కానీ హెచ్ఓఎంఎల్, హెచ్డీ, నాచ్యురల్ హెచ్‌బీ చేస్తే ఫలితం మెరుగైన స్థితిలో ఉంటుంది. – డాక్టర్ రాజేష్, కిడ్నీ వైద్య నిపుణుడు, మహబూబ్‌నగర్ పాలమూరు: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా చాలామంది కిడ్నీ సమస్యతో బాధపడేవారు పెరిగిపోతున్నారు. మారుతున్న జీవన విధానంతో యువత ఒత్తిడికి లోనవుతోంది. దీనికితోడు ఆహారపు అలవాట్లు పూర్తిగా మారిపోతున్నాయి. ఉప్పు, మసాలాలతో కూడిన ఆహారానికి అలవాటు పడటం, మానసిక ఒత్తిడి, ఎక్కువగా నొప్పులకు ఉపయోగించే ట్యాబ్లెట్స్ వాడటం, షుగర్, బీపీ, ఊబకాయం, మద్యం, పొగాకుకు బానిసవ్వడం తదితర అలవాట్లు కిడ్నీ రోగాలకు దారితీస్తోంది. రోజులో కనీసం అరగంట కూడా వ్యాయామం చేయకపోవడంతో ఈ సమస్య మరింత పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. అధిక రక్తపోటు, మధుమేహం లాంటి సమస్యలు మూత్రపిండాలపై అధిక ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఆహారం తినేటప్పుడు మాత్రమే యువత నీళ్లు తాగుతుండటం వల్ల శరీరానికి అవసరమైన నీరు సరిపోవడం లేదు. మరోవైపు ప్రాథమిక స్థాయిలో కిడ్నీ సమస్యలు గుర్తించకపోవడం, నిర్లక్ష్యం వల్ల రాళ్ల సమస్య ఏర్పడుతుంది. జిల్లాలో 28– 30 ఏళ్ల వయస్సులో అధిక రక్తపోటును నిర్లక్ష్యం చేస్తున్న వారిలో కిడ్నీలు దెబ్బతింటున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. 479 మందికి డయాలసిస్ ఉమ్మడి పాలమూరులో గద్వాల, వనపర్తి జిల్లాలో అధికంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రెండు జిల్లాల్లో డయాలసిస్ రోగులు అధికంగా ఉన్నారు. స్థానికంగా ఉండే వాతావరణ పరిస్థితితోపాటు ఆహార అలవాట్ల వల్ల కూడా కిడ్నీ బాధితులు అధికం అవుతున్నారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో 77 మిషన్ల ద్వారా 479 మంది రోగులకు నిత్యం డయాలసిస్ చేస్తున్నారు. కొత్తగా ఆత్మకూర్‌లో ఐదు, మక్తల్‌లో ఐదు మిషన్లతో కూడిన డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు కానున్నాయి. మార్చి రెండో గురువారం.. ప్రతి ఏడాది మార్చి రెండో గురువారం ప్రపంచ కిడ్నీ దినోత్సవంగా నిర్వహిస్తారు. కిడ్నీలు శరీరంలో వెన్నెముకకు ఇరువైపులా 9– 10 సెంటిమీటర్ల వెడల్పుతో పాటు 150గ్రాముల బరువు కల్గి ఉంటాయి. కిడ్నీ ప్రధాన శరీరంలోని నీటి లవణాల సమత్యులత, రక్త తయారీలో కీలక పాత్ర, మూత్రం తయారీ చేస్తుంటాయి. ప్రధానంగా కిడ్రీలలో సమస్య తీవ్రతరం అయితే తప్ప లక్షణాలు బయటపడవు. కిడ్నీ సమస్య ఉన్నవారిలో ప్రధానంగా ఆకలి మందగించడం, నీరసం, వాంతులు, చిరాకు, బరువు తగ్గడం, కాళ్ల వాపులు, మూత్రం తగ్గడం, ముఖం వాపు రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. తీసుకోవాల్సిన జాగ్రత్తలు కిడ్నీ వ్యాధిని కట్టడి చేయాలంటే ప్రధానంగా రోజూ తగినంత వ్యాయామం చేయడం, కావాల్సినంత నిద్ర, ఒత్తిడి లేకుండా జీవనం, సరైన మోతాదులో నీరు తాగడం, బీపీ, షుగర్ నియంత్రణలో పెట్టుకోవడం చేయాలి. దీర్ఘకాలికంగా కిడ్నీలు చెడిపోయిన రోగుల్లో క్రియాటీన్, పొటాషియం శాతాల పెరుగుదల శరీరంలో అదనంగా నీరు చేరిన ఆధారంగా ఎన్నిసార్లు డయాలసిస్ చేయాలన్నది ఆధారపడి ఉంటుంది. రోగులకు శ్వాస తీసుకోవడంలో అకస్మాత్తుగా ఇబ్బంది ఎదురవుతుంది. ఈ నేపథ్యంలో వెంటనే డయాలసిస్ చేపట్టాలి. అందుబాటులో కేంద్రం ఉంటే రోగికి మేలు జరుగుతుంది. సుదూరంలో ఉండటం వల్ల ఒక్కోసారి ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. రక్తం తక్కువగా ఉంటే ఎరిత్రోఫాయింట్ ఇంజెక్షన్ ఇస్తారు. మరీ తక్కువగా ఉంటే నేరుగా రక్తం ఎక్కించాల్సి వస్తుంది. సమీపంలోనే కేంద్రం ఉంటే ఇలాంటి సందర్భాల్లో రోగి కుటుంబ సభ్యులకు ఆందోళన ఉండదు. కిడ్నీ రోగులకు ఒక్కసారిగా బీపీ పడిపోయే ప్రమాదం ఉంది. కేంద్రాలు దగ్గరలోనే ఉంటే వెంటనే రోగిని కాపాడేందుకు అవకాశాలు ఎక్కువ. మూత్రపిండం.. జరభద్రం మారుతున్న జీవనశైలి.. ఆహారపు అలవాట్లు మోతాదులో నీళ్లు తాగక అనర్థాలు ఉమ్మడి జిల్లాలో పెరుగుతున్న కిడ్నీ సంబంధిత బాధితులు నేడు ప్రపంచ కిడ్నీ దినోత్సవం -
ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తిచేయండి
● లబ్ధిదారులతో గృహప్రవేశం చేయించేందుకు చర్యలు తీసుకోవాలి ● కలెక్టర్ బదావత్ సంతోష్ కందనూలు: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తిచేసి.. లబ్ధిదారులతో గృహప్రవేశాలు చేయించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ జీవీ శ్యాంప్రసాద్ లాల్, జెడ్పీ సీఈఓ దేవసహాయంతో కలిసి ఇందిరమ్మ ఇళ్లు, డబుల్బెడ్రూం ఇళ్ల నిర్మాణాల ప్రగతిపై మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, హౌసింగ్ ఏఈలతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా మండలాల వారీగా కేటాయించిన లక్ష్యం, లబ్ధిదారుల నిర్ధారణ, మంజూరైన ఇళ్లలో ప్రారంభమైన నిర్మాణాలు, అవి ఏ దశలో ఉన్నాయి.. క్షేత్రస్థాయిలో నెలకొన్న సమస్యలపై కలెక్టర్ ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ 20 నుంచి 26 తేదీ వరకు సంక్షేమ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలో చివరి దశ నిర్మాణంలో ఉన్న 2,711 ఇందిరమ్మ ఇళ్ల పనులను త్వరగా పూర్తిచేసి.. లబ్ధిదారులతో గృహప్రవేశాలు చేయించేందుకు అధికారులు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. జిల్లావ్యాప్తంగా 10,383 ఇందిరమ్మ ఇళ్లను లబ్ధిదారులకు మంజూరు చేయగా.. ఇప్పటివరకు 7,735 ఇళ్లు గ్రౌండింగ్ అయ్యాయని.. 2,648 ఇళ్ల నిర్మాణాలు ఇంకా ఎందుకు ప్రారంభించలేదని సంబంధిత అధికారులను కలెక్టర్ ప్రశ్నించారు. లబ్ధిదారుల ఎంపిక, గ్రౌండింగ్ విషయంలో వెనుకంజలో ఉన్న మండలాలను గుర్తించి.. లక్ష్య సాధన కోసం అంకితభావంతో పనిచేయాలని సూచించారు. ముఖ్యంగా ఎంపీడీఓలు క్షేత్రస్థాయిలో లబ్ధిదారులను నేరుగా కలిసి.. వారు వెంటనే ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించేలా ప్రోత్సహించాలని ఆదేశించారు. బేస్మెంట్ లెవల్ వరకు సకాలంలో పూర్తిచేసుకునేలా అధికారులు చొరవ చూపాలన్నారు. సమావేశంలో హౌసింగ్ పీడీ సంగప్ప, డీపీఓ శ్రీరాములు, జెడ్పీ డిప్యూటీ సీఈఓ గోపాల్‌నాయక్ ఉన్నారు. -
చెంచుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి
బల్మూర్/మన్ననూర్: చెంచుల ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక దృష్టిసారించినట్లు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికా రి డా.రవికుమార్ అన్నారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మంగళవారం మన్ననూర్, వటువర్లపల్లి పీహెచ్‌సీలతో పాటు బల్మూర్ మండలం చెంచుగూడెంలో వైద్యశిబిరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్, డెంటల్, ఐ, గైనకాలజీ, చిన్నపిల్లలకు సంబంధించిన వైద్యులు చెంచులకు సేవలు అందించడంతో పాటు ఆరోగ్య సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశారు. అనంతరం డీఎంహెచ్ఓ మాట్లాడుతూ.. చెంచులకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. గర్భిణులు ఆరోగ్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లే సమయంలో 102 వాహన సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కాగా, చెంచుగూడెంలో 105 మందికి వైద్యపరీక్షలు, మరో 46 మందికి క్షయ నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ డా.తారాసింగ్, ఫార్మసీ అధికారి శ్రీనివాసులు, డీపీఎంఓ మధుమోహన్, డిప్యూటీ మలేరియా అధికారి బిక్కులాల్, వైద్యులు సురేశ్‌బాబు, సుధాకర్, అభిలాష్, సూపర్వైజర్ వెంకటమ్మ, ఫార్మసిస్టు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
ఆన్లైన్లోనే ఇసుక అనుమతులు
● జిల్లాలో ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలి ● కలెక్టర్ బదావత్ సంతోష్ కందనూలు: జిల్లాలో ప్రజల అవసరాలు, ప్రభుత్వ పనులకు అవసరమైన ఇసుక కోసం ఆన్లైన్లోనే అనుమతులు పొందే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్ బదావత్ సంతోష్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో రెవెన్యూ, మైనింగ్‌శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఇసుక అక్రమ రవాణాకు తావులేకుండా చర్యలు చేపట్టాలన్నారు. జీపీఎస్ కలిగి మైనింగ్‌శాఖ వద్ద రిజిస్టర్ అయిన వాహనాల ద్వారానే ఇసుక రవాణాకు అనుమతించాలని ఆదేశించారు. జిల్లాలోని 18 ఇసుక రీచ్‌ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటుచేసి.. పోలీసు, రెవెన్యూ, మైనింగ్ శాఖల అధికారుల పర్యవేక్షణ ఉండాలన్నారు. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే లోడింగ్ చేయాలని సూచించారు. ఇసుకను అక్రమంగా తరలించే వాహనాలకు రూ. 20వేల వరకు జరిమానా విధించాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో జిల్లా మైనింగ్ అధికారి వెంకటరమణ, కలెక్టరేట్ తహసీల్దార్ రవికుమార్ తదితరులు ఉన్నారు. రేపు ప్రజాప్రతినిధులకు శిక్షణ ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈ నెల 12న సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ సంతోష్ తెలిపారు. ప్రజాప్రతినిధులకు శిక్షణ కార్యక్రమం విధి విధానాలపై మంగళవారం రాష్ట్ర సచివాలయం నుంచి సీఎస్ రామకృష్ణారావు వీసీ ద్వారా జిల్లా అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..జిల్లా కేంద్రంలోని తీగల వెంకటస్వామి ఫంక్షన్హాల్లో 12న ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు శిక్షణ కార్యక్రమం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే ప్రజాప్రతినిధులు అందరికీ ఆహ్వానం పంపించినట్లు వివరించారు. వీసీలో అదనపు కలెక్టర్లు జీవీ శ్యాంప్రసాద్ లాల్, అమరేందర్, జెడ్పీ సిఈఓ దేవసహాయం పాల్గొన్నారు. -
భూ రికార్డులు పక్కా!
జిల్లాలో భూముల రీసర్వేకు శ్రీకారం ● పైలెట్ ప్రాజెక్టుగా నాలుగు గ్రామాలు ఎంపిక ● అత్యాధునిక సాంకేతికత జీఎన్ఎస్ఎస్ రోవర్ విధానంలో భూముల సర్వే ● గ్రామసభల నిర్వహణలో రెవెన్యూశాఖ నిమగ్నం చిరిగిపోతున్న రికార్డులు.. రెవెన్యూ రికార్డులు చాలా వరకు శిథిలావస్థకు చేరి చిరిగిపోతున్నాయి. వందేళ్ల క్రితం నాటి రికార్డులు కావడంతో వాటిని పట్టుకోవడానికి కూడా వీలు లేనంతగా తయారయ్యాయి. కొన్ని గ్రామాలకు అసలు గ్రామ నక్షలు లేవు. దీంతో భూ వివాదాలు ఏర్పడినప్పుడు వాటిని పరిష్కరించడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. గ్రామాల వారీగా భూముల రీసర్వే చేయడం ద్వారా ఆయా సమస్యలకు చెక్ పెట్టవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఈ సర్వే ద్వారా డిజిటలైజ్ విలేజ్ మ్యాప్‌లు, కొత్త టీపన్లు, శేత్వార్లను రూపొందిస్తారు. సబ్ డివిజన్లు సైతం.. ఏదైనా ఒక సర్వే నంబర్లో భూమికి ఇప్పటి వరకు ఒకే రికార్డు అందుబాటులో ఉంది. ఆయా సర్వే నంబర్లో కొంత భాగం ఇతరులకు క్రయవిక్రమాలు జరుగుతుంటాయి. కానీ రికార్డుల్లో మాత్రం సర్వే నంబర్ మొత్తం ఒకే మ్యాప్‌గా ఉంటుంది. చాలా వరకు పెద్ద సర్వే నంబర్లలో సబ్ డివిజన్లు జరగలేదు. అలాగే పట్టాదారుకు సంబంధించి ఇద్దరు, ముగ్గురు వారసులు ఉండి.. పంచుకున్న భూమికి సంబంధించి ప్రత్యేకంగా మ్యాప్‌లను తయారు చేస్తారు. అచ్చంపేట: భూముల రీసర్వేకు రెవెన్యూశాఖ శ్రీకారం చుట్టింది. జిల్లాలో పైలెట్ ప్రాజెక్టు కింద నాలుగు గ్రామాలను ఎంపిక చేశారు. కొల్లాపూర్ మండలం మొలచింతపల్లి, తిమ్మాజిపేట మండలం మరికల్, బిజినేపల్లి మండలం ఖానాపూర్, లింగాల మండలం అంబటిపల్లి గ్రామాల్లో భూముల రీసర్వే చేపడుతున్నారు. ఇందుకోసం సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్‌శాఖ ఉద్యోగులతో పాటు, కొందరు లైసెన్స్డ్ సర్వేయర్లను నియమించారు. ఆయా పంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించి.. రీసర్వేతో ఉపయోగాలను పట్టాదారులకు వివరించారు. అత్యాధునిక సాంకేతికతతో కూడిన డీజీపీఎస్ (డిజిటల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం) విధానం కంటే ఇంకా అడ్వాన్స్డ్ టెక్నాలజీ జీఎన్ఎస్ఎస్ రోవర్ విధానంలో భూముల రీసర్వేకు శ్రీకారం చుట్టారు. -
ర్యాలంపాడుకు మోక్షం
ఎట్టకేలకు నిధులు.. ర్యాలంపాడు రిజర్వాయర్‌కు పూర్తిస్థాయిలో మరమ్మతు చేయడానికి ప్రభుత్వం రూ. 4.92 కోట్లు మంజూరు చేసింది. ఇందులో రూ.1.66 కోట్లు సీడబ్ల్యూపీఆర్సీ పుణెకు, మిగిలిన రూ. 3.66 కోట్లతో రిజర్వాయర్‌కు ఏర్పడిన లీకేజీలకు పూర్తిస్థాయిలో మరమ్మతు చేయాలని నిర్ణయించారు. అయితే రిజర్వాయర్ ఆనకట్టలోని రాక్‌టోల్ లేయర్ల మట్టి నమూనాలు, తూముల అడుగు భాగంలోని నమూనాలను పరీక్షల నిమిత్తం పుణెకు చెందిన సీడబ్ల్యూపీఆర్‌సీకి పంపనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ పరీక్ష ఫలితాల అనంతరం వచ్చే తుది నివేదిక ఆధారంగా రిజర్వాయర్‌కు పూర్తిస్థాయిలో మరమ్మతు చేపట్టనున్నారు. గద్వాల: నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం అంతర్భాగమైన ర్యాలంపాడు రిజర్వాయర్‌కు నాలుగేళ్ల క్రితం లీకేజీలు ఏర్పడ్డాయి. ఫలితంగా 4 టీఎంసీల నీటి సామర్థ్యం ఉన్న రిజర్వాయర్‌లో 2 టీఎంసీలు మాత్రమే నిల్వచేస్తూ.. 1.12 లక్షల ఎకరాల ఆయకట్టుకు వానాకాలంలో ఒక పంటకు మాత్రమే సాగునీరు అందిస్తున్నారు. యాసంగి సీజన్లో రెండో పంటకు సాగునీరు అందించకుండా క్రాప్‌హాలిడే ప్రకటిస్తూ వస్తున్నారు. దీంతో ర్యాలంపాడు రిజర్వాయర్‌కు మరమ్మతు చేయాలని రైతులు ప్రతి ఏడాది ఆందోళనకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలోనే పలుమార్లు హైదరాబాద్, పుణె నుంచి ఇంజినీరింగ్ నిపుణుల బృందం రిజర్వాయర్‌ను సందర్శించి.. సర్వే చేశారు. ఇందుకు సంబంధించిన సమగ్ర నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించారు. ఎట్టకేలకు ర్యాలంపాడు రిజర్వాయర్ మరమ్మతుకు మోక్షం లభించింది. రిజర్వాయర్ పూర్తిస్థాయి మరమ్మతు కోసం ప్రభుత్వం రూ. 4.92కోట్లు మంజూరు చేసింది. రెండేళ్లకే లీకేజీలు.. గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల ప్రజలకు తాగునీటితో పాటు 2లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో దివంగత మాజీ ముఖ్యమంత్రి డా.వైఎస్ రాజశేఖరరెడ్డి నెట్టెంపాడు ఎత్తిపోతల పథకానికి 2005లో శంకుస్థాపన చేశారు. 2009 వరకు పరుగులు పెట్టిన ప్రాజెక్టు నిర్మాణ పనులు.. వైఎస్సార్ అకాలమరణంతో అసంపూర్తిగా నిలిచాయి. నెట్టెంపాడు ప్రాజెక్టులో మొత్తం 20 టీఎంసీల సామర్థ్యంతో ఏడు రిజర్వాయర్లు ఉండగా.. ర్యాలంపాడు రిజర్వాయర్‌ను 4 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించారు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన రిజర్వాయర్ నిర్మాణంపై అధికారుల పర్యవేక్షణలో నిర్లక్ష్యం చోటు చేసుకోవడం.. గుత్తేదారు లోపభూయిష్ట నిర్మాణంతో రిజర్వాయర్ అందుబాటులోకి వచ్చిన రెండేళ్ల కాలంలోనే ఆనకట్ట, తూముల వద్ద లీకేజీలు ఏర్పడ్డాయి. రిజర్వాయర్ మరమ్మతుకు రూ. 4.92 కోట్లు మంజూరు సివిల్ గ్రౌంటింగ్ పరీక్షలకు రూ.1.66కోట్లు కేటాయింపు రూ. 3.66కోట్లతో జలాశయం ఆనకట్ట, తూముల మరమ్మతు త్వరలోనే ప్రారంభంకానున్న పనులు పలుమార్లు సర్వే.. ర్యాలంపాడు రిజర్వాయర్ లీకేజీలకు మరమ్మతు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మొదటగా రూ. 60లక్షలతో హైదరాబాద్‌కు చెందిన ఏజెన్సీకి సర్వే పనులను అప్పగించింది. ఆరునెలల పాటు సర్వే చేసిన సదరు ఏజెన్సీ.. మరమ్మతుకు సంబంధించిన తుది నివేదికను గత ప్రభుత్వానికి సమర్పించింది. దీనిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు. దీంతో మరోసారి పుణెకు చెందిన ఇంజినీరింగ్ బృందంతో సర్వే చేయించింది. ఇంజినీరింగ్ నిపుణుల బృందం రెండుసార్లు రిజర్వాయర్‌ను సందర్శించారు. సర్వేకు సంబంధించిన తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. త్వరలోనే పనులు.. ర్యాలంపాడు రిజర్వాయర్ లీకేజీలకు మరమ్మతు కోసం ప్రభుత్వం రూ. 4.92కోట్లు మంజూరు చేసింది. పుణె నుంచి వచ్చే తుదినివేదిక ఆధారంగా త్వరలోనే రిజర్వాయర్‌కు పూర్తిస్థాయిలో మరమ్మతు చేపట్టి.. పూర్తి ఆయకట్టుకు సాగునీరు అందిస్తాం. – రహీముద్దీన్, ఎస్ఈ, ఇరిగేషన్ శాఖ -
నానో ఎరువులతో రైతులకు మేలు
తెలకపల్లి: నానో డీఏపీ, యూరియా వినియోగంతో రైతులకు ఎంతో మేలు చేకూరుతుందని రాష్ట్ర మార్కెటింగ్ మేనేజర్ కృపాశంకర్, డీఏఓ యశ్వంత్‌రావు అన్నారు. తెలకపల్లి సింగిల్‌విండో కార్యాలయంలో మంగళవారం నానో ఎరువుల వినియోగంపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నానో యూరియా, డీఏపీ వినియోగంతో పంటల దిగుబడి పెరగడంతో పాటు రసాయన ఎరువుల వినియోగం, పెట్టుబడి తగ్గుతుందన్నారు. రైతులు నానో ఎరువుల వినియోగంపై దృష్టిసారించాలని సూచించారు. అనంతరం సుస్థిర వ్యవసాయంలో నానో ఎరువుల వినియోగంతో కలిగే ప్రయోజనాలను డీసీఓ రఘునాథరావు, డీహెచ్ఓ వెంకటేశ్వర్లు వివరించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ మాజీ చైర్మన్ భాస్కర్‌రెడ్డి, సీఈఓ ధర్మవీర్, ఫీల్డ్ ఆఫీసర్ శివరాజు, హరినాథరావు పాల్గొన్నారు. -
14న ఉగాది కవి సమ్మేళనం
స్టేషన్ మహబూబ్‌నగర్: పాలమూరు సాహితీ ఆధ్వర్యంలో శ్రీపరాభవ ఉగాది కవి సమ్మేళనం, బోల యాదయ్య రచించిన హార్ట్‌బీట్ పుస్తకావిష్కరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సాహితీ అధ్యక్షుడు డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం పాలమూరు నగరంలోని తెలంగాణ చౌర స్తా వద్ద ఉన్న రెడ్‌క్రాస్ భవన్లో ఉదయం 10 గంటలకు నిర్వహించే కవి సమ్మేళనానికి ముఖ్య అతిథులుగా వి.మనోహర్‌రెడ్డి, బెక్కెం జనార్దన్ తదితరులు హాజరవుతారని పేర్కొన్నారు. కవి సమ్మేళనంలో కవులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. -
ఇంటర్ పరీక్షలకు 196 మంది గైర్హాజరు
కందనూలు: జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. మంగళవారం ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఫిజిక్స్, ఎకనామిక్స్ పరీక్షలు నిర్వహించగా.. 6,059 మందికి గాను 5,863 మంది హాజరయ్యారు. జనరల్‌లో 4,659 మందికి గాను 4,525 మంది, ఒకేషనల్ విభాగంలో 1,400 మందికి గాను 1,338 మంది హాజరై పరీక్ష రాశారు. జనరల్‌లో 134 మంది, ఒకేషనల్ విభాగంలో 62 మంది గైర్హాజరయ్యారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశామని డీఐఈఓ వెంకటరమణ తెలిపారు. ఉద్యోగుల భద్రతే లక్ష్యం అచ్చంపేట: శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో ఉద్యోగుల భద్రతే జెన్కో లక్ష్యమని సీఈ కేవీవీ సత్యనారాయణ అన్నారు. భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో నిర్వహిస్తున్న జాతీయ భద్రతా వారోత్సవాలు మంగళవారం ముగిశాయి. ఈ సందర్భంగా ఇంజినీర్లు, ఆర్టిజన్లు, ఇతర ఉద్యోగులతో ఏర్పాటుచేసిన సమావేశంలో సీఈ మాట్లాడారు. కేంద్రంలోని సున్నిత ప్రాంతాల్లో విధులు నిర్వర్తించే ఇంజినీర్లు, ఉద్యోగులు సేఫ్టీ దుస్తులు ధరించడంతో పాటు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విద్యుత్ ఉత్పత్తి సమయంలో ప్రమాదాలకు గురికాకుండా ముందుజాగ్రత్తలు పాటించాలని తెలిపారు. సమావేశంలో ఎస్ఈలు ఆదినారాయణ, రవీంద్రకుమార్, డీఈ శ్రీకుమార్‌గౌడ్, ఏడీఈ రాము, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ మల్లికార్జున్ తదితరులు ఉన్నారు. తెగుళ్ల నివారణతో అధిక దిగుబడులు అమ్రాబాద్: పంటల్లో తెగుళ్ల నివారణతో అధిక దిగుబడులు సాధించవచ్చని పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త సత్తయ్య అన్నారు. మండలంలోని కల్ములోనిపల్లి, జంగంరెడ్డిపల్లి గ్రామాల్లో మంగళవారం పాలెం ఆర్‌ఏఆర్‌ఎస్ శాస్త్రవేత్తల బృందం పర్యటించి ఆముదం, వేరుశనగ, కంది తదితర పంటలను పరిశీలించింది. ఈ సందర్భంగా పంటల సాగులో పాటించాల్సిన మెళకువలు, తెగుళ్ల నివారణకు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యలపై రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు సదయ్య, సిద్దప్ప, ఈశ్వర్‌రెడ్డి, మాధురి పాల్గొన్నారు. -
‘ఉపాధి పని ప్రదేశాల్లో వసతులు కల్పించాలి’
పాన్‌గల్: ఉపాధి పనుల్లో ఆన్లైన్ మస్టర్ విధానాన్ని తొలగించాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు జబ్బార్ కోరారు. స్థానిక సమస్యల గుర్తింపులో భాగంగా మంగళవారం సీపీఎం బృందం మండలంలోని దావాజిపల్లిని సందర్శించి ఉపాధి కూలీల సమస్యలపై ఆరా తీసింది. అనంతరం వారు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఉపాధిహామీ పథకం పేరు మార్చి పథకాన్ని నీరుగార్చిందన్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వం 90 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 10 శాతం వాటా నిధులు ఖర్చుచేసే వారని.. కొత్త చట్టం ప్రకారం కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం నిధులు వెచ్చించేలా నిబంధనలు విధించిందని తెలిపారు. పని ప్రదేశాల్లో సరైన వసతులు లేక కూలీలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. రోజువారీ కూలి రూ.600 చెల్లిస్తూ.. ఏడాదికి 200 రోజులు పని కల్పించాలని కోరారు. మరో బృందం పార్టీ మండల కార్యదర్శి బాల్యానాయక్ ఆధ్వర్యంలో తెల్లరాళ్లపల్లి, కేతేపల్లిలో పర్యటించి ఉపాధి కూలీలు, స్థానిక సమస్యలపై ఆరా తీసింది. ఉపాధిహామీ పథకాన్ని రక్షించుకునేందుకు కలిసి పోరాడాలన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు సూర్యవంశం రాము, దేవేందర్, పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
గుండం ప్రాంతంలో పెద్దపులి
మన్ననూర్: నల్లమలలోని అమ్రాబాద్ పులుల రక్షిత అభయారణ్యంలో మళ్లీ పెద్ద పులి దర్శనమిచ్చింది. మంగళవారం మధ్యాహ్నం నాగర్‌కర్నూల్ జిల్లా ఫర్హాబాద్ చౌరస్తా నుంచి సఫారీ వాహనంలో బయలుదేరుతున్న పర్యాటకుల వాహనానికి ఎదురుగా గుండం అటవీ పరిసర ప్రాంతంలో పెద్దపులి కనిపించింది. అది గమనించిన సఫారీ వాహన డ్రైవర్ వాహనాన్ని ఆపి పర్యాటకులకు తెలియజేశాడు. -
కేఎల్ఐ, బీమా, కోయిల్‌సాగర్ ప్రాజెక్ట్‌లపై ఫోకస్..
2025 మే 1న మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ఎంపీ మల్లురవి, ఎమ్మెల్యేలు, సాగునీటి పారుదల శాఖ అధికారుల బృందం పాలమూరు ప్రాజెక్ట్‌ను సందర్శించింది. నార్లాపూర్, వట్టెం, ఏదుల రిజర్వాయర్లతో పాటు పంప్‌హౌజ్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. 2026 మార్చి కల్లా ప్రాజెక్ట్ పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటి వరకు పూర్తి కాలేదు. అయితే తాజాగా మరో 20 నెలలకు గడువును పొడిగించింది. ● ఉమ్మడి జిల్లాలో ఏళ్లుగా అసంపూర్తిగానే మిగిలిన కల్వకుర్తి ఎత్తిపోతల పథకం(కేఎల్ఐ), నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్ ప్రాజెక్ట్‌లను పూర్తి చేసేందుకు కసరత్తు మొదలుపెట్టింది. 2027 మార్చికల్లా పెండింగ్ ప్రాజెక్ట్‌లను పూర్తి చేసేందుకు లక్ష్యాన్ని నిర్దేశించింది. అలాగే కొడంగల్–నారాయణపేట–మక్తల్ ప్రాజెక్ట్ పనుల్లో వేగం పెంచి 2027 మార్చి నాటికే పూర్తి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. -
ఆధ్యాతికత వైపు మొగ్గుచూపాలి
బల్మూర్/ వంగూరు: ప్రతిఒక్కరూ అహంకారాన్ని వీడితేనే దేవుడి అనుగ్రహం పొందుతారని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు రామానుజ చినజీయర్‌స్వామి అన్నారు. మండలంలోని కొండనాగులలో సోమవారం శ్రీలక్ష్మీచెన్నకేశవస్వామి విగ్రహం, ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమంలో ఆయన పాల్గొని ఆధ్యాత్మిక ప్రవచనం చేశారు. ఆలయ అభివృద్ధి, సంస్కృతి పరిరక్షణలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మారుమూల నల్లమల ప్రాంతమైన కొండనాగుల వంటి గ్రామాల్లో హరిజన, గిరిజనులు భక్తిభావంతో ఆలయ నిర్మాణం చేయడం అభినందించదగ్గ విషయమన్నారు. ప్రతి గ్రామంలో మందిరాలను నెలకొల్పి దేవతామూర్తులను ఆరాదించి అనుగ్రహం పొందాలని సూచించారు. ప్రధానంగా మహిళలు ఆధ్యాతికత వైపు మొగ్గు చూపితేనే కుటుంబాలు అభివృద్ధి పరంగా పురోగతి సాధిస్తాయన్నారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో కాకతీయుల కాలం నాటి అద్భుతమైన పురాతన ఆలయాలు ఎంతో కీర్తి ప్రతిష్టలతో గుర్తింపు పొందాయన్నారు. అనంతరం సీబీఎం ట్రస్ట్ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేశారు. ● వంగూరు మండలంలోని ఎల్లమ్మ రంగపూర్ ఆలయంలో నూతనంగా నిర్మించిన వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని చినజీయర్‌స్వామి సందర్శించారు. ఆలయానికి విచ్చేసిన చినజీయర్ స్వామికి ఆలయ నిర్వాహకులు, అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో సర్పంచ్ మల్లయ్య, నాయకులు రాజేందర్‌రెడ్డి, సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అక్రమార్కులపై కొరడా!
జిల్లాలో ఇసుక, మట్టి అక్రమ రవాణాపై పటిష్ట నిఘా మూడు రోజుల్లో కేసుల నమోదు ఇలా.. ● గోపాల్పేట పీఎస్ పరిధిలో మూడు ట్రాక్టర్లు, పెద్దమందడి పీఎస్ పరిధిలో జేసీబీపై కేసుల నమోదు, ఇసుక డంపుల సీజ్. ● పెబ్బేరు పీఎస్ పరిధిలో నాలుగు ట్రాక్టర్లపై కేసులు ● వనపర్తి పట్టణ పీఎస్‌లో రెండు ట్రాక్టర్లపై కేసుల నమోదు ● వనపర్తి రూరల్ పీఎస్ పరిఽధిలో రెండు ట్రాక్టర్లపై.. ● ఖిల్లాఘనపురం పీఎస్ పరిధిలో మూడు మట్టి ట్రాక్టర్లపై కేసులు ● మదనాపురం పీఎస్ పరిఽధిలో ఒక ట్రాక్టర్‌పై కేసు నమోదు ● సీఎం సమీక్ష తర్వాత పోలీసుశాఖ ఉక్కుపాదం ● మూడు రోజుల వ్యవధిలోనే 38 ఇసుక ట్రాక్టర్లపై కేసులు వనపర్తి: జిల్లాలో ఇసుక, మట్టి అక్రమ రవాణాపై పోలీసుశాఖ పటిష్ట నిఘా ఏర్పాటుచేసి, ఉక్కుపాదం మోపుతోంది. ఎస్పీ సునీతారెడ్డి ఆదేశాల మేరకు పోలీసులు అక్రమార్కులపై కొరడా ఝుళిపిస్తున్నారు. కేవలం మూడు రోజుల వ్యవధిలోనే దాదాపు 38 ఇసుక ట్రాక్టర్లతో పాటు వాగుల్లో ఉన్న ప్రొకెయిన్లు సీజ్ చేసి.. కేసులు నమోదు చేశారు. కొన్ని ప్రాంతాల్లో అక్రమార్కులు భారీగా నిల్వచేసిన ఇసుకను సైతం సీజ్ చేసి.. మండల రెవెన్యూ అధికారులకు స్వాధీనం చేశారు. మట్టి వాహనాలను మైనింగ్‌శాఖ అధికారులకు అప్పగిస్తున్నారు. వారు క్యూబిక్ మీటర్ల కోలమానంగా జరిమానా విధిస్తుండటంతో జిల్లావ్యాప్తంగా అక్రమ దందాకు తెరలేపిన వారిలో భయం మొదలైంది. అనుమతి లేకుండా రోడ్డుపై ఇసుక ట్రాక్టర్లు రావడానికి ఆస్కారం లేనంతగా నిఘా వ్యవస్థను కట్టుదిట్టం చేశారు. సీఎం సమీక్ష తర్వాత.. రాష్ట్ర రాజధానిలో ఈ నెల 3న కలెక్టర్లతో సీఎం రేవంత్‌రెడ్డి నిర్వహించిన సమీక్షలో ఇసుక, మట్టి అక్రమ రవాణాపై సీరియస్‌గా స్పందించడం.. అక్రమ రవాణాను అదుపు చేయకుంటే పరోక్షంగా ప్రోత్సహిస్తున్నట్లు భావించాల్సి వస్తుందనే అర్థ వచ్చేలా మాట్లాడటంతో కలెక్టర్ పోలీస్ వ్యవస్థను అప్రమత్తం చేశారనే చర్చ సాగుతోంది. ఈ ప్రచారానికి ఊతమిచ్చేలా ఈ నెల 3 నుంచే జిల్లాలోని ఇసుక అక్రమ రవాణాపై పోలీసు అధికారులు కొరడా ఝుళిపించడం గమనార్హం. ఆయా మండలాల్లో ఎస్హెచ్ఓలు జల్లెడ పట్టి మరీ ఇసుక, మట్టిని అక్రమంగా తరలిస్తున్న వాహనాలపై కేసులు నమోదు చేయడంతో ఒక్కసారిగా పరిస్థితి అదుపులోకి వచ్చినట్లు తెలుస్తోంది. అత్యధికంగా తూంకుంట నుంచి.. జిల్లాలో అత్యధికంగా వీపనగండ్ల మండలం తూంకుంట ఇసుక రీచ్ నుంచి అనధికారికంగా పెద్ద ఎత్తున ఇసుక అక్రమ దందా సాగుతున్నట్లు అందిన సమాచారం మేరకు జిల్లా పోలీస్ బాస్ అక్కడి ఎస్ఐని అప్రమత్తం చేశారు. దీంతో ఈ నెల 5న ఒకే రోజు 9 ట్రాక్టర్లలో ఎలాంటి అనుమతి లేకుండా వాగు నుంచి ఇసుక తరలిస్తున్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ట్రాక్టర్ల యజమానులు, డ్రైవర్లపై కేసులు నమోదు చేశారు. -
వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోండి
లింగాల: జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప కేంద్రాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని డీఎంహెచ్ఓ రవికుమార్ వైద్యులు, వైద్య సిబ్బందికి సూచించారు. సోమవారం ఆయన లింగాలలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను ప్రజా పాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సీహెచ్‌సీలోని వివిధ విభాగాలను సందర్శించి రోగులతో మాట్లాడారు. అలాగే రికార్డులను పరిశీలించారు. సీహెచ్‌సీ, పీహెచ్‌సీలకు వచ్చే రోగులకు ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేటట్లు పచ్చదనం, పరిశుభ్రత పాటించాలని సూచించారు. ప్రస్తుతం వేసవికాలం కావడంతో రోగులు తాగునీటికి ఇబ్బందులు పడకుండా నీటి వసతిని కల్పించాలని ఆదేశించారు. ముఖ్యంగా ప్రతి పంచాయతీ, అంగన్వాడీ కేంద్రాలు, రేషన్ షాపులు, సబ్ సెంటర్ల దగ్గర వైరస్ కార్నర్, లేదా పాకెట్లను అందుబాటులో ఉంచాలని వైద్యులకు చెప్పారు. ఆస్పత్రుల నిర్వహణ విషయంలో అలసత్వం వహించకుండా విధులను నిర్వహించాలని తేల్చిచెప్పారు. జిల్లాలో నిర్వహిస్తున్న ప్రత్యేక వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో వ్యాధి నిరోధక నిర్మూలన అధికారి సురేష్‌బాబు, ఎన్సీడీ ప్రోగ్రాం అధికారి కృష్ణమోహన్, సికిల్ సెల్ ప్రోగ్రాం అధికారి ప్రదీప్, ప్రత్యేక వైద్య నిపుణులు, సీహెచ్‌సీ వైద్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
ఇంత నాసిరకం భోజనమా..
● ప్రతిరోజు పిల్లలకు ఇలాగే పెడుతున్నారా? ● మెనూ పాటించకపోవడంపై కలెక్టర్ ఆగ్రహం ● హెచ్ఎం, ఉపాధ్యాయురాలికి షోకాజ్ నోటీసులు కందనూలు: తాను జిల్లాలోని అనేక పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పరిశీలించినప్పటికీ.. ఇంత నాసిరకం భోజనం ఎక్కడా తినలేదని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. జిల్లాకేంద్రంలోని జెడ్పీ బాలికల పాఠశాలను కలెక్టర్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలను సందర్శించిన ఆయన విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. విద్యార్థులకు అందిస్తున్న ఆహారం నాణ్యత, మెనూ అమలు లేకపోవడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సోమవారం మెనూలో భాగంగా కిచిడీ, గుడ్డు, మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ ఇవ్వాల్సి ఉండగా.. వైట్ రైస్, గుడ్డు, సాంబార్ మాత్రమే వడ్డిస్తున్నట్లు గమనించారు. మెనూ ఎందుకు పాటించలేదని హెచ్ఎంను ప్రశ్నించారు. అలాగే విద్యార్థులకు వడ్డించిన అన్నం, సాంబార్ నాణ్యత సరిగా లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నం సరిగా వండలేదు.. సాంబార్ పసుపు నీళ్లలా ఉందని దుయ్యబట్టారు. రోజూ పిల్లలకు ఇలాగే భోజనం పెడుతున్నారా.. అన్నం ఎలా వండాలో కూడా తెలియదా..? అంటూ ఉపాధ్యాయులను మందలించారు. ఇలాంటి నిర్లక్ష్యం వల్ల విద్యార్థుల ఆరోగ్యం దెబ్బతింటుందని, ఎందుకు మిమ్మల్ని విధుల నుంచి సస్పెండ్ చేయకూడదో చెప్పాలని హెచ్ఎం, ఉపాధ్యాయురాలిని నిలదీశారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని స్పష్టం చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన హెచ్ఎం భాస్కర్‌రెడ్డి, ఫుడ్ చెకింగ్ టీచర్‌పై చర్యలు తీసుకోవాలని డీఈఓ రమేష్‌కుమార్‌కు ఫోన్లో ఆదేశించారు. ఇద్దరికీ షోకాజ్ నోటీసులు జారీ చేసి వివరణ తీసుకోవాలని సూచించారు. అంతకు ముందు పదో తరగతి విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడుతూ పరీక్షలకు కేవలం నాలుగు రోజుల సమయం మాత్రమే ఉందని ఈ నెల రోజులు సమయాన్ని వృథా చేయకుండా బాగా చదివి మంచి ఉత్తీర్ణత సాధించాలని సూచించారు. కలెక్టర్ వెంట మున్సిపల్ చైర్మన్ తీగల సునేంద్ర, ఆర్డీఓ సురేష్‌బాబు తదితరులున్నారు. -
ఇప్పుడే నిప్పుల కొలిమి
●మూడురోజుల నుంచి పెరిగిన ఎండలు పాలమూరు: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మూడు రోజులుగా భానుడు సెగలు కక్కుతున్నాడు. 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ఉదయం 9 గంటల నుంచే బయటకు రావాలంటే ప్రజలు జంకుతున్నారు. మధ్యాహ్నం సమయంలో ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇప్పుడే ఎండలు ఇంతలా మండుతుంటే.. వచ్చే ఏప్రిల్, మే నెలల్లో ఇంకెంత పెరుగుతాయోనని ఆందోళన చెందుతున్నారు. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉండటంతో వడదెబ్బ ముప్పు పొంచి ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సూర్యుడు నిప్పులు చెరుగుతుండగా వాతావరణ కాలుష్యంతో వేడి తీవ్రత మరింత అధికమవుతోంది. జిల్లాలో ప్రధానంగా వృద్ధులు, చిన్నారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చిన్నపిల్లల వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం పెరిగిన ఎండల తీవ్రత వల్ల ఇళ్లలో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఏర్పాటు చేసుకునే పనిలో ప్రతిఒక్కరూ బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఫ్యాన్ల నుంచి వేడి గాలులు వస్తున్న క్రమంలో వచ్చే వారంరోజుల్లో కూలర్ల కొనుగోళ్లు అధికంగా పెరగనున్నాయి. ●ఉమ్మడి పాలమూరులో ఎండల తీవ్రత దృష్ట్యా అన్ని పీహెచ్‌సీల్లో అవసరమైన మందులతోపాటు ఓఆర్ఎస్ పాకెట్లు అందుబాటులో ఉంచాల్సిన పరిస్థితి నెలకొంది. గ్రామాల్లో దినసరి కూలీలు, రైతులు, ఉపాధి హామీ కూలీలు ఇలా ప్రతిఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలి. క్షేత్రస్థాయిలో ఆశాలు, ఏఎన్ఎంలు ఇంటింటికి తిరుగుతూ ఓఆర్ఎస్ పాకెట్లు పంపిణీ చేయాలని పలువురు సూచిస్తున్నారు. -
పీయూకు జవసత్వాలు
అంబులెన్స్ అందించిన ఎంపీ.. యూనివర్సిటీలో విద్యార్థులు అనారోగ్యానికి గురైతే ప్రాథమిక చికిత్స అందించేందుకు అధికారులు ప్రత్యేక పీహెచ్‌సీని అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇక్కడ చిన్నపాటి ఆరోగ్య సమస్యలకు మాత్రమే చికిత్స ఇవ్వనున్నారు. అయితే విద్యార్థులకు అత్యవసర పరిస్థితి ఏర్పడితే ప్ర భుత్వ ఆస్పత్రి లేదా ఇతర ఆస్పత్రులకు తరలించేందుకు చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉండేంది. ఈ క్రమంలో పీయూ అధికారులు ఎంపీ డీకే అరుణను సంప్రదించగా ఆమె స్పందించి యూనివర్సిటీకి సుమారు రూ.10 లక్షల విలువైన అంబులెన్స్‌ను అందించారు. ప్రస్తుతం అది విద్యార్థులకు సేవలు అందిస్తుంది. మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: యూనివర్సిటీల అభివృద్ధికి నిధులు కేవలం ప్రభుత్వం నుంచే సంప్రదాయంగా వస్తున్న పద్ధతి ఉండేది. కానీ, పీయూలో ప్రభుత్వ నిధులతోపాటు ప్రైవేటు వ్యక్తుల నుంచి నిధులు సేకరించి యూనివర్సిటీని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. ఈ క్రమంలో యూనివర్సిటీ చరిత్రలోనే గతేడాది అత్యధికంగా విరాళాలు సాధించి రికార్డు సాధించారు. సుమారు రూ.10.20 కోట్ల నిధులు దాతల నుంచి రాబట్టడం విశేషం. అంతేకాకుండా భవిష్యత్‌లో మరిన్ని నిధులను ప్రైవేటు వ్యక్తులు, సంస్థల నుంచి (సీఆర్ఎఫ్) కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ కింద నిధులు సేకరించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే కొన్ని ప్రైవేటు సంస్థలకు యూనివర్సిటీ అవసరాలు, విద్యార్థులకు వసతుల కల్పన కోసం నిధులు సేకరించేందుకు ప్రతిపాదనలు సైతం పంపించారు. ఈ క్రమంలోనే నిధులు ఇచ్చేందుకు కొన్ని సంస్థలు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తుంది. త్వరలో మరిన్ని నిధులు యూనివర్సిటీ వచ్చే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ఆడిటోరియం నిర్మాణంతో.. పీయూలో విద్యార్థులు పెద్దఎత్తున కార్యక్రమాలు, సమావేశాలు నిర్వహించేందుకు ఆడిటోరియం ఇప్పటి వరకు లేవు. కేవలం రెండు సెమినార్ హాల్స్ మాత్రమే ఉండగా.. ఇందులో ఒకటి ఫార్మీసీ కళాశాల సెమినార్ హాల్, లైబ్రరీ ఆడిటోరియం. ఇక్కడ కూడా సీటింగ్ కెపాసిటీ చాలా తక్కువగా ఉండడంతో ఇబ్బందులు ఎదురయ్యేవి. ఈ నేపథ్యంలో పీయూలో ఆడిటోరియం నిర్మాణం కోసం రూ.10 కోట్లు ఇవ్వనున్నట్లు ఎంఎస్ఎన్ కంపెనీ అధినేత ఎంఎస్ఎన్ రెడ్డి ప్రకటించారు. వీటికి సంబంధించిన ప్రక్రియ సైతం ప్రారంభించినట్లు లేఖలను కూడా పీయూ వీసీకి అందించారు. దీంతో ఆడిటోరియం నిర్మాణం కోసం ఎంఈడీ కళాశాల ఆవరణలో భూమిని సైతం కేటాయించారు. త్వరలో భూమిపూజ చేసే అవకాశం ఉండగా.. సుమారు వెయ్యికిపైగా సీటింగ్ కెపాసిటీతో నిర్మించనున్నారు. అలాగే యూనివర్సిటీ అవసరాలతోపాటు బయటి వారికి సైతం అద్దె ప్రాతిపదికన ఇవ్వనున్నారు. మరిన్ని నిధులు రాబడతాం.. ఏడాది కాలంలో యూనివర్సిటీ చరిత్రలో ఎప్పుడూ లేనన్ని నిధులను ప్రైవేటు వ్యక్తుల నుంచి సేకరించాం. యూనివర్సిటీలో ఆడిటోరియం నిర్మాణానికి ఎంఎస్ఎన్ రెడ్డి రూ.10 కోట్లు ఇవ్వనున్నారు. వీటితోపాటు పీయూ హాస్టల్స్‌లో చపాతి చేసేందుకు ఎస్బీఐ నుంచి రెండు రోటీ మేకర్ మిషన్ తీసుకువచ్చాం. విద్యార్థుల అవసరాల కోసం మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ అంబులెన్స్ కూడా అందజేశారు. అలాగే ఇతర అవసరాల కోసం పలు ప్రైవేటు సంస్థలకు ప్రతిపాదనలు పంపించాం. త్వరలో మరిన్ని నిధులు రానున్నాయి. వీటితో విద్యార్థులకు మరిన్ని మౌలిక వసతులు కల్పించి.. నాణ్యమైన విద్య అందించేలా కృషిచేస్తాం. – జీఎన్ శ్రీనివాస్, వైస్ చాన్స్‌లర్, పీయూ ప్రభుత్వంపై ఆధారపడకుండా వినూత్న పంథాలో నిధుల సమీకరణ దాతల నుంచి గతేడాది సుమారు రూ.10.20 కోట్ల విరాళాలు హాస్టల్స్‌లో రెండు రోటీ మేకర్స్‌ను ఇచ్చిన ఎస్బీఐ విద్యార్థులు ఆస్పత్రికి వెళ్లేందుకు అంబులెన్స్ సమకూర్చిన ఎంపీ డీకే అరుణ విద్యార్థుల శిక్షణ, ఇతర వసతుల కల్పన కోసం పలు సంస్థలకు విజ్ఞప్తులు రోటీ మేకర్స్‌తో తీరిన ఇబ్బంది.. పీయూ బాలికల హాస్టల్స్‌లో ఇటీవల కొత్త హాస్టల్స్ ప్రారంభంతోపాటు ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు చేరారు. దీంతో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో ఉదయం టిఫిన్ కోసం చపాతీలు చేయడం పెద్ద సమస్యగా మారింది. ఇందులో సుమారు 750 మందికిపైగా ఉండగా ఒక్కొక్కిరికి సుమారు నాలుగు చపాతీలు ఇచ్చినా ఒక్కరోజు సుమారు 4 వేల చపాతీలు చేయాల్సి వస్తుంది. దీంతో సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉండటంతో ఎస్బీఐ గణేష్‌నగర్ బ్రాంచ్ యూనివర్సిటీ అధికారులు రోటీ మేకర్స్ ఇవ్వాలని ప్రతిపాదనలు పెట్టారు. దీంతో స్పందించిన ఎస్బీఐ అధికారులు పీయూ హాస్టల్స్‌కు రూ.10 లక్షల విలువైన రెండు రోటీ మేకర్స్‌ను అందించారు. ఇవి ప్రస్తుతం బాలికల హాస్టల్స్‌లో అందుబాటులోకి వచ్చాయి. వీటి అవసరం రెండు బాలుర హాస్టల్స్‌లో కూడా ఉండడంతో అక్కడ కూడా ఏర్పాటు చేయాల్సి ఉంది. -
బాలికల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యం
కందనూలు: బాలికల ఆరోగ్యాన్ని పరిరక్షించాలనే లక్ష్యంతోనే ప్రభుత్వం హెచ్‌పీవీ (హ్యూమన్ పాపిల్లోమ వైరస్) వ్యాక్సిన్ అందిస్తుందని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. ఆదివారం జిల్లా జనరల్ ఆస్పత్రిలో 14 ఏళ్ల బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. హెచ్‌పీవీ వ్యాక్సిన్‌తో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారించవచ్చన్నారు. జిల్లాలో మొత్తం 5,267 మంది 14 ఏళ్ల బాలికలు ఉండగా.. జిల్లా జనరల్ ఆస్పత్రితో పాటు కల్వకుర్తి, అమ్రాబాద్, ఉప్పునుంతల, లింగాల, అచ్చంపేట, కొల్లాపూర్ సివిల్ ఆస్పత్రుల్లో టీకాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. తల్లిదండ్రులు బాలికలకు తప్పనిసరిగా టీకా వేయించాలని కోరారు. ఏఎన్ఎంలకు సన్మానం.. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో స్థానిక జనరల్ ఆస్పత్రిలో కలెక్టర్ సంతోష్ ఏఎన్ఎంలను సన్మానించారు. అనంతరం ఆశావర్కర్లకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వైద్యరంగంలో మహిళల పాత్ర మరింత బలపడాలన్నారు. ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చేలా సేవలు అందించాలని సూచించారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డా.రవినాయక్, ఆస్పత్రి సూపరింటెండెంట్ డా.శేఖర్, డా.రోహిత్ తదితరులు పాల్గొన్నారు. -
‘హెచ్‌పీవీ’తో గర్భాశయ క్యాన్సర్ నివారణ
అచ్చంపేట రూరల్/ఉప్పునుంతల: మహిళల్లో గర్భాశయ క్యాన్సర్ నివారణ కోసమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమష్టిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ ఉచితంగా అందిస్తున్నట్లు ఎమ్మెల్యే డా.వంశీకృష్ణ అన్నారు. ఆదివారం అచ్చంపేట ప్రాంతీయ ఆస్పత్రి, ఉప్పునుంతల సీహెచ్‌సీలో హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. 9–14 ఏళ్లలోపు బాలికలు తప్పనిసరిగా టీకా వేయించుకోవాలని సూచించారు. ఈ వ్యాక్సిన్‌తో క్యాన్సర్ కారక వైరస్ నుంచి రక్షణ పొందవచ్చన్నారు. అనంతరం జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎమ్మెల్యే కేక్ కట్‌చేసి.. మహిళా వైద్యులు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డా.రవికుమార్, డిప్యూటీ డీఎంహెచ్ఓ డా.తారాసింగ్, డీసీహెచ్ రామకృష్ణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేందర్, సర్పంచ్ చింతగాళ్ల శ్రీనివాసులు, నాయకులు కట్టా అనంతరెడ్డి, తిప్పర్తి నర్సింహారెడ్డి, అంతటి మల్లేశ్ పాల్గొన్నారు. ముంపు నుంచి కాపాడండి చారకొండ: గోకారం ఎత్తిపోతల పథకం సామర్థ్యం తగ్గించి ముంపు ముప్పు నుంచి ఎర్రవల్లి, ఎర్రవల్లి తండాలను కాపాడాలని నిర్వాసితులు కోరారు. ఈ మేరకు ఆదివారం కల్వకుర్తిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎంపీ మల్లు రవి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డిని కలిసి విన్నవించారు. గోకారం ఎత్తిపోతల పథకం సామర్థ్యం తగ్గించి.. తమ గ్రామాలను ముంపు ముప్పు నుంచి మినహాయించాలని మూడు నెలలుగా శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. అయినప్పటికీ తమ గోడును ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోయారు. దీనిపై ఎంపీ మల్లు రవి స్పందిస్తూ.. ఇటీవల జరిగిన రాష్ట్రస్థాయి సమీక్షలో ఎర్రవల్లి, ఎర్రవల్లితండా ప్రజల సమస్యను మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. నిర్వాసితులకు అన్యాయం జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ వైస్‌ఎంపీపీ సాంబయ్యగౌడ్, నిర్వాసితులు పెద్దయ్య, పర్వతాలు, ప్రకాశ్, పర్వతాలు, లాలూనాయక్, సంజీవ నాయక్, రాంపాల్, మోత్య, బిక్కు దేవేందర్ పాల్గొన్నారు. వ్యవసాయంలో మహిళల పాత్ర పెరగాలి బిజినేపల్లి: వ్యవసాయంలో మహిళల పాత్ర మరింత పెరగాల్సిన అవసరం ఉందని పాలెం ఆర్‌ఏఆర్‌ఎస్ ఏడీఆర్ ఎల్.కృష్ణ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో మహిళా రైతులకు అవగాహన సదస్సు ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఏడీఆర్ మాట్లాడుతూ.. వ్యవసాయంలో అత్యాధునిక యాంత్రీకరణ పద్ధతులతో రైతులకు అధిక రాబడి వస్తుందన్నారు. మహిళా రైతులు స్వయం సహాయక సంఘాలుగా ఏర్పడి.. పాడి పరిశ్రమ, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ, సేంద్రియ వ్యవసాయం వంటి వాటితో ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని సూచించారు. వ్యవసాయం ప్రతి మహిళ జీవితంలో భాగం కావాలని.. పొల్లాల్లోనే కాకుండా ఇంటి పరిసరాల్లో కూడా వ్యవసాయం చేయవచ్చన్నారు. దానినే పెరటి వ్యవసాయం అంటారని తెలిపారు. కోళ్లు, చేపలు, గొర్రెల పెంపకంతో పాటు పండ్ల తోటలు, పట్టు పురుగుల పెంపకం వంటి ఎన్నో రంగాలు ఉన్నాయని.. వీటి ఉత్పత్తులను తగిన విధంగా ప్రాసెసింగ్ చేసి విదేశాలకు ఎగుమతి చేయవచ్చన్నారు. పూర్వం ప్రతి మహిళ జీవితంలో వ్యవసాయం ఒక భాగంగా ఉండేదని.. ఇప్పుడు కూడా అదే పద్ధతిని ఆధునికంగా తమ జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు. అనంతరం సేంద్రియ వ్యవసాయం, వివిధ పంటల్లో అధిక దిగుబడులు, పరిశోధనల్లో సత్ఫలితాలు సాధించిన మహిళా రైతులను ఆయన శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు కాడ సిద్దప్ప, డా.పద్మశ్రీ, శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
సేవల్లో సాంకేతికత..!
విద్యుత్‌శాఖ సరికొత్తగా టెక్నాలజీ వినియోగం వాట్సప్ ద్వారా ఫిర్యాదులు ఇలా.. వినియోగదారులు తమ మొబైల్ ఫోన్లో 87124 41912 నంబర్‌ను సేవ్ చేసుకుని.. వాట్సప్‌లో హాయ్ అని మెసేజ్ పంపాలి. వెంటనే ఎస్పీడీసీఎల్ కాల్ సెంటర్‌కు స్వాగతం అని మెసేజ్ వస్తుంది. ఇందులోనే రిజిస్టర్ కంప్లెయిట్, ట్రాక్ కంప్లెయిట్, చాట్ ఏజెంట్ అనే ఆప్షన్లు వస్తాయి. రిజిస్టర్ కంప్లెయిట్ సెలెక్ట్ చేశాక.. మీ విద్యుత్ కనెక్షన్ వివరాలు ఉన్నా.. లేకున్నా ఫిర్యాదు చేయవచ్చు. నిరంతర సమీక్షల ద్వారా ఫిర్యాదులకు త్వరగా పరిష్కారం చూపడంతో పాటు వినియోగదారుల అభిప్రాయాలను కూడా సేకరిస్తూ.. సేవల మెరుగుదలపై చర్యలు తీసుకొనున్నారు. అచ్చంపేట/కల్వకుర్తి టౌన్: విద్యుత్ వినియోగదారులకు మరింత వేగవంతంగా, పారదర్శకంగా సేవలు అందించేందుకు విద్యుత్‌శాఖ సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగిస్తోంది. వినియోగదారుల సమస్యలను సత్వరమే పరిష్కరించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. అందులో భాగంగా డిజిటల్ సేవలను ఆధునికీకరిస్తోంది. ఫిర్యాదుల స్వీకరణ నుంచి మొదలుకొని.. సమస్యల పరిష్కారం వరకు మొత్తం ప్రక్రియను సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా నిర్వహించడంతో సేవల నాణ్యత మెరుగుపడుతోందని సంబంధిత అధికారులు చెబుతున్నారు. వినియోగదారులకు డిజిటల్ సేవలు అందుబాటులోకి టోల్‌ఫ్రీ 1912 వాట్సప్‌లోనూ కరెంటు సమస్యలు తెలియజేసే అవకాశం -
‘పాలమూరు’ను.. 20 నెలల్లో పూర్తిచేస్తాం
● కృష్ణానదిలో మన వాటా నీటిలో బొట్టు కూడా వదిలిపెట్టం ● రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడి ● సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై సమీక్షా సమావేశం ● హాజరైన ఉమ్మడి జిల్లాలోని మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని వచ్చే 20 నెలల్లో పూర్తిచేస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. ఉమ్మడి పాలమూరులోని ముఖ్యమైన ప్రాజెక్టుల పనులను వేగవంతం చేసి రైతులకు సాగునీటిని అందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. ఆదివారం హైదరాబాద్‌లో ఉమ్మడి మహబూబ్‌నగర్‌లోని సాగునీటి ప్రాజెక్టులపై నిర్వహించిన సమీక్ష సమావేశానికి ఆయన అధ్యక్షత వహించగా.. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, ఎకై ్సజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, పశుసంవర్ధక, మత్స్య, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిలసాగర్ ప్రాజెక్టుల పనులను 2027 మార్చి నాటికి పూర్తిచేస్తామని స్పష్టం చేశారు. తెలంగాణకు కృష్ణానదిలో ఉన్న హక్కు మేరకు నీటిని పూర్తిగా వినియోగించుకుంటామని, ఒక్క బొట్టు కూడా వదిలిపెట్టమని తేల్చిచెప్పారు. ఈ క్రమంలోనే ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టుల పనులను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తుందన్నారు. వచ్చే ఏడాది కాలంలో కల్వకుర్తి ప్రాజెక్టుకు రూ.909 కోట్లు, నెట్టంపాడుకు రూ.252 కోట్లు, భీమాకు రూ.200 కోట్లు, కోయిల్‌సాగర్‌కు రూ.185 కోట్లు కేటాయించామని చెప్పారు. ఈ పనులను మిషన్ మోడ్‌లో పూర్తి చేసేందుకు భూ సేకరణ, పునరావాస చర్యలను వేగవంతం చేస్తున్నామని వివరించారు. జూరాల ప్రాజెక్టు డీసిల్టింగ్ జూరాల ప్రాజెక్టులో డీసిల్టింగ్ పనులను వెంటనే చేపట్టాలని సాగునీటి శాఖ అధికారులకు మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి ఆదేశించారు. 1995లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు మొదట 11.94 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకున్నా.. మట్టిపూడిక కారణంగా ప్రస్తుతం 9 టీఎంసీలకు చేరిందన్నారు. డీసిల్టింగ్ ద్వారా తీసే ఇసుకను గోదావరి పరివాహక ప్రాంతంలోని ఇతర సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో వినియోగించే అవకాశాన్ని పరిశీలించాలని సూచించారు. ఇటీవల వానాకాలం సీజన్లో రాష్ట్రంలో 148.5 లక్షల మె.ట., ధాన్యం ఉత్పత్తి నమోదు కావడం దేశంలోనే రికార్డు అన్నారు. అలాగే సుమారు 72 లక్షల మె.ట., ధాన్యాన్ని కొనుగోలు చేసి.. రైతుల ఖాతాల్లో రూ.20 వేల కోట్లు జమ చేశామని చెప్పారు. సమావేశంలో ఎంపీ డీకే అరుణ, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ప్రభుత్వ ఇరిగేషన్ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, ఇరిగేషన్ శాఖ సెక్రటరీ ఈ.శ్రీధర్, ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు. -
వంటగ్యాస్ ధరలు తగ్గించాలని రాస్తారోకో
బల్మూర్: ప్రభుత్వం పెంచిన వంటగ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం బల్మూర్ మండల కేంద్రంలో సీపీఎం నాయకులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్ధం పర్వతాలు, కార్యదర్శివర్గ సభ్యుడు దేశానాయక్ మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాకముందు వంటగ్యాస్ సిలిండర్ ధర రూ. 500 ఉండగా.. ప్రస్తుతం రూ.వెయ్యికి పెరిగిందన్నారు. బీజేపీ ప్రభుత్వం ఇష్టానుసారంగా ధరలు పెంచుతూ.. పేదలపై పెనుభారం మోపడం సరైంది కాదన్నారు. పెంచిన వంటగ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి శంకర్‌నాయక్, ఎండీ లాల్ ఆహ్మద్, బాబర్, ఆంజనేయులు, శ్రావణ్ కుమార్, శేఖర్, రాములు తదితరులు పాల్గొన్నారు. -
జోగుళాంబ క్షేత్రం మహిమాన్విత శక్తిపీఠం
అలంపూర్: జోగుళాంబ అమ్మవారి క్షేత్రం మహిమాన్విత శక్తిపీఠం అని శృంగేరి పీఠాధిపతులు జగద్గురు శంకరాచార్య విధుశేఖర భారతీస్వామి అన్నారు. విజయ యాత్రలో భాగంగా శుక్రవారం రాత్రి క్షేత్రానికి చేరుకున్న ఆయన శనివారం ఉదయం ఆలయాలను దర్శించుకున్నారు. ఆలయ అధికారులు అర్చక స్వాములతో కలిసి శృంగేరి పీఠాధిపతులను పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శృంగేరి పీఠాధిపతులు జోగుళాంబ ఆలయంలో శ్రీచక్రార్చనలు, కుంకుమార్చనలు, ప్రత్యేక పూజలు, బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో అభిషేకాలు, విశేష పూజలు చేశారు. స్థానికంగా ఉన్న కన్యకాపరమేశ్వరి ఆలయాన్ని సందర్శించి అక్కడ పూజలు నిర్వహించారు. పూజల అనంతరం క్షేత్ర పరిసరాల్లోని నవ బ్రహ్మ, కంచి కామాక్షమ్మ ఆలయాలను సందర్శించి.. శిల్పకళా నైపుణ్యాలను పరిశీలించారు. అలాగే పురావస్తు శాఖ మ్యూజియానికి వెళ్లి అక్కడి ప్రాచీన శిల్పాలు, విగ్రహాలను పరిశీలించడం జరిగింది. అనంతరం జోగుళాంబ అమ్మవారి ఆలయంలో భక్తులకు ప్రవచనం చేశారు. ఎమ్మెల్యే విజయుడు శృంగేరి పీఠాధిపతులను దర్శనం చేసుకున్నారు. క్షేత్ర అభివృద్ధిపై పీఠాధిపతులకు వినతిపత్రం అందజేశారు. శృంగేరి పీఠాధిపతులు భారతీస్వామి -
మహిళల భద్రతే ధ్యేయం
● వారి రక్షణ కోసం పోలీస్ శాఖ నిరంతరం కృషి ● వేధింపులపై బాధితులు నిర్భయంగా ఫిర్యాదు చేయండి ● ‘సాక్షి’తో ఏఎస్పీ వెంకటేశ్వర్లు నాగర్‌కర్నూల్ క్రైం: మహిళల భద్రతే ధ్యేయమని, ఇందుకోసం పోలీసు శాఖ నిరంతరం కృషిచేస్తుందని, మహిళలను ఎవరైనా వేధింపులకు గురిచేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఏఎస్పీ నోముల వెంకటేశ్వర్లు అన్నారు. తమకు ఎదురైన వేధింపులపై బాధితులు నిర్భయంగా పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. జిల్లాలో షీటీం, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ టీంతోపాటు భరోసా కేంద్రం సిబ్బంది పనిచేస్తున్నారని, మహిళలకు అపరిచితుల నుంచి ఎదురయ్యే సమస్యలను ఎలా గుర్తించాలనే విషయాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఆదివారం ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ఏఎస్పీ వెంకటేశ్వర్లు ‘సాక్షి’తో ముఖాముఖిగా మాట్లాడారు. ఉమెన్ హెల్ప్ డెస్క్‌లు.. జిల్లాలోని 22 పోలీస్స్టేషన్లకు వస్తున్న బాధిత మహిళల రక్షణ కోసం ఏర్పాటు చేసిన ఉమెన్ హెల్ప్ డెస్క్‌లు నిరంతరం కృషి చేస్తున్నాయని ఏఎస్పీ వెల్లడించారు. బాధిత మహిళల నుంచి వచ్చే ఫిర్యాదులు స్వీకరించడంతోపాటు కేసులు నమోదు చేయడం, నిందితులకు చట్టపరంగా శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటున్నారు. డయల్ 100కు ఫిర్యాదు.. మహిళలపై వేధింపులు జరిగితే బాధితులు నేరుగా పోలీస్స్టేషన్లకు వచ్చి ఫిర్యాదు చేయవచ్చు. ఎవరైనా పోలీస్స్టేషన్లకు వచ్చేందుకు ఇబ్బందిపడితే డయల్ 100, జిల్లా షీటీం సెల్ నం.87126 57676కు సైతం సమాచారం అందించవచ్చు. భరోసా కేంద్రం, షీటీంలు.. మహిళపై నేరాలు జరిగినప్పుడు బాధితులకు న్యాయం జరిగేలా చూస్తాం. పోక్సో, అత్యాచార కేసుల్లో బాధిత మహిళలు, చిన్నారులను భరోసా కేంద్రానికి తరలించి అవసరమైన వైద్యం చేయిస్తాం. బాధితుల నుంచి స్టేట్మెంట్ రికార్డు చేసి కోర్టులో న్యాయం జరిగేలా చూస్తాం. మహిళల రక్షణ కోసం షీటీంలో సీఐ పర్యవేక్షణలో మహిళా ఎస్ఐ, మహిళా ఏఎస్ఐ, ఏడు మంది మహిళా కానిస్టేబుళ్లు పనిచేస్తున్నారు. అవగాహన కార్యక్రమాలు.. మహిళలు, చిన్నారులపై నేరాలు జరగకుండా ఉండటం కోసం పోలీసుశాఖ ఆధ్వర్యంలో పాఠశాలలు, కళాశాలలు, బస్టాండ్లు, ఇతర రద్దీ ప్రాంతాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. బస్టాండ్, రద్దీ ప్రాంతాల్లో ఈవ్‌టీజింగ్ జరగకుండా ఉండటం కోసం ప్రతిరోజు మఫ్టీలో పోలీసులు ఉంటారు. సోషల్ మీడియా ద్వారా మహిళలపై వేధింపులు పెరిగిపోతున్నాయి. మహిళలు, చిన్నారులు తమ సోషల్ మీడియా అకౌంట్లలో ఫొటోలతోపాటు వ్యక్తిగత వివరాలు పోస్టు చేస్తుండటంతో సైబర్ నేరస్తులు వేధింపులకు పాల్పడున్నారు. సోషల్ మీడియాలో ఫొటోలు, వ్యక్తిగత వివరాలు పోస్టు చేయకూడదు. -
బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమీక్ష
చారకొండ: రెండో భద్రాద్రిగా పేరుగాంచిన సిర్సనగండ్ల సీతారామచంద్రాస్వామి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. ఈ నెల 25 నుంచి ఏప్రిల్ 6 వరకు నిర్వహించనున్న బ్రహ్మోత్సవాల నిర్వహణపై శనివారం ఆలయ పాలక మండలితో కలిసి రెవెన్యూ, పోలీసు, ఆర్‌డబ్ల్యూస్, ఆర్టీసీ, పైర్, విద్యుత్ తదితర అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మట్లాడుతూ .. ఆయా శాఖల అధికారులు సమన్వయంతో ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. ముఖ్యంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. ఆలయం వద్ద మౌలిక వసతులు కల్పించాలని సూచించారు. ఆలయ ప్రాంగణంలో కోనేరు, మరుగుదొడ్లు, తాగునీరు, పారిఽశుద్ధ్యం, విద్యుత్ సరాఫరా, ట్రాఫిక్ నియంత్రణ, చలువ పందిళ్ల ఏర్పాటుపై శ్రద్ధ వహించాలని పాలక మండలికి సూచించారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే సీతారామచంద్రాస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ చైర్మన్ రామశర్మ, మండల నాయకులు ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో ఆలయ మాజీ చైర్మన్ మల్లికార్జునశర్మ, ఈఓ స్వర్గం ఆంజనేయులు, సర్పంచ్ కామల్ల రామస్వామి, ఆలయ మేనేజర్ నిరంజన్, కల్వకుర్తి ఆర్డీఓ శ్రీనివాస్‌రెడ్డి, డీఎస్పీ సైరెడ్డి వెంకట్‌రెడ్డి, సీఐ రఘువీర్‌రెడ్డి, ఎకై ్సంజ్ సీఐ వెంకట్‌రెడ్డి, తహసీల్దార్ ఉమా, ఎంపీడీఓ శంకర్‌నాయక్, అధికారులు, నాయకులు పాల్గొన్నారు. -
మహిళా ఉద్యోగులకు క్రీడా పోటీలు
మన్ననూర్: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం మన్ననూర్లోని ఎఫ్డీఓ కార్యాలయ ఆవరణలో అటవీశాఖ మహిళా సిబ్బందికి ఆటల పోటీలు నిర్వహించారు. అమ్రాబాద్ పులుల రక్షిత అభయారణ్యం పరిసర ప్రాంతంలోని వివిధ రేంజ్‌లకు చెందిన 50 మంది మహిళా ఉద్యోగులు హాజరయ్యారు. ఈ సందర్భంగా డీఎఫ్ఓ రేవంత్‌చంద్ర అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు వక్తలు మాట్లాడారు. అటవీశాఖ ఉద్యోగులు విధుల నిర్వహణలో ప్రత్యేకించి మహిళా సిబ్బంది ఎదుర్కొంటున్న పలు సమస్యలను డీఎఫ్ఓ దృష్టికి తెచ్చారు. స్పందించిన ఆయన ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి కొంత మేరకై న పరిష్కరించేందు తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో స్వేచ్ఛాయుతమైన వాతావరణం కల్పించే దిశగా సఫారీ వాహనాలలో పర్యటన కోసం మహిళా ఉద్యోగులు అటవీ పరిసర ప్రాంతాలకు తరలివెళ్లారు. అంతకు ముందు వివిధ క్రీడల్లో పాల్గొని ప్రతిభ కనబరిచిన మహిళా ఉద్యోగులకు డీఎఫ్ఓ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఎఫ్ఆర్ఓలు వీరేష్, దుర్గాప్రసాద్, ఈశ్వర్, రవికుమార్, శ్రీకాంత్, హన్మంత్ తదితరులు పాల్గొన్నారు. -
జోగుళాంబ క్షేత్రానికి శృంగేరి పీఠాధిపతి
అలంపూర్: పట్టణంలోని జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వరస్వామి క్షేత్రానికి శృంగేరి పీఠాధిపతి జగద్గురు శంకరాచార్య విధుశేఖర భారతిస్వామి శుక్రవారం రాత్రి చేరుకున్నారు. ఈ సందర్భంగా శృంగేరి పీఠాధిపతికి అలంపూర్ చౌరస్తా సమీపంలోని పుల్లూరు టోల్‌ప్లాజా వద్ద అర్చక స్వాములు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి పీఠాధిపతులు అలంపూర్‌కు వచ్చారు. క్షేత్రానికి చేరుకున్న పీఠాధిపతులకు అర్చక స్వాములు, అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పీఠాధిపతులు శ్రీజోగుళాంబ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో పీఠాధిపతులకు పాదుకా పూజలు నిర్వహించారు. అనంతరం శృంగేరి పీఠాధిపతులు జగద్గురు శంకరాచార్య విధుశేఖర భారతిస్వామి ఆలయ ప్రాంగణంలోని కుంకుమార్చన మండపంలో చంద్రమౌలీశ్వర ఆరాధన, శ్రీచక్రార్చన పూజలు నిర్వహించారు. ఉదయం బాలబ్రహ్మేశ్వరస్వామి, జోగుళాంబదేవి ఆలయా ల్లో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. -
పరిసరాల పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత
కందనూలు: పరిసరాల పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. ప్రజా పాలన– ప్రగతి కార్యాచరణ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన మొదటి థీమ్ ‘పరిశుభ్రత’ కార్యక్రమాన్ని శుక్రవారం కలెక్టరేట్లో ఆవరణలో కలెక్టర్ స్వయంగా చీపురు పట్టి అధికారులతో కలిసి పరిశుభ్రత కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’లో భాగంగా శుక్రవారం నుంచి ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. కార్యాలయ పరిసరాలు, గదులు, రికార్డు గదులు పరిశుభ్రంగా ఉంచాలని, అలాగే కార్యాలయాల్లో ఉన్న పెండింగ్ ఫైల్స్ త్వరితగతిన క్లియర్ చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు సంబంధించిన ఫైళ్లు ఎక్కువకాలం పెండింగ్‌లో ఉండకుండా వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పరిశుభ్రత కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ పారిశుద్ధ్య కార్మికుల సేవలను అభినందిస్తూ, సమాజ ఆరోగ్య రక్షణలో వారి పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఏఓ చంద్రశేఖర్, వివిధ శాఖల అధికారులు రమేష్‌కుమార్, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. -
ప్రగతి ప్రణాళికతో ప్రజల్లోకి..
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి విజయవంతం చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ, జిల్లా ఇన్చార్జి మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. శుక్రవారం మహబూబ్‌నగర్ కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమం అమలుపై సన్నాహాక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామసభల్లో తాగునీటి సమస్యను ప్రజలు ప్రస్తావించే అవకాశం ఉందని, ఇందుకు గాను ముందుగానే అధికారులు తాగునీటి సమస్య పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. గడిచిన రెండున్నరేళ్లలో గ్రామాల్లో ప్రభుత్వ పథకాల లబ్ధిపొందిన వారి వివరాలను గ్రామసభల్లో వెల్లడించాలని సూచించారు. లబ్ధిదారుల జాబితా, నోడల్ అధికారుల జాబితా, దరఖాస్తుల వివరాలను అధికారులు మంత్రులు, ఎమ్మెల్యేలకు ఇవ్వాలని స్పష్టం చేశారు. 46 లక్షల మంది మహిళలకు హెల్త్ ప్రొఫైల్ తయారు చేస్తున్నామన్నారు. ఉమ్మడి పాలమూరులోని ఐదు జిల్లాల్లో ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ఒక్కోరోజు తాను పాల్గొంటానని పేర్కొన్నారు. ఇందులో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఉన్నాయని, 99 రోజుల కార్యక్రమానికి అనుగుణంగా పక్కా ప్రణాళికతో ముందుకెళ్లాలని సూచించారు. సీఎం రేవంత్‌రెడ్డి సైతం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉందన్నారు. అటవీ పోడు భూముల సమస్య పరిష్కారానికి రెవెన్యూ, అటవీ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఆస్పత్రుల అభివృద్ధి కమిటీల సమావేశాలు నిర్వహించేలా చూస్తామన్నారు. ‘ప్రజాపాలన’ కార్యక్రమాన్నివిజయవంతం చేయాలి 99 రోజుల ప్రత్యేక కార్యాచరణతో ముందుకు.. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ -
‘ఖిల్లా’ ఎంపీడీఓకు సైతం..
వనపర్తి జిల్లా ఖిల్లాఘనపురం మండల ఎంపీడీఓ విజయసింహారెడ్డి సివిల్స్‌లో మెరిశారు. హైదరాబాద్‌లోని మనికొండలో నివాసం ఉంటున్న అంజిరెడ్డి, అలివేలు దంపతులకు ఇద్దరు కుమారులు విజయసింహారెడ్డి, విక్రంసింహారెడ్డి ఉన్నారు. అన్నదమ్ములిద్దరూ ఒకేసారి గ్రూప్–1లో కొలువులు సాధించాడు. ఇప్పుడు కూడా అన్న విజయసింహారెడ్డి సివిల్స్‌లో ఆలిండియా 682వ ర్యాంక్ సాధించగా.. ఆయన తమ్ముడు విక్రమ్‌సింహారెడ్డి కూడా 541 ర్యాంక్ సాధించారు. విషయం తెలిసిన వెంటనే ఖిల్లాఘనపురంలో ఎంపీడీఓ కార్యాలయం సిబ్బంది విజయసింహారెడ్డికి స్వీట్లు తినిపించి.. అభినందనలు తెలిపారు. అలాగే బీజేపీ నాయకులు ఆయనను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. -
40 ఎకరాలు కౌలుకు..
నేను 40 ఎకరాల తోటలను కౌలుకు తీసుకున్నాను. కౌలు అడ్వాన్సు, పురుగు మందులకు ఇప్పటికే రూ.50 లక్షలకు పైగా ఖర్చు చేశాను. జనవరిలో వచ్చిన పూతలన్నీ రాలిపోయాయి. నల్లిపురుగు ఒక రకంగా పూతలను దెబ్బతీసింది. ఉదయం పూట వచ్చే మంచు కాగు మరో కారణమైంది. కౌలుకు తీసుకున్న తోటల్లో ఎక్కడా పిందెలు కనిపించడం లేదు. మామిడి రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలి. – పెద్దూరి లక్ష్మయ్య, మామిడి రైతు, కొల్లాపూర్ ఈసారి మామిడి పూతలు బాగా వచ్చాయి. కానీ, పూత, పిందెలు నిలవలేదు. డిసెంబర్, జనవరి నెలల్లో వరి, మినుము పంటలు ఒకేసారి కోతలకు వచ్చాయి. ఆయా పంటలకు ఉన్న నల్లి మొత్తం మామిడి తోటలపైకి సోకింది. దీంతో పెద్దమొత్తంలో మామిడి పూతలు దెబ్బతిన్నాయి. వాతావరణంలో మార్పులు కూడా పంట దెబ్బతినడానికి కారణమైంది. వారం రోజుల క్రితం వరకు మంచు కాగు పట్టింది. ప్రస్తుతం ఉన్న పిందెలను కాపాడుకునేందుకు రైతులు సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. – లక్ష్మణ్, ఉద్యానవన అధికారి, కొల్లాపూర్ ● -
సివిల్స్‌లో మెరిసిన పాలమూరు బిడ్డ
● గతేడాది ఆలిండియా 700వ ర్యాంక్.. ఈసారి 358వ ర్యాంక్ ● గ్రూప్–1లోనూ 27 ర్యాంక్.. ప్రస్తుతం నల్లగొండ డిప్యూటీ కలెక్టర్‌గా ఉద్యోగం ● ఐఏఎస్ కావడమే లక్ష్యమంటున్న వెంకటేష్ ● ఖిల్లాఘనపురం ఎంపీడీఓకు విజయసింహారెడ్డికి 682వ ర్యాంక్ అడ్డాకుల/ఖిల్లాఘనపురం: అఖిల భారత సర్వీసుల్లో నియామకాలకు నిర్వహించిన సివిల్స్ పాలమూరు బిడ్డ మరోసారి సత్తా చాటాడు. మహబూబ్‌నగర్ జిల్లా మూసాపేట మండలం నిజాలాపూర్ గ్రామానికి చెందిన ఎం.వెంకటేష్‌ప్రసాద్ సాగర్ మొదటి ప్రయత్నంలో 700 ర్యాంక్ సాధించగా.. రెండో ప్రయత్నంలో మరింత మెరుగుపరుచుకొని 358 ర్యాంక్‌ను సొంతం చేసుకున్నారు. వనపర్తి జిల్లా ఖిల్లాఘనపురం మండల ఎంపీడీఓగా విధులు నిర్వర్తిస్తున్న విజయసింహారెడ్డి (రంగారెడ్డి జిల్లా)ఆలిండియా 682వ ర్యాంక్ సాధించారు. పట్టుదలతో చదివి ర్యాంకులు.. నిజాలాపూర్ గ్రామానికి చెందిన మునుగల్ఛేడ్ సత్యయ్య, యశోద దంపతుల కుమారుడైన ఎం.వెంకటేష్ ప్రసాద్ హైదరాబాద్‌లోని పటాన్చెరువు శ్రీసాయి పబ్లిక్ స్కూల్లో 1, 2వ తరగతులు, 3వ తరగతి కొత్తకోటలోని జీటీ నారాయణ, 4 నుంచి 10వ తరగతి వరకు మహబూబ్‌నగర్‌లోని చైతన్య సెంట్రల్ స్కూల్లో చదివారు. తర్వాత ఆంధ్రప్రదేశ్‌లోని పుట్టపర్తిలో శ్రీ సత్యసాయి విద్యా సంస్థల్లో ఇంటర్(ఎంపీసీ), డిగ్రీ(బీఎస్సీ ఫిజిక్స్), పీజీ పూర్తి చేశారు. వెంకటేష్ ప్రసాద్ తండ్రి సత్యయ్య ప్రస్తుతం కోయిలకొండ మండలంలో ట్రాన్స్‌కో ఏఈగా విధులు నిర్వహిస్తున్నాడు. తల్లి యశోద గృహిణి. వీరు మహబూబ్‌నగర్‌లోని శేషాద్రినగర్‌లో నివాసముంటున్నారు. గతేడాది సివిల్స్‌లో 700వ ర్యాంకు సాధించిన వెంకటేష్.. ఈ సారి సత్తా చాటి 358వ ర్యాంక్ పొందాడు. 2025లో విడుదలైన గ్రూప్–1 ఫలితాల్లో 27వ ర్యాంకు సాదించాడు. గతేడాది సెప్టెంబర్ 27న డిప్యూటీ కలెక్టర్‌గా ఉత్తర్వు అందుకున్న ఆయన అదేనెల 29న నల్లగొండ జిల్లా డిప్యూటీ కలెక్టర్‌గా విధుల్లో చేరాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లో గ్రూప్–1 అధికారుల శిక్షణలో ఉన్నాడు. ‘ఐఏఎస్ సాధించడమే లక్ష్యం. మరోసారి ప్రయత్నించి.. ఐఏఎస్ సాధిస్తా.’ అనే ధీమా వ్యక్తం చేస్తున్నారు వెంకటేష్ ప్రసాద్. -
స్కానింగ్ సెంటర్లోనే ప్రసవం!.. గంగరాజుపై పోక్సో కేసు
నాగర్‌కర్నూల్ క్రైం: మైనర్‌ను శారీరకంగా వాడుకుని ప్రసవానికి కారణమైన యువకుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ బుర్రి శ్రీనివాస్ తెలిపారు. ఈనెల 2న జిల్లాకేంద్రంలోని ఓ స్కానింగ్ సెంటర్లోని బాత్రూంలో మైనర్ బాలిక ప్రసవమైన సంఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. కొల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన ఓ మైనర్ సమీప బందువు ప్రేమపేరిట మాయమాటలు చెప్పి శారీరకంగా లోబర్చుకోవడంతో గర్భం దాల్చింది. సదరు వేసవి సెలవుల అనంతరం కేజీబీవీ హాస్టల్‌కు వెళ్లి అక్కడే ఉంటుంది. గర్భిణీ అనే విషయం దాచిపెట్టి కళాశాల అధ్యాపకులు, సిబ్బందికి కాలు ఫ్యాక్చర్ అయిందని, హాస్టల్ భోజనంతోనే లావు అవుతున్నానని సమాధాం చెబుతూ వస్తోంది. ఈ క్రమంలోనే ఈ నెల 2వ తేదీన బాలికకు కడుపు నొప్పి రావడంతో స్కానింగ్ కోసం జిల్లాకేంద్రంలోని ఓ ప్రైవేటు స్కానింగ్ సెంటర్‌కు రావడంతో అక్కడే ప్రసవం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు స్కానింగ్ సెంటర్‌కు వెళ్లి తల్లి, మగ శిశువును జనరల్ ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందించారు. తొలుత ఓ మైనర్ బాలుడిని తీసుకొచ్చి విచారణ జరపగా.. తాను ఎలాంటి తప్పు చేయలేదని ఆ బాలుడు పోలీసులకు చెప్పాడు. దీంతో బాలికను మరోసారి పోలీసులు గట్టిగా నిలదీసి.. వివరాలు సేకరించారు. తన ఇంటి సమీపంలో ఉన్న బంధువు గంగరాజు కారణమని బాలిక చెప్పడంతో... అతని గంగరాజును అదుపులోకి తీసుకొని విచారించారు. ప్రేమపేరుతో మాయమాటలు చెప్పి బాలికను శారీరకంగా లోబర్చుకోవడం వల్లే తల్లి అయిందని విచారణలో తేలడంతో నిందితుడి గంగరాజుపై పోక్సో, అత్యాచారం కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. కాగా.. నిందితుడికి ఇది వరకే పెళ్లి అయి.. ఇద్దరు పిల్లలున్నారు. -
యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు
వెల్దండ: రైతులను యూరియా కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఫర్టిలైజర్ యాప్‌తో ఒక్క బస్తా యూరియా కూడా దొరక్కపోవడంతో ఆగ్రహానికి గురైన రైతులు బుధవారం వెల్దండ మండల కేంద్రంలో హైదరాబాద్–శ్రీశైలం జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే.. స్థానిక ఆగ్రో రైతు సేవాకేంద్రంలో 300 బస్తాలు, సింగిల్‌విండోలో 400 బస్తాల యూరియా అందుబాటులో ఉంటుందని రైతులకు సమాచారం అందించడంతో వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఫర్టిలైజర్ యాప్‌లో యూరియా బుకింగ్ చేసుకునేందుకు రైతులు ప్రయత్నించగా.. క్షణాల్లోనే నో స్టాక్ అని చూపడంతో ఆగ్రహానికి గురయ్యారు. సమీపంలోని ప్రధాన రహదారిపైకి రైతులు చేరుకొని ఆందోళనకు దిగారు. ఒక్క నిమిషంలోనే 700 బస్తాల యూరియా బుకింగ్ కావడం ఏమిటని ప్రశ్నించారు. దళారులు యూరియాను బుక్ చేసుకొని రైతులకు బ్లాక్‌లో అధిక ధరలకు విక్రయిస్తున్నారని ఆరోపించారు. పాత పద్ధతిలోనే రైతులకు యూరియా అందించాలని డిమాండ్ చేశారు. కాగా, రైతుల ఆందోళనతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న ఏఓ శోభారాణి, ఎస్ఐ కురుమూర్తి అక్కడికి చేరుకొని రైతులకు నచ్చజెప్పారు. జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లి యూరియా సమస్య లేకుండా చూస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. -
‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’పై నిర్లక్ష్యాన్ని సహించం
● జిల్లాలో విజయవంతంగా నిర్వహించాలి ● కలెక్టర్ బదావత్ సంతోష్ కందనూలు: జిల్లాలో ఈ నెల 6 నుంచి జూన్ 12వ తేదీ వరకు నిర్వహించనున్న ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమాన్ని అన్ని శాఖల అధికారులు విజయవంతంగా నిర్వహించాలని.. నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ బదావత్ సంతోష్ హెచ్చరించారు. బుధవారం కలెక్టరేట్లోని వీసీ హాల్లో అదనపు కలెక్టర్లు అమరేందర్, దేవసహాయం, ఏఎస్పీ వెంకటేశ్వర్లుతో కలిసి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికపై కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరువయ్యే విధంగా రూపొందించిన ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని విజయవంతం చేయడం ప్రతి అధికారి బాధ్యత అని అన్నారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు, సేవలు సమర్థవంతంగా అందేలా కృషి చేయాలని సూచించారు. ప్రతి శాఖకు కేటాయించిన లక్ష్యాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని.. ఇందుకు గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజా సమస్యలను వేగంగా పరిష్కరించడం.. పెండింగ్ దరఖాస్తులను క్లియర్ చేయడం, అభివృద్ధి పనులను వేగవంతం చేయడం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అదే విధంగా అధికారులు సమయపాలన పాటించాలని.. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పని కలెక్టర్ హెచ్చరించారు. మెరుగైన వైద్యం అందించాలి.. తాడూరు: ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి వచ్చే ప్రజలకు వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉంటూ.. మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ ఆదేశించారు. తాడూరు పీహెచ్‌సీని ఆయన ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలోని పలు విభాగాలను పరిశీలించడంతో పాటు రోగులతో స్వయంగా మాట్లాడి.. చికిత్స విధానం, జౌషధాల లభ్యతపై ఆరా తీశారు. వైద్యపరీక్షల నిర్వహణలో ఆలస్యం చేయొద్దని సిబ్బందికి సూచించారు. అవసరమైన మందులు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. అంతకు ముందు స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కొనసాగుతున్న ఇంటర్ పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేశారు. కేంద్రంలో విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలు, సీసీ నిఘా, పోలీసు బందోబస్తు తదితర వాటిని పరిశీలించారు. మాల్ ప్రాక్టీస్‌కు ఆస్కారం లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కలెక్టర్ వెంట ఇంటర్మీడియట్ నోడల్ అధికారి వెంకటరమణ ఉన్నారు. -
ఇంటర్ పరీక్షలకు 189 మంది గైర్హాజరు
కందనూలు: జిల్లాలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. బుధవారం జిల్లావ్యాప్తంగా 34 పరీక్ష కేంద్రాల్లో ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మ్యాథ్స్, బాటనీ, పొలిటికల్ సైన్స్ పరీక్షలు నిర్వహించగా.. 6,125 మందికి గాను 5,936 మంది హాజరయ్యారు. జనరల్‌లో 4,712 మందికి గాను 4,580 మంది, ఒకేషనల్ విభాగంలో 1,413 మందికి గాను 1,356 మంది హాజరై పరీక్ష రాశారు. జనరల్ విభాగంలో 132 మంది, ఒకేషనల్ విభాగంలో 57 మంది గైర్హాజరయ్యారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశామని డీఐఈఓ వెంకటరమణ తెలిపారు. దేశం ఉన్నత స్థానంలో ఉంటేనే మనకు రక్ష కొల్లాపూర్: దేశం ఉన్నత స్థానంలో ఉంటేనే మనకు రక్ష అని.. ప్రతి వ్యక్తి దేశం బాగుండాలనే ఆలోచనతో ముందుకుసాగాలని మహా సహస్రావధాని గరికపాటి నర్సింహారావు అన్నారు. ధార్మిక విధాన పరిషత్ ఆధ్వర్యంలో కొల్లాపూర్‌లోని వాసవీ కల్యాణ మండపంలో ఏర్పాటుచేసిన ప్రవచన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ముందుగా పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆత్మీయ బంధం–ఆత్మకు సుగంధం అనే అంశంపై ఆయన ప్రసంగించారు. నేటి తరం పిల్లలకు కుటుంబ విలువలు నేర్పాల్సిన అవసరం ఉందన్నారు. కొందరు ఎన్ఆర్ఐలు మీరు వద్దు.. మీ ఆస్తులు వద్దు అనే నినాదంతో కుటుంబాన్ని వదిలేసుకోవడం ఆందోళనకరమైన అంశమన్నారు. విదేశీయులు మన కుటుంబ వ్యవస్థ, ఆతిధ్య లక్షణాలను పాటిస్తుంటే.. ఇక్కడి వారు మాత్రం విదేశీ మోజులో పడి, విడాకుల వ్యవస్థ, కాంట్రాక్టు మ్యారేజ్ వ్యవస్థలను తీసుకువస్తున్నారన్నారు. ప్రపంచం మొత్తం యుద్ధాలతో అల్లాడుతుంటే.. మన దేశం మాత్రం ప్రశాంతంగా ఉందన్నారు. ఇందుకు కారణం పాలకులు రాజనీతి, అలీన విధానాలు, పంచశీల సూత్రాలు పాటించడమేనని అన్నారు. మేడ్ ఇన్ ఇండియా విధానానికి అందరూ ప్రాధాన్యం ఇవ్వాలని.. స్వదేశీ ఉత్పత్తులను కొనాలని ఆయన పిలుపునిచ్చారు. దేశంలో ప్రభుత్వ విద్యా రంగాన్ని బలోపేతం చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ శ్రమించాలని కోరారు. అనంతరం గరికపాటిని పలువురు నాయకులు శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రెడ్డి జ్యోతి సత్యనారాయణ, వైస్ చైర్మన్ షేక్ రహీంపాషా, కౌన్సిలర్లు ఖాదర్ పాషా, లహరి వేణుగోపాల్‌గౌడ్, మానపాడు నర్సింహ, సాయిరాంయాదవ్, నాయకులు వెంకటస్వామి, సుదర్శన్‌శెట్టి, రాజశేఖర్, శేషయ్య, కొండా శ్రీనివాసులు, స్వామిశెట్టి, సాయిబాబు, జగదీశ్, శ్రీనివాస్‌గౌడ్, శ్రీకాంత్, బృంగి కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. రమణీయం.. రంగనాథుడి రథోత్సవం వనపర్తి రూరల్: శ్రీరంగాపురం రంగనాథస్వామి రథోత్సవాన్ని బుధవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకుడు విష్ణునారాయణశర్మ పర్యవేక్షణలో వేద పండితులు శ్రీదేవి, భూదేవి సమేత రంగనాథస్వామి ఉత్సవ మూర్తులను పట్టువస్రాలు, బంగారు ఆభరణాలతో అందంగా అలంకరించి.. వేద మంత్రోచ్ఛారణలతో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మంగళ వాయిద్యాలు, భక్తుల గోవింద నామస్మరణ నడుమ ఉత్సవ విగ్రహాలను పల్లకీలో ఆలయం నుంచి రథం వద్దకు తీసుకొచ్చి ఆసీనులు చేశారు. సంస్థానాధీశుడు రాజా కృష్ణదేవరావు టెంకాయ కొట్టగా.. ఆయనతో పాటు వారి కుమారుడు ఆరుద్రదేవ్, ఎమ్మెల్యే మేఘారెడ్డి భక్తులతో కలిసి రథాన్ని ప్రధాన ఆలయం నుంచి గోదాదేవి ఆలయం వరకు లాగారు. రథోత్సవాన్ని తిలకించేందుకు ఉమ్మడి జిల్లాతో పాటు, వివిధ ప్రాంతాల భక్తులు భారీగా తరలివచ్చారు. సాయంత్రం భక్తులు రథాన్ని తిరిగి ఆంజనేయస్వామి ఆలయం వరకు, అటు నుంచి రథశాలకు చేర్చారు. రథోత్సవానికి వచ్చిన భక్తులకు శ్రీరంగాపురం సేవాసమితి ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. -
రూ.5– 6 వేల కోట్ల వ్యయం..
గుడ్డెందొడ్డి రిజర్వాయర్ సామర్థ్యం పెంపునకు సంబంధించి 14,700 ఎకరాల్లో చేపడుతున్న రిజర్వాయర్ నిర్మాణానికి సుమారు రూ.5– 6 వేల కోట్లు వ్యయం అవుతుందని అంచనా. ఇది వరకే ఈ రిజర్వాయర్‌ను 1,400 ఎకరాలలో నిర్మించారు. సామర్థ్యం పెంచేందుకు అదనంగా మరో 700 ఎకరాల భూమి అవసరమవుతుంది. దీంతో రిజర్వాయర్ దిగువన కొత్తపాలెం గుట్టల వరకు విస్తరించనున్నారు. సుమారు 11.15 కిలోమీటర్ల పొడవుతో రిజర్వాయర్ ఆనకట్ట నిర్మించనున్నారు. ● గుడ్డెందొడ్డి రిజర్వాయర్ నింపిన నీటిని తిరిగి జూరాల ప్రాజెక్టు రిజర్వాయ ర్కు ఎత్తిపోసే సమయంలోనే సమాంతరంగా హైడల్ విద్యుత్ ప్రాజెక్టులో టర్బైన్స్ ద్వారా విద్యుదుత్పత్తి చేసేలా ప్రత్యేకంగా డిజైన్ చేస్తుండడం రాష్ట్రంలోనే తొలిసారి. గుడ్డెందొడ్డి రిజర్వాయర్ -
నెలరోజులుగా దొరకడం లేదు..
నేను మూడెకరాల్లో వరి, రెండెకరాల్లో మొక్కజొన్న సాగుచేశా. యూరియా కోసం నెలరోజులుగా ప్రయత్నిస్తున్నా. యాప్‌లో ఎప్పుడు బుక్ చేసుకుందామన్నా నో స్టాక్ అని వస్తుంది. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదు. పంటలను ఎలా కాపాడుకోవాలో తెలియడం లేదు. ఫర్టిలైజర్ యాప్‌తో నిజమైన రైతులకు అన్యాయం జరుగుతుంది. పాత పద్ధతిలోనే రైతులకు యూరియా అందించాలి. – జర్పుల లక్యానాయక్, రైతు, దుబ్బతండా మూడెకరాల్లో మొక్కజొన్న పంట సాగుచేశా. నాకు 15 బస్తాల యూరియా అవసరం ఉంది. యూరియా కోసం వారం రోజులుగా ప్రయత్నిస్తున్నా దొరకడం లేదు. యాప్‌లో బుకింగ్ కోసం ప్రయత్నిస్తే స్టాక్ లేదని చెబుతున్నారు. రైతులకు సరిపడా యూరియా అందించాలి. – చెన్న శ్రీనివాసులు, గట్టురాయిపాకుల, తెలకపల్లి మండలం జిల్లాలో అవసరమైన యూరియా స్టాక్ అందుబాటులో ఉంది. ప్రస్తుతం 38 వేల మెట్రిక్ టన్నుల యూరియా నిల్వ ఉంది. యాప్ ద్వారా యూరియా బుకింగ్ చేసుకోవాల్సి ఉండటంతో.. పలుచోట్ల సమస్యలు ఉన్నాయి. యాప్ ద్వారా ఇబ్బందులు ఉన్నవారు సంబంధిత వ్యవసాయ అధికారులను సంప్రదించాలి. రైతులకు సరిపడా యూ రియా సరఫరాకు చర్యలు తీసుకుంటున్నాం. – యశ్వంత్‌రావు, జిల్లా వ్యవసాయశాఖ అధికారి ● -
గుడ్డెందొడ్డి.. అప్‌గ్రేడ్
రిజర్వాయర్ సామర్థ్యం 1.19 టీఎంసీల నుంచి 15 టీఎంసీలకు పెంపు ●అనుమతులు వచ్చాయి.. గుడ్డెందొడ్డి రిజర్వాయర్‌ను 15 టీఎంసీలకు పెంచేందుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో సర్వే పన ులు మొదలుపెట్టాం. ఇందుకోసం రూ.16 లక్షలు విడుదలయ్యాయి. పనులు వేగవంతంగా పూర్తిచేసి ఈ నెల చివరి నాటికి ప్రభుత్వానికి డీపీఆర్‌ను సమర్పిస్తాం. – రహీముద్దీన్, ఇరిగేషన్ శాఖ ఎస్ఈ గద్వాల: ఉమ్మడి పాలమూరు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల కింద 9 లక్షల ఎకరాలు ఆయకట్టు ఉంది. ప్రతి ఏడాది వానాకాలం ఖరీఫ్ సీజన్లో ఈ ప్రాజెక్టుల కింద సాగయ్యే ఆయకట్టుకు సాగునీటికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు. కానీ, ఇదే ప్రాజెక్టుల కింద రబీ సీజన్లో మాత్రం ఆయకట్టుకు నీటి కష్టాలు ఎదురవుతాయి. ఈ నేపథ్యంలో నెట్టెంపాడు ప్రాజెక్టు పరిధిలో ఉన్న గుడ్డెందొడ్డి రిజర్వాయర్ సామర్థ్యాన్ని 15 టీఎంసీలకు పెంచేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఇందుకు సంబంధించి రిజర్వాయర్ సామర్థ్యం పెంపునకు సంబంధించిన సర్వే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నెలాఖరుకు సమగ్ర ప్రాజెక్టు రిపోర్టును సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపనున్నారు. దీంతో ఉమ్మడి పాలమూరులోని సాగునీటి ప్రాజెక్టుల కింద రబీ సీజన్లో సాగయ్యే ఆయకట్టుకు సాగునీటి కష్టాలు తొలగనున్నాయి. 120 రోజులపాటు వరద గుడ్డెందొడ్డి రిజర్వాయర్ ప్రస్తుతం సామర్థ్యం 1.19 టీఎంసీలు కాగా దీనిని 15 టీఎంసీలకు పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. 15 టీఎంసీలకు పెంచిన నేపథ్యంలో జూరాల ప్రాజెక్టుకు వరద సమయంలో ప్రతిరోజు అర టీఎంసీ నీటిని ఎత్తిపోసేలా అధికారులు డిజైన్ చేస్తున్నారు. జూరాలకు వానాకాలంలో సుమారు 120 రోజులపాటు వరద వస్తుంది. అయితే ఇక్కడ రోజుకు అర టీఎంసీ ఎత్తిపోయడం వల్ల కేవలం 30 రోజుల్లోనే రిజర్వాయర్‌కు పూర్తిస్థాయి సామర్థ్యంతో నీటిని నింపుకొనే వెసులుబాటు లభిస్తుంది. వరద సమయంలో ప్రతిరోజు అర టీఎంసీ ఎత్తిపోసేలా ప్రణాళిక ఈ నెల చివరి నాటికి డీపీఆర్ సిద్ధం చేసేలా కసరత్తు ముమ్మరంగా కొనసాగుతున్నసర్వే పనులు ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టులకు తీరనున్న సాగునీటి కష్టాలు -
నెట్టెంపాడుకు మహర్దశ
●ప్రభుత్వానికి నివేదిక.. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం మట్టి కాల్వలకు సీసీ లైనింగ్ నిర్మించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాం. 150 కి.మీ. మేర కాల్వలకు సీసీ లైనింగ్ నిర్మాణానికి రూ. 373 కోట్లు వ్యయం అవుతుందని అంచనాలు సిద్ధం చేశాం. ఈ నివేదికను ప్రభుత్వానికి పంపాం. ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చిన వెంటనే పనులు మొదలుపెడతాం. – రహీముద్దీన్, ఎస్ఈ, ఇరిగేషన్‌శాఖ గద్వాల: నడిగడ్డ వరప్రదాయిని నెట్టెంపాడు ఎత్తిపోతల పథకానికి మహర్దశ పట్టనుంది. తరచుగా లీకేజీలతో కోతలకు గురవుతున్న ప్రాజెక్టు మట్టి కాల్వలకు సీసీ లైనింగ్ నిర్మించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈ పథకం ద్వారా గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల పరిధిలో 1.49 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోంది. అయితే సాగునీటి కాల్వలకు ఇప్పటి వరకు సీసీ లైనింగ్ చేయలేదు. దీంతో కాల్వల్లో షిల్టు, పిచ్చిమొక్కలు, కంపచెట్లు పెరిగాయి. దీంతో కాల్వలకు లీకేజీలు ఏర్పడి సాగునీరు వృథా అవుతోంది. తద్వారా ఆయకట్టుకు సమృద్ధిగా సాగునీరు అందించేందుకు అడ్డంకులు తలెత్తుతున్నాయి. వీటన్నింటిని అరికట్టేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. 150 కి.మీ. మేర ఉన్న కాల్వలకు సీసీ లైనింగ్ నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం సుమారు రూ. 373కోట్లతో అంచనాలు రూపొందించారు. నీటి పారుదలకు అడ్డంకులు.. వానాకాలంలో కృష్ణానదికి వరదలు వచ్చే 120 రోజుల పాటు జూరాల ప్రాజెక్టు వెనకజలాల నుంచి నెట్టెంపాడుకు నీటిని ఎత్తిపోస్తారు. ఎత్తిపోసే నీటిని ఏడు రిజర్వాయర్లలో నింపి.. వాటి పరిధిలోని ఆయకట్టుకు కాల్వలు, డిస్టిబ్యూటర్లు, సబ్ డిస్టిబ్యూటర్ల ద్వారా నీటిని పారిస్తారు. ఇలా ఆయకట్టుకు సాగునీరు పారించే కాల్వలకు లైనింగ్ లేకపోవడంతో కంపచెట్టు, ముళ్లపొదలు పెరిగిపోయి నీటి ప్రవాహానికి అడ్డంకిగా మారాయి. ఈ క్రమంలో చాలా వరకు సాగునీరు వృథాగా పోతుంది. ప్రస్తుతం నెట్టెంపాడు కింద సుమారు 1.49 లక్షల ఎకరాలకు సాగునీటిని విడుదల చేస్తుండగా.. ఇందులో 2 టీఎంసీలకు పైగా నీరు వృథా అవుతోంది. తీరనున్న సమస్య.. నెట్టెంపాడు ప్రాజెక్టు కింద నిర్మించిన మట్టి కాల్వలు, డిస్టిబ్యూటర్లు, సబ్ డిస్టిబ్యూటర్లలో సీసీ లైనింగ్ నిర్మాణంతో నీటి పారుదల సాఫీగా సాగనుంది. తద్వారా చివరి ఆయకట్టు రైతులకు సాగునీటి సమస్య తీరనుంది. 150 కి.మీ. మేర కాల్వకు సీసీ లైనింగ్ నిర్మాణానికి రూ. 373 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు రూపొందించిన అధికారులు.. ప్రభుత్వ అనుమతుల కోసం ఎదురుచూస్తున్నారు. 2లక్షల ఎకరాల ఆయకట్టు.. కృష్ణానదిపై నిర్మించిన జూరాల ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ ఆధారంగా గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల్లో 2లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి దివంగత డా.వైఎస్ రాజశేఖరరెడ్డి నెట్టెంపాడు ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. రూ. 1,480 కోట్ల అంచనా వ్యయంతో మొదలుపెట్టిన నిర్మాణానికి రూ. 2వేల కోట్లపైగా ఖర్చుచేశారు. ఇందులో ఏడు రిజర్వాయర్లు, రెండు లిఫ్టులు, 164 కి.మీ. మెయిన్ కెనాల్స్, మరో 100 కి.మీ. మేర డిస్టిబ్యూటర్ల నిర్మాణాలు ఉన్నాయి. కాల్వల లైనింగ్‌కు రూ.373 కోట్లతో ప్రతిపాదనలు 150 కి.మీ. మేరసీసీ నిర్మాణానికి చర్యలు పనులు పూర్తయితే సాగునీటి లీకేజీలకు అడ్డుకట్ట ప్రభుత్వ అనుమతులే తరువాయి -
నామినేటెడ్‌పై నజర్!
పదవుల కోసం కాంగ్రెస్ నేతల ముమ్మర ప్రయత్నాలు పల్లె, పట్టణాల్లో కో‘ఆప్షన్’ ఎవరికో.. గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యి సర్పంచ్, పాలక వర్గాలు కొలువుదీరి రెండు నెలలు గడిచింది. ఇప్పటివరకు గ్రామపంచాయతీల కోఆప్షన్ సభ్యుల నియామకాలపై స్పష్టత రాలేదు. రాష్ట్రవ్యాప్తంగా నియామకాలపై ప్రభుత్వం జీఓ విడుదల చేయాల్సి ఉంది. మున్సిపాలిటీల్లోనూ ఎన్నికలు పూర్తయ్యి కొత్త పాలకవర్గాలు కొలువుదీరాయి. ఈ క్రమంలో పల్లెలతో పాటు పట్టణాల్లోనూ కోఆప్షన్ సభ్యుల నియామకం కోసం ఆశావహులు ఎదురుచూస్తున్నారు. గ్రామాలతో పాటు జిల్లాలోని మున్సిపాలిటీల్లో కోఆప్షన్ సభ్యులుగా అవకాశం కోసం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నుంచి తీవ్రమైన పోటీ నెలకొంది. సాక్షి, నాగర్‌కర్నూల్: కాంగ్రెస్ పార్టీలో ముఖ్యనేతలు, సీనియర్ నాయకుల దృష్టి ప్రభుత్వ నామినేటెడ్ పదవులపై పడింది. రాష్ట్రస్థాయిలో కార్పొరేషన్ల చైర్మన్లుగా అవకాశం కల్పించాలని ఇప్పటికే పలువురు కాంగ్రెస్ నేతలు అధిష్టానానికి విజ్ఞప్తి చేసుకున్నారు. ఈ సారి తమకు ఎలాగైనా అవకాశం కల్పించాలని స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేల మెప్పు పొందేందుకు ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు. పెద్దసంఖ్యలో ఖాళీగా ఉన్న కార్పొరేషన్లు, ఇతర నామినేటెడ్ పదవులను ప్రభుత్వం భర్తీ చేయనుందన్న ఊహాగానాల నేపథ్యంలో జిల్లాలోని కాంగ్రెస్ నేతల ప్రయత్నాలు ఊపందుకున్నాయి. కార్పొరేషన్, జిల్లాస్థాయిపదవులకు పోటాపోటీ ఇప్పటికే పార్టీ అధిష్టానానికి విజ్ఞప్తులు పల్లెల్లో కోఆప్షన్ నియామకాలపై నెలకొన్న ఆశలు -
పూర్తిస్థాయిలో కొరవడిన పర్యవేక్షణ..
జడ్చర్ల పట్టణంలోనే బాదేపల్లిలో 30 పడకల ఆస్పత్రి ఉండేది. దీన్ని బీఆర్ఎస్ హయాంలో 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందుగా కల్వకుర్తి రోడ్డులో నిర్మించిన 100 పడకల ఆస్పత్రి భవనంలోకి మార్చారు. ప్రారంభ సమయంలో మార్చురీ నిర్మాణం పూర్తి కాకపోవడంతో బాదేపల్లి ఆస్పత్రి పరిధిలోని మార్చురీలోనే మృతదేహాలకు పోస్ట్‌మార్టం నిర్వహిస్తున్నారు. మృతదేహాలను సైతం అక్కడే భద్రపరుస్తున్నారు. కిలోమీటరున్న దూరంలో ఉండగా.. పర్యవేక్షణ కొరవడడంతో మృతదేహాన్ని కుక్కలు పీక్కుతిన్న ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో విచారణకు వచ్చిన రాష్ట్ర వైద్య ఆరోగ్య పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్‌కుమార్ ముందుగా బాదేపల్లిలో మార్చురీ, ఆ తర్వాత కల్వకుర్తి రోడ్డులోని ప్రభుత్వ ఆస్పత్రి, మార్చురీని సందర్శించారు. కొత్తగా ఏర్పాటు చేసిన మార్చురీలో ఉన్న మూడు ఫ్రీజర్లను పరిశీలించారు. మార్చురీ నిర్మాణం పూర్తయి అధునాతన సౌకర్యాలు అందుబాటులో ఉన్నా.. పాత ఆస్పత్రినే పోస్టుమార్టం నిర్వహించడంపై అధికారులు, డాక్టర్లకు చీవాట్లు పెట్టినట్లు సమాచారం. ఆస్పత్రి నిర్వహణ, వైద్యుల పనితీరు సరిగ్గా లేదంటూ అసంతృప్తిని వ్యక్తం చేయడం పూర్తిస్థాయిలో పర్యవేక్షణ కొరవడిందనే దానికి అద్దం పడుతోంది. -
వట్టెం వెంకన్నకుపల్లకీసేవ
బిజినేపల్లి: వట్టెం శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం అలివేలుమంగ, గోదాదేవి సమేత వేంకటేశ్వరస్వామికి పల్లకీసేవ నిర్వహించారు. ముందుగా ఆలయ ప్రధాన అర్చకుడు సముద్రాల శ్రీమన్నారాయణచార్యుల ఆధ్వర్యంలో గరుడ పతాకావిష్కరణ చేశారు. అనంతరం స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను పల్లకీలో పురవీధుల్లో ఊరేగించారు. కాగా, చంద్రగ్రహణం సందర్భంగా ఉదయం 7 నుంచి ఆలయాన్ని మూసివేశారు. సాయంత్రం 7 గంటల తర్వాత ఆలయాన్ని తెరిచి ప్రక్షాళన చేశారు. అనంతరం స్వామివారి బ్రహ్మోత్సవాలు కొనసాగించారు. పర్యాటకాభివృద్ధికి కృషి కొల్లాపూర్ రూరల్: రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సహకారంతో జిల్లాలోని పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి కృషిచేస్తున్నట్లు జిల్లా టూరిజంశాఖ అధికారి నర్సింహ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలో కలెక్టర్ బదావత్ సంతోష్‌ను ఆయన కలిసి పర్యాటకశాఖ డైరీ, క్యాలెండర్ అందజేశారు. అనంతరం సోమశిల–అలంపూర్ టూరిజం సర్క్యూట్లో భాగంగా సోమశిల, సింగోటం, జటప్రోలు, కొల్లాపూర్ కోట తదితర ప్రాంతాలను పర్యాటక పరంగా అభివృద్ధి చేసే ప్రణాళికలపై కలెక్టర్‌తో చర్చించారు. త్వరలో పర్యాటకశాఖ తరఫున జిల్లా ఫారెస్టు, రెవెన్యూ, దేవాదాయ, ఇరిగేషన్ శాఖల అధికారులతో సమావేశమై.. సోమశిల–అలంపూర్ టూరిజం సర్క్యూట్‌పై సమీక్షించనున్నట్లు కలెక్టర్ తెలియజేశారని ఆయన తెలిపారు. 1,772 డోసుల హెచ్‌పీవీ టీకాల కేటాయింపు నాగర్‌కర్నూల్ క్రైం: జిల్లా వ్యా క్సిన్ స్టోర్‌కు మొదటి విడతగా 1,772 డోసుల హెచ్‌పీవీ (హ్యూ మన్ పాపిల్లోమా వైరస్) టీకాలు కేటాయించినట్లు ఇన్చార్జి డీఎంహెచ్ఓ డా.రవికుమార్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని వ్యాక్సిన్ స్టోర్‌ను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా టీకాల నిల్వను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో హెచ్‌పీవీ టీకా కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఇప్పటికే వైద్యారోగ్యశాఖ అధికారులు, సిబ్బందికి అవసరమైన శిక్షణ పూర్తిచేసినట్లు పేర్కొన్నారు. మొదటి విడతలో జనరల్ ఆస్పత్రి, సివిల్ ఆస్పత్రుల్లో టీకా కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇన్చార్జి డీఎంహెచ్ఓ వెంట జిల్లా వ్యాక్సిన్ స్టోర్ మేనేజర్ కుమార్ ఉన్నారు. -
వైద్యశాఖలో దుమారం..!
సంచలనంగా మారిన జడ్చర్ల ఘటన సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: జడ్చర్లలోని 30 పడకల ప్రభుత్వ ఆస్పత్రికి సంబంధించి బాదేపల్లి మార్చురీలో పోస్టుమార్టం కోసం తీసుకొచ్చిన మృతదేహాన్ని వీధి కుక్కలు పీక్కు తిన్న అమానవీయ ఘటన సంచలనంగా మారింది. వైద్యారోగ్య శాఖ నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతుండగా.. రాజకీయ పక్షాలు విమర్శలు ఎక్కుపెట్టాయి. మరోవైపు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టిన రాష్ట్ర వైద్య ఆరోగ్య పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్‌కుమార్.. ఇందుకు బాధ్యులుగా పేర్కొంటూ నలుగురిపై సస్పెన్షన్ వేటు వేశారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రకళతో పాటు ఆర్ఎంఓ హరినాథ్, డ్యూటీ డాక్టర్ మునీషా, ఎంఎన్ఓ రవిప్రకాశ్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఆర్ఎంఓ పోస్ట్ ఖాళీగా ఉన్నా.. ప్రభుత్వం నుంచి గానీ, సూపరింటెండెంట్ నుంచి గానీ ఎలాంటి అధికారిక ఉత్తర్వులు లేకున్నా ఇన్చార్జిగా పేర్కొంటూ హరినాథ్‌పై వేటు వేయడం వైద్యారోగ్య శాఖలో దుమారం రేపుతోంది. బాదేపల్లి మార్చురీలో మృతదేహాన్ని కుక్కలు పీక్కుతిన్న ఘటన వైరల్‌గా మారడంతో ప్రభుత్వంపై రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. స్వయానా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఇన్చార్జిగా ఉన్న జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకోవడం దారుణమని.. దీన్ని బట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి వైద్యరంగంపై ఉన్న చిత్తశుద్ధి ఏంటో స్పష్టవుతోందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ విమర్శించారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి రాజీనామా చేయాలని బీఆర్ఎస్కు చెందిన మాజీ మంత్రి లక్ష్మారెడ్డి.. ఈ ఘటన కలచివేసిందని, బాధ్యులను కఠినంగా శిక్షించాలని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. ఈ క్రమంలో విచారణకు వచ్చిన రాష్ట్ర వైద్య ఆరోగ్య పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్‌కుమార్ ఈ ఘటనకు నలుగురిని బాధ్యులుగా పేర్కొంటూ సస్పెండ్ చేస్తునట్లు ప్రకటించారు. విచారణ క్రమంలో డాక్టర్ హరినాథ్ తనకు సంబంధం లేదని కమిషనర్ దృష్టికి తీసుకురాగా.. ఆయన వినిపించుకోలేదని సమాచారం. విచారణ అనంతరం కమిషనర్ ఫోన్లో మాట్లాడడం, వెంటనే సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించడం సందేహాలకు తావిస్తోంది. పూర్తిస్థాయిలో విచారణ చేపట్టకుండా ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్లకు తలొగ్గి.. ఈ ఘటనను ఇంతటితో ముగించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్లతోనేనా..? మృతదేహాన్ని కుక్కలు పీక్కుతినడంపై విపక్షాల ఆగ్రహం నలుగురిపై సస్పెన్షన్ వేటు వేసిన కమిషనర్ ఇన్చార్జి ఆర్ఎంఓ హరినాథ్‌పై వేటుతో కలకలం నన్ను ఎప్పుడు ఇన్చార్జిగా నియమించారోనాకే తెలియదంటూ ఆశ్చర్యం మౌఖికంగానే తప్ప ఎలాంటి అధికార ఉత్తర్వులు లేవని వెల్లడి డాక్టర్స్ యూనియన్‌కు ఫిర్యాదు.. సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ సంబంధం లేకున్నా బలిచేశారు.. వాస్తవానికి నేను ఆర్ఎంఓను కాదు. నన్ను ఆర్ఎంఓగా పేర్కొనడం చూసి ఆశ్చర్యపోయాను. ఘటన చోటుచేసుకున్న సోమవారం రోజు నా డ్యూటీ సమయం ప్రకారం ఉదయం 9 గంటలకు ఆస్పత్రికి వెళ్లా. డ్యూటీ అనంతరం సాయంత్రం 4 గంటలకు ఆస్పత్రి నుంచి వచ్చేశాను. మార్చురీలో జరిగిన సంఘటన నాకు తెలియదు. ఆ సమయంలో నేను ఆన్‌డ్యూటీలో కూడా లేను. జరిగిన ఘటన బాధాకరమే.. అయినా నా నిర్లక్ష్యం లేకున్నా నాపై సస్పెన్షన్ వేటు వేయడం అన్యాయం. దీన్ని మా డాక్టర్స్ యూనియన్ దృష్టికి తీసుకెళ్లాను. ఉన్నతాధికారులు మరోసారి సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలి. – డాక్టర్ ఎస్.హరినాథ్, సీఏఎస్ (పీడియాట్రిషన్) -
‘కుమ్మెర’ బాధితులకు న్యాయం చేయాలి
నాగర్‌కర్నూల్ క్రైం/నాగర్‌కర్నూల్ రూరల్: ఇటీవల కుమ్మెరగట్టు జాతరలో జరిగిన దాడిలో రెండు నెలల చిన్నారి మృతిచెందిన ఘటనపై ప్రభుత్వ సమగ్ర విచారణ జరిపి.. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కర్ణాటక మాజీ డీజీపీ రవీంద్రనాథ్ కోరారు. మంగళవారం కుమ్మెరగట్టులో మల్లన్న స్వామిని ఆయన దర్శించుకున్నారు. అనంతరం గ్రామానికి వెళ్లి దాడి ఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామస్తులు కుల,మతాలకు అతీతంగా అందరూ కలిసిమెలసి జీవించాలని సూ చించారు. ఆయన వెంట ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఫోరం జాతీయ అధ్యక్షుడు జెట్టి ధర్మరాజు ఉన్నారు. ● జిల్లా కేంద్రంలోని నేషనల్ హైస్కూల్లో ఐక్యత సమాజ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన దివంగత పుట్టపాగ మహేంద్రనాథ్ శతజయంతి ఉత్సవాల సన్నాహాక సమావేశానికి మాజీ డీజీపీ రవీంద్రనాథ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మహేంద్రనాథ్ జీవిత కీలక ఘట్టాలను తెలియజేశారు. శతజయంతి ఉత్సవాల్లో ఆయన విగ్రహావిష్కరణ ఆవశ్యకతను వివరించారు. అంతకుముందు ఐక్యత సమాజ సంస్థ అధ్యక్షుడు కళ్యాణ నర్సింహ, కార్యదర్శి బాగవేణి నర్సింహులు తదితరులు మహేంద్రనాథ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో రమేశ్‌బాబు, పటాన్, అబ్దుల్లాఖాన్, వహీద్ ఖాన్, రవి, మురళీధర్, నర్సింహ, రవికుమార్, లంకెప్ప, బాలరాజు పాల్గొన్నారు. -
‘విద్యా కమిషన్ సిఫారసులు సవరించాలి’
కందనూలు: ప్రభుత్వానికి విద్యా కమిషన్ సమర్పించిన సిఫారసులను సవరించి.. అసంబద్ధ అంశాలను తొలగించాలని జిల్లా టీచర్స్ జేఏసీ డిమాండ్ చేసింది. మంగళవారం స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో జేఏసీ చైర్మన్ సత్యనారాయణరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి జిల్లాలోని పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు హాజరై మాట్లాడారు. విద్యా కమిషన్ రూపొందించిన ప్రతిపాదనల్లో కొన్ని అంశాలు ప్రభుత్వ విధానానికి ఉపయోగకరంగా ఉన్నప్పటికీ.. అనేక సూచనలు ఆచరణ సాధ్యంకానివిగా ఉన్నాయని ఆక్షేపించారు. మండలాన్ని యూనిట్‌గా తీసుకోవడం.. ఒక మండలంలో 3 లేదా 4 పాఠశాలలే ఉండాలనే ప్రతిపాదన గ్రామీణ విద్యార్థులను చదువుకు దూరం చేసే చర్యగా ఉందని అభిప్రాయపడ్డారు. విద్యార్థుల ఉత్తీర్ణత శాతాన్ని 45 శాతం నుంచి 75 శాతానికి పెంచే ప్రతిపాదన విద్యార్థులపై మానసిక ఒత్తిడిని పెంచి.. డ్రాపౌట్లు పెరిగే ప్రమాదం ఉందన్నారు. ఉపాధ్యాయ శిక్షణకు సంబంధించిన కొన్ని సూచనలు ఎన్సీటీఈ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. వివిధ ప్రవేశ పరీక్షలను రద్దు చేయడమంటే కార్పొరేట్ విద్యా వ్యవస్థకు ఊతమిచ్చే చర్య అని అభివర్ణించారు. ఒకే క్యాంపస్‌లో 1,500 మందికి పైగా విద్యార్థులతో పాఠశాలలు నిర్వహించడం ఆచరణ సాధ్యం కాదన్నారు. ఉపాధ్యాయులను ఐదేళ్ల కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించి.. ఆ తర్వాత పనితీరు ఆధారంగా కొనసాగింపు ఇవ్వాలనే ప్రతిపాదన అన్యాయమని విమర్శించారు. ఉపాధ్యాయుల వేతనాలు అధికంగా ఉన్నాయని.. వాటిని తగ్గించాలని సూచించడం సరైంది కాదన్నారు. పేద విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను రద్దు చేయాలనే ప్రతిపాదన అన్యాయమన్నారు. విద్యా కమిషన్ అసంబద్ధ సిఫారసులను తొలగించి.. విద్యార్థుల ఆకాంక్షకు అనుగుణంగా విధానాలను రూపొందించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో జేఏసీ నాయకులు శ్రీధర్ శర్మ, విజయ్‌కుమార్, రాజారెడ్డి, గుడిపల్లి నిరంజన్, లక్ష్మణ్ నాయక్, సీహెచ్ వెంకట్, పచ్చిపాల సుబ్బయ్య, ఆంజనేయులు, రమేశ్, కొంగరి జానయ్య ఉన్నారు. -
పక్కాగా భవనాలు
అచ్చంపేట ఆర్డీఓ కార్యాలయానికి సొంత భవనం లేకపోవడంతో తాత్కాలికంగా తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో చిన్న గది, గోదాం షెడ్డులను మరమ్మతు చేపట్టి అరకొర వసతుల మధ్య కొనసాగుతుంది. కొల్లాపూర్ ఆర్డీఓ కార్యాలయం ఆర్అండ్బీ అతిథి గృహంలో నిర్వహిస్తున్నారు. కల్వకుర్తి ఆర్డీఓ కార్యాలయం పశుసంవర్ధక శాఖకు సంబంధించిన భవనంలో తాత్కాలికంగా కొనసాగిస్తున్నారు. పదర తహసీల్దార్ కార్యాలయం వైద్య, ఆరోగ్య శాఖ శిథిలావస్థకు చేరిన పురాతన పాత భవనంలో కొనసాగుతుంది. ఉద్యోగులు, సందర్శకులు అవస్థలు పడుతున్నారు. చారకొండ తహసీల్దార్ కార్యాలయం అద్దె భవనంలో కొనసాగుతుండగా.. ఇటీవలే రియల్ ఎస్టేట్ వ్యాపారులు వెంచర్లో ఓ భవనం నిర్మించి ఇచ్చారు. పెంట్లవెల్లి తహసీల్దార్ కార్యాలయం పాత పంచాయతీ భవనంలో అరకొర గదులు, వసతుల మధ్య కొనసాగుతుంది. ఊర్కొండ తహసీల్దార్ కార్యాలయం పశువైద్యశాల, మహిళా సంఘం భవనాల్లో నెట్టుకొస్తున్నారు. అచ్చంపేట తహసీల్దార్ కార్యాలయం శిథిలావస్థకు చేరి గదులు కురుస్తున్నాయి. నాగర్‌కర్నూల్ తహసీల్దార్ కార్యాలయం వందేళ్ల క్రితం నిర్మించిన పాత భవనంలో ఇరుకు గదుల్లో కొనసాగుతుంది. ఉప్పునుంతల, బల్మూర్, లింగాల, అమ్రాబాద్,వంగూరు తహసీల్థార్ కా ర్యాలయాలు సొంత భవనాల్లో సాగుతున్నా.. శిథిలావస్థకు చే రాయి. ఇక్కడ అధికారులతోపాటు ఉద్యోగులు తీవ్ర ఇబ్బందు ల మధ్య పాలన వ్యవహారాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభు త్వం దీనిపై ప్రత్యేకంగా దృష్టిసారించిన నేపథ్యంలో.. త్వరగా కార్యరూపం దాల్చేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అచ్చంపేట: జిల్లాలోని పలు రెవెన్యూ కార్యాలయాలకు మహర్దశ పట్టనుంది. పరిపాలనలో కీలకమైన తహసీల్దార్, ఆర్డీఓ కార్యాలయాలకు నూతనంగా శాశ్వత పక్కా భవనాలు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. అద్దె భవనాలు, శిథిలావస్థకు చేరిన కార్యాలయాలకు రెండు విడతల్లో నూతన భవనాలు నిర్మించనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ భవనాలన్నింటినీ ఒకే నమూనాలో నిర్మించేలా ప్రతిపాదనలు సిద్ధ చేస్తున్నట్లు వెల్లడించారు. మంత్రి మాటలు కార్యరూపం దాల్చితే అద్దె కష్టాలు తొలగడంతోపాటు శిథిలావస్థకు చేరిన భవనాల స్థానంలో నూతన భవనాలు నిర్మించనున్నారు. పథకాల అమలులో కీలకం.. జిల్లా పరిపాలనకు రెవెన్యూ గుండెకాయలాంటింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేయడంలో ఈ శాఖనే అత్యంత కీలకమైంది. క్షేత్రస్థాయిలో ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమం చేపట్టాలన్న రెవెన్యూ వ్యవస్థదే ప్రధాన పాత్ర. ఇంతటి ప్రాధాన్యత కలిగిన రెవెన్యూ శాఖకు సొంత భవనాలు కరువయ్యాయి. ఒకటి, రెండు మండలాలను మినహాయిస్తే జిల్లాలో మెజార్టీ తహసీల్దార్ కార్యాలయాలకు పక్కా భవనాలు లేవు. అద్దె ప్రతిపాదికన కొన్నిచోట్ల కొనసాగుతుండగా.. మరికొన్ని చోట్ల ఇతర శాఖల ప్రభుత్వ భవనాల్లో నిర్వహిస్తున్నారు. వాటిలో సరైనా సౌకర్యాలు లేక అధికారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఆర్డీఓ కార్యాలయాలది అదే పరిస్థితి తాజా సొంత భవన నిర్మాణాలకు ప్రభుత్వం చర్యలు -
పైసలిస్తే యూరియా ఇవ్వాలి..
యూరియా కోసం వస్తే ఫోన్లో బుకింగ్ చేసుకోవాలి అంటున్నారు. మాకు పెద్ద ఫోన్ లేదు. ఈ ఫోన్లో బుకింగ్ కుదరదని చెబుతున్నారు. ఆన్లైన్లో బుకింగ్ మాకు సమస్యగా మారింది. బుకింగ్ చేసుకుందామన్నా స్టాక్ లేదని చెబుతున్నారు. కాబట్టి మాలాంటి వారికి పైసలిస్తే యూరియా బస్తా ఇచ్చేలా చూడాలి. – రాములు, ఎండబెట్ల, నాగర్‌కర్నూల్ యూరియా బస్తాల కోసం వెళ్తే ఇబ్బందులు ఎదురవుతున్నా యి. ప్రభుత్వం యూరియా బుకింగ్ యాప్‌ను రద్దు చేసి నేరుగా బస్తాలను పంపిణీ చేయాలి. యాప్‌లో బుకింగ్ కావ డం లేదు. ఎప్పుడు స్టాక్ ఉంటుందో, ఎప్పుడు అయిపోతుందో అర్థం కావడం లేదు. ఎప్పటిలాగే దుకాణాల్లో నేరుగా యూ రియా ఇస్తేనే బాగుంటుంది. – నరేందర్, తిర్మలాపురం, తాడూరు మండలం జిల్లాలో యూరియా అవసరమైన రైతులు యాప్ ద్వారా బుకింగ్ చేసుకుని పొందాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు 46,529 మంది రైతులకు 2.18 లక్షల యూరియా బస్తాలను పంపిణీ చేశాం. స్మార్ట్ ఫోన్లు లేని రైతులు సంబంధిత ఏఈఓలను సంప్రదించి యూరియా బుక్ చేసుకోవాలి. జిల్లాలో అవసరమైన మేరకు 20 వేల బస్తాల యూరియా నిల్వలు ఉన్నాయి. – యశ్వంత్‌రావు, డీఏఓ ● -
వైభవంగా వట్టెం వెంకన్న బ్రహ్మోత్సవాలు
బిజినేపల్లి: వట్టెం శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు సోమవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాల మొదటిరోజు ఉదయం సుప్రభాతం, ప్రాతరాధన, అర్చన, సేవాకాలం, హోమం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. అలివేలుమంగ, గోదాదేవి సమేత వేంకటేశ్వరస్వామివార్లకు అభిషేకాలు, అలంకరణ, రాజభోగం, వాసుదేవ పుణ్యాహవచనం, రక్షాబంధనం, అంకురార్పణ వంటి కార్యక్రమాలు జరిపారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యుడు ప్రతాప్‌రెడ్డి, వికాస తరంగిణి ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ రాజశేఖర్, భరత్‌కుమార్, చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
స్మార్ట్ ఫోన్ లేకపోవడంతో..
యూరియా బుకింగ్‌కు ఫర్టిలైజర్ యాప్‌లో ముందస్తు బుకింగ్‌ను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. రైతు పాస్‌బుక్‌తో లింకేజీ ఉన్న మొబైల్ నంబర్‌తో యాప్‌లో లాగిన్ కావాల్సి ఉంటుంది. మొబైల్ నంబర్ లింక్ లేకున్నా.. స్మార్ట్ ఫోన్ లేకపోయినా యూరియా బుకింగ్‌కు అవకాశం లేదు. దీంతో యూరియా బస్తాలు ఎలా పొందాలని రైతులు ఆందోళన చెందుతున్నారు. పీఏసీఎస్, ఫర్టిలైజర్ కేంద్రాలకు వచ్చి యూరియా బస్తాలు లేకుండానే వెనుదిరగడం కనిపిస్తోంది. అయితే స్మార్ట్‌ఫోన్ లేనివారు సంబంధిత ఏఈఓ, ఏఓలను సంప్రదించాలని అధికారులు చెబుతున్నారు. ఈ విషయంపై అవగాహన లేక రైతులు ఫర్టిలైజర్ కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. ఏఈఓలను సంప్రదించినా మొబైల్ నంబర్ లింక్ లేకపోవడంతో బుకింగ్‌కు నోచుకోవడం లేదు. తీరా బుకింగ్ సమయానికి నోస్టాక్ అని చూపిస్తోంది. -
కళాకారుల సంక్షేమానికి బడ్జెట్ కేటాయించాలి
నాగర్‌కర్నూల్ రూరల్: సమగ్ర సాంస్కృతిక విధానం రూపొందించి కళారంగంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బాల్‌నర్సింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం తెలంగాణ ప్రజానాట్య మండలి ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో కళాకారులది ముఖ్య పాత్ర అన్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత కళాకారులను అన్ని విధాలుగా ఆదుకుంటామని గత ప్రభుత్వం హామీ ఇచ్చి నెరవేర్చలేకపోయిందని విమర్శించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సైతం కళాకారులకు ఉద్యోగ, ఉపాధి, అవకాశాలు కల్పిస్తామని చెప్పి రెండేళ్లు గడిచినా ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని దుయ్యబట్టారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్‌కు అందజేశారు. కార్యక్రమంలో ప్రజానాట్య మండలి జిల్లా అధ్యక్షుడు మల్లయ్య, కార్యదర్శి విజయుడు, కళాకారులు పర్వతాలు, చందు, యాదగిరి, ఊషన్నగౌడ్, నాగరాజు, జ్యోతి, వెంకటస్వామి, సువర్ణ, నర్సింహ, శివకృష్ణ పాల్గొన్నారు. -
ప్రాజెక్టుల భూసేకరణ వేగవంతం చేయాలి
కందనూలు: జిల్లాలో కొనసాగుతున్న సాగునీటి ప్రాజెక్టుల భూ సేకరణ ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని వీసీ హాల్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో రెవెన్యూ, సాగునీటి శాఖల అధికారులతో కలిసి భూసేకరణ పనుల పురోగతిపై కలెక్టర్ సమగ్రంగా చర్చించారు. జిల్లాలో అమలులో ఉన్న ప్రాధాన్య ప్రాజెక్టులైన పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతలు, మహాత్మగాంధీ కల్వకుర్తి, అచ్చంపేట నియోజకవర్గంలోని ఇతర సాగునీటి ప్రాజెక్టుల భూ సేకరణ పనుల్లో ఎలాంటి జాప్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రభుత్వం ఈ ప్రాజెక్టులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, రైతుల ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని పారదర్శకంగా, న్యాయబద్ధంగా భూసేకరణ ప్రక్రియ కొనసాగించాలని సూచించారు. భూ యజమానులతో సమన్వయం చేసుకుని, వారికి చెల్లించాల్సిన పరిహారం విషయంలో ఎ లాంటి ఆలస్యం లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. భూ సేకరణకు సంబంధించిన పెండింగ్ కేసులు, వివాదాలు, సర్వే ప్రక్రియలు త్వరితగతిన పూర్తి చేయాలని, ప్రతి దశలో సమన్వయం పెంచుకుని నిర్ణీత గడువులో పనులు ముగించాలని పేర్కొన్నారు. అవసరమైతే ప్రత్యేక శిబిరాలు నిర్వహించి రైతుల సందేహాలను నివృత్తి చేయాలని, సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ అమరేందర్, సాగునీటి శాఖల అధికారులు పాల్గొన్నారు. -
హోలీ సహజ రంగులతో జరుపుకోవాలి
నాగర్‌కర్నూల్ క్రైం/ కందనూలు: హోలీ పండుగను సహజ రంగులతో పర్యావరణానికి అనుకూలంగా జరుపుకోవాలని ఇన్చార్జి డీఎంహెచ్ఓ రవికుమార్ అన్నారు. జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ సైన్స్ డిగ్రీ, పీజీ కళాశాలలో ప్రిన్సిపల్ మదన్మోహన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈకో– ఫ్రెండ్లీ హోలీ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. హోలీ సందర్భంగా మార్కెట్లో లభించే రసాయన ఆధారిత రంగులు చర్మం, కళ్లు, శ్వాసకోశానికి హానికరమన్నారు. చిన్నపిల్లలు, యువత రసాయన రంగులతో ఆడితే చర్మ అలర్జీలు, దద్దుర్లు, కంటి ఇన్ఫెక్షన్లు, శ్వాస సమస్యలు వచ్చే ప్రమాదం ఉందన్నారు. కొన్నిరంగుల్లో ఉండే సీసం, పాదరసం వంటి లోహాలు దీర్ఘకాలిక సమస్యలకు కారణమవుతాయని హెచ్చరించారు. ప్రతిఒక్కరు పూలు, కూరగాయలు, పసుపు, కుంకుమ, బీట్రూట్, పాలకూర వంటి సహజ పదార్థాలతో తయారు చేసిన సహజ రంగులను మాత్రమే ఉపయోగించాలని సూచించారు. నీటిని వృథా చేయకుండా, ఇతరులకు ఇబ్బంది కలగకుండా హోలీ పండుగను ఆనందంగా, ఆరోగ్యకరంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా ఉప మాస్ మీడియా అధికారి రాజగోపాల్‌చారి, జిల్లా వ్యాక్సిన్ స్టోర్ మేనేజర్ కుమార్, ఉపాధ్యాయలు అంజయ్య, వనిత, ఉమాదేవి, దశరథం, శోభారాణి, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం కౌన్సిలర్ వసంత హాజరై విద్యార్థులతో కలిసి హోలీ సంబరాలు జరుపుకొన్నారు. -
కార్మికుల వేతన వెతలు
● పంచాయతీలో కార్మికులకు 4 నెలలు అందని వేతనాలు ● పట్టించుకోని అధికారులు ● సమ్మె తప్పదంటున్న కార్మికులు అచ్చంపేట రూరల్: పంచాయతీల్లో పారిశుద్ధ్య పనులు చేసే కార్మికులకు నాలుగు నెలలుగా వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో కుటుంబ పోషణ భారంగా మారిందని ఆవేదన చెందుతున్నారు. కొత్తగా పాలక వర్గాలు ఏర్పడ్డా.. తమ సమస్యలు తీరడం లేదని వాపోతున్నారు. రోజురోజుకూ పనిభారం పెరుగుతున్నా ప్రజాప్రతినిధులు, అధికారులు తమ సమస్యలు పట్టించుకోవడం లేదంటున్నారు. పెరగని జీతాలు గ్రామాల్లో చెత్త సేకరణ, మురుగు కాల్వల శుభ్రత, పిచ్చి మొక్కల తొలగింపు, నీటి పైపుల లీకేజీలు, బ్లీచింగ్ పౌడర్ చల్లడం, వీధి దీపాలకు మరమ్మతు, దోమల నివారణకు ఫాగింగ్‌తో పాటు అన్ని పనులకు కార్మికులే ఆధారం. చాలా ఏళ్లుగా గ్రామ పంచాయతీల్లో పనులు చేస్తున్నా.. జీతాలు పెరగడం లేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఆదాయం ఎక్కువగా ఉన్న జీపీల్లో కొంత వరకు జీతాలు అందిస్తున్నా చిన్న జీపీల్లో కార్మికులు జీవనం అస్తవ్యస్తం ఉంది. గతంలో పాలకవర్గం లేకపోవడం, నిర్వహణకు నిధులు లేకపోవడంతో పంచాయతీ కార్యదర్శులు అప్పులు చేసి నెట్టుకొచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావాల్సిన నిధులు రాకపోవడంతో తీవ్ర నిధుల కొరత ఏర్పడింది. కొన్ని గ్రామాల్లో ఇంటి పన్నుల వసూళ్లు, ఇతర ఆదాయ మార్గాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని కార్మికుల వేతనాలు, ఇతరాలకు వినియోగించారు. చెత్త సేకరణకు వినియోగించే ట్రాక్టర్లకు కొన్ని నెలలుగా పంచాయతీ కార్యదర్శులే సొంత డబ్బులతో డీజిల్ పోయించారు. జిల్లాలో 2,500 మంది కార్మికులు జిల్లాలో 461 పంచాయతీలు ఉండగా.. 2,500 మందికి పైగా కార్మికులు పారిశుద్ధ్య పనులు చేస్తున్నారు. ప్రతి కార్మికుడికి రూ.9,500ల వేతనంగా నిర్ణయించినా నిధుల కొరత కారణంగా అనేక పంచాయతీల్లో వేతనాలు చెల్లించకుండా పెండింగ్‌లో ఉంచారు. ప్రధాన డిమాండ్లు పంచాయతీ ఉద్యోగులకు, కార్మికులకు వేతనాలు క్రమంగా చెల్లించాలి. 2వ పీఆర్సీ పరిధిలోకి పంచాయతీ సిబ్బందిని తీసుకొచ్చి జీఓ నంబర్ 60 ప్రకారం వేతనాలు చెల్లించాలి. జీఓ నంబర్ 51ని సవరించి మల్టీపర్పస్ కార్మికుల విధానం రద్దు చేసి పాత కేటగిరీల ప్రకారం ఉద్యోగులుగా గుర్తించాలి. కారోబార్లు, బిల్ కలెక్టర్లను సహాయ కార్యదర్శులుగా నియమించాలి. అర్హులైన ఉద్యోగులకు పదోన్నతులు ఇవ్వాలి. ఉద్యోగ భద్రత కల్పించి, రిటైర్మెంట్ బెనిఫిట్‌గా రూ.5లక్షల చొప్పున చెల్లించాలి. ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకోవడానికి ఆర్థిక సాయంతో పాటు ప్లాట్లు ఇవ్వాలి. -
కల్యాణం.. కమనీయం
కందూరు శ్రీరామలింగేశ్వరస్వామి క్షేత్రంలో ఆదివారం స్వామివారి కల్యాణాన్ని కనులపండువగా జరిపించారు. దక్షిణకాశీగా వెలుగొందుతున్న ఆలయంలో పార్వతీ సమేత రామలింగేశ్వరస్వామి కల్యాణం అశేష భక్తజన సందోహం మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. గ్రామంలో మహిళలు సిద్దం చేసిన తలంబ్రాలను గ్రామస్తులు పల్లకీలో ఉంచి మేళతాళాల మధ్య ఊరేగింపుగా రామలింగేశ్వరస్వామి క్షేత్రానికి తీసుకువచ్చి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పూల పందిరిలో ఉంచారు. అనంతరం పార్వతి సమేత రామలింగేశ్వరస్వామి ఉత్సవ విగ్రహాలను సన్నాయి వాయిధ్యాల నడుమ ఆలయం లోపలి నుంచి కల్యాణ మండపంలోకి తెచ్చారు. దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ మదనేశ్వర్‌రెడ్డి దంపతులు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. పురోహితులు ఉత్సవ విగ్రహాలకు పట్టు వస్త్రాలను కట్టించి, జీలకర్ర, బెల్లం పెట్టించారు. వేదమంత్రోచ్ఛరణాలు, మేళతాళాల మధ్య పార్వతి మెడలో మంగళసూత్రాన్ని కట్టించి కల్యాణాన్ని కమనీయంగా జరిపించారు. ఈ సందర్భంగా ఆలయంలోని శివలింగానికి అభిషేకాలు నిర్వహించి పూలతో అలంకరించారు. అనంతరం కల్యాణానికి తరలివచ్చిన భక్తులకు అన్నదానం చేశారు. – అడ్డాకుల -
నర్వ.. ప్రగతి బావుటా
సమకూరనున్న నిధులు యాస్పిరేషన్ బ్లాక్ ప్రగతిపై ఢిల్లీలోని నీతి ఆయోగ్ సీఈఓ సుబ్రమణ్యం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణపేట కలెక్టర్‌తో వీసీ నిర్వహించి నర్వ గురించి చర్చించి 12 ప్రతిపాదనలతోపాటు మరో 2 ప్రతిపాదనలు ఆమోదం పొందాయి. ఇందులో శ్రీపునరుత్పాదక పర్యావరణ అనుకూల ఆహారం (నర్వ కేజీబీవీలో సౌరశక్తితో పనిచేసే వంటగది) కోసం రూ.1.2 కోట్లు మంజూరు చేశారు. అలాగే స్పార్క్ స్కూల్ ప్రోగ్రాం ఫర్ ఏఐ రెడినెస్ నాలెడ్జ్ (ప్రాథమిక పాఠశాలల్లో ఏఎక్స్ఎల్ డిజిటల్ ల్యాబ్‌ల స్థాపన)కు ఆమోదం తెలిపారు. ● మండలంలో 6 అంగన్వాడీ భవనాలు, డైనింగ్‌హాల్ కోసం రూ.1.5 కోట్లు, మండలంలోని 3 కేంద్రాలలో ఫేర్ ప్రైస్ షాప్స్ (సూపర్ మార్కెట్ మోడల్) ఏర్పాటు కోసం రూ.3.73 లక్షలు, ఫ్రంట్‌లైన్ వర్కర్స్ బెస్ట్ ప్రాక్టీస్ అప్రిసియేషన్ అవార్డు కోసం రూ.2 లక్షలు, మండలంలోని 22 పాఠశాలల్లో ఏఐ డిజిటల్ ల్యాబ్‌తోపాటు సోలార్ కిచెన్ కోసం రూ.1.2 కోట్లు, ప్రకృతి వ్యవసాయానికి రూ.15 లక్షల నిధులు మంజూరు కానున్నాయి. జిల్లాలో నీతి ఆయోగ్ సంపూర్ణ అభియాన్‌కు ఎంపికతో మహర్దశ నర్వ: దేశంలో అత్యంత వెనకబడిన ప్రాంతాలను గుర్తించి వాటిని అభివృద్ధి చేసేందుకు నీతి ఆయోగ్ జూలై 4, 2022న సంపూర్ణ అభియాన్ అనే ప్రత్యేక కార్యక్రమం ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి గాను దేశంలో 500 వెనకబడిన ప్రాంతాలను గుర్తించగా.. ఉమ్మడి పాలమూరులోని జోగుళాంబ గద్వాల జిల్లాలో గట్టు మండలం, నారాయణపేట జిల్లాలో నర్వ మండలాన్ని ఎంపిక చేసింది. ఇందులో సమగ్ర అభివృద్ధి సాధించేలా.. ఆరోగ్యం, పోషణ, విద్య, పారిశుద్ధ్యం, నీటి వసతి, వ్యవసాయం వంటి ఆరు ముఖ్యమైన సూచికలపై దృష్టిసారించింది. ఈ మేరకు మొదటి మూడు నెలలపాటు చేపట్టిన న్యూట్రీషణ్ (పోషణ), అగ్రికల్చర్ (వ్యవసాయం), విద్య (ఎడ్యుకేషన్, నీటి వసతి, సోషల్ సెక్టార్) విభాగాల్లో మెరుగైన పనితీరుపై ఇటీవల జాతీయ స్థాయిలో ర్యాంకింగ్ విడుదల చేశారు. ఇందులో జాతీయ స్థాయిలో దక్షిణ భారతదేశంలో ప్రథమ స్థానం, మొత్తం జాతీయ స్థాయిలో నర్వ మండలం యాస్పిరేషన్ బ్లాక్ 3వ ర్యాంకు సాధించినట్లు అధికారులు గణంకాలు విడుదల చేశారు. అలాగే దేశవ్యాప్తంగా నీటి కొరతతో అల్లాడుతున్న అనేక ప్రాంతాలకు నర్వ బ్లాక్ దిక్సూచిగా నిలిచింది. నీతి ఆయోగ్ తాజాగా విడుదల చేసిన వాటర్ బడ్జెటింగ్ ఇన్ యాస్పిరేషనల్ బ్లాక్స్ నివేదికలో నర్వ బ్లాక్ పనితీరుపై ప్రశంసలు కురిపించింది. సౌరశక్తి ఆధారిత వంటశాల.. సంపూర్ణ అభియాన్ ద్వారా ఆరు విభాగాల్లో చేపట్టిన పనులపై గతేడాది డిసెంబర్ 27న కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈ ప్రాంతంలో పర్యటించి కేంద్రానికి నివేదిక అందించారు. ఇందుకు యాస్పిరేషన్ బ్లాక్ ప్రగతి కోసం నర్వ కేజీబీవీలో సౌరశక్తి ఆధారిత వంటశాల (సోలార్ ఫర్ హెల్తీ రినివబుల్ అండ్ ఈకో ఫ్రెండ్లీ ఈటింగ్) స్థాపన కోసం రూ.62.15 లక్షలు మం జూరు చేసింది. 2025– 26 ఆర్థిక సంవత్సరానికి గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద మొదటి విడతగా రూ. 15,53,750 మంజూరు చేశారు. ఈ నిధులతోపాటు పీఎంశ్రీ పెద్దకడ్మూర్ ఉన్నత పాఠశాల, మండల ప్రా థమిక పాఠశాలల్లో అదనపు తరగతి గదుల నిర్మాణం, ప్రాథమిక పాఠశాలల్లో ఏఎక్స్ఎల్ డిజిటల్ ల్యా బ్ల ఏర్పాటు కోసం రూ.58,13,070 మంజూరు చేశారు. దీంతోపాటు 6 నెలలుగా నర్వ మండలంలో కలెక్టర్ ప్రత్యేక చొరవ చూపించి రూ.8 లక్షలు విడు దల చేయించి అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులు కూర్చునేందుకు ప్రీ స్కూల్ బల్లలు, కుర్చీ లు, గోడలపై పేయింటింగ్స్, మ్యాపులు, మంకీ బార్స్, బెడ్‌షీట్స్ వంటి పరికరాలను మండలంలోని 33 అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేశారు. దీంతోపాటు మోడల్ అంగన్వాడీ కేంద్రాలను ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. 2024–25లో ఆస్పిరేషన్ బ్లాక్ కార్యక్రమానికి ఎన్నిక ఆరు విభాగాల్లో ఉత్తమ పనితీరుపై ప్రశంసలు దక్షిణ భారతంలో ప్రథమ, జాతీయ స్థాయిలో 3వ ర్యాంకు కేంద్ర ప్రభుత్వం నుంచి సమకూరనున్న మరిన్ని నిధులు కేంద్ర మంత్రి పర్యటనతో.. నీతి ఆయోగ్ సంపూర్ణ అభియాన్ కార్యక్రమం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఎంపికై న 10 జిల్లాల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ గతేడాది డిసెంబర్లో పర్యటించారు. ఈ సందర్భంగా నర్వ మండలంలోని రాయికోడ్‌లో డిసెంబర్ 27న పర్యటించి సంపూర్ణ అభియాన్ ద్వారా అమలవుతున్న పథకాలను లబ్ధిదారులు, చిన్నారులను అడిగి తెలుసుకొని కేంద్రానికి నివేదిక అందించారు. దీంతో జాతీయ స్థాయిలో నర్వ మండలానికి అభివృద్ధి పరంగా ప్రత్యేక నిధులు రాబట్టేందుకు ఈ కార్యక్రమం దోహదపడింది. మరిన్ని నిధులు.. దేశవ్యాప్తంగా నర్వ బ్లాక్ ఉత్తమ ర్యాంకు సాధించడంతో మరిన్ని నిధులు రానున్నాయి. ఇటీవల నీతి ఆయోగ్ అడిషనల్ డైరెక్టర్ గౌరవ్ కటియార్ బ్లాక్ పనితీరు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో కొత్తగా వచ్చే నిధులతో అంగన్వాడీ కేంద్రాల్లో టాయిలెట్స్ నిర్మాణం, కేజీబీవీలో సోలార్ స్టీమింగ్ కుకింగ్ సిస్టం ఏర్పాటు కానుంది. – బాలాజీ, నీతి ఆయోగ్ కోఆర్డినేటర్, నర్వ -
ఎక్కడా అటంకం కలగడం లేదు..
పదో తరగతి వార్షిక పరీక్షలో గతేడాది కంటే ఇప్పుడు ఉత్తమ ఫలితా లు సాధించేలా ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేస్తున్నాం. విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. వరుస ఎన్నికల నేపథ్యంలో బోధనలో కొన్ని ఇబ్బందులు కలిగిన విషయం వాస్తవమే. అయినా అన్నింటిని సరిచేసుకుంటూ.. ముందుకు సాగుతున్నాం. గతం కంటే రాష్ట్రస్థాయిలో ఉత్తమ ర్యాంక్ సాధిస్తాం. వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా విద్యార్థులను సిద్ధం చేశాం. – రమేష్‌కుమార్ జిల్లా విద్యాధికారి ఆందోళనకు గురికావద్దు.. పరీక్షలు దగ్గర పడుతున్నాయని ఎక్కువ గంటలు చదువుతూ విద్యార్థులు ఆహారం, నిద్రను నిర్లక్ష్యం చేస్తుంటారు. ఇది మెదడుపై ప్రభావం చూపుతోంది. గంట చదివితే 15 నిమిషాలు విశ్రాంతి తీసుకోవాలి. పరీక్షల సమయంలో ఆహారాన్ని మితంగా తీసుకొని పండ్ల జ్యూస్‌లకు ప్రాధాన్యత ఇవ్వాలి. – రాజేష్‌గౌడ్, పీడియాట్రిక్, ప్రభుత్వ మెడికల్ కళాశాల, నాగర్‌కర్నూల్ ● -
బాధ్యత పెరిగింది..
సంపూర్ణ అభియాన్ 2.0 కార్యక్రమంలో నర్వ యాస్పిరేషన్ బ్లాక్ దేశంలోనే 3వ ర్యాంకు సాధించి మరింత బాధ్యతను పెంచింది. కలెక్టర్ ఆదేశాల మేరకు మండలంలో ఆరు విభాగాల్లో వంద శాతం ఫలితాలు సాధించేందుకు కృషిచేస్తాం. – శ్రీనివాసులు, ఎంపీడీఓ నర్వస్పార్క్, శ్రీకార్యక్రమాలు.. నీతి ఆయోగ్ ద్వారా యాస్పిరేషన్ బ్లాక్ నర్వ మండలానికి రూ.1.2 కోట్లు నిధులు మంజూరు కానున్నాయి. స్పార్క్ (ప్రాథమిక పాఠశాలల్లో ఎక్స్ఎల్ డిజిటల్ ల్యాబ్‌లు), శ్రీ (పునరుత్పాదక, పర్యావరణ అనుకూల ఆహారం కోసం సౌరశక్తితో పనిచేసే వంటగది) నిర్మాణాలకు ఈ నిధులు వినియోగించనున్నారు. – ప్రణయ్‌కుమార్, శిక్షణ కలెక్టర్, నారాయణపేట -
నేటి నుంచి వెంకన్న బ్రహ్మోత్సవాలు
బిజినేపల్లి: మండలంలోని వట్టెం శ్రీవేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉత్సవాలు వారం పాటు కొనసాగుతాయని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ నెల 5న గురువారం ఉదయం అలర్మేల్ మంగ గోదాదేవి సమేత శ్రీవేంకటేశ్వర స్వామివార్ల కల్యాణం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. భక్తుల సౌకర్యం కోసం అన్ని వసతులు కల్పించినట్లు నిర్వాహకులు తెలిపారు. వేరుశనగ క్వింటా రూ.10,363 కల్వకుర్తి రూరల్: స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డుకు ఆదివారం భారీగా వేరుశనగ అమ్మకానికి వచ్చింది. 171మంది రైతులు 1,146 క్వింటాళ్లు తెచ్చినట్లు అధికారులు తెలిపారు. అత్యధికంగా క్వింటా వేరుశనగకు రూ.10,363 ధర లభించగా.. కనిష్టంగా రూ.5,669, సరాసరి ధర రూ.9,563 పలికింది. కందులకు అత్యధికంగా రూ.7,229 ధర లభించింది. మార్కెట్ యార్డుకు వచ్చిన రైతులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసినట్లు మార్కెట్ కార్యదర్శి శివరాజ్ చెప్పారు. ‘ముంపు బాధితులను విస్మరించొద్దు’ చారకొండ: గోకారం జలాశయంలో ముంపు గ్రామాలను మినహాయించాలని చేపడుతున్న దీక్షలు ఆదివారం నాటికి 90 రోజులు అయినా ప్రభుత్వం నిర్వాసితులను పట్టించుకోవడం లేదని ఎర్రవల్లి, ఎర్రవల్లి తండా ప్రజలు వాపోయారు. డిండి–నార్లాపూర్ ఎత్తిపోతల పథకంలో భాగంగా చేపడుతున్న మండలంలోని గోకారం రిజర్వాయర్ నిర్మాణం సామర్థ్యం తగ్గించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందిచాలని, ఎంపీ, ఎమ్మెల్యే స్పందించి ఎర్రవల్లి, ఎర్రవల్లితండా గ్రామాలు ముంపునకు గురి కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని ఒప్పించాలని డిమాండ్ చేశారు. ఆర్అండ్ఆర్ నోటిఫికేషన్ రద్దు జీఓ జారీ చేసే వరకు దీక్షలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. -
అత్యాధునికపరిజ్ఞానం..
సురభిరాజులు ప్రజారంజక పాలనతోపాటు అత్యాధునిక పరిజ్ఞానాన్ని వినియోగించడంలోనూ ముందున్నారు. మద్రాసు రాష్ట్రంలో ఉన్న రెండు విమానాలలో ఒకటి మద్రాసు పాలకులది కాగా.. రెండోది సురభి రాజులది. ఇద్దరు ప్రయాణించగల ఈ విమానాన్ని సురభి వెంకటలక్ష్మారావు కూతురు అయిన సరస్వతిదేవి అమ్మయ్యగారి భర్త బొబ్బిలి రాజ్యానికి చెందిన ఐవీ కృష్ణారావు నడిపేవారు. 1935 ఆగస్టు 25న కృష్ణారావు చనిపోవడంతో ఆయన స్మృత్యార్థం ఆర్ఐడీ బాలుర కళాశాల సమీపంలో స్తూపం ఏర్పాటు చేశారు. రైల్వే వ్యవస్థ ప్రారంభమయ్యాక కొల్లాపూర్‌కు రైల్వే లైన్ వేయాలనే ప్రతిపాదనను బ్రిటీష్ పాలకులు తీసుకురాగా సురభిరాజులు తిరస్కరించారు. ఇక్కడి సంపదను తరలించుకుపోతారనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారని చెబుతారు. సురభి రాజులు వినియోగించిన విమానం -
క్రీడా పాఠశాలలను సద్వినియోగం చేసుకోవాలి
కందనూలు: రాష్ట్రంలోని క్రీడా పాఠశాలలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ బదావత్ సంతోష్ సూచించారు. క్రీడా పాఠశాలల్లో 2026–27 విద్యా సంవత్సరానికి గాను 4వ తరగతిలో ప్రవేశానికి సంబంధించిన పోస్టర్‌ను శనివారం కలెక్టరేట్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. 2017 సెప్టెంబర్ 1 నుంచి 2018 ఆగస్టు 31వ తేదీ మధ్య జన్మించి.. 4వ తరగతి చదువబోతున్న విద్యార్థులు అర్హులని తెలిపారు. ఆసక్తి, అర్హులైన విద్యార్థులు http://tgss.te langana.gov.com వెబ్సైట్లో మార్చి 4వ తేదీలోగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. 13 నుంచి 17వ తేదీ వరకు మండల స్థాయిలో ఎంపికలు ఉంటాయన్నారు. 30న నాగర్‌కర్నూల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో జిల్లాస్థాయి ఎంపికలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఎంపికలకు హాజరయ్యే విధ్యార్థులు ప్రస్తుత పాఠశాల నుంచి స్టడీ సర్టిఫికెట్, పంచాయతీ/మున్సిపాలిటీ నుంచి పుట్టిన తేదీ ధ్రువపత్రం, 3వ తరగతి పురోగతి నివేదిక కాపీ, ఆధార్, కుల ధ్రువపత్రం, ఐదు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు తీసుకురావాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో డీవైఎస్ఓ సీతారాం, జిల్లా సివిల్ సప్లయ్ అధికారి నర్సింహారావు పాల్గొన్నారు. -
చట్టాలపై అవగాహన తప్పనిసరి
కొల్లాపూర్ రూరల్: ప్రతి ఒక్కరికీ చట్టాలపై తప్పనిసరిగా అవగాహన ఉండాలని కొల్లాపూర్ కోర్డు న్యాయమూర్తులు ఉపనిషధ్వాని, డి.లక్ష్మణ్ అన్నారు. శనివారం కొల్లాపూర్ మండలం ముక్కిడిగుండంలో న్యాయ విజ్ఞాన సదుస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజలకు చట్టాలకు లోబడి నడుచుకోవాలని సూచించారు. బాల్యవివాహాలు చేయడం నేరమన్నారు. అదే విధంగా ఎవరైనా బాలలను పనిలో పెట్టుకుంటే చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం అటవీ చట్టాలు, రోడ్డు భద్రత నియమాలు, మహిళా చట్టాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ భూమిని, న్యాయవాదులు మోహన్‌లాల్, బాలస్వామి, నిరంజన్ పాల్గొన్నారు. -
అనుమానాస్పద స్థితిలో 3 నెలల పసికందు మృతి
అప్పుల బాధతో కౌలు రైతు బలవన్మరణం ఆర్టీసీ ఉద్యోగులకుపురస్కారాలు కొల్లాపూర్: స్థానిక ఆర్టీసీ డిపోలో శనివారం ఉత్తమ ఉద్యోగుల అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా విధి నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభకనబర్చిన ఆర్టీసీ డ్రైవర్లు, కండెక్టర్లు, మెకానిక్‌లకు డీఎం ఉమాశంకర్ పురస్కారాలను అందజేశారు. గత జనవరిలో అత్యధిక ఈపీకే, అత్యధిక ఇన్సెంటివ్, ఇంధన పొదుపు చేసిన డ్రైవర్లు, కండెక్టర్లను నగదు పురస్కారాలతో సత్కరించినట్లు ఆయన తెలిపారు. ఆర్టీసీ అభివృద్ధికి ఉద్యోగులు బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో ఉద్యోగులు రత్నమ్మ, వెంకటేశ్వర్లు, నజీర్, గౌస్ తదితరులు పాల్గొన్నారు. ఇంటర్ పరీక్షకు 5,763 మంది హాజరు కందనూలు: జిల్లాలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు శనివారం ప్రశాంతంగా కొనసాగాయి. జిల్లావ్యాప్తంగా 34 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించగా.. 5,921 మంది విద్యార్థులకు గాను 5,763 మంది హాజరయ్యారు. జనరల్‌లో 4,537 మందికి గాను 4,431 మంది, ఒకేషనల్ విభాగంలో 1,384 మందికి గాను 1,332 మంది హాజరై పరీక్ష రాశారు. జనరల్‌లో 107 మంది, ఒకేషనల్ విభాగంలో 52 మంది గైర్హాజరయ్యారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశామని డీఐఈఓ వెంకటరమణ తెలిపారు. శనేశ్వరాలయానికి పోటెత్తిన భక్తులు బిజినేపల్లి: నందివడ్డెమాన్ జైష్ట్యాదేవి సమేత శనేశ్వరాలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. తమ ఏలినాటి శనిదోష నివారణ కోసం శనేశ్వరుడికి తిల తైలాభిషేకాలు నిర్వహించి.. గోత్ర నామార్చనలు చేశారు. అనంతరం బ్రహ్మసూత్ర శివాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకుడు గవ్వమఠం విశ్వనాథశాస్త్రి పాల్గొన్నారు. ‘సప్తశేష వాహనం’పై రంగనాథస్వామి వనపర్తి రూరల్: శ్రీరంగాపురం రంగనాథస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం అర్చకులు స్వామి, అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. ఉదయం మంగళ వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ శ్రీవారి మూలమంత్ర హవనం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం సర్వాలంకరణ శోభితుడు, సమస్త లోకాధిపతి అయిన రంగనాథస్వామి ఉభయ నాంచారీ సమేతుడై సప్త శేషవాహనంపై తిరువీధుల్లో విహరించారు. దివ్యతేజ స్వరూపుడైన స్వామివారిని భక్తులు పెద్దసంఖ్యలో దర్శించుకున్నారు. అర్చకులు విష్ణునారాయణ, కిట్టుస్వామి, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. గెస్టు లెక్చరర్స్‌కు ఇంటర్వ్యూలు మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ లా కళాశాలలో ఖాళీలను గెస్టు లెక్చరర్లచే భర్తీ చేసేందుకు గాను శనివారం అధికారులు ఇంటర్వ్యూలు నిర్వహించారు. గత వారం అధికారులు నోటిఫికేషన్ ఇవ్వగా.. వచ్చిన దరఖాస్తుల ఆధారంగా వీసీ శ్రీనివాస్, రిజిస్ట్రార్ రమేష్‌బాబు ఇంటర్వ్యూ సరళిని పరిశీలించారు. కార్యక్రమంలో ఆడిట్‌సెల్ డైరెక్టర్ చంద్రకిరణ్ తదితరులు పాల్గొన్నారు. వివరాలు –IIలో u -
ఉత్తమ ఫలితాలతో ప్రథమ స్థానంలో నిలుద్దాం
కందనూలు: పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించి.. జిల్లాను రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలబెట్టాలని అదనపు కలెక్టర్ అమరేందర్ అన్నారు. జిల్లాలోని సంక్షేమ వసతిగృహాల పదో తరగతి విద్యార్థులకు శనివారం జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో ప్రేరణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా భవిష్యత్ మార్గనిర్దేశం చేశారు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా చదువుకోవాలని సూచించారు. ముఖ్యంగా పరీక్షలంటే భయం వీడాలన్నారు. ప్రతి విద్యార్థికి ఉపాధ్యాయ బృందం అందుబాటులో ఉంటుందని.. ఏ సమయంలోనైనా తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చని తెలిపారు. వసతిగృహాల్లో పదో తరగతి విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాలను తమ అవసరాలకు అనుగుణంగా ఉపయోగించుకోవాలని ఆ యన సూచించారు. కార్యక్రమంలో డీఈఓ రమేశ్‌కుమార్, జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ అధి కారి ఉమాపతి, సైకాలజిస్ట్ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
ఎలక్ట్రానిక్ వ్యర్థాలతో పర్యావరణానికి ముప్పు
కందనూలు: ఎలాక్ట్రానిక్ వేస్టేజ్ పర్యావరణానికి పెను సవాల్‌గా మారిందని తెలంగాణ నేషనల్ గ్రీన్ కార్ప్స్ ప్రతినిధి చైతన్య అన్నారు. హరిథాన్ ఎకో హ్యాకథాన్‌లో భాగంగా శనివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో ఈ–వేస్ట్‌పై నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆమె హాజరై మాట్లాడారు. ప్రస్తుత కాలంలో ఈ–వేస్ట్ పర్యావరణానికి పెను ముప్పుగా మారిందని ఆందోళన వ్యక్తంచేశారు. ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగం పెరుగుతున్న కొద్దీ.. వాటి వ్యర్థాలు అధికమవుతున్నాయన్నారు. వాటిని సరైన విధంగా నిర్వహించకపోతే భూమి, నీరు, గాలి కాలుష్యానికి దారితీస్తాయని తెలిపారు. పాడైన మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, బ్యాటరీలు వంటి పరికరాల్లో ఉండే హానికర రసాయనాలు మానవ ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపవచ్చని పేర్కొన్నారు. యువత ఈ విషయంపై చైతన్యం పెంపొందించుకొని ఎలక్ట్రానిక్ వ్యర్థాలను నిర్లక్ష్యంగా పారవేయకుండా, సరైన విధానంలో నిర్వహించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి ఈ–వేస్ట్‌ను తగ్గించే దిశగా చర్యలు చేపట్టాలని కోరారు. అనంతరం పర్యావరణ పరిరక్షణ కోసం పాత ఎలక్ట్రానిక్ పరికరాలను రీ సైక్లింగ్‌కు పంపించడం.. పర్యావరణహిత జీవన విధానాన్ని అలవర్చుకోవడం.. కాలుష్య నియంత్రణపై అవగాహన పెంపొందించడం వంటి సూచనలు చేశారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ మదన్మోహన్, అధ్యాపకులు అంజయ్య, ఉమాదేవి, కోదండరాములు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
సకలకళా సురభిలు
● స్వాతంత్య్రానికి ముందే కొల్లాపూర్‌లో డబుల్ లైన్ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, ఆస్పత్రి ఏర్పాటు ● దక్షిణ భారతంలో రెండో విమానం కొనుగోలు చేసింది వీరే.. ● ఆధ్యాత్మికతతోపాటు తెలుగు భాష పరిరక్షణకు పెద్దపీట ● కళలకు పట్టం.. ఉద్యానవనాల సాగుకు బీజం కొల్లాపూర్ బంగ్లా వ్యూ జటప్రోల్, కొల్లాపూర్ సంస్థానాలుగా సురభిరాజుల ప్రజారంజక పాలన రాచరిక పాలన అంటే సంప్రదాయాలు, కట్టుబాట్లు, బానిసత్వం ఉంటాయి.. కానీ, కొల్లాపూర్‌ను శతాబ్దాల పాటు పాలించిన సురభి రాజవంశస్థులు అందుకు భిన్నంగా స్వేచ్ఛాయుత పాలన అందించారు. ఆధ్యాత్మికతను పెంపొందిస్తూ.. కళలకు పట్టం కట్టి.. అధునాతన వసతులతో ఆదర్శవంతమైన పాలన సాగించారు.. ఆ కాలంలోనే కొల్లాపూర్‌లో వంద ఫీట్ల వెడల్పాటి రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణం, ఆస్పత్రి వసతులు కల్పించారంటే వీరి ముందుచూపు ఏపాటిదో ఊహించవచ్చు. అలాగే దక్షిణ భారతంలోనే మద్రాస్, నిజాం పాలకుల తర్వాత విమానం కొనుగోలు చేసిన ఘనత వీరికే దక్కింది. ఆధునికతతోపాటు ఆధ్యాత్మికత, తెలుగు భాష పరిరక్షణకు పెద్దపీట వేసిన సురభిరాజ వంశస్తుల ప్రజారంజక పాలనపై ‘సాక్షి’ సండే స్పెషల్ కథనం.. – కొల్లాపూర్ సుపరిపాలన అందించిన రాజా వెంకట లక్ష్మారావు తెలంగాణ రాష్ట్రంలో గల 14 సంస్థానాల్లో సురభిరాజులది ఒకటి. జటప్రోల్‌ను కేంద్రంగా చేసుకుని సాగించిన వీరి పరిపాలనకు సంబంధించిన చారిత్రక అంశాలు 14వ శతాబ్దం నుంచి అందుబాటులో ఉన్నాయి. జటప్రోల్లో శత్రుదుర్భేద్యమైన రాజధాని కోట నిర్మించారు. జటప్రోల్ సంస్థానంపైకి తరచూ కర్నూలు జిల్లా నుంచి శత్రురాజులు దండయాత్రలు చేస్తుండడంతో 1840లో రాజా లక్ష్మణరాయల కాలంలో సంస్థానాన్ని కొల్లాపూర్‌కు మార్చారు. మైసూరు ప్యాలెస్ నమూనాతో రాజమహల్, మంత్రమహల్, రాణిమహల్ అని విభజించి భారీ కోటను నిర్మించారు. 1884లో రాజా వెంకటలక్ష్మణరావు హయాంలో సంస్థానం కోట నిర్మాణం జరిగింది. 1948లో సురభిరాజుల సంస్థానం రాజా వెంకట జగన్నాథరావు పరిపాలనా కాలంలో భారత ప్రభుత్వంలో విలీనమైంది. కవుల పోషణ సురభిరాజులు కవులను కూడా పోషించారు. 19వ తరం పాలకుడైన మాధవరావు స్వతహాగా చంద్రికాపరిణయం అనే కవితా సంపుటిని రచించారు. సురభి సంస్థానంలో ఎలకూచి బాలసరస్వతి, ఎల్లూరి నరసింగకవి, వాజపేయాజుల రామసుబ్బరాట్ కవి వంటి ఉద్దండులు ఉండేవారు. తెలుగు భాషా పరిరక్షకులు నిజాం నవాబులకు సామంతులుగా ఉన్న సురభిరాజులు పరిపాలనలో ఎక్కడ కూడా నిజాం పోకడలను అనుసరించలేదు. ప్రధానంగా భాషా పరిరక్షణలో వారు తెలుగుకే ప్రాధాన్యం ఇచ్చారు. సంస్థానాల్లో చాలాచోట్ల ఉర్దూ ప్రభావం ఉన్నప్పటికీ.. జటప్రోల్, కొల్లాపూర్ సంస్థానంలో మాత్రం ఆ ఊసు ఎక్కడా కనిపించదు. తెలుగు భాష పరిరక్షణలో భాగంగా 1920లో కొల్లాపూర్ కవులచే స్నేహలతా కవితా సంఘాన్ని ఏర్పాటు చేయించి.. దాని నిర్వహణకు సహకరించారు. 1930లో రాణి రత్నమాంబ ఆర్థిక సహకారంతో వైజయంతి అనే తెలుగు పత్రికను ప్రచురించారు. అభివృద్ధికి చిరునామా.. కొల్లాపూర్ పట్టణాన్ని సురభిరాజులు అభివృద్ధికి చిరునామాగా మార్చారు. దేశంలో విద్యుత్ వాడకం ప్రారంభమైన తొలినాళ్లలోనే మద్రాసు సంస్థానంతోపాటు విద్యుత్ వినియోగించిన పట్టణాల్లో కొల్లాపూర్ ఒకటి. 18వ శతాబ్దంలోనే ధర్మాస్పత్రి ఏర్పాటు చేసి ప్రజలకు ఉచితంగా ఆయుర్వేద వైద్య సేవలు అందించారు. 1920లోనే టౌన్ ప్లానింగ్ రూపొందించారు. వ్యవసాయ అభివృద్ధి కోసం వేలాది ఎకరాలకు సాగునీరందించేలా సింగోటం శ్రీవారి సముద్రం చెరువు నిర్మించారు. హిందూ, ముస్లింలకు సమాన ప్రాధాన్యత ఇస్తూ.. జటప్రోల్లో హజ్రత్ ఇనాయత్షా ఖాద్రీ దర్గా ఉర్సుకు మదనగోపాలస్వామి ఆలయం నుంచి పూజా సామగ్రిని పంపించేవారు. నిజాంకు ఇష్టమైన ప్రాంతం.. కొల్లాపూర్ సంస్థానం నిజాం నవాబుకు ఇష్టమైన ప్రాంతం. సురభి రాజులు సింగోటంలో నిర్మించిన లక్ష్మీనర్సింహస్వామి ఆలయానికి నిజాం నవాబు రోజూ ఒక్క రూపాయి చొప్పున కై ంకర్యంగా పంపేవారు. 1850 నుంచే నిజాం పాలకులతో సురభి రాజులకు సత్సంబంధాలు ఉండేవి. 1854 నుంచి 1884 వరకు సంస్థానాన్ని పాలించిన రాజా వెంకట జగన్నాథరావును నిజాం పాలకులు రాజా బహదూర్, నిజాం నూజ్వంత్ అనే బిరుదులతో సత్కరించారు. కళలకు పుట్టినిల్లు.. సురభి రాజులు శిల్ప, చిత్రకళలకు ప్రాధాన్యం ఇచ్చారు. 16వ శతాబ్దంలో జటప్రోల్, మంచాలకట్ట, సోమశిల గ్రామాల్లో నిర్మించిన పురాతన ఆలయాలే ఇందుకు నిదర్శనం. శ్రీశైలం డ్యాం నిర్మాణంలో ఈ గుడులన్నీ కృష్ణానదిలో మునిగిపోగా.. 1989లో జటప్రోల్, కొల్లాపూర్‌లో మదనగోపాలస్వామి, మూకగుడులు, సోమశిలలో లలితాంబికా సోమేశ్వరాలయాలను పురావస్తు శాఖ పునర్నిర్మించింది. జటప్రోల్లో ఆలయ ముఖద్వారం, ఆలయంలో మంటపాలు, మదనగోపాలస్వామి ఆలయంలోని స్తంభాలపై చెక్కిన శిల్పాలు సురభిరాజుల శిల్పకళా సౌరభాన్ని చాటుతాయి. అలాగే చిత్రకళలకు కూడా వీరు ప్రాధాన్యం ఇచ్చారు. సురభిరాజుల కోటలో ఉన్న చిత్రాలు ఈ విషయాన్ని తెలియపరుస్తాయి. హైదరాబాద్లోరాజవంశ వారసులు.. సురభి రాజవంశ వారసుడిగా ప్రస్తుతం ఆదిత్య లక్ష్మారావు కొనసాగుతున్నారు. సింగోటం లక్ష్మీనర్సింహస్వామి, జటప్రోల్ మదనగోపాలస్వామి, కొల్లాపూర్‌లోని మాధవస్వామి, బండాయిగుట్ట వేంకటేశ్వరస్వామి, శివాలయం, రామాలయాలకు ఫౌండర్ ట్రస్టీగా ఉన్నారు. ఆదిత్య లక్ష్మారావుకు అనిరుధ జగన్నాథరావు, విధుర రాజగోపాలరావు అనే ఇద్దరు కుమారులున్నారు. వీరు సికింద్రాబాద్‌లోని సురభి గార్డెన్లో నివాసం ఉంటున్నారు. ఉద్యానవనాల పెంపకంపై దృష్టి బొబ్బిలి రాజవంశాలతో బంధుత్వం ఉన్న సురభి రాజులు అక్కడి నుంచి వివిధ రకాల మామిడి మొక్కలను తెచ్చి కొల్లాపూర్‌లో ఉద్యానవనాల సాగుకు శ్రీకారం చుట్టారు. వివిధ ప్రాంతాల నుంచి తెచ్చిన మామిడి మొక్కలను కొల్లాపూర్‌లోని పెద్దతోటలో సాగుచేశారు. పెద్దతోటలో కాచిన పండ్లను బ్రిటీష్ పాలకులతోపాటు నిజాం నవాబులకు పంపేవారు. -
అందని రైతు ‘భరోసా’
● పంట పెట్టుబడి సాయం కోసంరైతన్నల ఎదురుచూపులు ● యాసంగి సీజన్ వరినాట్లు పూర్తి.. దిగుబడి దశలో వేరుశనగ ● ఎన్నికలు ముగిసినా నిధుల విడుదలపై స్పందించని ప్రభుత్వం ● తప్పని పరిస్థితుల్లో వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్న రైతులు శాటిలైట్ సర్వే ఆధారంగా.. సాగులో ఉన్న భూములకే రైతు భరోసా ఇవ్వాలనే లక్ష్యంతో ప్రభుత్వం క్షేత్రస్థాయిలో శాటిలైట్ సర్వే చేసింది. సర్వే నంబర్ల వారీగా రైతుల వివరాలు నమోదు చేస్తూ.. ఆక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగా సర్వే పూర్తిచేయగా.. సాగుచేసిన భూముల వివరాలను వ్యవసాయశాఖ ఆన్లైన్లో నమోదు చేసినప్పటికీ రైతు భరోసా జాడే లేకుండాపోయింది. కాగా, రైతుభరోసా కింద ఎకరాకు ప్రతి ఏడాది రూ. 15వేలు అందిస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. రెండు సీజన్లకు విడివిడిగా సాయం అందిస్తామని ప్రకటించింది. అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా పెట్టుబడి సాయం పెంపుపై స్పష్టత ఇవ్వలేదు. రెండు సీజన్లలో ఎకరాకు రూ. 12వేలు మాత్రమే అందిస్తున్నారు. అయితే ఒక సీజన్లో రూ. 6వేల చొప్పున పంట పెట్టుబడి సాయం అందుతుందని రైతులు ఆరోపిస్తున్నారు. అచ్చంపేట: యాసంగి సీజన్ ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా రైతు భరోసాపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదు. మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే రైతుల బ్యాంకు ఖాతాల్లో పంట పెట్టుబడి సాయం జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే పంటలు చేతికందే సమయం ఆసన్నమైనా ఇప్పటి వరకు రైతు భరోసా జమ కాలేదు. ఎన్నో ఇబ్బందులు పడి వేరుశనగ, వరి, ఇతర పంటలు సాగుచేసిన రైతులు ప్రభుత్వం అందించే పెట్టుబడి సాయం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. 2023 యాసంగిలో 3.06 లక్షల మంది రైతులకు రూ. 369.21 కోట్లు అందించగా.. 2024 యాసంగిలో 2.41 లక్షల మంది రైతులకు రూ. 247.39 కోట్ల సాయం మాత్రమే అందింది. అదే ఏడాది వానాకాలంలోనూ రైతు భరోసాను నాలుగు ఎకరాల వరకు మాత్రమే పరిమితం చేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది. పెద్ద భూస్వాములు మాత్రమే కాదు.. 5 – 6 ఎకరాలున్నా చిన్న, మధ్యతరహా రైతులు కూడా నష్టపోయారు. ప్రస్తుత యాసంగిలోనూ రైతు భరోసా నిధులు విడుదల చేయకుండా సాగదీస్తుండటంతో ఆందోళనకు గురవుతున్నారు. జిల్లాలో పంటసాగు ఇలా.. జిల్లాలో 7,59,793 ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా.. అధికారుల అంచనా ప్రకారం ప్రస్తుత యాసంగి సీజన్లో 3.95 లక్షల ఎకరాల్లో పంట సాగైంది. ఇందులో 1,40,064 ఎకరాల్లో వరి, 1,06,368 ఎకరాల్లో వేరుశనగ, 1,35,348 ఎకరాల్లో మొక్కజొన్న, 10,734 ఎకరాల్లో మినుములు, 811 ఎకరాల్లో జొన్నలు, 674 ఎకరాల్లో ఇతర పంటలు సాగుచేశారు. ఎకరాకు రూ. 6వేల చొప్పున రూ.237 కోట్లు అందించాల్సి ఉంది. అయితే ప్రభుత్వం సకాలంలో రైతుభరోసా అందించకపోవడంతో చిన్న, సన్నకారు రైతులు పంట పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన దుస్థితి నెలకొంది. ఎన్నికల కోడ్ సాకుతో.. గతేడాది డిసెంబర్లోనే అందాల్సిన యాసంగి సాయం వరుస ఎన్నికల కారణంగా ఫిబ్రవరి నెలాఖరు వరకు వాయిదా పడుతూ వచ్చింది. మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే నిధులు విడుదల చేస్తామని ఆశించిన రైతులకు నిరాశే ఎదురైంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే నిధులు విడుదల చేయాలని.. లేకపోతే మళ్లీ కోడ్ సాకుతో సాయం నిలిచిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో రైతుభరోసా పొందే రైతులు 3.06 లక్షలు సమగ్ర వివరాలు నమోదు.. సాగులో ఉన్న భూముల వివరాలు రైతుల వారీగా ఆన్లైన్లో పొందుపరిచాం. ఈ ఏడాది కొత్తగా పంట సాగుచేసిన భూముల వివరాలను సైతం మండల తహసీల్దార్, వ్యవసాయాధికారి నివేదిక ఆధారంగా నమోదు చేశాం. రైతుభరోసాకు సంబంధించిన జాబితా సిద్ధంగా ఉంది. ప్రభుత్వం నుంచి నిధులు విడుదలైన వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేస్తాం. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. – యశ్వంత్‌రావు, జిల్లా వ్యవసాయశాఖ అధికారి -
టెన్త్ బెటాలియన్ అభివృద్ధికి కృషి
ఎర్రవల్లి: తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీస్ సిబ్బందికి అవసరమైన అన్ని వసతులు అందించి.. బెటాలియన్ల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలంగాణ స్పెషల్ పోలీస్ అడిషనల్ డీజీపీ సంజయ్‌కుమార్ జైన్ అన్నారు. శుక్రవారం ఎర్రవల్లిలోని పదో బెటాలియన్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమాల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన గద్వాల ఎస్పీ శ్రీనివాసరావు, పటాలం కమాండెంట్ జయరాజుతో కలిసి నూతన కన్వెన్షన్ హాల్, పాఠశాల వేదిక, టెన్నిస్ కోర్టును ప్రారంభించారు. త్వరలో నిర్మంచబోయే 30 షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణలో బెటాలియన్ పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది చేస్తున్న సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. ఇటీవల ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది పలు ప్రాంతాల్లో సమర్థవంతంగా విధులు నిర్వహించినందుకు గాను ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం అసిస్టెంట్ కమాండెంట్లు నరేందర్‌రెడ్డి, పాణికి ఉత్కృష్ట సేవా పతకాలను ప్రదానం చేశారు. అలాగే ప్రతిభకనబర్చిన పోలీస్ సిబ్బంది, పాఠశాల విద్యార్థులను అభినందించి ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్లు నరేందర్‌రెడ్డి, పాణి, ఆర్ఐలు నర్సింహరాజు, ఆర్పీ సింగ్, ధర్మారావు, రాజేశం, రాజు తదితరులు పాల్గొన్నారు. టీఎస్ఎస్పీ అడిషనల్ డీజీపీ సంజయ్‌కుమార్ జైన్ -
అనూహ్య మలుపులు
క్లిష్టతరంగా మారిన కుమ్మెర జాతరలో దాడి ఘటన సాక్షి, నాగర్‌కర్నూల్: కుమ్మెర మల్లన్న జాతరలో దాడి ఘటన అనూహ్య మలుపులు తిరుగుతూ మరింత క్లిష్టతరంగా మారుతోంది. ఇప్పటికే ఈ ఘటనపై ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీల పోరాటం కొనసాగడంతోపాటు ఉన్నత స్థాయిలో ఎస్సీ, బీసీ కమిషన్లు సైతం విచారణలో భాగమయ్యాయి. జాతీయ మానవ హక్కుల కమిషన్ సైతం స్పందించి నాలుగు వారాల్లో ఘటనపై పూర్తి వివరాలను అందించాలని కలెక్టర్‌ను ఆదేశించింది. ఈ నెల 18న జాతరలో దాడి ఘటన చోటుచేసుకోగా 21న పసిపాప మరణం నుంచి వరుసగా ఏడు రోజులపాటు నిరసనలు కొనసాగాయి. రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఈ కేసులో పోలీసుల నిఘా వైఫల్యంతోపాటు బాధితుల పట్ల పోలీసుల వైఖరిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. లోతుగా విచారణ.. కుమ్మెర ఘటనలో బాధిత కుటుంబంపై దాడి జరగగా ఇది ఆధిపత్య వర్గం నుంచి పోరుగా ఆగ్రహం పెల్లుబికింది. ఈ క్రమంలో నిందితులపై హత్యకేసు నమోదుచేయాలన్న డిమాండ్ వ్యక్తమైంది. అయితే పోలీసులు దాడి ఘటనలో పాల్గొన్నవారు ఎవరు.. ఏం జరిగిందన్న దాంతోపాటు బాధితులపైనా లోతుగా విచారణ కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో చివరగా ఏం తేలుతుందోనని, బాధితులకు ఎలాంటి న్యాయం జరుగుతుందోనన్న దానిపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. దాడికి పాల్పడిన వారందరినీ అరెస్ట్ చేయాలని బాధితులు కోరుతుండగా.. ఇప్పటి వరకు ముగ్గురిని మాత్రమే అరెస్ట్ చేశారు. ఇంకా నలుగురు పరారీలో ఉన్నారని, త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు. బాధితులపైనే కేసుతో.. జాతరలో గణేశ్‌ను కొబ్బరికాయల గదిలో తలుపులు వేసి బంధించి 8 మంది వరకు దాడి చేసినట్లు బయటకు వచ్చిన వీడియోల్లోనే స్పష్టమైంది. దాడి ఘటన వెంటనే ముందుగా బాధితుడు గణేశ్ డయల్ 100 ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే పోలీస్‌స్టేషన్ దాకా వచ్చాక ముందుగా బాధితుడిపైనే కేసు నమోదు చేయడం వివాదానికి దారితీసింది. నిందితుల పట్ల పోలీసులు గౌరవ మర్యాదలతో ప్రవర్తించారని, తమను మాత్రం నిర్లక్ష్యం చేశారని బాధితులు పదేపదే ఆరోపించారు. గణేశ్‌పై దాడి జరిగింది స్పష్టమైనప్పటికీ, నిందితుడు శ్రీనివాస్‌రెడ్డికి గాయాలు అయ్యాయన్న కారణంతో బాధితులపైనే కేసు నమోదు చేయడం ఆగ్రహావేశాలకు దారితీసింది. దాడి ఘటన తర్వాత మూడు రోజులకు ఫిబ్రవరి 21న రెండు నెలల పాప మరణంతో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో బాధితులు రోడ్డెక్కారు. ప్రజాసంఘాల ఒత్తిడితోనే పోలీసులు కేసు నమోదుచేశారని, లేకపోతే మరింత నీరుగార్చేవారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఘటన తర్వాత స్పందనపై విమర్శలు.. కుమ్మెర మల్లన్న జాతరలో ఏటా పదివేల మందికిపైగా భక్తులు పాల్గొంటున్నారు. జిల్లాకేంద్రానికి 11 కి.మీ దూరంలో కుమ్మెర ఉండగా.. భారీ సంఖ్యలో పాల్గొనే జాతరలో పోలీసుల బందోబస్తు, భద్రత ఏర్పాట్లలో లోపాలు ఉన్నట్టు ఎస్సీ, బీసీ కమిషన్ చైర్మన్లు స్పష్టం చేశారు. దాడి ఘటన చోటుచేసుకున్న నాటి నుంచి ఏం జరుగుతుందన్న దానిపై, అసలు నిజాలు తెలుసుకోవడంలో పోలీస్ నిఘా వ్యవస్థ సైతం వైఫల్యం చెందినట్లు విమర్శలు వస్తున్నాయి. దాడి ఘటన చోటుచేసుకున్న తర్వాత బాధితుల పట్ల పోలీసులు చూపిన వైఖరి వివాదాస్పదమైంది. అనేక మలుపులతో అంతుచిక్కని దాడి కేసు బాధితులపైనా లోతుగా సాగుతున్న విచారణ చివరికి ఎటువైపు దారితీస్తుందోనన్న అనుమానం పోలీసుల నిర్లక్ష్యం, నిఘా వైఫల్యంపై విమర్శలు -
రేర్ డిసీజెస్.. బీ అలర్ట్!
జన్యుపరమైన లోపాలతోనూ చర్మవ్యాధులు ఈ ఫొటోలో మందంగా మారిన అరచేతులు, కాళ్లను చూపిస్తున్న వ్యక్తిది హనుమాన్‌పల్లి గ్రామ పరిధిలోని ఓ తండా. జన్యు లోపంతో చర్మవ్యాధి బారినపడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ‘నాకు ఊహ తెలిసినప్పటి నుంచీ ఇలాగే ఉంది. రోజురోజుకూ పెద్దగా అవుతోంది. మహబూబ్‌నగర్‌లో, హైదరాబాద్‌లో చాలా ఆస్పత్రులకు తిరిగా. మహారాష్ట్రలో ఉండగా.. అక్కడి డాక్టర్ల వద్దకూ వెళ్లా. రూ.3 లక్షలు కడితే అమెరికాలో ట్రీట్మెంట్ చేసుకోవచ్చని అక్కడి డాక్టర్ చెప్పారు. సిద్ధమైన తర్వాత గ్యారంటీ ఇవ్వలేమనడంతో ఆశలు వదులుకున్నా. నాతోపాటు గ్రామంలో ఐదారుగురి పరిస్థితి ఇలాగే ఉంది.’ అని ఆయన తన ఆవేదన వెళ్లగక్కారు. సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: రాష్ట్రంలో చర్మ సంబంధిత వ్యాధుల శాతం పెరుగుతోంది. ప్రధానంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌తోపాటు పలు గ్రామీణ ప్రాంతాల్లో డెర్మటాలజీ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. పరిశుభ్రత, పోషకాహారంతోపాటు జీవనశైలిలో లోపాలు, వాయు, జల కాలుష్యంతో చర్మ వ్యాధుల బారినపడే వారి సంఖ్య ఏటేటా పెరుగుతోంది. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ రీసెర్చ్ ఇన్ మెడికల్ సైన్సెస్‌తోపాటు పలు పరిశోధన సంస్థల అధ్యయనంలో ఈ విషయం తేటతెల్లమైంది. జన్యుపరమైన లోపాలతో సైతం స్కిన్ డిసీజ్ వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి బాధితులు వెలుగులోకి వచ్చిన సందర్భాలు ఇప్పటి వరకు అతి తక్కువే. తాజాగా ఉమ్మడి పాలమూరులో ఇలాంటి అరుదైన వ్యాధుల బారిన పడిన కేసులు వెలుగుచూడడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ధన్వాడ మండలంలో.. గతంలో కరీంనగర్, రంగారెడ్డి, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో జన్యు లోపాలతో చర్మ వ్యాధుల బారిన పడిన ఘటనలు వెలుగుచూశాయి. తాజాగా ఉమ్మడి మహబూబ్‌నగర్ పరిధిలోని నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం హనుమాన్పల్లితోపాటు దాని చుట్టు పక్కల గ్రామాల్లో ఇలాంటి బాధితులు ఉన్నట్లు ఆలస్యంగా వెలుగుచూసింది. వీరిలో పలువురు ఏనుగొండలోని ఎస్వీఎస్ ఆస్పత్రిలో కొన్నేళ్లుగా చికిత్స పొందుతున్నారు. అరి చేతులు, కాళ్లలో స్పర్శ కోల్పోయి.. హనుమాన్‌పల్లి గ్రామంలో 2011 లెక్కల ప్రకారం 1 ,425 మంది జనాభా ఉంది. ఇందులో పురుషులు 7 28, మహిళలు 697 మంది. వీరిలో ఎస్టీ సామాజిక వ ర్గానికి చెందినవారు 250 మంది వరకు ఉన్నట్లు అంచనా. ఈ వర్గానికి చెందిన సుమారు 25 నుంచి 30 మంది వరకు జన్యు లోపాలతో వచ్చిన చర్మ వ్యా ధులతో సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇందులో అధి క సంఖ్యలో ప్రధానంగా పామోప్లాంటార్ కెరటోడ ర్మా వ్యాధితో ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం. అరి చేతులు, పాదాలు మందమై.. స్పర్శ కోల్పోవడం, చర్మం పగుళ్లు రావడం, నడిచేటప్పుడు, ఏదైనా పని చేసేటప్పుడు నొప్పి ఉండడం, దురద వంటివి ఈ వ్యాధి లక్షణాలు. అవగాహన లేకపోవడంతో అనేక ఏళ్లుగా ఇబ్బందులు తాజాగా ఉమ్మడి పాలమూరులో వెలుగులోకి.. రక్త సంబంధీకుల మధ్య వివాహాలేకారణమంటున్న వైద్యులు -
బహిరంగ చర్చకు సిద్ధం: ఎంపీ మల్లు రవి
శుక్రవారం నిజనిర్ధారణ కోసమని కాంగ్రెస్ నేతల బృందం కుమ్మెర గ్రామంలో పర్యటించింది. ఎంపీ మల్లురవి, డీసీసీ అధ్యక్షుడు వంశీకృష్ణ, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రాజేశ్‌రెడ్డి, వీర్లపల్లి శంకర్ తదితరులు గ్రామస్తులతో మాట్లాడారు. అనంతరం జిల్లాకేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. కుమ్మెర ఘటన విషయంలో అవాస్తవాలే ఎక్కువగా ప్రచారంలో ఉన్నాయని, వాస్తవాలను గమనించాలని ఎంపీ మల్లు రవి అన్నారు. పసిపాప మృతిపై రాజకీయం చేస్తున్నారని చెప్పారు. ఈ విషయంలో రాజకీయ పక్షాల ముఖ్యనేతలతోపాటు ఆందోళన నిర్వహించిన వారితో తాను బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నానన్నారు. బాధిత కుటుంబానికి అన్యాయం జరిగినట్టు అనిపిస్తే తాను పార్టీని వదిలైనా వారితో కలిసి పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. -
గ్రామాల అభివృద్ధిలో సర్పంచులే కీలకం
● అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించాలి ● కలెక్టర్ బదావత్ సంతోష్ కందనూలు: గ్రామాల అభివృద్ధి, సమస్యల పరిష్కారం, ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పన వంటి ప్రధాన నిర్ణయాల్లో సర్పంచులు కీలకంగా వ్యవహరించాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. అచ్చంపేట డివిజన్లోని 137 జీపీల సర్పంచులకు శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో 3వ విడత శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించి మాట్లాడారు. గ్రామాల అభివృద్ధిలో సర్పంచులు ముందుండి పనిచేయాలన్నారు. ప్రజల అవసరాలను గుర్తిస్తూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాల్సిన గురుతర బాధ్యత సర్పంచులపై ఉందన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడం ద్వారా తమ వ్యక్తిగత గౌరవం కూడా పెంపొందుతుందని తెలిపారు. ముఖ్యంగా ఎలాంటి రాజకీయాలకు తావులేకుండా తమ పరిపాలన పేద ప్రజల అభ్యున్నతికి పాటుపడేలా ఉండాలని సూచించారు. మహిళా సర్పంచుల స్థానాల్లో కుటుంబ సభ్యుల జోక్యం ఉండరాదన్నారు. మహిళా సర్పంచులు తమ నాయకత్వ పటిమను పెంపొందించుకోవాలని సూచించారు. గ్రామాల్లో తాగునీరు, పారిశుద్ధ్యం, రహదారులు, విద్య, వైద్యం వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలను నిరంతరం పర్యవేక్షిస్తూ.. లోటుపాట్లు ఉంటే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు. పన్నులు, ఇతర స్థానిక వనరుల ద్వారా సమకూరే ఆదాయంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్నారు. తద్వారా మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపర్చుకోవచ్చని అన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అమరేందర్, దేవ సహాయం, జెడ్పీ డిప్యూటీ సీఈఓ గోపాల్ నాయక్, డీపీఓ శ్రీరాములు తదితరులు ఉన్నారు. -
కంటిచూపుపై నిర్లక్ష్యం వహించొద్దు
కల్వకుర్తి రూరల్: డ్రైవర్లు కంటిచూపు సమస్యలపై నిర్లక్ష్యం వహించొద్దని కల్వకుర్తి డీఎస్పీ వెంకట్‌రెడ్డి అన్నారు. కల్వకుర్తి పోలీస్‌స్టేషన్ ఆవరణలో శుక్రవారం ఆమనగల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో డివిజన్ పరిధిలోని ప్రైవేటు వాహనాల డ్రైవర్లకు కంటివైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా కంటి వైద్యసిబ్బంది వెంకటేశ్, వెంకటస్వామి డ్రైవర్లకు పరీక్షలు చేసి.. అవసరమైన మందులు అందజేశారు. అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ.. ప్రతి డ్రైవర్‌కు తప్పనిసరిగా దూరం, దగ్గరిచూపు ఉండాలన్నారు. డ్రైవర్లకు కంటి సమస్యలు ఉంటే ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంటుందన్నారు. అదే విధంగా మద్యం తాగి వాహనాలు నడపొద్దని సూచించారు. కార్యక్రమంలో ఎస్ఐలు మాధవరెడ్డి, కృష్ణమూర్తి, కృష్ణదేవ పాల్గొన్నారు. -
పరీక్షల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి
కందనూలు: ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణలో అధికారులు అప్రమత్తంగా ఉంటూ.. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని కలెక్టర్ బదావత్ సంతోష్ ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో కొనసాగుతున్న పరీక్ష కేంద్రాన్ని గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు కల్పించిన వసతులను పరిశీలించారు. ఎలాంటి అవకతవకలకు తావులేకుండా పరీక్షలను సజావుగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. పరీక్షలు పూర్తయ్యే వరకు అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. కాగా, జిల్లావ్యాప్తంగా 34 కేంద్రాల్లో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్ష నిర్వహించగా.. 5,968 మంది విద్యార్థులకు గాను 5,806 మంది హాజరయ్యారు. జనరల్ విభాగంలో 4,588 మందికి గాను 4,475 మంది, ఒకేషనల్ విభాగంలో 1,380 మందికి గాను 1,331 మంది హాజరై పరీక్ష రాశారు. జనరల్‌లో 113 మంది, ఓకేషనల్ విభాగంలో 49 మంది గైర్హాజరయ్యారు. కలెక్టర్ వెంట డీఐఈఓ వెంకటరమణ ఉన్నారు. -
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
వెల్దండ: నియోజకవర్గంలో అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. వెల్దండలో నిర్మాణాలు పూర్తయిన ఇందిరమ్మ ఇళ్లను గురువారం అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, ముఖ్యమంత్రి సోదరుడు, కొడంగల్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి తిరుపతిరెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పేదల సొంతింటి కల సాకారమవుతుందన్నారు. 10ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో డబుల్బెడ్రూం ఇళ్ల పేరుతో పేదలను మోసం చేశారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇందిరమ్మ ఇళ్ల పథకంతో ప్రతి గ్రామంలో విడతల వారీగా అర్హులందరికీ ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారంటీలు అమలు చేస్తున్నామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఇంటి నిర్మాణాలను త్వరగా పూర్తిచేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ సత్యపాల్‌రెడ్డి, తహసీల్దార్ కార్తీక్‌కుమార్, సర్పంచ్ యాదమ్మ, ఉపసర్పంచ్ శ్రీనివాస్, వెంకటయ్యగౌడ్, భూపతిరెడ్డి, రామకృష్ణ, సంజీవ్‌కుమార్, పర్వత్‌రెడ్డి, తిరుపతిరెడ్డి, హమీద్, పుల్లయ్య, పురుషోత్తంచారి, జంగయ్య యాదవ్, రాజు, సురేందర్‌రెడ్డి పాల్గొన్నారు. -
లెక్క పక్కా..
● ఉత్తర్వులు జారీ చేసిన వ్యవసాయశాఖ ● జిల్లాలో 330 మంది వలంటీర్లు అవసరం ● ఎంపిక బాధ్యత ఎంఈఓలకు.. ●అచ్చంపేట: వలంటీర్లతో పంటల డిజిటల్ సర్వే చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వలంటీర్ల నియామకానికి చర్యలు చేపట్టింది. అగ్రికల్చర్లో డిగ్రీ, డిప్లొమా, సైన్స్ గ్రాడ్యుయేట్ ఇతర డిగ్రీలు ఉత్తీర్ణులైన వారికి ప్రాధాన్యత ఇవ్వాలని.. వారు లేకుంటే ఇంటర్, పదో తరగతి ఉత్తీర్ణులైన వారిని వలంటీర్లుగా నియమించాలని ఏఈఓలను ఆదేశించింది. స్థానికులైన వలంటీర్లను నియమించి.. 45 రోజుల్లో పంటల డిజిటల్ సర్వే ప్రక్రియను పూర్తిచేయాలని నిర్దేశించింది. అయితే రెండేళ్ల క్రితమే ఏఈఓలకు డిజిటల్ సర్వే చేయాలని బాధ్యతలు అప్పగించినప్పటికీ.. వారు ఇతర బాధ్యతలు నిర్వహిస్తున్నందున సక్రమంగా సర్వే నిర్వహింలేదు. దీన్ని దృష్టిలో ఉంచుకొని పంటల సర్వే ప్రైవేటు వలంటీర్లతో చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నెలాఖరులోగా ప్రారంభం.. జిల్లావ్యాప్తంగా 143 వ్యవసాయ క్లస్టర్ల పరిధిలో 348 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అయితే భూ భారతి మ్యాప్ కలిగిన 330 గ్రామాల్లో పంటల సర్వేకు వలంటీర్లను నియమించనున్నారు. మిగతా గ్రామాల్లో ఏఈఓలే సర్వే చేయనున్నారు. ఇప్పటికే ఆయా క్లస్టర్ల పరిధిలో ఏఈఓలు వలంటీర్ల నియామక ప్రక్రియ ప్రారంభించారు. స్మార్ట్ఫోన్ల వినియోగంతో పాటు డిజిటల్ సర్వేపై అవగాహన కలిగిన ఉన్న వారిని వలంటీర్లుగా నియమించి.. ఒకటి, రెండు రోజులపాటు శిక్షణ ఇచ్చారు. ఈ నెలాఖరులోగా సర్వే ప్రారంభించాలని జిల్లా వ్యవసాయశాఖ యోచిస్తోంది. 3.95లక్షల ఎకరాల్లో సాగు.. జిల్లావ్యాప్తంగా ప్రస్తుత యాసంగి సీజన్లో 3.95లక్షల ఎకరాల్లో వరి, వేరుశనగ, మొక్కజొన్న తదితర పంటలను రైతులు సాగుచేశారు. అందులో వరి 1.40 లక్షల ఎకరాలు, వేరుశనగ 1.6 లక్షలు, మొక్కజొన్న 1.35లక్షలు, ఇతర పంటలు మరో 14వేల ఎకరాల్లో సాగుచేశారు. వలంటీర్లు పూర్తిస్థాయిలో డిజిటల్ సర్వే నిర్వహించి.. పంటల సాగుపై రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందించనున్నారు. జిల్లావ్యాప్తంగా డిజిటల్ సర్వేకు వలంటీర్ల నియామక ప్రక్రియ పూర్తిచేస్తున్నాం. ఇప్పటికే దాదాపుగా నియామక ప్రక్రియ చేపట్టడం జరిగింది. వారికి సమగ్ర శిక్షణ అనంతరం త్వరలోనే పంటల సర్వే ప్రారంభిస్తాం. – యశ్వంత్‌రావు, జిల్లా వ్యవసాయశాఖ అధికారి ఎంపికై న వలంటీర్లు మొబైల్ యాప్ ద్వారా పంటల నమోదు చేపట్టనున్నారు. ఒక్కో డిజిటల్ నమోదుకు ప్రభుత్వం రూ.7 చొప్పున వలంటీర్లకు చెల్లించనుంది. సర్వేలో భాగంగా రైతు డిజిటల్ ఫొటో, భూమి విస్తీర్ణం, ఏ విస్తీర్ణంలో ఏయే పంటలు సాగుచేశారు.. రైతు ఫోన్ నంబర్‌ను నమోదు చేయనున్నారు. -
హైదరాబాద్‌ను దిగ్బంధిస్తాం
నిందితులను అరెస్టు చేయకపోతే.. నాగర్‌కర్నూల్ క్రైం: రెండు నెలల పసిపాపను చంపిన ఘటనలో నిందితులను అరెస్టు చేసి జైలుకు పంపకపోతే హైదరాబాద్‌ను దిగ్బంధిస్తామని దిగ్బందిస్తామని.. ముఖ్యమంత్రి ఇంటితో పాటు రాష్ట్ర సచివాలయాన్ని ముట్టడిస్తామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ కూడలిలో చేపట్టిన నిరసన దీక్షా శిబిరాన్ని ఆయన సందర్శించి.. బాధితులను పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 79 ఏళ్ల స్వతంత్ర భారతంలో నేటికీ కుల, మతపరమైన ఘటనలు చోటు చేసుకోవడం బాధాకరమన్నారు. కుల అహంకారంతో ఈ దాడి జరిగిందని.. ఇందుకు బాధ్యులైన వారు ఎంతటి వారైనా పార్టీలకు అతీతంగా కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. చిన్నారి మృతి ఘటనపై పాలకులకు చీమకుట్టినట్టు కూడా లేదన్నారు. నిందితులను అరెస్టు చేసి జైలుకు పంపకపోతే రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడుతామన్నారు. బడుగు బలహీన వర్గాలు ఐక్యమత్యతో ఉంటూ ఇలాంటి ఘటనలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. జిల్లా ఎస్పీ మీడియాకు ఒక బులిటెన్ జారీ చేసి, అందులో బాధితులనే నిందితులుగా చూపడం.. చిన్నారి మృతదేహంపై, అంతర్గతంగా ఎలాంటి గాయాలు లేవని ప్రకటించడం.. ఘటన జరిగిన సమయంలో కుమ్మెర గ్రామంలో ఆ చిన్నారి లేదని చెప్పడాన్ని చూస్తే కేసును తప్పుదోవ పట్టించడానికి పోలీసులు, పాలకులు కుట్రలు పన్నుతున్నారని స్పష్టమవుతుందని అన్నారు. పోలీసు వ్యవస్థ న్యాయం వైపు ఉండాలని హితవు పలికారు. బాధితులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్ర ఉద్యమంగా కుమ్మెర ఘటనను ముందుకు తీసుకెళ్తాం మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ -
పీఆర్సీ ప్రకటించాలి
ఉప్పునుంతల: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయులకు వెంటనే కొత్త పీఆర్సీని ప్రకటించాలని డీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జక్క రామస్వామి డిమాండ్ చేశారు. గురువారం మండలంలోని తాడూరు యూపీఎస్‌లో నిర్వహించిన డీటీఎఫ్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడుస్తున్నా.. ఉద్యోగ, ఉపాధ్యాయులకు నూతన పీఆర్సీని ప్రకటించకుండా కాలయాపన చేస్తోందన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ నం.25ను రద్దుచేసి.. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలన్నారు. విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతుల కల్పనపై దృష్టిసారించాలని కోరారు. అనంతరం మండల కమిటీని ఎన్నుకున్నారు. నూతన కమిటీ సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించారు. సమావేశంలో మండల అధ్యక్షుడు డి భాస్కర్‌రెడ్డి, ఉపాధ్యక్షులు రత్నప్రసాద్, కె.జ్యోతి, కార్యదర్శులు పి.జానకీరాం, భార్గవి, హజారుద్దీన్, రాములు తదితరులు ఉన్నారు. -
ఇంటి వద్దకే సీతారాముల కల్యాణ తలంబ్రాలు
స్టేషన్ మహబూబ్‌నగర్: భద్రాచలంలో వచ్చే నెల 27న జరిగే శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవం సందర్భంగా దేవాదాయశాఖ సహకారంతో టీజీఆర్టీసీ లాజిస్టిక్ ద్వారా భక్తుల ఇంటి వద్దకే తలంబ్రాలు అందించనున్నట్లు ఆర్టీసీ రీజినల్ మేనేజర్ సంతోష్‌కుమార్, లాజిస్టిక్ ఏటీఎం బద్రి నారాయణ తెలిపారు. తలంబ్రాలు చేరవేసే కార్యక్రమానికి సంబంధించిన వాల్‌పోస్టర్లను గురువారం రీజినల్ కార్యాలయంలో వారు ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ రూ.151 చెల్లించి సీతారాముల కల్యాణ తలంబ్రాల కోసం వచ్చే నెల 31 వరకు బుకింగ్ చేసుకోవచ్చన్నారు. పూర్తి వివరాల కోసం మార్కెటింగ్ ఎగ్జిక్యూటీవ్‌లు గద్వాల, నాగర్‌కర్నూల్, వనపర్తి డిపో 91542 98609, కొల్లాపూర్, కల్వకుర్తి, అచ్చంపేట డిపో 91542 98611, మహబూబ్‌నగర్, షాద్‌నగర్, నారాయణపేట, కోస్గి డిపో 91542 98612, ఉమ్మడి జిల్లా 91542 98637 నంబర్లను సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో డిప్యూటీ రీజినల్ మేనేజర్ లక్ష్మీధర్మ, డిపో మేనేజర్ అశోక్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
పట్టణాభివృద్ధికి సమన్వయంతో పనిచేయండి
కందనూలు: మున్సిపాలిటీ పాలకవర్గం, అధికారులు సమన్వయంతో పనిచేసి.. పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి సూచించారు. గురువారం నాగర్‌కర్నూల్ మున్సిపల్ కార్యాలయంలో నూతన పాలకవర్గం బాధ్యతల స్వీకరణ కార్యక్రమం నిర్వహించగా.. ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. కొత్త పాలకవర్గం ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. పట్టణంలో మౌలిక సదుపాయాలతో పాటు శుభ్రత, తాగునీరు, రోడ్ల నిర్మాణం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్యే సమక్షంలో పుర చైర్మన్‌గా తీగల సునేంద్ర కుమార్, వైస్‌చైర్మన్‌గా బాదం రమేశ్, కౌన్సిల్ సభ్యులు బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
బాధితులకు రూ.కోటి పరిహారం చెల్లించాలి
నాగర్‌కర్నూల్ రూరల్: కుమ్మెర ఘటన బాధిత కుటుంబానికి రూ.కోటి పరిహారం చెల్లించడంతో పాటు నిందితులపై హత్యకేసు నమోదు చేసి అరెస్టు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సాగర్ డిమాండ్ చేశారు. గురువారం జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాధితులను ఒంటరి చేయడానికి ప్రభుత్వ యంత్రాంగం ప్రయత్నిస్తోందన్నారు. ఇలాంటి ఎత్తుగడలను మానుకొని బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి పర్వతాలు, ఆర్.శ్రీనివాసులు, పొదిలి రామయ్య, అశోక్, తారాసింగ్, అంతటి కాశన్న, మధు, వెంకటేశ్, మాలిక్, వెంకటయ్య, నాగరాజుగౌడ్ పాల్గొన్నారు. కుమ్మెర ఘటనపై పోలీసుల విచారణ మహమ్మదాబాద్: కుమ్మెర ఘటనలో బిడ్డను కోల్పోయిన మౌనిక తల్లిగారి ఊరైన మహమ్మదాబాద్ మండలం సంగాయపల్లిలో గురువారం పోలీసులు విచారణ చేపట్టారు. బాధితురాలు మౌనిక తల్లి బాలికిష్టమ్మతో పలు వివరాలు సేకరించారు. బాధితురాలి అసలు పేరు యాదమ్మ అని.. తమది బీసీ సామాజిక వర్గం కాగా.. నాగర్‌కర్నూల్‌కు చెందిన గణేశ్‌ను ప్రేమ వివాహం చేసుకున్నట్లు వివరించింది. అయితే బాధితురాలి పేరు, ఊరు, మండలం, జిల్లా, కులం తదితర వివరాల సేకరణ నిమిత్తం విచారణకు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. -
మౌనిక, పాపపై దాడి జరిగినట్టు ఆధారాలు లేవు
సాక్షి, నాగర్‌కర్నూల్: కుమ్మెర మల్లన్న జాతరలో చోటుచేసుకున్న దాడి ఘటనపై అన్ని కోణాల్లో సమగ్ర విచారణ చేపట్టామని నాగర్‌కర్నూల్ ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్ తెలిపారు. గురువారం జిల్లాకేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ నెల 18న కుమ్మెర జాతరలో దాడి జరిగిన సమయంలో డయల్ 100కు సమాచారం వచ్చిన వెంటనే స్పందించామన్నారు. ముందుగా గ్రామానికి చెందిన శ్రీనివాస్‌రెడ్డి తలకు గాయమైందని గణేశ్‌పై ఫిర్యాదు ఇచ్చారని, దీంతో కేసు నమోదు చేశామన్నారు. అలాగే గణేశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులపై మరో కేసు పెట్టామని చెప్పారు. అయితే ఘటన రోజు ఇచ్చిన ఫిర్యాదులో గణేశ్, చంద్రకళపై మాత్రమే దాడి గురించి ప్రస్తావించారని, మౌనిక, పాపపై దాడి జరిగినట్టుగా ఫిర్యాదులో లేదన్నారు. ఘటన జరిగిన మూడు రోజుల తర్వాత ఈ నెల 21న ఉదయం పాప మరణించిందని చెప్పారు. జనరల్ ఆస్పత్రిలో పాపకు పోస్టుమార్టం నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు నిరాకరించారని పేర్కొన్నారు. ఈ నెల 17న జాతరలో తల్లి చంద్రకళను శ్రీనివాస్‌రెడ్డి తిట్టాడని.. శ్రీనివాస్‌రెడ్డిని దూషిస్తూ గ్రామ వాట్సప్ గ్రూప్‌లో గణేశ్ ఆడియో పోస్టు చేశాడు. గ్రూప్‌లో ఎందుకు పోస్టు చేశావంటూ గణేశ్‌ను ప్రశ్నిస్తూ శ్రీనివాస్‌రెడ్డితోపాటు మరో 8 మంది గణేశ్, చంద్రకళపై దాడికి దిగినట్టు వివరించారు.8మందిపైకేసు... ముగ్గురు రిమాండ్నాగర్కర్నూల్ జనరల్ ఆస్పత్రిలో గత డిసెంబర్ 21న 1.44 కిలోల బరువుతో పాప జన్మించినట్టు ఎస్పీ చెప్పారు. శ్వాస సంబంధ సమస్యతో ఎన్ఐసీయూలో చికిత్స పొందిందన్నారు. ఆరోగ్యం క్షీణించడంతో హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆస్పత్రిలో 30 రోజులపాటు చికిత్స పొందినట్టు చెప్పారు. రెస్పిరేటరీ, జాండీస్, న్యూమోనియా సమస్యలున్నట్టు గుర్తించామన్నారు. అయితే పాప మరణానికి సంబంధించి ఫోరెన్సిక్, విస్త్రా రిపోర్టు రావాల్సి ఉందని చెప్పారు. కుమ్మెర జాతరలో మౌనికతోపాటు ఆమె బిడ్డపై దాడి జరిగినట్టు ఆధారాలు కనిపించలేదని స్పష్టం చేశారు. ఈ విషయంలో సమగ్ర దర్యాప్తు చేపడుతున్నామని, ఇప్పటికే దాడి చేసిన 8 మందిపై కేసు నమోదు చేసి, ముగ్గురిని రిమాండ్‌కు పంపామని వివరించారు. మిగతా వారు పరారీలో ఉన్నారని, త్వరలోనే పట్టుకుంటామని వెల్లడించారు.బాధితుల ఆచూకీ లేదు: నాగర్‌కర్నూల్ డీఎస్పీ శ్రీనివాస్కుమ్మెర ఘటనలో దాడికి గురైన బాధిత కుటుంబం నాగర్‌కర్నూల్ జిల్లాకేంద్రంలో ఆరు రోజులుగా ఆందోళన నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే గురువారం రాత్రి బాధిత కుటుంబ సభ్యులు దీక్షా శిబిరాన్ని ఖాళీ చేశారు. ఆ తర్వాత అక్కడి టెంట్లు, వేదికను సైతం తొలగించారు. దీనిపై నాగర్‌కర్నూల్ డీఎస్పీ శ్రీనివాస్ స్పందిస్తూ బాధిత కుటుంబం తమకు సమాచారం ఇవ్వకుండా కారులో వెళ్లిపోయారని చెప్పారు. బీసీ జేఏసీ, డీఎస్పీ నాయకులు సాయి, రఘు వారిని కారులో తీసుకువెళ్లారని చెప్పారు. కాగా, హైదరాబాద్‌లో ఆందోళన నిర్వహించేందుకు బాధిత కుటుంబం వెళ్లినట్లు సమాచారం.నాలుగు వారాల్లో నివేదిక ఇవ్వండి: ఎన్హెచ్ఆర్సీ ఆదేశంకుమ్మెర జాతరలో దాడి ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) నాగర్‌కర్నూల్ కలెక్టర్ బదావత్ సంతోష్‌ను ఆదేశించింది. ఈ ఘటనపై న్యాయవాది వినోద్ హిందుస్థానీ ఎన్హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేయగా కమిషన్ స్పందించింది. ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి యాక్షన్ టోకెన్ రిపోర్టును తమకు నాలుగు వారాల్లో అందించాలని కలెక్టర్, ఎస్పీలకు నోటీసు జారీ చేసింది. -
పోరాటం ఆపొద్దు..!
● మానవత్వానికి మాయని మచ్చగా దాడి ఘటన ● రెండు నెలల పసిపాపపై ఇంత క్రూరత్వమా? ● ఒక్క వ్యక్తిపై 20 మంది దాడి చేయడం సిగ్గుచేటు ● ‘కుమ్మెర’ బాధిత కుటుంబాన్ని పరామర్శించిన కేటీఆర్ బాధితులకు న్యాయం జరిగే దాకా అండగా నిలబడదాం కుమ్మెర ఘటనలో నిరుపేద కుటుంబంపై దాడికి పాల్పడటం అధికార దురహంకారానికి నిదర్శనమని కేటీఆర్ అన్నారు. ఒక్క వ్యక్తిపై 20 మంది కలిసి దాడి చేయడం, పసిపాప అని కూడా చూడకుండా కాలితో తన్నడం మానవత్వానికే మచ్చగా మిగిలిందని విమర్శించారు. ఇలాంటి ఘటనపై ప్రజలంతా స్పందించాలని, మనసున్న మనుషులంతా ఏకం కావాలని కోరారు. హంతకులను శిక్షించే దాకా సమాజం ఊరుకోదని హెచ్చరించారు. అప్పుడే పుట్టిన పసిపాపకు కుల, మతాలతో ఏం సంబంధమని ప్రశ్నించారు. పుట్టిన 5 నిమిషాలకు పుట్టేదే కులం, మతమని.. మనుషులు పుట్టించిన కులం పేరుతో దేవుని దర్శనాలకు రాకుండా ఎలా చేస్తారని మండిపడ్డారు. ఒక ఎమ్మెల్యే, ఎంపీ కుటుంబంలో జరిగితే పోలీసులు ఇలాగే స్పందిస్తారా..? అని ప్రశ్నించారు. సాక్షి, నాగర్‌కర్నూల్: జిల్లాలోని కుమ్మెర మల్లన్న జాతరలో ఓ కుటుంబం పట్ల పైశాచికంగా ప్రవర్తించిన మానవ మృగాలను శిక్షించే వరకు పోరాటం ఆపొద్దని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు అన్నారు. బాధిత కుటుంబానికి తమ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. బుధవారం ఆయన నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద ఎస్సీ, ఎస్టీ, బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిరసన శిబిరంలో బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. బాధిత కుటుంబ సభ్యులు చంద్రకళ, గణేశ్, మౌనికతో మాట్లాడి ఘటన వివరాలు తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని, తమ పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సంఘటన చోటుచేసుకున్న వెంటనే స్పందించి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహిస్తున్న విశారదన్ మహరాజ్ పోరాటాన్ని అభినందించారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు, హంతకులందరికీ శిక్ష పడే దాకా పోరాటాన్ని ఆపేది లేదని తేల్చిచెప్పారు. పోలీసులను డిస్మిస్ చేయాలి కుమ్మెర దాడి ఘటనలో బాధితుల ఫిర్యాదు తీసుకోవడంలో పోలీసులు నిర్లక్ష్యం చేశారని మాజీమంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. బాధ్యులైన వారిని సస్పెండ్ కాకుండా డిస్మిస్ చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో పోలీసింగ్‌కు అంతర్జాతీయంగా పేరు తీసుకొస్తే.. కాంగ్రెస్ హయాంలో వ్యవస్థను నీరుగార్చారని మండిపడ్డారు. నిందితులందరిపై హత్య కేసు నమోదు చేయాలని కోరారు. ఆధిపత్యం, అహంకారంతోనే.. అగ్రకులాల ఆధిపత్యం, అహకారంతోనే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని ఎమ్మెల్సీ గోరటి వెంకన్న అన్నారు. కుమ్మెరలో ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమని చెప్పారు. ఇక్కడి పరిస్థితులు, ఇలాంటి ఘటనల నుంచే తాను పాటలు పాడానని గుర్తుచేశారు. ప్రభుత్వం నిందితులపై చర్యలు తీసుకోకుండా నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరించడం సరికాదని విమర్శించారు. బాధితులపైనే కేసు పెడతారా..? కుమ్మెర ఘటనలో దాడి చేసిన వారిపై కాకుండా బాధితులపైనే పోలీసులు కేసు పెట్టారని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి ఆరోపించారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు పెట్టేందుకు కోర్టు అనుమతి కావాలని చెప్పడం ఎక్కడైనా ఉందా? అని నిలదీశారు. ఈ కేసు దర్యాప్తు సమయంలో పదేపదే ఎమ్మెల్సీ నుంచి డీఎస్పీకి ఫోన్లు వచ్చాయని ఆరోపించారు. ఎంపీ మల్లు రవి ఫోన్ చేసి బాధితులకు న్యాయం చేయాలని చెప్పకుండా.. చూసి చేయండి అని చెప్పడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ఇక్కడి ప్రాంతం కుల, మతాల సామరస్యానికి ప్రతీకగా నిలిచిందని కేటీఆర్ పేర్కొన్నారు. మహేంద్రనాథ్‌తోపాటు ఎమ్మెల్సీ గోరటి వెంకన్న లాంటి ప్రజా కవులు ఇక్కడి ప్రాంత సామరస్యం కోసం కృషిచేశారని చెప్పారు. కులాలు, మతాల పిచ్చి వదిలి.. సామాజిక చైతన్యం కావాలన్నారు. మానవ మృగాలకు శిక్ష పడేందుకు అందరం ఏకమవ్వాలని చెప్పారు. బాధిత కుటుంబానికి తక్షణ సాయంగా రూ.లక్ష అందజేశారు. ఇంటి నిర్మాణం కోసం రూ.10 లక్షల ఆర్థికసాయం చేస్తున్నట్టు ప్రకటించారు. -
తొలి పరీక్షకు 276 మంది గైర్హాజరు
కందనూలు: జిల్లావ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు బుధవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మొదటిరోజు పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు ఉరుకులు పరుగుల మధ్య చేరుకున్నారు. ఉదయం 8 గంటల నుంచే కేంద్రాల వద్ద విద్యార్థులు, వారి తల్లిదండ్రుల సందడి నెలకొంది. అధికారులు, సిబ్బంది విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి.. కేంద్రాల్లోకి అనుమతించారు. జిల్లావ్యాప్తంగా 34 కేంద్రాల్లో మొదటి సంవత్సరం సెకండ్ లాంగ్వేజ్, పేపర్–1 పరీక్ష నిర్వహించగా.. 7,265 మంది విద్యార్థులకు గాను 6,989 మంది హాజరయ్యారు. జనరల్ విభాగంలో 5,565 మందికి గాను 5,387 మంది, ఒకేషనల్ విభాగంలో 1,700 మందికి గాను 1,602 మంది హాజరయ్యారు. జనరల్ విభాగంలో 178 మంది, ఒకేషనల్ విభాగంలో 98 మంది గైర్హాజరయ్యారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు డీఐఈఓ వెంకటరమణ తెలిపారు. -
ఆర్భాటాలతో అప్పుల పాలు కావద్దు : మంత్రి
వీపనగండ్ల: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో నిబంధనలను విస్మరించి ఆర్భాటాలకు వెళ్లి అప్పులపాలు కావద్దని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు లబ్ధిదారులకు సూచించారు. బుధవారం మండలంలోని సంగినేనిపల్లి, కల్వరాలలో ఇందిరమ్మ ఇళ్లతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన భూమిపూజ చేసి మాట్లాడారు. గత ప్రభుత్వం చేసిన అప్పులతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకున్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేస్తున్నామని వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజాప్రతినిధులు, ప్రజలు సమన్వయంతో వ్యవహరించినప్పుడే గ్రామాలు అభివృద్ధి పథంలో పయనిస్తాయని చెప్పారు. కల్వరాలలో నెలకొన్న నీటిఎద్దడిని సత్వరమే పరిష్కరించాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ వరలక్ష్మి, ఎంపీడీఓ శ్రీనివాసరావు, జిల్లా పర్యాటకశాఖ అధికారి నర్సింహ, సర్పంచ్‌లు పల్ల జయంతి, బండారి రాముడు, బలుస రామన్‌గౌడ్ పార్టీ నాయ కులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ఒత్తిడి తగ్గించే టెలీమానస్
● ఇంటర్ పరీక్షల నేపథ్యంలో విద్యార్థులకుఅందుబాటులోకి.. ● యాక్టివ్ చేసిన వైద్య, ఆరోగ్య శాఖ మహబూబ్‌నగర్ క్రైం: జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులు మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు ఆరోగ్య శాఖ ‘టెలీమానస్’ను యాక్టీవ్ చేసింది. కొన్నిరోజుల నుంచి ఆరోగ్య శాఖ ప్రత్యేక కౌన్సిలర్ ఇంటర్ కళాశాలలను సందర్శించి టెలీమానస్పై అవగాహన కల్పించడంతోపాటు విద్యార్థులు ఒత్తిడిని ఎలా అధిగమించాలనే అంశాలను వివరించారు. పరీక్షలంటే విద్యార్థులు ఒత్తిడికి గురవకుండా సలహాలు, సూచనలు ఇచ్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా టెలీమానస్‌ను అధికారులు ఏర్పాటు చేశారు. టోల్‌ఫ్రీ నంబర్ 14416 లేదా 1800–89–14416ను సంప్రదించాలి. 24 గంటలపాటు సేవలు అందుబాటులో ఉంటాయి. హైదరాబాద్‌లోని ఎర్రగడ్డలో ఉన్న టోల్‌ఫ్రీ నంబర్‌ను సైకియాట్రిస్ట్‌లు, సైకాలజిస్ట్‌లు, కౌన్సిలర్లు అటెండ్ చేసి విద్యార్థులకు అవసరమైన సూచనలు చేస్తారు. పరీక్షల్లో ఫెయిల్ అయిన వారితోపాటు మానసిక ఒత్తిడిలో ఉన్నవారికి ఇది ఉపయోగేపడే విధంగా చర్యలు తీసుకున్నారు. జిల్లాకు సంబంధించి జడ్చర్లలో ఒక ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసి దీనిని పర్యవేక్షిస్తున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి మహబూబ్‌నగర్ జిల్లా నుంచి 45 ఫోన్ కాల్స్, నాగర్‌కర్నూల్ 21, వనపర్తి 10, గద్వాల 63, నారాయణపేట 27 కాల్స్ టెలీమానస్‌కు వచ్చాయి. ఇందులో అధికంగా విద్యార్థులు ఉన్నారు. ప్రస్తుతం ఇంటర్ పరీక్షలు జరుగుతున్న క్రమంలో టెలిమానస్ సేవలు వినియోగించుకునే వారి సంఖ్య మరింత పెరగనుంది. సమయపాలన ముఖ్యం.. చుట్టూ ఉండే వాతావరణం ఇతరులతో పోలిక వంటి వాటి కారణంగా విద్యార్థులు ఒత్తిడికి గురయ్యే అవకాశం అధికంగా ఉంటుంది. తల్లిదండ్రులు వారిని అవసరమైన మేర ప్రోత్సహించి నడిపించాలి. చదువు విషయంలో ప్రణాళిక, సమయపాలన ఎంతో ముఖ్యం. కష్టమైన సబ్జెక్టు ఉంటే ప్రతిరోజు 30 నిమిషాలు చదివేందుకు కేటాయించాలి. మెదడును పరీక్షలపై ప్రణాళికబద్ధంగా అలవాటు చేయడం ఉత్తమం. నిత్యం ఒకే సమయం లేదా ఒకే ప్రాంతంలో చదువుకునేందుకు అలవాటు చేస్తే ఫలితాలు మెరుగైన పద్ధతిలో వస్తాయి. – వంగీపురం శ్రీనాథాచారి, మానసిక నిపుణుడు -
దరఖాస్తుల ఆహ్వానం
కందనూలు: ప్రభుత్వ క్రీడా పాఠశాలల్లో 2026–27 విద్యా సంవత్సరం 4వ తరగతిలో ప్రవేశానికి సంబంధించి అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా యువజన, క్రీడల అధికారి సీతారాం బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2017 సెప్టెంబర్ 1 నుంచి 2018 ఆగస్టు 31వ తేదీ మధ్య జన్మించి.. 2026–27 విద్యా సంవత్సరం 4వ తరగతి చదవబోతున్న విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి, అర్హులైన విద్యార్థులు మార్చి 4వ తేదీలోగా htt p://tfrr.telangana.gov.in వెబ్సైట్లో దర ఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. కంటిచూపుపై నిర్లక్ష్యం వహించొద్దు నాగర్‌కర్నూల్ క్రైం: కంటిచూపుపై ఎవరూ నిర్లక్ష్యం వహించకూడదని ఆప్తాలమిక్ ఆఫీసర్ కొట్ర బాలాజీ అన్నారు. స్థానిక పాత కలెక్టరేట్ భవనంలో బుధవారం జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్యశిబిరం నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి శిబిరానికి వచ్చిన 78 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వీరిలో 34 మందికి కంటిశుక్లం శస్త్రచికిత్స అవసరమని గుర్తించి.. ఏనుగొండ లయన్ రాంరెడ్డి కంటి ఆస్పత్రికి పంపించినట్లు ఆయన తెలిపారు. కంటిచూపు సమస్యతో బాధపడే వారు జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత వైద్యశిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు సేవాభావంతో మెలగాలి కందనూలు: విద్యార్థులు సేవాభావంతో మెలగాలని జిల్లా రవాణాశాఖ అధికారి చిన్నబాలు సూచించారు. నాగర్‌కర్నూల్ మండలం గగ్గలపల్లిలో స్థానిక ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ వలంటీర్లు చేపట్టిన శిబిరం బుధవారం ముగిసింది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు చదువులో రాణించడంతో పాటు సేవాదృక్పథం కలిగి ఉండాలన్నారు. సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాల్లో పాల్గొనడం బాధ్యతగా భావించాలని.. ఇలాంటి శిబిరాలు వ్యక్తిత్వ వికాసానికి ఎంతో దోహదపడతాయని తెలిపారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ మదన్మోహన్, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు. రేపు మెగా ఉద్యోగ మేళా గద్వాలన్యూటౌన్: మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఈ నెల 27న మెగా ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా.మీనాక్షీ, సీపీడీసీ మెంబర్ సాయిశ్యామ్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు బుధవారం కళాశాలలో ఉద్యోగ మేళా బ్రోచర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు మెగా జాబ్ మేళా ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మేళాలో జస్ట్ డయల్, క్యాలిబర్, మెడ్ ప్లస్, టాషియన్, ముత్తూట్ ఫైనాన్స్ తదితర కంపెనీలు పాల్గొంటాయన్నారు. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న, పూర్తిచేసిన అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. ఉద్యోగానికి ఎంపికై న వారికి అదే రోజు అపాయిమెంట్ లెటర్ అందిస్తారని తెలిపారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వైస్ ప్రిన్సిపాల్ లక్ష్మీప్రసాద్, కేరీర్ గైడెన్స్ సెల్ కన్వీనర్ సమత, అధ్యాపకులు పాల్గొన్నారు. -
దుర్మార్గులకు శిక్ష పడాలి
● నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై చర్యలు తీసుకోండి ● కలెక్టర్, ఎస్పీలను ఆదేశించిన ఎస్సీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య సాక్షి, నాగర్‌కర్నూల్: కుమ్మెర ఘటనలో దాడికి పాల్పడిన నిందితులందరిపై హత్య కేసు నమోదు చేయాలని, అందరికీ శిక్షపడేలా చూడాలని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. ఈ ఘటనపై సమగ్ర నివేదిక అందించాలని కలెక్టర్ బదావత్ సంతోష్‌ను ఆదేశించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపైనా విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్లో బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. బాధిత కుటుంబానికి కమిషన్ తరపున రూ.లక్ష చెక్కును అందజేశారు. కుమ్మెరలో కుటుంబం జీవించలేని పరిస్థితులు ఉన్నాయని వారికి రక్షణ కల్పించాలని సూచించారు. జిల్లాకేంద్రంలో డబుల్ బెడ్రూం ఇల్లు ఏర్పాటు, గణేశ్‌కు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కలెక్టర్‌ను ఆదేశించారు. -
సస్యరక్షణ చర్యలతో అధిక దిగుబడులు
తాడూరు: పంటల సాగులో అధిక దిగుబడులు సాధించేందుకు రైతులు తప్పనిసరిగా యాజమాన్య పద్ధతులు, సకాలంలో సస్యరక్షణ చర్యలు చేపట్టాలని కేవీకే శాస్త్రవేత్తలు ఎన్.నవత, భానుశ్రీ సూచించారు. బుధవారం తాడూరు మండలం తుమ్మలసూగూరు శివారులో సాగుచేసిన మొక్కజొన్న పంటను వారు పరిశీలించి.. రైతులకు పలు సూచనలు చేశారు. ప్రస్తుతం పంటకు సోకే తెగుళ్లు, వాటి నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, నీటి నిర్వహణ పద్ధతులపై అవగాహన కల్పించారు. పంట దిగుబడి సాధించేందుకు శాసీ్త్రయ విధానం అనుసరించాలని సూచించారు. ఆదివాసీ చెంచులకు పట్టాలు ఇవ్వాలని హెచ్ఆర్సీ ఆదేశం మన్ననూర్: ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీ చెంచులు దశాబ్దాలుగా సాగుచేసుకుంటున్న భూములకు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఇవ్వాలని మానవ హక్కుల కమిషన్ కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేసినట్లు హైకోర్టు న్యాయవాది వినోద్ హిందుస్తానీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2022లో అర్హులైన రైతులకు ప్రభుత్వం ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు జారీ చేసిందని పేర్కొన్నారు. అయితే ఆదివాసీ చెంచులు పట్టాదారు పాస్‌పుస్తకాల కోసం కలెక్టరేట్లో పలుమార్లు అర్జీ పెట్టుకున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టాలు ఇవ్వలేదన్నారు. ఈ విషయంపై అమ్రాబాద్ మండలం నల్లమల అటవీ లోతట్టు ప్రాంతంలోని రాయిలేటి పెంటకు చెందిన 8 మంది ఆదివాసీ చెంచుల తరఫున మాజీ సర్పంచ్, శక్తి స్వచ్ఛంద సంస్థ కార్యకర్త నల్లపోతుల పెద్దిరాజు మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారని ఆయన తెలిపారు. దీనిపై విచారించిన కమిషన్.. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై కేసులు నమోదు చేయడంతో పాటు ఆదివాసీ చెంచులకు నాలుగు వారాల్లో పట్టాదారు పాస్‌పుస్తకాలు జారీ చేయాలని ఆదేశించిందని ఆయన తెలిపారు. -
పసిగుడ్డు ఏం పాపం చేసింది?
సాక్షి, నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో జరిగిన దాడి ఘటనలో హంతకులను కాపాడే ప్రయత్నం చేయడం సిగ్గుచేటని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కుమ్మెర జాతరలో జరిగిన ఘటన మాటలకు అందని విషాదం అని చెప్పారు. రెండు నెలల పసిగుడ్డు ఏం పాపం చేసిందని దుర్మార్గంగా ప్రవర్తించారని మండిపడ్డారు. శిశువు మరణిస్తే కూడా హత్యకేసు పెట్టకపోవడమేంటని ప్రశ్నించారు. హంతకులను కాపాడాలనుకునే ప్రతిఒక్కరూ దోషులేనని, ఇందులో సీఎం, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ ఎవరున్నా దోషులేనని అన్నారు. బుధవారం నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో బాధిత కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం ఆయన మాట్లాడారు. మానవత్వానికే మచ్చ..కుమ్మెరలో నిరుపేద కుటుంబంపై దాడి ఘటన మానవత్వానికే మచ్చగా కేటీఆర్ అభివర్ణించారు. ఈ ఘటనను రాజకీయం చేసేందుకు తాము రాలేదని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని అడిగే బాధ్యత ప్రజలందరిపై ఉందని స్పష్టం చేశారు. మల్లన్న దర్శనం కావాలని అడిగినందుకు ఒక వ్యక్తిపై 20 మంది దాడిచేయడం అధికార అహంకారమేనని చెప్పారు. విచక్షణ లేకుండా ఒకడు కాలితో తన్నితే రెండు నెలల పాప చనిపోయిందని తెలిపారు. ఈ కేసును పోలీసులు సుమోటోగా తీసుకోవాల్సింది పోయి.. ఫిర్యాదు ఇస్తే సరిగా రాసివ్వలేదని ఇబ్బంది పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాప తల్లి న్యాయం కోసం రోడ్డెక్కే పరిస్థితి రావడం దారుణమైన విషయం అన్నారు.8 మందిపై హత్య కేసు నమోదు చేయాలిపసిపాపకు కులం, మతం, అధికారం గురించి ఏం తెలుసని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ ఘటన గురించి తెలిశాక ఒక తండ్రిగా తల్లడిల్లిపోయానని ఆవేదన చెందారు. 8 మందిపై హత్యకేసు నమోదు చేసి జైలుకు పంపాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే శిక్షపడే దాకా ఉద్యమం ఆపబోమని, అసెంబ్లీలో నిలదీస్తామన్నారు. బాధిత కుటుంబానికి రూ.కోటి పరి హారం చెల్లించాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ తరపున రూ.లక్ష చెక్కును బాధిత కుటుంబానికి అందజేశారు. ఇంటి నిర్మాణం కోసం రూ.10 లక్షల ఆర్థిక సాయం చేస్తున్నట్టు తెలిపారు. కేటీఆర్ వెంట ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మారెడ్డి, నిరంజన్‌రెడి ఉన్నారు. -
కుమ్మెర ఘటన అమానవీయం: కేటీఆర్
సాక్షి, నాగర్ కర్నూల్: కుమ్మెరలో జరిగిన ఘటన అమానవీయం అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. దేవుడి దర్శనం కోసం వెళ్తే దాడికి పాల్పడటం దారుణమన్నారు. కుమ్మెర ఘటన మానవత్వానికి మచ్చ.. తెలంగాణ సమాజం తలదించుకునే దుర్మార్గమైన ఘటనగా కేటీఆర్ అభివర్ణించారు. కులాలు మతాలు పేరిట అవమానించటం.. హత్య రాజకీయాలు చేస్తోన్నవారికి అండగా నిలిచిన వారిది కూడా తప్పేనని కేటీఆర్ అన్నారు.గణేష్‌పై అమానుషంగా దాడి చేశారు. మౌనిక ప్రాధేయపడిన కూడా వినకుండా పసిపాపను కాలుతో తన్నితే చనిపోయింది. శిక్షించాల్సిన పోలీసులు ఏం చేస్తున్నారు?. ఇక్కడి పోలీసులు వ్యవహరించిన తీరు దారుణంగా ఉంది. ఇక్కడి పోలీసులు రాజ్యాంగాన్ని ఖననం చేస్తున్నారు. దుర్ఘటనలో 8 మంది నిందితులను తక్షణమే హత్యానేరం కింద అరెస్టు చేసి చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. పసిగుడ్డు మృతికి కారకులైన దుండగులను ఉరితీసినా తప్పులేదు. ప్రభుత్వం కూడా స్పందించాలి. కోటి రూపాయల పరిహారం ఇవ్వాలి. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలన్నారు. -
ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం
● జిల్లావ్యాప్తంగా 34 కేంద్రాల ఏర్పాటు ● హాజరుకానున్న 15,173 మంది విద్యార్థులు ● నేటి నుంచి వచ్చేనెల 18 వరకు కొనసాగనున్న పరీక్షలు వసతులపై ప్రత్యేక దృష్టి.. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన వసతులు కల్పించడంపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టిసారించింది. వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రథమ చికిత్స నిమిత్తం సిబ్బందిని ప్రతి పరీక్ష కేంద్రాల్లో నియమించడంతో పాటు తరగతి గదుల్లో చీకటి ఉండకుండా లైట్లు, ఉక్కపోత లేకుండా ఫ్యాన్లు ఏర్పాటుచేశారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పోలీసు బందోబస్తు నిర్వహించనున్నారు. సమీపంలోని జిరాక్స్ సెంటర్లను మూసి ఉంచనున్నారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు కొనసాగనున్నాయి. ప్రశ్నపత్రాలను తెరవడం.. సీజ్ చేయడం వంటి వాటిని సీసీ నిఘాలో నిర్వహించనున్నారు. సీసీ కెమెరాలను కంట్రోల్ కమాండ్ రూమ్‌కు అనుసంధానం చేశారు. కందనూలు: జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. బుధవారం నుంచి వచ్చేనెల 18వ తేదీ వరకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల పరీక్షలు కొనసాగనున్నాయి. విద్యార్థులు గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇదివరకు ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు ఫీజు చెల్లించలేదనే కారణంతో విద్యార్థులకు హాల్‌టికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేసేవి. ఈ నేపథ్యంలో గతేడాది నుంచి ఓటీపీ ద్వారా ఆన్లైన్లో హాల్‌టికెట్ డౌన్లోడ్ చేసుకునే అవకాశాన్ని ఇంటర్‌బోర్డు కల్పించింది. హాల్‌టికెట్‌పై ఉండే బార్కోడ్ స్కాన్ చేస్తే ఏ పరీక్ష కేంద్రం అనే విషయం తెలిసిపోతుంది. పరీక్ష కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి.. ఇంటర్ పరీక్షల నిర్వహణ కోసం జిల్లావ్యాప్తంగా 34 కేంద్రాలను ఏర్పాటుచేశారు. అందులో 16 ప్రభుత్వ, 11 ప్రైవేటు జూనియర్ కళాశాలలు, ఒక ట్రైబల్ వెల్ఫేర్, ఒక మైనార్టీ వెల్ఫేర్, ఒక సోషల్ వెల్ఫేర్, మూడు ఎంజేపీ, ఒక మోడల్ కళాశాలల్లో పరీక్ష కేంద్రాలు కొనసాగనున్నాయి. మొత్తం 15,173 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. ఇందులో ప్రథమ సంవత్సరం విద్యార్థులు జనరల్ 5,805 మంది, ఒకేషనల్ విభాగంలో 1,752 మంది, ద్వితీయ సంవత్సరం జనరల్‌లో 5,837 మంది, ఒకేషనల్ విభాగంలో 1,779 మంది విద్యార్థులు ఉన్నారు. అధికారుల నియామకం.. పరీక్షల పర్యవేక్షణ నిమిత్తం 34 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 34 మంది డిపార్టుమెంట్ అధికారులు, 11 మంది అడిషనల్ చీప్ సూపరింటెండెంట్లు, ఏడుగురు కస్టోడియన్లు, రెండు ఫ్లైయింగ్ స్క్వాడ్స్, మూడు సిట్టింగ్ స్క్వాడ్స్‌తో పాటు హైపవర్ కమిటీని నియమించారు. మాస్ కాపీయింగ్‌కు ఎక్కడా ఆస్కారం లేకుండా పరీక్ష కేంద్రాల్లో విస్తృత తనిఖీలు చేపట్టనున్నారు. 144 సెక్షన్ అమలు నాగర్‌కర్నూల్ క్రైం: ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్ష సమయంలో సమీపంలోని జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని.. ఎలాంటి సౌండ్ స్పీకర్లు, డీజే పెట్టకూడదన్నారు. 144 సెక్షన్ అమలులో ఉండటం వల్ల నలుగురి కంటే ఎక్కువ మంది గుమికూడవద్దని తెలిపారు. ఏర్పాట్లు పూర్తిచేశాం.. ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా ప్రశాంత వా తావరణంలో పరీక్షలు రాయాలి. ముఖ్యంగా గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి. మాస్ కాపీయింగ్‌కు అవకాశం లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. – వెంకటరమణ, డీఐఈఓ -
అర్జీల పరిష్కారానికి కృషి చేయాలి
వనపర్తి: ప్రజల నుంచి వచ్చిన అర్జీలు, ఫిర్యాదులకు అధికారులు సరైన సమాధానం ఇవ్వడంతో పాటు పరిష్కారం దిశగా తక్షణ చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఎకై ్సజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారా వు అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కొల్లాపూర్ నియోజకవర్గం పానగల్ మండలానికి సంబంధించి రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖలపై కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి సమీక్ష నిర్వహించారు. పాన్‌గల్ మండలం తెల్లరాళ్లపల్లిలో ఓ రైతు తన భూమి పొరపాటున అటవీ భూమిగా నమోదైందంటూ దరఖాస్తు చేసుకున్నారని, నేటికీ పరిష్కారం కాకపోవడంపై అధికారులను ప్రశ్నించారు. పది రోజుల్లో పరిష్కరించినట్లు తనకు తెలియజేయాలన్నారు. అదేవిధంగా దావాజ్పల్లితండా, కిష్టాపూర్‌కు చెందిన పలువురు రైతులు తమ పోడు భూమి సమస్యను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. అధికారులతో ఆరా తీసిన మంత్రి వెంటనే పరిష్కరించాలని కోరారు. పానగల్ మండలంలోని భూములకు సంబంధించి స్పెషల్ డ్రైవ్ నిర్వహించి పరిష్కరించాలని కలెక్టర్‌కు సూచించారు. ఇందిరమ్మ ఇళ్లు మంజూరై పనులు ప్రారంభించని వారితో సమావేశం నిర్వహించాలన్నారు. పనులు ప్రారంభించకపోవడానికి గల కారణాలు తెలుసుకొని త్వరగా ప్రారంభించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలు వేగంగా పూర్తయ్యేలా చొరవ చూపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను సహనంతో విని పరిష్కరించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించాలని.. కేవలం కార్యాలయాలకు మాత్రమే పరిమితం కావద్దన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు ఖీమ్యానాయక్, యాద య్య, ఆర్డీఓ సుబ్రమణ్యం, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోవర్ధన్‌సాగర్, జిల్లా అటవీశాఖ అధికారి సత్యనారాయణ, ఇతర అధికారులు, పాన్ గల్ మండల ప్రజలు పాల్గొన్నారు. రాష్ట్ర ఎకై ్సజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు -
పిల్లలతో పనులు చేయిస్తే చర్యలు
నాగర్‌కర్నూల్ క్రైం: ఎవరైనా పిల్లలను పనిలో పెట్టుకుంటే చట్టపరమైన చర్యలు తప్పవని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీదేవి అన్నారు. ఇటీవల గుంపుమేస్త్రి చెర నుంచి విడిపించిన వలస కూలీలకు బుధవారం జిల్లాకేంద్రంలో చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. మహారాష్ట్రలోని పర్భాని జిల్లాలో ఇటీవల వనపట్లకు చెందిన గుంపుమేస్త్రి ఎర్రయ్య చెర నుంచి తెలకపల్లి మండలానికి సంబంధించిన వలస కూలీలను గతనెల 23న జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చొరవతో విడిపించడం జరిగిందన్నారు. వలస కూలీలు వెట్టిచాకిరీ నుంచి ఎలా బయటపడాలి.. జీవితంలో ఎలా ఉన్నతంగా జీవించాలనే విషయాలను వివరించారు. పిల్లలను పనిలో పెట్టకూడదని.. బడి ఈడు పిల్లలందరూ పాఠశాలకు వెళ్లి చదువుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ లేబర్ కార్డు కలిగి ఉండాలన్నారు. అనంతరం బ్యాంకు ఖాతా ప్రాముఖ్యతను వివరించి.. ఆధార్, బ్యాంకు ఖాతా లేని వారికి నేషనల్ ఆదివాసీ సంస్థ, ఇంటర్నేషనల్ జస్టిస్ మిషన్ ఆధ్వర్యంలో ఎన్రోల్మెంట్ చేయించినట్లు తెలిపారు. కార్యక్రమంలో సీడబ్ల్యూసీ చైర్పర్సన్ లక్ష్మణ్‌రావు, ఎల్ఓ రాజ్‌కుమార్, డీసీపీఓ శ్రీశైలం, సీఐ శంకర్ పాల్గొన్నారు. -
న్యాయవాదుల రక్షణ చట్టం తేవాలి
కొల్లాపూర్: న్యాయవాదులకు రక్షణ కల్పించేందుకు ప్రత్యేకంగా చట్టం తీసుకురావాలని కొల్లాపూర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పోతుల నాగరాజు డిమాండ్ చేశారు. న్యాయవాదుల రక్షణ చట్టం కోసం తెలంగాణ బార్ అసోసియేషన్ల సమాఖ్య చేపట్టిన ఆందోళన కార్యక్రమాలకు సంఘీభావంగా మంగళవారం కొల్లాపూర్ జూనియర్ సివిల్‌జడ్జి కోర్టు ఎదుట న్యాయవాదులు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. న్యాయవాదులపై గత కొంతకాలంగా దాడులు పెరుగుతున్నాయన్నారు. పాలక ప్రభుత్వాల అలసత్వమే ఇందుకు కారణమన్నారు. కఠిన చట్టాలు లేకపోవడంతో న్యాయవాదులకు రక్షణ లభించడం లేదన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వాలు స్పందించి న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామన్నారు. న్యాయవాదులు శ్రీనివాసరావు, వసంతరెడ్డి, నజీరుద్దీన్, భాస్కర్‌రెడ్డి, ఉపేందర్, శ్రీహరి, శివారెడ్డి, నిరంజన్, కురుమూర్తి, మనోహర్, బాలస్వామి, రామలక్ష్మమ్మ, నళిని తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించాలి మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను విద్యార్థుల్లో పెంపొందించేందుకు కృషి చేయాలని పాలమూరు యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ శ్రీనివాస్ అన్నారు. మంగళవారం పీయూ పరిధిలోని కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించేందుకు ఏర్పాటు చేసిన 100 రోజుల యాక్షన్ ప్లాన్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రస్తుతం మార్కెట్‌కు అవసరమైన మానవ వనరులను అభివృద్ది చేసేందుకు కళాశాల స్థాయిలోనే చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థులు కమ్యూనికేషన్ స్కిల్స్, నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలని సూచించారు. స్కిల్ మ్యాపింగ్, ఎక్స్పర్మెంటల్ లర్నింగ్, ఇంటర్న్‌షిప్, అప్రెంటిషిప్ వంటి వాటిని విద్యార్థులకు అందించేందుకు అధ్యాపకులు కృషి చేయాలన్నారు. విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచేందుకు తీసుకుంటున్న చర్యలకు సంబంధించి ప్రతినెల కార్యాచరణ ప్రణాళిక సమర్పించాలని ఆదేశించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ రమేష్‌బాబు, ఆడిట్ సెల్ డైరెక్టర్ చంద్రకిరణ్, కోఆర్డినేటర్ రవికుమార్, సిద్దరామగౌడ్, సుజాత, రమేష్, జాహ్నవి తదితరులు పాల్గొన్నారు. -
పసిబిడ్డ చనిపోయినా పట్టించుకోరా?
● బాధితులపైనే కేసులు పెడతారా.. ● కుమ్మెర ఘటనపై జాతీయ ఓబీసీ, ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తాం ● బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు కందనూలు: కుమ్మెర జాతరలో నిరుపేద కుటుంబంపై జరిగిన దాడిలో రెండు నెలల పసిబిడ్డను కోల్పోయిన ఘటన దారుణమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు అన్నారు. మంగళవారం బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో ఏర్పాటుచేసిన దీక్షా శిబిరంలో బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. పాలమూరు బిడ్డగా చెబుకుంటున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. ఈ ప్రాంతంలోనే ఒక దళిత మహిళకు జరిగిన అన్యాయంపై ఇప్పటికీ స్పందించకపోవడం దుర్మార్గమన్నారు. స్థానిక ఎమ్మెల్యేల చేతిలో నియోజకవర్గ అధికారులంతా కీలుబొమ్మలుగా మారారని.. ఫలితంగానే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పరిపాలన విషయంలో పట్టు కోల్పోయారని ఆయన ఆరోపించారు. తమకు అన్యాయం జరిగిందని బాధితులు ఫిర్యాదు చేస్తే.. దాడికి పాల్పడిన నిందితుల నుంచి ఫిర్యాదు తీసుకుని బాధితులపైనే కేసులు పెట్టే సంస్కారం ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి సంఘటనలే కొనసాగుతున్నాయని.. అమాయకులపై అక్రమ కేసులు బనాయించి అధికారాన్ని చెలాయిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ ఘటనపై జాతీయ ఓబీసీ, ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు నరేందర్‌రావు, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు తల్లోజు ఆచారి, ఓబీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్‌గౌడ్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దిలీపాచారి, కట్టా సుధాకర్‌రెడ్డి ఉన్నారు. దోషులను కఠినంగా శిక్షించాలి నాగర్‌కర్నూల్ రూరల్: కుమ్మెర ఘటనలో అకారణంగా దాడిచేసి.. రెండు నెలల పసికందు హత్యకు కారకులైన దోషులను కఠినంగా శిక్షించాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రహీం శేఖర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ధర్నా శిబిరంలో బాధిత కుటుంబాన్ని ఆయన పరామర్శించి మాట్లాడారు. కుమ్మెర ఘటనపై పోలీసులు స్పందించిన తీరును చూస్తుంటే.. నిందితులకు వారే పరోక్షంగా సహకరిస్తున్నారనే విషయం అర్థమవుతుందన్నారు. నేటికీ కులవివక్షత కొనసాగడం దురదృష్టకరమని అన్నారు. నిరుపేద కుటుంబంపై దాడి, పసిబిడ్డ మృతికి కారకులైన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. -
నిర్లక్ష్యమే పాపమైంది
కుమ్మెర ఘటనకు అధికారుల వైఫల్యమే కారణం వారిపై ఇలాంటిదాడులుంటాయా? పేదలు, ఎస్సీ, ఎస్టీ, బీసీల పైనే దాడులు కొనసాగుతున్నాయని, ఉన్నత వర్గాలపై ఇలాంటి దాడులు ఎక్కడైనా ఉంటాయా అని ఎస్సీ, ఎస్టీ, బీసీ జేఏసీ చైర్మన్ విశారదన్ మహారాజ్ ప్రశ్నించారు. ఉన్నత వర్గాల, పెత్తందారుల చేతుల్లో దాడికి గురైతే పోలీసులు మాత్రం బాధితులపైనే మొదట కేసులు పెట్టారన్నారు. ప్రజాసంఘాల ఒత్తిడితో మాత్రమే తర్వాత నిందితులపై కేసు పెట్టారని తెలిపారు. ఫిర్యాదు చేసిన నిందితులందరిపై చర్యలు తీసుకోవాలని, అందరినీ రిమాండ్‌కు పంపాలని డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం జరగాలి కుమ్మెరలో బాధిత కుటుంబానికి ప్రభుత్వం పూర్తిస్థాయిలో అండగా ఉంటుందని ఎంపీ మల్లు రవి చెప్పారు. కలెక్టర్ సంతోష్, ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్‌కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. బాధ్యులైన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని, ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని కోరారు. సాక్షి, నాగర్‌కర్నూల్: జిల్లాలోని కుమ్మెర మల్లన్న జాతర నిర్వహణ మొదలు, దాడి ఘటన, తర్వాత కేసుల దర్యాప్తులోనూ అధికారుల నిర్లక్ష్యం కనిపించిందని బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ వెల్లడించారు. మంగళవారం జిల్లాలోని నాగర్‌కర్నూల్ మండలం కుమ్మెర గ్రామంలో ఆలయం వద్ద సంఘటన చోటుచేసుకున్న ప్రదేశాన్ని బీసీ కమిషన్ చైర్మన్, సభ్యుల బృందం పరిశీలించింది. బాధిత కుటుంబ సభ్యులు చంద్రకళ, గణేశ్, మౌనికను పరామర్శించారు. వారి నుంచి ఘటనకు కారణమైన వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబానికి రాష్ట్ర బీసీ కమిషన్ పూర్తిస్థాయిలో అండగా ఉంటుందని, సమగ్ర విచారణ చేపడుతున్నట్టు వివరించారు. కుమ్మెర గ్రామంలో ఆలయ పరిసరాలు, సంఘటనా స్థలం, బాధిత కుటుంబం ఇంటిని పరిశీలించిన తర్వాత పోలీస్, రెవెన్యూ, ఎండోమెంట్ అధికారుల నిర్లక్ష్యం, భద్రతాలోపాలు తేటతెల్లమయ్యాయని వెల్లడించారు. 10 వేలకు మించి భక్తులు.. రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, సభ్యులు రాపోలు జయప్రకాశ్, టి.సురేందర్, బాలలక్ష్మి బృందం కుమ్మెర గ్రామాన్ని సందర్శించారు. 10 వేలకు మించి భక్తులు పాల్గొనే జాతర నిర్వహణలో అధికారులు పూర్తిస్థాయిలో వైఫల్యం చెందారని కమిషన్ చైర్మన్ వెల్లడించారు. ఆలయంలో టికెట్, నిర్వహణ విషయంలో ఎండోమెంట్ అధికారుల పర్యవేక్షణ ఉండాల్సి ఉండగా.. పూర్తిగా సర్పంచ్, గ్రామ పెద్దల పెత్తనమే కొనసాగిందన్నారు. పోలీస్ శాఖ బందోబస్తు ఏర్పాటు చేయాల్సి ఉండగా, కనీస స్థాయిలో ఏర్పాట్లు లేవన్నారు. రెవెన్యూ శాఖ అధికారుల నుంచి పర్యవేక్షణ, ఏర్పాట్లు లేవని చెప్పారు. పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొనే జాతరలో అధికారులు నిర్లక్ష్యంగా ఉండటం దురదృష్టకరమన్నారు. కలెక్టర్ సంతోష్, ఎస్పీ సంగ్రామ్‌సింగ్‌జీ పాటిల్, ఆర్డీఓ సురేశ్, డీఎస్పీ శ్రీనివాసులు తదితరుల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఘటనపై సమగ్ర వివరాలను నివేదిక అందించాలని ఆదేశించారు. రెవెన్యూ, పోలీస్, ఎండోమెంట్ అధికారుల పర్యవేక్షణ కరువు చిన్నారి మృతిపై విచారణ సందర్భంగా బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ బాధిత కుటుంబం నుంచి వివరాలు సేకరించిన కమిషన్ చైర్మన్, సభ్యులు జిల్లాకేంద్రంలో నాలుగోరోజు కొనసాగిన నిరసనలు నేడు కేటీఆర్ రాక.. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు నాగర్‌కర్నూల్ జిల్లాకేంద్రానికి రానున్నారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డితోపాటు ఉమ్మడి జిల్లాలోని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు హాజరై నిరసన కార్యక్రమంలో పాల్గొననున్నారు. -
నిరసనలు ఉధృతం..
జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ జేఏసీ ఆధ్వర్యంలో బాధిత కుటుంబానికి మద్దతుగా ఏర్పాటు చేసిన శిబిరంలో రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల నేతలు పాల్గొన్నారు. బీజేపీ, బీఎస్పీ, సీపీఎం, సీపీఐ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగాయి. రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ పార్టీలకు చెందిన ముఖ్యనేతలు, ప్రజాసంఘాల నాయకులు నిరసన శిబిరానికి చేరుకుని బాధితులకు మద్దతు తెలుపుతున్నారు. కుమ్మెర ఘటనలో బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ న్యాయవాది వినోద్ హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన మానవ హక్కుల కమిషన్ ఫిర్యాదును స్వీకరించి కేసు నమోదు చేసింది. -
అన్ని అనుమతులు ఉన్నాయి
ప్లాట్లు కొనుగోలు చేసే సమయంలో న్యాయపరమైన అన్ని ధ్రువీకరణ పత్రాలు సరిచూసుకొనే కొనుగోలు చేశాం. 20 ఏళ్ల క్రితమే పట్టాదారుల రిజిస్ట్రేషన్‌తో పాటు నాలా, డీటీసీపీ అనుమతులు ఉన్నాయి. గ్రామపంచాయతీ నుంచి ఇంటి నిర్మాణ అనుమతులు తీసుకున్నాం. పన్నులు కూడా కడుతున్నాం. ఇలాంటి సమయంలో ఇప్పడు దేవాదాయశాఖ భూమి అంటూ ఇబ్బంది పెట్టడం సరికాదు. ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి దృష్టికి సమస్యను తీసుకెళ్లాం. కాలనీల్లో ఇళ్లను మినహాయించి ఖాళీగా ఉన్న దేవాదాయ భూములను స్వాధీనం చేసుకునే విధంగా చర్యలు తీసుకంటామని హామీ ఇచ్చారు. – రాఘవేందర్, అధ్యక్షుడు, సరస్వతీ కాలనీ, జడ్చర్ల దేవాదాయ శాఖ పేర్కొన్న సర్వే నంబర్లలో ఇళ్లు, తదితర నిర్మాణాలకు సంబంధించి ఎలాంటి అనుమతులు ఇవ్వడం లేదు. గతంలోనే అనుమతులు నిలిపివేయాలని దేవాదాయశాఖ అధికారులు ఉత్తర్వులు ఇవ్వడం వల్లే.. అన్ని అనుమతులు ఆపేశాం. – లక్ష్మారెడ్డి, కమిషనర్, జడ్చర్ల మున్సిపాలిటీ -
‘పది’ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
కందనూలు: జిల్లాలో పదో తరగతి పరీక్షలను అన్ని శాఖల అధికారుల సమన్వయంతో పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు నిర్వహించనున్న పదో తరగతి పరీక్షలకు సంబంధించి జిల్లావ్యాప్తంగా మొత్తం 60 కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో 10,683 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానుండగా.. అందులో 5,264 మంది బాలురు, 5,394 మంది బాలికలు ఉన్నారన్నారు. జిల్లాలోని 257 ప్రభుత్వ, ప్రైవేట్, గురుకుల, ఇతర మాధ్యమాల పాఠశాలల విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది మొదటిసారిగా ప్రతి పరీక్షకు మధ్య నాలుగు రోజుల వ్యవధి ఉండటం విద్యార్థులకు మంచి అవకాశమని చెప్పారు. ఈ విరామాన్ని సద్వినియోగం చేసుకునేలా విద్యార్థులకు అవసరమైన విద్యా మార్గదర్శకత్వం అందించాలని సూచించారు. పరీక్షల సమయంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు సమయానికి పరీక్ష కేంద్రాలకు చేరుకునేలా ప్రత్యేక బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులను కోరారు. ప్రతి విద్యార్థి పరీక్ష సమయానికి గంట ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. పరీక్షా కేంద్రాల్లోకి సెల్ఫోన్లు, ఇతరత్రా ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదని స్పష్టం చేశారు. పరీక్షలను పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని అధికారులకు చెప్పారు. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని, అధికారులు తమకు కేటాయించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని స్పష్టం చేశారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం వహించినా సహించబోమని హెచ్చరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ అమరేందర్, డీఎస్పీ శ్రీనివాసులు, డీఈఓ రమేష్‌కుమార్, డీపీఓ శ్రీరాములు, డీఎంహెచ్ఓ రవికుమార్, ఏసీ రాజశేఖర్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
క్రమశిక్షణతో సాధన చేస్తే క్రీడల్లో ప్రతిభ
నాగర్‌కర్నూల్ క్రైం: పోలీసు సిబ్బంది క్రమ శిక్షణతో సాధన చేస్తే క్రీడల్లో ప్రతిభచాటి పతకాలు సాధించవచ్చని ఎస్పీ సంగ్రామ్‌సింగ్‌జీ పాటిల్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర పోలీస్ క్రీడలలో జిల్లా పోలీస్ అధికారులు జోగుళాంబ జోన్ తరపున క్రీడల్లో పాల్గొని పతకాలు సాధించినట్లు సోమవారం ఎస్పీ కార్యాలయంలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రస్థాయి పోలీస్ క్రీడలు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరంలో జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తున్నారని, జిల్లా పోలీసు శాఖలో పనిచేస్తున్న ఆర్ఐ జగన్, ఆర్ఎస్ఐ శివాజీ, గౌస్ లాన్ టెన్నిస్ నాన్ గెజిటెడ్ పోలీస్ ఆఫీసర్స్ టీం ఈవెంట్ విభాగంలో పాల్గొని మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం సాధించారని చెప్పారు. క్రమశిక్షణతో కూడిన సాధన దృఢ సంకల్పంతో విజయం సాధించారని, మున్ముందు మరిన్ని క్రీడల్లో ప్రతిభ కనబరిచి జిల్లా పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. క్రీడల్లో పతకాలు సాధించిన సిబ్బందిని అభినందించారు. -
‘సామాజిక తెలంగాణ కోసం పోరాటం’
గద్వాల: పోరాడి సాధించుకున్న తెలంగాణలో బీఆర్ఎస్ పాలనలో సామాజిక న్యాయం దక్కలేదని, సామాజిక న్యాయం కోసం తాము మరోపోరాటం చేస్తామని, అది నడిగడ్డ నుంచే మొదలుపెడతామని మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. సోమవారం ఆమె గద్వాల జిల్లా కేంద్రంలో రైతుల సంఘర్షణ సభలో పాల్గొని మాట్లాడారు. గత బీఆర్ఎస్ పాలనలో నడిగడ్డ ప్రాంతం పూర్తిగా అన్యాయానికి గురైందన్నారు. మామ, బావ, అత్త, అల్లుడు ఇలా ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు పాలిస్తూ ఈ ప్రాంతాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నారో కూడా తెలియదని, ఆయనకు ఏమైనా నిజాయితీ ఉంటే తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలన్నారు. ఈ అత్త, అల్లుడు రాజకీయానికి ప్రత్యామ్నాయంగా కొత్త రాజకీయ శక్తిగా వస్తున్నామని, అది నడిగడ్డకు వజ్రాయుధంగా మారుతుందన్నారు. మార్పు ఈ ప్రాంతం నుంచే మొదలుపెడతామన్నారు. సీడుపత్తి రైతులను ఆర్గనైజర్లు, కంపెనీలు నిండా ముంచుతున్నాయని, రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు. -
కొలిక్కిరాని జడ్చర్ల వేంకటేశ్వరస్వామి భూముల వ్యవహారం
నెట్‌బాల్ చాంపియన్ మహబూబ్‌నగర్ ● బాలుర, బాలికల విభాగంలో జిల్లా జట్ల ప్రతిభ ● రన్నరప్‌లుగా మేడ్చల్, నారాయణపేట ● ముగిసిన రాష్ట్రస్థాయి సీఎం కప్ నెట్‌బాల్ పోటీలు – మహబూబ్‌నగర్ క్రీడలు ఆందోళన.. అయోమయం● -
రగులుతున్న కుమ్మెర
దాడి ఘటనపై ముమ్మరమైన విపక్షాల నిరసనలు బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు మంగళవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు రానున్నారు. జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన నిరసన శిబిరంలో పాల్గొననున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్, బీఎస్పీ, సీపీఐ, సీపీఎం, బీజేపీతోపాటు ప్రజాసంఘాలు, కుల సంఘాల ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం తరపున జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే వంశీకృష్ణ స్పందించి హామీ ఇచ్చినా నిరసనల పర్వం ఆగడం లేదు. బాధితులు ఫిర్యాదు చేసిన మేరకు నిందితులందరిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
విద్యార్థులు శాసీ్త్రయ జ్ఞానాన్ని పెంచుకోవాలి
కందనూలు: విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే శాసీ్త్రయ జ్ఞానాన్ని పెంపొందించుకొని తమ చుట్టూ జరుగుతున్న విషయాలను పరిశోధనాత్మక దృష్టితో పరిశీలించాల్సిన అవసరం ఉందని డీఈఓ రమేష్‌కుమార్ అన్నారు. సోమవారం జిల్లాకేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన భౌతిక, రసాయన శాస్త్ర జిల్లా స్థాయి టాలెంట్ టెస్ట్ ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులు శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. స్మార్ట్ఫోన్లను వినోదానికి మాత్రమే కాకుండా విజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకునే సాధనంగా ఉపయోగించుకోవాలని హితవు పలికారు. జిల్లాస్థాయి పరీక్షల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపికై న ముగ్గురు విద్యార్థులకు డీఈఓ నగదు బహుమతులు అందజేసి.. జ్ఞాపికలతో సత్కరించారు. ఈ క్రమంలో సిర్సవాడ జెడ్పీహెచ్ఎస్ 9వ తరగతి విద్యార్థిని జడ్పిహెచ్ఎస్ దీక్షిత మొదటి స్థానం సాధించగా, అదే పాఠశాల చెందిన విద్యార్థి హర్షవర్ధన్ రెండో స్థానం, బల్మూరు జెడ్పీహెచ్ఎస్ 9వ తరగతి విద్యార్థి కిరణ్‌సాగర్ మూడోస్థానం సాధించారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎంలు భాస్కర్‌రెడ్డి, ఎఫ్పీఎస్టీడీ జిల్లా అధ్యక్షుడు నాగరాజు, ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి పాల్గొన్నారు. -
50 ఏళ్ల క్రితమే తారుమారు..
జడ్చర్ల వేంకటేశ్వరస్వామి ఆలయానికి 102 ఎకరాల భూమి ఉంది. ఇందులో జడ్చర్ల శివారులోని సర్వే నంబర్లు 125, 157, 160, 215, 267, 268లలో 63 ఎకరాల భూమి ఉంది. అలాగే భూత్పూర్ మండలంలోని తాటిపర్తి గ్రామ శివారులో 39 ఎకరాల భూమి ఉంది. ఇక్కడ కూడా దేవాదాయ భూమి ఆక్రమణకు గురైంది. వీటికి భూరికార్డులు 50 ఏళ్ల క్రితమే తారుమారయ్యాయి. ఈ భూములకు సంబంధించి దేవాలయ నిర్వహణ చూస్తున్న కొందరు అర్చకులు తమ పేరు మీద రెవెన్యూ రికార్డులను తారుమారు చేసి అవి తమకు వంశపారపర్యంగా వచ్చిన భూములుగా పేర్కొంటూ దశల వారీగా విక్రయించారు. దీంతో ఆ భూములు పలువురి చేతులు మారాయి. రియల్ వ్యాపారులు ఆ భూములను వెంచర్లుగా మార్చి ప్లాట్లు విక్రయించారు. ప్లాట్లు కొనుగోలు చేసిన వందలాది మంది ఇళ్లు సైతం నిర్మించుకొని నివాసం ఉంటున్నారు. ప్రస్తుతం జడ్చర్ల సరస్వతీకాలనీ, మధురానగర్, ఆ చుట్టుముట్టు కొన్ని కాలనీలు దేవాదాయశాఖకు సంబంధించిన భూముల్లోనే వెలిశాయి. జడ్చర్ల శివారులో దేవాదాయ శాఖ ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్టు ఐదు దశాబ్దాల క్రితమే రికార్డులు తారుమారు చేతులు మారిన భూముల్లో వెలసిన వెంచర్లు, కాలనీలు ఆలస్యంగా మేల్కొన్న దేవాదాయ శాఖ అధికారులు క్రయవిక్రయాలు నిలిపివేత.. ఆందోళనలో కొనుగోలుదారులు జడ్చర్ల వేంకటేశ్వరస్వామి ఆలయ భూముల వ్యవహారం చేంతాడులా సాగుతోంది. దశాబ్దాల తరబడి ఉలుకుపలుకు లేని దేవాదాయశాఖ అధికారులు మూడేళ్ల క్రితం మేల్కొని హడావుడి చేసి.. ఆ తర్వాత మిన్నకుండిపోయారు. దీంతో ఆ భూముల వ్యవహారం ఓ కొలిక్కిరాకుండా పోవడంతో పాటు ఆ భూముల్లో ఇళ్ల కట్టుకున్న వారి పరిస్థితి అయోమయంగా మారింది. ఆలయ భూములకు సంబంధించిన సర్వే నంబర్లలో క్రయవిక్రయాలు జరగకుండా రిజిస్ట్రేషన్లు, నిర్మాణాలకు అనుమతులను నిలిపివేయడంతో వందలాది మంది కొనుగోలుదారులలో ఆందోళన నెలకొంది. – జడ్చర్ల -
ప్రశాంతంగా గురుకులాల ప్రవేశ పరీక్ష
కందనూలు: జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాల్లో 5వ తరగతి రెగ్యులర్, 6 నుంచి 9వ తరగతి వరకు బ్యాక్లాగ్ సీట్ల భర్తీ నిమిత్తం ఆదివారం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. జిల్లావ్యాప్తంగా 22 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించగా.. మొత్తం 7,546 మంది విద్యార్థులకు గాను, 7,263 మంది హాజరయ్యారు. 283 మంది గైర్హాజరయ్యారని ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా జోనల్ అధికారి విద్యుల్లత తెలిపారు. పుర ఫలితాలే ప్రజాపాలనకు నిదర్శనం చిన్నంబావి: కాంగ్రెస్ ప్రభుత్వ రెండేళ్ల పాలనకు పురపాలికల ఎన్నికల ఫలితాలే నిదర్శనమని రాష్ట్ర ఎకై ్సజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం మండలంలోని వెల్టూరులో కేఎంఆర్ ట్రస్ట్ చైర్మన్ కళ్యాణరావుతో కలిసి మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి భూమిపూజ, మండల కేంద్రంలో దివ్యాంగులకు ద్విచక్ర వాహనాలు అందజేసి మాట్లాడారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పని చేస్తున్నారన్నారన్నారు. రెండేళ్ల ప్రజాపాలనలో పేదలకు అనేక సంక్షేమ పఽథకాలు అందించడమేగాక ప్రశాంత వాతావరణం కల్పించినట్లు చెప్పారు. రాబోయే రోజుల్లో పాలనపై ప్రత్యేక దృష్టి సారించి మరిన్ని పథకాలు అమలు చేస్తామని వివరించారు. బాధిత కుటుంబాలకు పరామర్శ.. వెల్టూరులో ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన జెడ్పీటీసీ మాజీ సభ్యుడు బాలకిష్టయ్య కుటుంబాన్ని మంత్రి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అదేవిధంగా అదే గ్రామానికి చెందిన బాలీశ్వరి ఇటీవల మృతిచెందగా ఆ కుటుంబాన్ని పరామర్శించారు. బాలిశ్వరి పిల్లలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రామచంద్రారెడ్డి, బీచుపల్లి యాదవ్, కృష్ణప్రసాద్ యాదవ్, కాంగ్రెస్‌పార్టీ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్ యాదవ్, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
రమణీయం.. రథోత్సవం
శ్రీఅంబా రామలింగేశ్వరస్వామి రథోత్సవంలో పాల్గొన్న భక్తులు వెల్దండ మండలం గుండాలలో ఆదివారం తెల్లవారుజామున శ్రీఅంబా రామలింగేశ్వరస్వామి రథోత్సవం కనులపండువగా సాగింది. స్వామివారి ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన రథంపై స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను కొలువుదీర్చి వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగించారు. రథాన్ని లాగేందుకు భక్తులు పోటీపడ్డారు. ఈ సందర్భంగా శివనామస్మరణ మార్మోగింది. రథంపై ఊరేగుతున్న స్వామివారిని భక్తులు దర్శించుకొని భక్తిపారవశ్యంతో పులకించిపొయారు. రథోత్సవం సందర్భంగా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. – వెల్దండ -
నిర్లక్ష్యంపై నిరసన సెగ
వివాదాస్పదంగా పోలీసుల తీరు ముగ్గురు నిందితులను రిమాండ్‌కు తరలింపు.. కుమ్మెర ఆలయంలో భక్తులపై దాడికి పాల్పడిన నిర్వాహకుల్లో ముగ్గురు వ్యక్తులపై పోలీసులు ఆదివారం కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. కుమ్మెర గ్రామానికి చెందిన శ్రీనివాస్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, మధుసుదన్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి రిమాండ్ చేసినట్టు డీఎస్పీ శ్రీనివాసులు వెల్లడించారు. శిశువు మృతిపై సమగ్ర విచారణ చేపడుతున్నామని, ఫోరెన్సిక్ నిపుణుల ఆధ్వర్యంలో పోస్ట్‌మార్టం నిర్వహించినట్టు చెప్పారు. పోస్ట్‌మార్టం నివేదిక ఆధారంగా కేసు దర్యాప్తు కొనసాగించి విచారణను పూర్తిచేస్తామన్నారు. ఈ విషయంలో ఎలాంటి అపోహలకు తావులేదని స్పష్టం చేశారు. సాక్షి, నాగర్‌కర్నూల్: కుమ్మెర ఆలయంలో భక్తులపై నిర్వాహకుల దాడి ఘటనలో రెండు నెలల శిశువు మృతిచెందిన సంఘటన కలకలం రేపింది. ఈ క్రమంలో బాధితులు ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు స్పందించిన తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. పోలీసుల తీరుపై ఆదివారం బాధిత కుటుంబ సభ్యులతో పాటు ప్రతిపక్షాలు, ప్రజాసంఘాల నుంచి ఆగ్రహం పెల్లుబికింది. ఆదివారం జిల్లాకేంద్రంలోని పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నాలో వివిధ సంఘాల నేతలు పాల్గొని బాధిత కుటుంబానికి సంఘీభావం ప్రకటించారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నతో పాటు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. పోలీసుల వైఖరిపై మండిపాటు.. కుమ్మెర మల్లన్న ఆలయానికి ఈనెల 18న గ్రామానికి చెందిన చంద్రకళ, కీర్తి, గణేశ్, మౌనిక దర్శనం కోసం వెళ్లారు. రూ.100 ఎంట్రీ టికెట్ విషయంలో నిర్వాహకులకు, భక్తులకు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో భక్తులు గణేశ్, చంద్రకళపై నిర్వాహకులు దాడి చేశారు. ఆలయం పక్కన కొబ్బరికాయల గదిలోకి తీసుకెళ్లి చితకబాదారు. ఈ క్రమంలో అడ్డుకోబోయిన మౌనికపై సైతం దాడికి పాల్పడటంతో రెండు నెలల శిశువు సైతం కిందపడిపోయింది. కాగా, ఈనెల 21న శిశువు మరణించింది. దీనిపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందించలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. దాడి కారణంగా కాకుండా వేరే కారణంతో మరణించి ఉండవచ్చని తమనే బెదిరింపులకు గురిచేశారని బాధితురాలు మౌనిక వాపోయారు. మల్లన్న జాతర దాడి ఘటనలో శిశువు మృతి పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు నిర్లక్ష్యంగా మాట్లాడారంటూ బాధితుల ఆరోపణ పోలీస్‌స్టేషన్ ఎదుట ప్రతిపక్షాల నిరసన ఎట్టకేలకు ముగ్గురిని రిమాండ్‌కు తరలించిన పోలీసులు -
మహిళల ప్రగతి చక్రం
●ప్రతినెలా చెల్లింపు.. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని 10 డిపోల పరిధిలో ఇందిరా మహిళా శక్తి కింద మొత్తం 32 బస్సులు నడుస్తున్నాయి. ప్రతినెలా హైదరాబాద్ ఆర్టీసీ ప్రధాన కార్యాలయం నుంచి మండల మహిళా సమాఖ్యల ఖాతాలో డబ్బు జమ అవుతుంది. 84 నెలల తర్వాత బస్సులను తిరిగి ఆర్టీసీ అప్పగించాల్సి ఉంటుంది. అప్పటి వరకు వచ్చే ఆదాయం సమాఖ్యలకు చేరుతుంది. – సంతోష్‌కుమార్, ఆర్ఎం, మహబూబ్‌నగర్ గ్రామ సంఘాలకు రుణం.. ప్రభుత్వం మా మండల సమాఖ్యకు ఆర్టీసీ బస్సు అందజేసింది. ఈ బస్సు మండల సమాఖ్య పేరిట రిజిస్టర్ కాగా.. అచ్చంపేట డిపో పరిధిలో నడుస్తోంది. ఆర్టీసీ నుంచి ప్రతినెలా మండల సమాఖ్య ఖాతాకు రూ.69,654 జమ చేస్తున్నారు. ఆర్టీసీ నుంచి వస్తున్న డబ్బులను గ్రామ సంఘాలకు రుణంగా ఇచ్చి ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నాం. – లలిత, మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు, ఉప్పునుంతల అచ్చంపేట: మహిళా సాధికారిత దిశగా ప్రభుత్వం చేపట్టిన వినూత్న కార్యక్రమం సత్ఫలితాలు ఇస్తోంది. ఉమ్మడి జిల్లాలో 32 మహిళా సమాఖ్యలకు ఇందిరా మహిళా శక్తిని కేటాయించడంతో ఆర్టీసీ బస్సుల ద్వారా భారీ ఆదాయం సమకూరుతోంది. అతి తక్కువ పెట్టుబడితో ప్రారంభమైన ఈ ప్రక్రియ.. ఇప్పుడు మహిళా సమాఖ్యల ఆర్థిక పురోగతికి బాటలు వేస్తోంది. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా ఆర్టీసీకి అద్దె బస్సులను అప్పగించిన మహిళా సమాఖ్యలకు యాజమాన్యం క్రమం తప్పకుండా అద్దెలు చెల్లిస్తుండటంతో ఈ పథకం ద్వారా మహిళా సభ్యులకు మంచి ఫలితాలు అందుతున్నాయి. ఎనిమిది నెలల క్రితం ప్రభుత్వం బస్సుల కొనుగోలు ప్రక్రియ చేపట్టగా.. గతంలో రెండు నెలల అద్దెలు విడుదల కాగా.. ఇటీవల ఆరు నెలల అద్దెలను ఆర్టీసీ యాజమాన్యం మహిళా సమాఖ్యలకు చెల్లించింది. 64 బస్సులకు ప్రతిపాదనలు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ ఆర్టీసీ)కు ఆర్టీసీ బస్సులను అద్దె ప్రాతిపదికన ఏర్పాటు చేసేందుకు మండల సమాఖ్యల ద్వారా కొనుగోలు చేయించారు. ఇలా ఉమ్మడి జిల్లాలో ఇందిరా మహిళా శక్తి కింద ప్రభుత్వం 64 బస్సుల కొనుగోలు చేసేందుకు ప్రతిపాదించగా ఇప్పటి వరకు 32 బస్సులు కొనుగోలు చేసి మహిళా సమాఖ్యలకు అందజేసింది. ప్రభుత్వం మహిళా సంఘాలకు బస్సుల కొనుగోలు చేసేందుకు అనుమతులు ఇవ్వగా.. రూ.9.60 కోట్లతో ఇప్పటి వరకు 32 బస్సులు మహిళా సంఘాల ద్వారా సమకూర్చారు. వీటిలో నాగర్‌కర్నూల్ జిల్లాలోని వంగూరు, పెద్దకొత్తపల్లి, తిమ్మాజిపేట, బల్మూర్, ఉప్పునుంతల, నాగర్‌కర్నూల్, కల్వకుర్తి మండల సమాఖ్యలకు ఒక్కొక్కటి చొప్పున 7 బస్సులు ఏర్పాటు చేశారు. ఒక్కో బస్సు కొనుగోలుకు రూ.36 లక్షల చొప్పున నిధులు సమకూర్చారు. వీటిలో మహిళా సమాఖ్యలు రూ.6 లక్షలు చెల్లించగా.. ప్రభుత్వం రూ.30 లక్షలను సీఏఎఫ్ (క్రెడిట్ ఆవిడంట్ ఫండ్)గా మంజూరు చేసింది. ఈ కార్యక్రమం ద్వారా మండల సమాఖ్యలకు ఆర్థిక స్థిరత్వం, మహిళా సాధికారితకు పటిష్టమైన పునాదులు పడుతున్నాయి. నెలకు రూ.69,468 ఆదాయం ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఉమ్మడి జిల్లాలోని 32 మండలాల మహిళా సమాఖ్యలకు చెందిన 32 బస్సులను 10 డిపోల పరిధిలో నడుస్తున్నాయి. ప్రతి బస్సుకు నెలకు రూ.69,468 చొప్పున ఈఎంఐ (అద్దె రూపంలో ఆదాయం అందుతోంది. గత ఆరు నెలల కాలానికి గాను ప్రతి మండల సమాఖ్య ఖాతాలో రూ.4,16,808 జమ అయ్యాయి. మహిళా సమాఖ్యలు కేవలం రూ.6 లక్షల పెట్టుబడి పెట్టగా.. ప్రభుత్వం ఒక్కో బస్సుకు రూ.30 లక్షల వరకు వెచ్చించింది. మహిళా సమాఖ్యల ద్వారా కొనుగోలు చేసి ఆర్టీసీకి అప్పగించిన బస్సులకు ప్రతినెలా సంస్థ సంబంధిత మహిళా సమాఖ్యలకు అద్దెలు చెల్లిస్తోంది. గత ఆరు నెలల కాలానికి ఆర్టీసీ జిల్లాకు సంబంధించి మొత్తం 32 బస్సులకు గాను రూ.1,33,37,856 చెల్లించింది. 84 నెలలపాటు ఒప్పందం ఆర్టీసీ బస్సులతో మహిళా సమాఖ్యలకు భారీ ఆదాయం ఈఎంఐలు సకాలంలోచెల్లింపుతో సభ్యుల ఊరట ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 32 బస్సుల కొనుగోలు ఇది బ్యాంకు రుణం కాదని, ప్రభుత్వం మహిళా సమాఖ్యలకు అందజేసిన ఒక గొప్ప ఆర్థిక అవకాశం అని ఆధికారులు పేర్కొంటున్నారు. 84 నెలల ఒప్పందం ముగిసిన తర్వాత ఈ బస్సులను తిరిగి సంఘాలకు అప్పగించాల్సి ఉంటుంది. అప్పటి వరకు వచ్చే ఈ ఆదాయం మహిళా సమాఖ్యల బలోపేతానికి, మండల స్థాయిలో సామాజిక కార్యక్రమాలకు ఎంతో దోహదపడనుంది. టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం బస్సులకు సంబంధించిన అద్దెలను చెల్లించడంతో జిల్లాలోని మహిళా సమాఖ్యలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం మహిళా శక్తి ద్వారా బస్సులను కొనుగోలు చేయించి.. ఆర్టీసీకి అప్పగించడం ద్వారా తాము యజమానులం కాగలిగామని, ఇది తమ ఆర్థిక ఎదుగుదలకు మరో అడుగుగా భావిస్తున్నామని పేర్కొన్నారు.10 డిపోల పరిధిలో.. ఇందిరా మహిళా శక్తి కింద ఉమ్మడి జిల్లాకు కేటాయించిన మండల మహిళా సమాఖ్యల ఆర్టీసీ బస్సులు 10 డిపోల పరిధిలో నడుస్తున్నాయి. ఇందులో అచ్చంపేట డిపోలో 2, గద్వాలలో 4, కల్వకుర్తిలో 2, కొల్లాపూర్‌లో 2, కోస్గిలో 1, మహబూబ్‌నగర్‌లో 5, నాగర్‌కర్నూల్‌లో 2, నారాయణపేటలో 3, షాద్‌నగర్‌లో 4, వనపర్తిలో 7 చొప్పున ఉన్నాయి. -
బంజారాల ఆత్మగౌరవానికి ప్రతీక సేవాలాల్
కల్వకుర్తి టౌన్: సమాజంలో సమానత్వం, సేవాభావం, నిజాయతీ విలువలను బలపరిచిన మహానుభావుడు సేవాలాల్ మహారాజ్ అని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. ఆదివారం కల్వకుర్తిలో నిర్వహించిన సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకల్లో రాష్ట్ర విద్యా కమిషన్ మెంబర్ చారకొండ వెంకటేశ్‌తో కలిసి ఆయన పాల్గొని మాట్లాడారు. సేవాలాల్ బోధనలు సమాజానికి మార్గదర్శనీయమని.. ఆయన బంజారాల ఆత్మగౌరవానికి ప్రతీక అని కొనియాడారు. ఆయన చూపిన మార్గంలో నడిస్తే సమాజం మరింత సుస్థిరంగా, సమానంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. అంతకు ముందు పట్టణంలోని హరిహర టౌన్ షిప్లో ఉన్న సేవాలాల్ మహారాజ్ భవనంలో ఎమ్మెల్యే ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సంప్రదాయ వేషధారణలో బంజారా మహిళలు, యువతు లు నృత్యాలు చేస్తూ సంబరాలు నిర్వహించారు. కార్యక్రమంలో పీసీబీ మెంబర్ బాలాజీసింగ్, మున్సిపల్ చైర్పర్సన్ రత్నమాల, వైస్ చైర్మన్ షానవాజ్ ఖాన్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రమా కాంత్ రెడ్డి, తహసీల్దా ర్ ఇబ్రహీం, కాంగ్రెస్ నాయకులు ఆనంద్‌కుమార్, గణేశ్, హన్మానాయక్ పాల్గొన్నారు. -
రెండు రోజుల పాటు కొనసాగిన నిరసనలు..
ఈనెల 18న కుమ్మెర ఆలయంలో దాడి ఘటన చోటుచేసుకోగా, శనివారం శిశువు మృతి చెందింది. శనివారం సాయంత్రం కుటుంబసభ్యులు తమ ఫిర్యాదుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ నిరసన వ్యక్తం చేశారు. డీఎస్పీ పార్టీ వ్యవస్థాపకులు విశారదన్ మహారాజ్ రోడ్డుపై బైఠాయించి ధర్నాలో పాల్గొన్నారు. ఆదివారం సైతం ఉదయం నుంచి పోలీస్‌స్టేషన్ ఎదుట నిరసన కొనసాగింది. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున చేరుకుని రోడ్డుపై బైఠాయించారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, బీసీ జేఏసీ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్, ఎస్సీ, బీసీ కులసంఘాలు, బీఎస్పీ పార్టీ నేతలు ధర్నాలో పాల్గొన్నారు. ఈనెల 18న ఫిర్యాదు ఇస్తే ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోవడం ఏంటని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పోలీసులను ప్రశ్నించారు. మొత్తం 8 మందిపై ఫిర్యాదు చేస్తే ముగ్గురిని మాత్రమే అదుపులో తీసుకుంటామని చెప్పడం నిందితులను కాపాడటమేనని అన్నారు. ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డి బంధువులు అయినందుకే వారిని కాపాడుతున్నారని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి ఆరోపించారు. కుమ్మెర గ్రామంలోని బాధిత కుటుంబం ఇంటికి వెళ్లి పరామర్శించారు. -
శిశువు మృతిపై పెల్లుబికిన ఆగ్రహం..
సాక్షి, నాగర్‌కర్నూల్: రెండు రోజుల క్రితం ఆలయంలో దర్శనం కోసం వచ్చిన భక్తులపై నిర్వాహకులు దాడి చేయగా తోపులాటలో రెండు నెలల శిశువు కిందపడగా, ఆదివారం మృతిచెందింది. ఈ ఘటనలో పోలీసుల తీరుపై కుటుంబ సభ్యులతోపాటు ప్రతిపక్షాల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఆదివారం నాగర్‌కర్నూల్ జిల్లాకేంద్రంలోని పోలీస్‌స్టేషన్ ఎదుట బీఆర్ఎస్ శ్రేణులతోపాటు బీసీ, ఎస్సీ, కులసంఘాలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రోజంతా నిరసన కార్యక్రమాలు కొనసాగాయి. ఈనెల 18న ఫిర్యాదు చేస్తే ఇప్పటివరకు పోలీసులు స్పందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టారు.నిందితులను తక్షణమే అదుపులోకి తీసుకోవాలంటూ రోడ్డుపై బైఠాయించారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించి వారికి మద్దతుగా ఆందోళనలో పాల్గొన్నారు. ‘కుమ్మెర ఆలయంలో దాడి ఘటనలో ప్రధాన నిందితులుగా ఉన్న వారంతా నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి బంధువులు కావడంతో పోలీసులు పక్షపాతంగా వ్యవహరించారు. బాధితులు ఫిర్యాదు ఇచ్చినా చర్యలు తీసుకోలేదు. వారిని కాపాడేందుకు బాధితులపైనే వేధింపులకు పాల్పడ్డారు’ అని మర్రి ఆరోపించారు. -
ముందుకు సాగునీరా
ఉమామహేశ్వర.. మైలారం శివారులో మొదలైన రిజర్వాయర్ ఆనకట్ట పనులు ●ఉమామహేశ్వర రిజర్వాయర్ ఆనకట్ట 6.5 కి.మీ పొడవు ఉంటుంది. 54 ఎకరాల ప్రభుత్వ భూమిలో 400 నుంచి 600 మీటర్ల పొడవైన ఆనకట్ట పనులు మొదలయ్యాయి. ఇప్పటికే పీడీ, 1,700 ఎకరాల్లో సర్వే పూర్తయ్యాయి. కొంత భాగం పీఎన్ వేయగా మరో 126 ఎకరాలకు సంబంధించి పీఎన్ వేయా ల్సి ఉంది. రెవెన్యూ రికార్డు పహాణి ప్రకారం అవార్డు వేసేందుకు చర్యలు తీసుకుంటు న్నాం. నీటిని తీసుకునే విషయంపై ప్రభు త్వం నిర్ణయం తీసుకోవాలి. భూ సేకరణ కోసం జీఓ 42 ప్రకారం ముందుకెళ్తున్నాం. – అమర్‌సింగ్, ఈఈ ఇరిగేషన్ శాఖ, అచ్చంపేట -
చిన్నారి మృతి కారకులను శిక్షించాలి
నాగర్‌కర్నూల్ క్రైం: నాగర్‌కర్నూల్ మండలంలోని కుమ్మెర మల్లన్న జాతరలో చంద్రకళతోపాటు కుటుంబ సభ్యులపై దాడికి పాల్పడి.. రెండు నెలల చిన్నారి మృతికి కారణమైన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ధర్మ సమాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు విశారదన్ మహరాజ్ అన్నారు. శనివారం రాత్రి 7 గంటల నుంచి కుల సంఘాల ఆధ్వర్యంలో ఽజనరల్ ఆస్పత్రి ఎదుట బాధిత కుటుంబ సభ్యులతో కలిసి రాత్రి 11 గంటల వరకు నాలుగు గంటలపాటు ధర్నా నిర్వహించడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. జనరల్ ఆస్పత్రి నుంచి అంబేడ్కర్ చౌరస్తా వరకు ట్రాఫిక్ నిలిచిపోవడంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సందర్భంగా విశారదన్ మహరాజ్ మాట్లాడుతూ చిన్నారి మృతికి కారణమైన కుమ్మెర గ్రామ సర్పంచ్ తుకారాంరెడ్డి, సతీష్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డిలపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని పట్టుబట్టారు. ధర్నా నాలుగు గంటలపాటు కొనసాగడంతో శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా నియోజకవర్గంలోని అన్ని పోలీస్స్టేషన్ల నుంచి ఎస్ఐలు, పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. బాధితులు, కుల సంఘాల నాయకులు ఎంతకూ ధర్నా విరమించలేదు. దీంతో డీఎస్పీ శ్రీనివాస్ ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్‌తో ఫోన్లో మాట్లాడించినప్పటికీ ససేమిరా ఒప్పుకోలేదు. చివరికి 11 గంటల సమయంలో ప్రయాణికులు కుల సంఘాల నాయకులను విజ్ఞప్తి చేయడంతో ధర్నాను విరమించారు. ధర్నాలో బీఎస్పీ అధ్యక్షుడు రామచందర్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేందర్, లక్ష్మణ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. నాలుగు గంటలపాటు కొనసాగిన ధర్నా


