కల్యాణం.. కమనీయం | - | Sakshi
Sakshi News home page

కల్యాణం.. కమనీయం

Mar 2 2026 8:35 AM | Updated on Mar 2 2026 8:35 AM

కల్యాణం.. కమనీయం

కల్యాణం.. కమనీయం

కందూరు శ్రీరామలింగేశ్వరస్వామి క్షేత్రంలో ఆదివారం స్వామివారి కల్యాణాన్ని కనులపండువగా జరిపించారు. దక్షిణకాశీగా వెలుగొందుతున్న ఆలయంలో పార్వతీ సమేత రామలింగేశ్వరస్వామి కల్యాణం అశేష భక్తజన సందోహం మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. గ్రామంలో మహిళలు సిద్దం చేసిన తలంబ్రాలను గ్రామస్తులు పల్లకీలో ఉంచి మేళతాళాల మధ్య ఊరేగింపుగా రామలింగేశ్వరస్వామి క్షేత్రానికి తీసుకువచ్చి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పూల పందిరిలో ఉంచారు. అనంతరం పార్వతి సమేత రామలింగేశ్వరస్వామి ఉత్సవ విగ్రహాలను సన్నాయి వాయిధ్యాల నడుమ ఆలయం లోపలి నుంచి కల్యాణ మండపంలోకి తెచ్చారు. దేవాదాయశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ మదనేశ్వర్‌రెడ్డి దంపతులు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. పురోహితులు ఉత్సవ విగ్రహాలకు పట్టు వస్త్రాలను కట్టించి, జీలకర్ర, బెల్లం పెట్టించారు. వేదమంత్రోచ్ఛరణాలు, మేళతాళాల మధ్య పార్వతి మెడలో మంగళసూత్రాన్ని కట్టించి కల్యాణాన్ని కమనీయంగా జరిపించారు. ఈ సందర్భంగా ఆలయంలోని శివలింగానికి అభిషేకాలు నిర్వహించి పూలతో అలంకరించారు. అనంతరం కల్యాణానికి తరలివచ్చిన భక్తులకు అన్నదానం చేశారు. – అడ్డాకుల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement