కందనూలు: జిల్లావ్యాప్తంగా పదో తరగతి వార్షిక పరీక్షలు శనివారం ప్రారంభమయ్యాయి. జిల్లావ్యాప్తంగా 10,651 మంది విద్యార్థులు పరీక్ష రాయనుండగా వారికోసం 60 కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొదటిరోజు తెలుగు పరీక్ష జరగగా 10,651 మంది విద్యార్థులకు గాను 10,630 మంది (98.80 శాతం) హాజరవగా 21 మంది గైర్హాజరయ్యారని డీఈఓ రమేష్‌కుమార్ తెలిపారు. అలాగే ఇది వరకు పరీక్షల్లో తప్పిన ప్రైవేట్ విద్యార్థులు 5 మందికి గాను నలుగురు హాజరు కాగా ఒకరు గైర్హాజరైనట్లు చెప్పారు. అంతకు ముందు జిల్లాకేంద్రంలోని సీఎన్‌ఆర్ ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రం వద్ద డీఈఓ రమేష్‌కుమార్ విద్యార్థులను తనిఖీ చేసి పరీక్ష హాల్‌లోకి పంపించారు. జిల్లావ్యాప్తంగా తొలిరోజు 34 పరీక్ష కేంద్రాలను అధికారులు తనిఖీలు చేశారు. డీఈఓ పాలెం, నాగర్‌కర్నూల్‌లో రెండు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసి.. తాగునీరు, ఓఆర్‌ఎస్ పాకెట్లు, ఇతర సదుపాయాలు, పరీక్ష ప్రక్రియను పరిశీలించారు. ప్రశాంతమైన వాతావరణంలో పరీక్ష జరిగేలా చర్యలు తీసుకున్నామని, ఎలాంటి మాల్ ప్రాక్టిస్ కేసులు నమోదు కాలేదని డీఈఓ పేర్కొన్నారు.
మొదటిరోజు 98.80 శాతం
హాజరు


