‘ఖిల్లా’ ఎంపీడీఓకు సైతం.. | - | Sakshi
Sakshi News home page

‘ఖిల్లా’ ఎంపీడీఓకు సైతం..

Mar 7 2026 9:21 AM | Updated on Mar 7 2026 9:21 AM

‘ఖిల్లా’ ఎంపీడీఓకు సైతం..

నపర్తి జిల్లా ఖిల్లాఘనపురం మండల ఎంపీడీఓ విజయసింహారెడ్డి సివిల్స్‌లో మెరిశారు. హైదరాబాద్‌లోని మనికొండలో నివాసం ఉంటున్న అంజిరెడ్డి, అలివేలు దంపతులకు ఇద్దరు కుమారులు విజయసింహారెడ్డి, విక్రంసింహారెడ్డి ఉన్నారు. అన్నదమ్ములిద్దరూ ఒకేసారి గ్రూప్‌–1లో కొలువులు సాధించాడు. ఇప్పుడు కూడా అన్న విజయసింహారెడ్డి సివిల్స్‌లో ఆలిండియా 682వ ర్యాంక్‌ సాధించగా.. ఆయన తమ్ముడు విక్రమ్‌సింహారెడ్డి కూడా 541 ర్యాంక్‌ సాధించారు. విషయం తెలిసిన వెంటనే ఖిల్లాఘనపురంలో ఎంపీడీఓ కార్యాలయం సిబ్బంది విజయసింహారెడ్డికి స్వీట్లు తినిపించి.. అభినందనలు తెలిపారు. అలాగే బీజేపీ నాయకులు ఆయనను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement