40 ఎకరాలు కౌలుకు.. | - | Sakshi
Sakshi News home page

40 ఎకరాలు కౌలుకు..

Mar 7 2026 9:21 AM | Updated on Mar 7 2026 9:21 AM

40 ఎకరాలు కౌలుకు.. వాతావరణంలో మార్పులే కారణం

నేను 40 ఎకరాల తోటలను కౌలుకు తీసుకున్నాను. కౌలు అడ్వాన్సు, పురుగు మందులకు ఇప్పటికే రూ.50 లక్షలకు పైగా ఖర్చు చేశాను. జనవరిలో వచ్చిన పూతలన్నీ రాలిపోయాయి. నల్లిపురుగు ఒక రకంగా పూతలను దెబ్బతీసింది. ఉదయం పూట వచ్చే మంచు కాగు మరో కారణమైంది. కౌలుకు తీసుకున్న తోటల్లో ఎక్కడా పిందెలు కనిపించడం లేదు. మామిడి రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలి.

– పెద్దూరి లక్ష్మయ్య,

మామిడి రైతు, కొల్లాపూర్‌

ఈసారి మామిడి పూతలు బాగా వచ్చాయి. కానీ, పూత, పిందెలు నిలవలేదు. డిసెంబర్‌, జనవరి నెలల్లో వరి, మినుము పంటలు ఒకేసారి కోతలకు వచ్చాయి. ఆయా పంటలకు ఉన్న నల్లి మొత్తం మామిడి తోటలపైకి సోకింది. దీంతో పెద్దమొత్తంలో మామిడి పూతలు దెబ్బతిన్నాయి. వాతావరణంలో మార్పులు కూడా పంట దెబ్బతినడానికి కారణమైంది. వారం రోజుల క్రితం వరకు మంచు కాగు పట్టింది. ప్రస్తుతం ఉన్న పిందెలను కాపాడుకునేందుకు రైతులు సస్యరక్షణ చర్యలు చేపట్టాలి.

– లక్ష్మణ్‌, ఉద్యానవన అధికారి, కొల్లాపూర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement