జోగుళాంబ హుండీ ఆదాయం రూ.99 లక్షలు | - | Sakshi
Sakshi News home page

జోగుళాంబ హుండీ ఆదాయం రూ.99 లక్షలు

Mar 13 2026 8:56 AM | Updated on Mar 13 2026 8:56 AM

అలంపూర్‌: దక్షిణకాశీ అలంపూర్‌ క్షేత్రంలోని శ్రీజోగుళాంబదేవి అమ్మవారి హుండీ లెక్కింపు జరిగింది. దేవాదాయ, ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్‌ మదనేశ్వర్‌రెడ్డి, ఆలయ ఈఓ దీప్తి ఆధ్వర్యంలో గురువారం చేపట్టిన హుండీ లెక్కింపులో ఆలయ సిబ్బంది, వివిధ సేవా సంస్థల సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జోగుళాంబ అమ్మవారి ఆలయంలోని హుండీలను లెక్కించగా రూ.99,55,566 ఆదాయం సమకూరినట్లు ఈఓ దీప్తి తెలిపారు. అలాగే 28 గ్రాముల మిశ్రమ బంగారం, 298 గ్రాముల మిశ్రమ వెండి వచ్చిందని పేర్కొన్నారు. వీటితోపాటు విదేశీ కరెన్సీలైన యూఎస్‌డీ 39, ఫౌండ్స్‌ 10, ఓమన్‌ 100 బైసా హుండీల ద్వారా వచ్చినట్లు చెప్పారు. బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాల హుండీలను ఉగాది పండగ తర్వాత లెక్కించనున్నట్లు ఈఓ వెల్లడించారు. అమ్మవారి హుండీ ద్వారా వచ్చిన నగదును డీసీసీ బ్యాంక్‌లో జమ చేశామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement