ఏప్రిల్ 15 వరకు గడువు
6వ తరగతి నుంచి..
జిల్లాలో మూడు కస్తూర్బా విద్యాలయాల ఎంపిక
● వచ్చే విద్యా సంవత్సరం నుంచి తరగతులు షురూ
● ప్రవేశ పరీక్ష ద్వారా
విద్యార్థుల
చేరికకు అవకాశం
● ఐఐటీ, నీట్, క్యాట్ తదితర పరీక్షలకు ప్రత్యేక శిక్షణ
● రేపటి నుంచి దరఖాస్తుల స్వీకరణ
●
అచ్చంపేట: కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో ఇక ఎక్స్‌లెన్స్ చదువు అందనుంది. కార్పొరేట్, ప్రైవేట్‌లకు ధీటుగా నాణ్యమైన బోధన అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు యంగ్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌కు సంబంధించి విద్యార్థులకు ఐఐటీ, క్యాట్, నీట్, లాసెట్ వంటి ప్రవేశ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. రాత పరీక్ష ద్వారా ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఎంపిక చేసి పోటీ పరీక్షలకు సంసిద్ధం చేయనున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ ప్రక్రియ అమలు కానుంది. చాలామంది విద్యార్థులు ఆర్థిక పరిస్థితుల కారణంగా దూర ప్రాంతాల్లో శిక్షణకు వెళ్లకుండా ఇంజినీరింగ్, మెడికల్, లా కోర్సుల్లో చేరలేకపోతున్నారు. ఇంటి వద్దనే సిద్ధమవుతూ అవగాహన లేక వాటిలో రాణించలేకపోతున్నారు. ఇలాంటి వారి కోసం ప్రభుత్వం జిల్లాలో మూడు కేజీబీవీలను ఎంపిక చేసింది. ఇందులో విద్యార్థులకు ఇంటర్‌తోపాటు ఆయా ప్రవేశ పరీక్షలకు నిపుణులతో శిక్షణ అందించనున్నారు.
జిల్లావ్యాప్తంగా 20 కస్తూర్భా గాంధీ విద్యాలయాలు ఉండగా 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఇక్కడ విద్యా బోధన ఉంటుంది. ఇంటర్‌లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ విద్యాలయాల్లో మొత్తం 6,222 మంది విద్యార్థినులు విద్యను అభ్యసిస్తున్నారు. అయితే వీరంతా పేద విద్యార్థులే. ప్రభుత్వం ఈ ఏడాది యంగ్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ కింద నాగర్‌కర్నూల్, బిజినేపల్లి, వెల్దండ సీఓఈలను ఎంపిక చేశారు. కాగా.. నాగర్‌కర్నూల్ కేజీబీవీలో ఐఐటీ, జేఈఈకి సంబంధించి శిక్షణ కల్పించనున్నారు. బిజినేపల్లి కేజీబీవీలో క్యాట్‌కు సంబంధించి శిక్షణ ఇవ్వనున్నారు. వెల్దండ కేజీబీవీలో నీట్ కోర్సుకు సంబంధించి శిక్షణ ఉంటుంది. అయితే ఈ పాఠశాలల్లో గ్రంథాలయంతోపాటు ఎన్‌సీసీ, ఇతర మౌలిక వసతులు ఏర్పాటు చేయనున్నారు. వీటికి ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించింది. అవసరమైన విషయ పరిజ్ఞాన నిపుణులను సైతం నియమించింది. జూన్ నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. విద్యార్థులకు అవసరమైన స్టడీ మెటీరియల్ అందించనున్నారు.
ఎక్స్‌లెన్స్‌కు
ఎంపికై న వెల్దండ కస్తూర్బా విద్యాలయం
జిల్లాలోని ఈ మూడు కేజీబీవీల్లో వచ్చే ఏడాది ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరానికి సంబంధించి ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా సోమవారం నుంచి ఏప్రిల్ 15 వరకు దరఖాస్తు గడువు ఉంది. మే 5న పరీక్ష నిర్వహించనున్నారు. ఎస్సెస్సీ పూర్తిచేసిన వారు అర్హులు. అయితే ఎంపికై న విద్యార్థులకు జేఈఈ, నీట్, ఎఫ్ సెట్, లా సెట్ తదితర ఎంట్రైన్స్ కోచింగ్‌లతోపాటు సీఏకు సంబంధించి కూడా శిక్షణ కల్పించనున్నారు.


