అమ్రాబాద్: పదర మండలంలోని మద్దిమడుగు పబ్బతి శ్రీఆంజనేయస్వామి దేవస్థానం పాలక మండలిని దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ మేరకు గురువారం పాలక మండలి చైర్మన్‌గా దేశావత్ రాములునాయక్, డైరెక్టర్లుగా బసిరెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి, నాగిరెడ్డి, పెద్ద కోటమ్మ, సుబ్బదాస్, శ్రీనివాసులు, శ్రీశైలం, హలరాజు, లింగయ్య, వెంకటయ్య, ప్రణీత, రాములు, లక్ష్మణ్‌బావోజీని నియమించగా.. మద్దిమడుగు ఆంజనేయస్వామి సన్నిధిలో ప్రమాణస్వీకారం చేశారు. ఎండోమెంట్ డివిజన్ ఇన్‌స్పెక్టర్ మదన్, ఈఓ నర్సింహులు పాలక మండలిచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా చైర్మన్ రాములునాయక్ మాట్లాడుతూ ఆలయ అభివృద్ధితోపాటు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సమష్టి కృషితో చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ప్రధాన అర్చకులు వీరయ్యశర్మ, సిబ్బంది పరందామరెడ్డి, విశ్వేశ్వర్‌రెడ్డి, అజయ్ తదితరులు పాల్గొన్నారు.


