బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమీక్ష | - | Sakshi
Sakshi News home page

బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమీక్ష

Mar 9 2026 7:12 AM | Updated on Mar 9 2026 7:12 AM

చారకొండ: రెండో భద్రాద్రిగా పేరుగాంచిన సిర్సనగండ్ల సీతారామచంద్రాస్వామి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. ఈ నెల 25 నుంచి ఏప్రిల్‌ 6 వరకు నిర్వహించనున్న బ్రహ్మోత్సవాల నిర్వహణపై శనివారం ఆలయ పాలక మండలితో కలిసి రెవెన్యూ, పోలీసు, ఆర్‌డబ్ల్యూస్‌, ఆర్టీసీ, పైర్‌, విద్యుత్‌ తదితర అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మట్లాడుతూ .. ఆయా శాఖల అధికారులు సమన్వయంతో ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. ముఖ్యంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. ఆలయం వద్ద మౌలిక వసతులు కల్పించాలని సూచించారు. ఆలయ ప్రాంగణంలో కోనేరు, మరుగుదొడ్లు, తాగునీరు, పారిఽశుద్ధ్యం, విద్యుత్‌ సరాఫరా, ట్రాఫిక్‌ నియంత్రణ, చలువ పందిళ్ల ఏర్పాటుపై శ్రద్ధ వహించాలని పాలక మండలికి సూచించారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే సీతారామచంద్రాస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ చైర్మన్‌ రామశర్మ, మండల నాయకులు ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో ఆలయ మాజీ చైర్మన్‌ మల్లికార్జునశర్మ, ఈఓ స్వర్గం ఆంజనేయులు, సర్పంచ్‌ కామల్ల రామస్వామి, ఆలయ మేనేజర్‌ నిరంజన్‌, కల్వకుర్తి ఆర్డీఓ శ్రీనివాస్‌రెడ్డి, డీఎస్పీ సైరెడ్డి వెంకట్‌రెడ్డి, సీఐ రఘువీర్‌రెడ్డి, ఎకై ్సంజ్‌ సీఐ వెంకట్‌రెడ్డి, తహసీల్దార్‌ ఉమా, ఎంపీడీఓ శంకర్‌నాయక్‌, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement