నేటి నుంచి వెంకన్న బ్రహ్మోత్సవాలు
బిజినేపల్లి: మండలంలోని వట్టెం శ్రీవేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉత్సవాలు వారం పాటు కొనసాగుతాయని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ నెల 5న గురువారం ఉదయం అలర్మేల్ మంగ గోదాదేవి సమేత శ్రీవేంకటేశ్వర స్వామివార్ల కల్యాణం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. భక్తుల సౌకర్యం కోసం అన్ని వసతులు కల్పించినట్లు నిర్వాహకులు తెలిపారు.
వేరుశనగ క్వింటా రూ.10,363
కల్వకుర్తి రూరల్: స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డుకు ఆదివారం భారీగా వేరుశనగ అమ్మకానికి వచ్చింది. 171మంది రైతులు 1,146 క్వింటాళ్లు తెచ్చినట్లు అధికారులు తెలిపారు. అత్యధికంగా క్వింటా వేరుశనగకు రూ.10,363 ధర లభించగా.. కనిష్టంగా రూ.5,669, సరాసరి ధర రూ.9,563 పలికింది. కందులకు అత్యధికంగా రూ.7,229 ధర లభించింది. మార్కెట్ యార్డుకు వచ్చిన రైతులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసినట్లు మార్కెట్ కార్యదర్శి శివరాజ్ చెప్పారు.
‘ముంపు బాధితులను విస్మరించొద్దు’
చారకొండ: గోకారం జలాశయంలో ముంపు గ్రామాలను మినహాయించాలని చేపడుతున్న దీక్షలు ఆదివారం నాటికి 90 రోజులు అయినా ప్రభుత్వం నిర్వాసితులను పట్టించుకోవడం లేదని ఎర్రవల్లి, ఎర్రవల్లి తండా ప్రజలు వాపోయారు. డిండి–నార్లాపూర్ ఎత్తిపోతల పథకంలో భాగంగా చేపడుతున్న మండలంలోని గోకారం రిజర్వాయర్ నిర్మాణం సామర్థ్యం తగ్గించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందిచాలని, ఎంపీ, ఎమ్మెల్యే స్పందించి ఎర్రవల్లి, ఎర్రవల్లితండా గ్రామాలు ముంపునకు గురి కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని ఒప్పించాలని డిమాండ్ చేశారు. ఆర్‌అండ్‌ఆర్ నోటిఫికేషన్ రద్దు జీఓ జారీ చేసే వరకు దీక్షలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
నేటి నుంచి వెంకన్న బ్రహ్మోత్సవాలు
నేటి నుంచి వెంకన్న బ్రహ్మోత్సవాలు


